బీసీలు, మైనార్టీలను మోసం చేసింది నువ్వే కదా బాబు ?
విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ మహాసభ విజయవంతం కావడం టీడీపీ సహించలేకపోతోంది. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపకుండా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే.. మూడున్నరేళ్లలో రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సీఎం వైఎస్ జగన్ వారికి సమున్నత గౌరవం ఇచ్చారు. వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిందెవరు?. బీసీలు, మైనార్టీలను మోసం చేసింది చంద్రబాబు కాదా?.. బీసీలు, మైనార్టీలను మోసం చేసింది నువ్వే కదా బాబు ?
రూల్స్ తెలియని వాడు రూలర్ అవుతాడా ?
2019 ఎన్నికల్లో రెండు చోట్ల అసెంబ్లీకి పోటీచేసి ఓటమి పాలైన పవన్ కల్యాణ్ ఇప్పుడు కనీసం తను అయినా గెలవాలని తంటాలు పడుతున్నారు. రాంగ్ రూట్‌లో పవన్ వెళ్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు మినహా ఏమీ తెలియని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. వారాహి వాహనానికి మిలటరీ వాహనాలకు మాత్రమే వేసే ఆలీవ్ గ్రీన్ రంగు వేశారు. ఇది చట్ట విరుద్ధం కాదా..? రూల్స్ తెలియని వాడు రూలర్ అవుతాడా ?
మోదీ బీజేపీ బాహుబలిగా మారారా ?
పోయిన చోటే వెతుక్కోవాలంటారు. గత ఎన్నికల్లో త్రుటిలో కోల్పోయిన స్థానాలపై బాగా దృష్టి పెట్టడంలో, దూరమైన వర్గాలను కలుపుకొని పోవడంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించిన బీజేపీ గుజరాత్‌లో తిరుగులేని విజయాన్ని సాధించింది. సీఎంగా 13 ఏళ్లు గుజరాత్‌లోనూ, పీఎంగా ఎనిమిదేళ్లుగా కేంద్రంలోనూ తిరుగులేని నాయకునిగా మోదీ సాధించిన పేరు ప్రఖ్యాతులు కూడా ఈసారి ఫలితాలను బాగా ప్రభావితం చేశాయి. ఒక్కడే వచ్చాడు..156 సీట్లు పట్టుకుపోయాడు.. మోదీ బీజేపీ బాహుబలిగా మారారా ?
తేల్చేద్దాం గన్‌షాట్‌గా..
శనివారం రాత్రి 7 గంటలకు
తిరిగి ఆదివారం ఉదయం 7.30 గంటలకు సాక్షి టీవీలో
Comments
Please login to add a commentAdd a comment