బీజేపీలో చేరిన జడేజా భార్య | Ravindra Jadeja Wife Rivaba joins BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన జడేజా భార్య

Published Mon, Mar 4 2019 8:44 AM | Last Updated on Mon, Mar 4 2019 8:44 AM

Ravindra Jadeja Wife Rivaba joins BJP - Sakshi

రాజ్‌కోట్‌ : టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా సోలంకి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం గుజరాత్ వ్యవసాయ శాఖ మంత్రి ఆర్‌సీ ఫల్దు, ఎంపీ పూనం సమక్షంలో రివాబా కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు స్ఫూర్తి అని, అందుకే తాను బీజేపీలో చేరినట్టు రవీబా జడేజా తెలిపారు. బీజేపీలో చేరడం ద్వారా దేశం మొత్తానికి సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు. గత ఏడాది నవంబర్ 20న జడేజా, ఆయన భార్య ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. 

కర్ణిసేన మహిళా విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన 6 నెల్లకే ఆమె రాజకీయాల్లోకి రావడం చర్చనీయాంశమైంది. గతేడాది ‘పద్మావత్’ సినిమాకి వ్యతిరేకంగా గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కర్ణిసేన ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. క్షత్రియ వంశ చరిత్రను వక్రీకరించే విధంగా సినిమాను రూపొందిచినట్లు పేర్కొంటూ వారు ఈ నిరసన చేపట్టారు. దీంతో కొన్ని రాష్ట్రాలు మొదట్లో ఈ సినిమాను ప్రదర్శించడానికి వెనుకాడాయి. ఈ నిరసనల సమయంలోనే కర్ణిసేన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అయితే ఓ కానిస్టేబుల్‌ గొడవతో తొలిసారి వార్తల్లో నిలిచిన రివాబా.. ప్రస్తుతం రాజ్‌కోట్‌లో ఉంటూ జడేజా రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నారు. ఇక జడేజా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. 2016లో వివాహ బంధంతో ఒక్కటైన జడేజా-రివాబాలకు ఓ పాప ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement