దేశంలో ఏం జరుగుతుందో యువత తెలుసుకోవాలి | Director Vivek Agnihotri Visited Bhagya Laxmi Temple In Charminar | Sakshi
Sakshi News home page

దేశంలో ఏం జరుగుతుందో యువత తెలుసుకోవాలి

Published Mon, Jan 27 2020 3:51 AM | Last Updated on Mon, Jan 27 2020 3:51 AM

Director Vivek Agnihotri Visited Bhagya Laxmi Temple In Charminar - Sakshi

వివేక్‌ అగ్నిహోత్రి

‘‘కశ్మీరీ హిందువుల మారణహోమం, హత్య లు, వాళ్లపై సాగిన క్రూరత్వం గురించి ఎవ్వరూ సినిమా తీయలేదు. ఆ కథ అందరికీ తెలియ జేయాలనుకున్నా’’ అన్నారు బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి. ‘ద కశ్మీర్‌ ఫైల్స్‌’ పేరుతో ఆయన ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని చార్మినార్‌ వద్ద ఉన్న లక్ష్మీ దేవి ఆలయాన్ని సందర్శించారు వివేక్‌. ఆ తర్వాత ఈ సినిమాకు మద్దతు తెలుపుతున్నవారితో సమావేశమయ్యారు.

‘‘దేశంలో ఏం జరుగుతుందో యువత తెలుసుకోవాలి. బయటకు వెల్లడికాని కశ్మీరీ పండిట్‌ల కథ వాళ్లు తెలుసుకోవాలి. ఈ విషయంపై బాగా పరిశోధన చేశా. అందుకే స్క్రిప్ట్‌ పూర్తి చేయడానికి చాలా సమయం పట్టింది. ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. సినిమా పూర్తయ్యాక ఈ సబ్జెక్ట్‌పై పుస్తకం రాయాలనుకుంటున్నాను’’ అన్నారు వివేక్‌ అగ్నిహోత్రి. నిర్మాతలు అనిల్‌ సుంకర, టిజి విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల ఈ సినిమాకు మద్దతు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement