ప్రపంచంలోని ఉత్తమ ఆల్‌రౌండర్లలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కుతుంది. 34 ఏళ్ల ఈ గుజరాత్ ఆటగాడు ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన జడ్డూ.. డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో ఫర్వాలేదనిపించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 48 పరుగులు చేసిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు. ఇక ఆసీస్‌తో ఫైనల్లో మొత్తంగా 4 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ వేదికగా ప్రఖ్యాత ఓవల్ వేదికగా జూన్ 7- 11 వరకు జరిగిన ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లకు దాదాపు నెలరోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ సహా మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక జడేజా సైతం తనకు ఇష్టమైన వ్యాపకాల్లో మునిగిపోయాడు. కాగా రవీంద్ర జడేజాకు అశ్వాలన్నా, గుర్రపు స్వారీ అన్నా ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో తాజాగా జడ్డూ షేర్ చేసిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
సుదీర్ఘ విరామం తర్వాత తనకు ఇష్టమైన అశ్వాన్ని కలిశానన్న జడ్డూ.. ‘‘ఫరెవర్ క్రష్’’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా గత అక్టోబరులోనూ మై క్రష్ అంటూ జడేజా ఇలాంటి ఫొటోను పంచుకున్నాడు. ఇక జడేజా డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా బిషన్ సింగ్ బేడీ పేరిట ఉన్న రికార్డును సవరించాడు.
టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా నిలిచాడు. బిషన్ సింగ్ బేడి 67 మ్యాచ్‌లలో 266 వికెట్లు తీయగా.. జడ్డూ 65 మ్యాచ్‌లలో 268 వికెట్లతో అతడిని అధిగమించాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో విన్నింగ్ షాట్‌లో రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్‌ను చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో అతడి భార్య, ఎమ్మెల్యే రివాబా మైదానంలోకి వచ్చి జడ్డూ పాదాలకు నమస్కరించిన ఫొటోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో జడ్డూ తాజా ట్వీట్‌పై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇదేం ట్విస్టు భయ్యా! వదినమ్మ కాకుండా గుర్రాన్ని క్రష్ అంటున్నావు! ’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు
చదవండి: శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా!
రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే..
Forever crush ❤️🐎 #meetingafterlongtime pic.twitter.com/NvrvZrqenV
— Ravindrasinh jadeja (@imjadeja) June 18, 2023
Comments
Please login to add a commentAdd a comment