bc sabha
-
టీడీపీ సభలో గాలిలో లేచిన కుర్చిలు
కర్నూలు సిటీ: తెలుగు దేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. కర్నూలు శివారులోని ఎంఆర్సీ ఫంక్షన్ హాలులో ఆ పార్టీ జిల్లా స్థాయి జయహో బీసీ సభను ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి కర్నూలు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చెందిన కోట్ల వర్గీయుడిగా గుర్తింపుపొందిన మాచాని సోమ్‌నాథ్ సభకు హాజరయ్యారు. ఆయనను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు వేదికపైకి ఆహ్వానించారు. దీంతో సమావేశంలో బీవీ అనుచరులు ఈలలు, కేకలు వేస్తూ వేదికపైకి సోమ్‌నాథ్ వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో బీవీ అనుచరులు, సోమ్‌నాథ్ అనుచరులు కుర్చిలు పైకెత్తి బాహాబాహీకి దిగారు. కార్యకర్తలను జిల్లా అధ్యక్షుడు సముదాయించినా వినిపించుకోలేదు. ‘ఓ జయ నాగేశ్వరరెడ్డీ .. నీ అనుచరులకు చెప్పుకుంటావా? సమావేశం నుంచి వెళ్లిపోతావా?’ అంటూ అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తమ నాయకుడి పేరు రాకపోవడం..ఈసారి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఇన్చార్జ్గా పని చేస్తున్న బీవీ జయనాగేశ్వరరెడ్డికి ఏ సర్వేల్లో కూడా అనుకూలంగా రాకపోవడంతోనే సీటు ఖరారు చేయలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్సార్సీపీ తరుపున ఇన్చార్జిగా బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుకను ప్రకటించడంతో అక్కడ టీడీపీ అభ్యర్థిగా బీసీలకే ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే బీవీ వర్గానికి చెందిన వారు చంద్రబాబు నాయుడు ఆలోచనలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ నాయకుడికి సీటు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు నిర్ణయంపై అసంతృప్తి ఉమ్మడి జిల్లాల్లోని తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు..మిగిలిన నియోజకవర్గాల్లో ఖరారు చేయకపోవడంతో అధినేత నిర్ణయంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆలూరు నియోజకవర్గం పంచాయతీ తేల్చకపోవడంతో ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు జిల్లా స్థాయిలో జరిగిన జయహో బీసీ సభకు దూరంగా ఉన్నారు. ఇక ఆదోనిలో పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని టీడీపీ నేతలు ఏ కార్యక్రమం కూడా చేయడం లేదు. మంత్రాలయంలోనూ అదే పరిస్థితి. ఈసారి అక్కడ బీసీలకు ఇస్తారని ప్రచారం ఉండడంతో ఇన్చార్జ్ తిక్కారెడ్డి అధినేత పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ కోసం ఇన్నేళ్లు పని చేసిన వారికి ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేశారు. సభలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, తెలుగు యువత మాజీ ఉపాధ్యక్షులు రామకృష్ణ, మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
టాప్ 3 పొలిటికల్ టాపిక్స్.. తేల్చేద్దాం గన్‌షాట్‌గా..!
బీసీలు, మైనార్టీలను మోసం చేసింది నువ్వే కదా బాబు ? విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ మహాసభ విజయవంతం కావడం టీడీపీ సహించలేకపోతోంది. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపకుండా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే.. మూడున్నరేళ్లలో రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సీఎం వైఎస్ జగన్ వారికి సమున్నత గౌరవం ఇచ్చారు. వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిందెవరు?. బీసీలు, మైనార్టీలను మోసం చేసింది చంద్రబాబు కాదా?.. బీసీలు, మైనార్టీలను మోసం చేసింది నువ్వే కదా బాబు ? రూల్స్ తెలియని వాడు రూలర్ అవుతాడా ? 2019 ఎన్నికల్లో రెండు చోట్ల అసెంబ్లీకి పోటీచేసి ఓటమి పాలైన పవన్ కల్యాణ్ ఇప్పుడు కనీసం తను అయినా గెలవాలని తంటాలు పడుతున్నారు. రాంగ్ రూట్లో పవన్ వెళ్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు మినహా ఏమీ తెలియని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. వారాహి వాహనానికి మిలటరీ వాహనాలకు మాత్రమే వేసే ఆలీవ్ గ్రీన్ రంగు వేశారు. ఇది చట్ట విరుద్ధం కాదా..? రూల్స్ తెలియని వాడు రూలర్ అవుతాడా ? మోదీ బీజేపీ బాహుబలిగా మారారా ? పోయిన చోటే వెతుక్కోవాలంటారు. గత ఎన్నికల్లో త్రుటిలో కోల్పోయిన స్థానాలపై బాగా దృష్టి పెట్టడంలో, దూరమైన వర్గాలను కలుపుకొని పోవడంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించిన బీజేపీ గుజరాత్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. సీఎంగా 13 ఏళ్లు గుజరాత్‌లోనూ, పీఎంగా ఎనిమిదేళ్లుగా కేంద్రంలోనూ తిరుగులేని నాయకునిగా మోదీ సాధించిన పేరు ప్రఖ్యాతులు కూడా ఈసారి ఫలితాలను బాగా ప్రభావితం చేశాయి. ఒక్కడే వచ్చాడు..156 సీట్లు పట్టుకుపోయాడు.. మోదీ బీజేపీ బాహుబలిగా మారారా ? తేల్చేద్దాం గన్‌షాట్‌గా.. శనివారం రాత్రి 7 గంటలకు తిరిగి ఆదివారం ఉదయం 7.30 గంటలకు సాక్షి టీవీలో -
జయహో బీసీ మహాసభకు మద్దతు
సాక్షి, అమరావతి: బీసీలే వెన్నెముక అనే నినాదంతో ఈ నెల 7న విజయవాడలో జరుగనున్న జయహో బీసీ మహాసభకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విజయవాడలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో జయహో బీసీ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మారేష్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నా దేశంలో బీసీ ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో సైతం బీసీలకు జరగని మేలు ఏపీలో సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని చెప్పారు. ఏపీలో బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా సీఎం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని కొనియాడారు. బడుగు బలహీనవర్గాలంతా జగన్‌కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల బేబీ రాణి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోర్ల మహీధర్ తదితర బీసీ సంఘం నేతలు మాట్లాడారు. మారుమోగుతున్న జయహో బీసీ నినాదం గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సాక్షి, అమరావతి: దేశచరిత్రలో ఎవరూ చేయలేని సామాజిక విప్లవాన్ని, జ్యోతిరావు పూలే ఆశయాలను నిజంచేసి చూపించిన సీఎం వైఎస్ జగన్ వెంటే బీసీలంతా నడుస్తున్నారని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశచరిత్రలో 82 వేలమంది బీసీలను ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దిన ఒకే ఒక్కడు సీఎం జగన్ అని తెలిపారు. జయహో బీసీ నినాదం రాష్ట్రమంతా మారు మోగుతోందని ఆయన చెప్పారు. -
రేపే ‘జయహో బీసీ’ మహాసభ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బీసీలు మరింత అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో వారి సమస్యలను తెలుసుకునేందుకే ‘వెనుకబడిన కులాలే వెన్నెముక’ అనే నినాదంతో ‘జయహో బీసీ మహాసభ’ కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం భారీఎత్తున నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల ఇన్చార్జి, పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ నెల ఏడో తేదీన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లను విజయసాయిరెడ్డితో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి సోమవారం పరిశీలించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘జయహో బీసీ’ నినాదం చంద్రబాబు సొత్తుకాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని.. జనాభాలో 50 శాతం ఉన్న ఆ వర్గాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం గడచిన మూడున్నరేళ్లలో 50 శాతం నామినేటెడ్ పదవులు ఇచ్చి రాజకీయంగా, సంక్షేమం కింద రూ.1.37 లక్షల కోట్లను మంజూరు చేసి ఆర్థికంగా, విద్యా, ఉద్యోగ ఆవకాశాలు కల్పించి సామాజికంగా తలెత్తుకు తిరిగేలా చేసిందన్నారు. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కంటే ఏపీలో బీసీలు ఎక్కువ అభివృద్ధి సాధించడం సీఎం వైఎస్ జగన్ ఘనతగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా సభల నిర్వహణ ఇక సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బీసీలు అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే 139 బీసీ కులాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. క్షేత్రస్థాయిలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సభ ద్వారా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. సభ అనంతరం జోనల్, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో ఇదే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అలాగే, రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మహాసభలను కూడా నిర్వహిస్తామన్నారు. మరోవైపు.. సభలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ టీకే రాణా, డీసీపీలు విశాల్ గున్ని, శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్‌కు ఎంపీ సూచించారు. ఈ సందర్భంగా భోజనశాల, వాహనాల పార్కింగ్, స్టేజ్, ప్రజలు వచ్చి వెళ్లే మార్గాలను ఎంపీ పరిశీలించారు. 82 వేల మందికి ఆహ్వాన పత్రాలు ఇక వార్డు మెంబర్లు, పంచాయతీ సర్పంచ్‌లు, పీఏసీఎస్ అధ్యక్షులు, సభ్యులు, ఇతర నామినేటెడ్ పదవుల్లో ఉన్న 82,432 మంది బీసీలకు జయహో బీసీ మహాసభ ఆహ్వాన పత్రాలను పంపించినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇక సభకు వచ్చే వారికోసం 24 రకాల వంటకాలను సిద్ధంచేయిస్తున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. చంద్రబాబు బీసీల ద్రోహి: బొత్స బొత్స మాట్లాడుతూ.. బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుని టీడీపీ రాజకీయ లబ్ధిపొందిందని మండిపడ్డారు. 14 ఏళ్ల తన పాలనలో చంద్రబాబు బీసీలను ఆణగదొక్కారన్నారు. ఆ కాలంలో బీసీ ఉపకులాలకు చెందిన వ్యక్తులకు మొక్కుబడిగా ఇస్త్రీ పెట్టెలు, మోకులు, కత్తెర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అదే ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల మేరకు ఏడాదికి రూ.80 వేల కోట్లను బీసీల బ్యాంకు ఖాతాల్లో జమచేశారని గుర్తుచేశారు. టీడీపీలోని బీసీ నాయకులే చంద్రబాబును చూసి ‘ఇదేం ఖర్మరా బాబూ!’ అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. షెడ్యూల్ ఇదీ.. ఉదయం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభను ప్రారంభిస్తారని విజయసాయిరెడ్డి చెప్పారు. 10 నుంచి 12 గంటల వరకు బీసీ మంత్రులు, నాయకులు ప్రసంగిస్తారు. 12 నుంచి ఒంటి గంట వరకు సీఎం ప్రసంగిస్తారు. -
వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తా: చంద్రబాబు
సాక్షి, ఏలూరు/సాక్షి, రాజమహేంద్రవరం/కొవ్వూరు: ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలను నట్టేట ముంచుతున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు. నేను అనుకుంటే వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తా. పశ్చిమ గోదావరిలో ఉన్న హార్టీకల్చర్ యూనివర్సిటీ పేరు మారుస్తా’ అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చేశారు. గురువారం జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం మండలాల్లో, కొవ్వూరులో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో రోడ్‌షోలు నిర్వహించి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. తొలుత కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన బీసీ సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి, డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఒకే జిల్లా వాళ్ళు. రాష్ట్రంలో సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల ఈ నలుగురే రాజకీయం చేస్తుంటే మేము చూస్తూ ఉండాలా’ అని అన్నారు. ఈ ప్రభుత్వంలో బీసీలకు పదవులు ఇచ్చి అగ్రవర్ణాల కింద పని చేయించుకుంటున్నారని అన్నారు. బీసీలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాలని కోరిక ఉండటం తప్పు కాదని, ఒక పద్ధతి ప్రకారం ఎదగాలని చెప్పారు. బీసీల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు ఆయన పోలవరంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు గానీ గంజాయి మాత్రం ఇస్తున్నారని, అందరూ గంజాయి మత్తులో ఉంటే రాష్ట్రాన్ని దోచేస్తున్నారని విమర్శించారు. ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని, తెలంగాణలో ఎక్కువ మద్దతు ధర ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు పోయి, ఇసుక, మైనింగ్ మాఫియా, గంజాయి, ఎర్రచందనం స్మగ్లర్లు ఎక్కువయ్యారన్నారు. పోలవరం పునరావాస కాలనీలను జూబ్లీహిల్స్‌లా చేయాలనుకున్నా అన్నారు. 72 శాతం ప్రాజెక్టు తానే పూర్తి చేశానని, తాము అధికారంలోకి రాగానే పోలవరాన్ని జిల్లా గా ప్రకటిస్తామన్నారు. మనం ఎమైనా చేస్తే పోలీసులు వచ్చి గోడలు దూకి అరెస్టు చేస్తారని అంటూనే, వాళ్లదేం తప్పులేదని, జీతాలు కూడా లేవంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. తన మీద కేసులు పెట్టేందుకు తవ్వుతూనే ఉన్నారని, ఈక కూడా దొరకదని చెప్పారు. ప్రాజెక్టు వద్ద హైడ్రామా అంతకుముందు చంద్రబాబు, టీడీపీ నేతలు పోలవరం ప్రాజెక్టులోకి వెళ్లడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొన్నారు. ప్రాజెక్టు సందర్శనకు అనుమతి తప్పనిసరని, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో అనుమతించలేమని డీఎస్పీ లతాకుమారి వివరించారు. దీంతో పోలీసులను అడ్డగోలు రీతిలో ప్రశి్నంచి 15 నిమిషాల పాటు రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. ఉద్యోగాలిచ్చా.. రాయల్టీ ఇవ్వండి తన హయాంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశానని, మీ పిల్లలకు విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయని, లక్షల ఆదాయం చూపించానని అందుకు ప్రతిఫలంగా తనకు రాయల్టీ పే చేయాలని చంద్రబాబు కొవ్వూరు సభలో అన్నారు. సంపాదనలో కనీసం ఒక శాతం రాయల్టీ ఇవ్వాలన్నారు. పార్టీ ఫండ్ అన్నా ఇవ్వాలని ప్రాథేయపడ్డారు. -
సీఎం జగన్ సామాజిక సాధికారతకు న్యాయం చేశారు
సాక్షి, విజయవాడ: బీసీలకు సామాజిక న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌దే అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీసీలకు సీఎం జగన్ చేసిన న్యాయం మరెవరూ చేయలేదు. అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. తద్వారా సామాజిక న్యాయం పాటించారు. బీసీలకు ఒక గుర్తింపు ఇచ్చిన పార్టీ వైఎస్సార్సీపీ. వైఎస్సార్సీపీ తరపున ఆర్.కృష్ణయ్య లాంటి బీసీ నాయకుడిని రాజ్యసభకు పంపాం. సామాజిక సాధికారతకు న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌దే అని సజ్జల పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఏనాడూ బీసీలను పట్టించుకోలేదు. కానీ, సీఎం జగన్ బీసీల ఆకాంక్షలకు పెద్దపీట వేశారు. విద్య, వైద్యమే ఏ కుటుంబానికైనా అతిముఖ్యం. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఆర్థికంగా నిలబడేందుకు అన్ని వర్గాలకు అండగా నిలిచాం. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నాం. మూడున్నరేళ్ల కిందట రాష్ట్రం ఎలా ఉండేదో.. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ఎలా ఉందో ఆలోచించాలి అని ప్రజలకు సజ్జల పిలుపు ఇచ్చారు. ఇంకా ఏమన్నారంటే.. బీసీలకి వెన్నుదన్నుగా నిలిచిన పార్టీ వైఎస్సార్ సీపీ. పద్నాలుగేళ్లు చంద్రబాబు అధికారంలో ఉండి బీసీలకు ఏమి చేయలేదు. కానీ, గడిచిన మూడున్నరేళ్లలో బీసీల జీవితాలలో మార్పు వచ్చింది. ఈ జన సంక్షేమ ప్రభుత్వంపై ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారు. ఈ మూడున్నరేళ్లలో అసమానతలను తొలగించాం. జాతీయ పార్టీలో ఉండి కూడా దివంగత మహానేత వైఎస్సార్ బీసీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బీసీల తలరాతలను వారే మార్చుకునేలా సీఎం జగన్ అవకాశం కల్పించారు. ఇక విదేశీ విద్యలోను గత ప్రభుత్వం వివక్ష చూపింది.అందరికి ఇవ్వలేదు. కొందరికే ఇచ్చి చేతులు దులుపుకుంది. విదేశాల్లో టాప్ 100 యూనివర్సిటీలో అవకాశాలు దక్కించుకున్న విద్యార్ధులకి వాళ్ల వాళ్ల విద్యకు అయ్యే ఖర్చును మొత్తం మా ప్రభుత్వమే(వైఎస్సార్సీపీ) భరిస్తుంది. గతంలో 4 లక్షల మంది ఉద్యోగాలుంటే.. నేడు ఆ సంఖ్య ఆరు లక్షలకి పైగా పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు తర్వాత అధిక శాతం నాయకత్వం బిసిలకే కట్టబెట్టాం. 2029 నాటికి వైఎస్సార్సీపీలో టిక్కెట్లకోసం బీసీల నుంచే ఎక్కువ పోటీ ఉండబోతోంది. సంక్షేమ పథకాలు కొనసాగలంటే సీఎం జగన్ మళ్లీ గెలవాలి. 175 స్థానాల్లో వైసీపీ గెలవడం అంటే బీసీల విజయంగా భావించాలి. ఆర్థిక పరిస్థితి బాగోకపోయిన సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్ ది. అందమైన భవిష్యత్ కోసం సీఎం వైఎస్ జగన్‌కి చేయూతనివ్వాలి.. మళ్లీ ఆయన్ని గెలిపించాలి అని ప్రజలను కోరారు సజ్జల ఇదీ చదవండి: జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు! -
27న విజయవాడలో బీసీ ఆత్మగౌరవ సభ
సాక్షి, అమరావతి/పటమట(విజయవాడ తూర్పు): ఈ నెల 27న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య హైదరాబాద్‌లో నాయకులతో సమావేశం నిర్వహించారు. బీసీ ఆత్మగౌరవ సభ పోస్టర్‌ను కృష్ణయ్య విడుదల చేశారు. ఈ సమావేశ వివరాలను ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు ఎన్.మారేష్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను సన్మానించి బీసీల సత్తా చాటేలా ఆత్మగౌరవ సభను నిర్వహించాలని కృష్ణయ్య సూచించారని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీలంతా ఏకమై పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏపీ బీసీ సంఘ మహిళా అధ్యక్షురాలు వేముల బేబీరాణి పాల్గొన్నారు. అనంతరం బీసీ సంఘ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా మల్లి అప్పారావు, ఉత్తరాంధ్ర కన్వీనర్‌గా సనపాల లక్ష్మీనరసింహ, ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా అనిల్‌కుమార్, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా వెంకటాచార్యులు, రాష్ట్ర కన్వీనర్‌గా తన్నీరు సుబ్బారావు, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాధవికి కృష్ణయ్య నియామకపత్రాలు అందించారు. -
బీసీ సంక్రాంతి సభ: వాహనాలు మళ్లింపు
సాక్షి, విజయవాడ: ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరుగనున్న బీసీ సంక్రాంతి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. వాహనాల మళ్లింపులు: పీఎన్బీఎస్ నుంచి మచిలీపట్నం, ఏలూరు వెళ్లే ఆర్టీసీ బస్సులు పీసీఆర్, చుట్టుగుంట, రామవరప్పాడు రింగ్ మీదుగా దారి మళ్లింపు బందర్ రోడ్ లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సిటీ బస్సులకు నిషేధం పీసీఆర్ వైపు నుంచి బెంజి సర్కిల్ వెళ్ళు సాధారణ వాహనాలు డీసీపీ బంగ్లా మీదుగా స్టేట్ గెస్ట్ హౌస్, జమ్మిచెట్టు నుంచి పీవీపీ మాల్ మీదుగా ఎంజీ రోడ్లోకి మళ్లింపు ఆర్టీఏ నుంచి రెడ్ సర్కిల్, రెడ్ సర్కిల్ నుంచి శిఖామణి సెంటర్, శిఖామణి సెంటర్ నుంచి వాటర్ ట్యాంక్ రోడ్లో వాహనాలు అనుమతించబడవు. ఆహ్వానితులకు ప్రత్యేక సూచనలు: బీసీ సంక్రాంతి కార్యక్రమానికి వచ్చే వీఐపీ వాహనాలకు గేట్ నెంబర్-2 ద్వారా ప్రవేశం బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు వారి అనుచరులకు గేట్ నెంబర్-3 నుంచి ప్రవేశం డైరెక్టర్ల వాహనాలకు స్వరాజ్య మైదానం ,పోలీస్ ఆర్మడ్ గ్రౌండ్ లో పార్కింగ్ ఏర్పాటు కార్యకర్తలు,అతిధులు స్టేడియం పరిసర ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడ వాహనాల పార్కింగ్ చేయరాదు ఇతరులకు అసౌకర్యము కలిగించకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీ బత్తిన శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. -
22న బీసీల చలో విజయవాడ
కొత్తపేట : కాపులను బీసీ జాబితాలో చేర్చడం తగదంటూ బీసీ ఉద్యమంలో భాగంగా ఈ నెల 22న చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టినట్టు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపర్తి సూర్యచంద్రరావు తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చేందుకు నియమించిన బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథన్కు తమకు జరిగే అన్యాయాన్ని వినతిపత్రం ద్వారా వివరించనున్నామని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా బీసీలు 22న ఉదయం రావులపాలెం సెంటర్‌కు చేరుకుని, అక్కడి నుంచి భారీ ర్యాలీగా తరలివెళ్లనున్నట్టు తెలిపారు. బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, సభ్యులు తరలిరావాలని పిలుపునిచ్చారు.