Political analysts
-
Lok Sabha Election 2024: మహిళలు 10 శాతమైనా లేరు!
ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మహిళల సంఖ్య 10 శాతం కంటే తక్కువే ఉంది! ఈసారి మహిళా అభ్యర్థులు కేవలం 797 మందేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. అంటే 9.5 శాతం! తొలి విడతలో 1,618 మంది అభ్యర్థుల్లో మహిళలు 135 మంది. రెండో విడతలో 1,192 మంది అభ్యర్థుల్లో 100 మంది, మూడో విడతలో 1,352 మందిలో 123, నాలుగో విడతలో 1,717 మందిలో 170, 5వ విడతలో 695 మందిలో 82 మంది మహిళలున్నారు. పోలింగ్ జరగాల్సిన ఆరో విడతలో 869 మంది అభ్యర్థుల్లో 92 మంది మహిళలున్నారు. ఏడో విడతలో కూడా 904 మంది అభ్యర్థుల్లో మహిళలు కేవలం 95 మందే. మహిళా రిజర్వేషన్ల అమలుపై పారీ్టల చిత్తశుద్ధి ఏపాటితో చెప్పేందుకు ఈ ఉదంతం ఒక్కటి చాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈసారి మొత్తం 8,337 మంది అభ్యర్థులు లోక్‌సభ బరిలో నిలిచారు. ఇంతమంది పోటీలో ఉండటం 1996 తర్వాత ఇదే తొలిసారి. 1996లో రికార్డు స్థాయిలో 13,952 మంది పోటీ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇదో ఆధునిక రా.కీ.నే! కుమారులూ... ఏడు చేపల కథ!
ఇదో కథ. తరతరాలుగా తెలిసిందే. ఎంతోమంది రాజకీయ నేతలకు తరచూ అనుభవంలోకి వచ్చిన కథే. తరం తర్వాత తరం... ఇలా తర్వాతితరానికి తెలియాలనే ఉద్దేశంతో విచిత్ర వింత తంత్ర, కాతంత్ర, కుతంత్ర, బహుళతంత్రాలు రాసిన మహామునుల్లాంటి రాజకీయ విశ్లేషకులు దీన్ని గ్రంథస్థం చేసిన కథ. కేవలం ప్రైవేట్ సర్క్యులేషన్లో ఉంచిన ఈ ఓపెన్ సీక్రెట్గాథ సారాంశమేమిటంటే... అనగనగనగా ఓ రాజకీయనేత. రాజులాంటి ఆ రా.కీ. నేతకు ఏడుగురు కొడుకులు. ఓ రోజున రా.కీ. నేత ఇలా అన్నాడు. ‘‘కుమారులారా... ఎన్నాళ్లు నా పంచనబడి ఇలా బతికేస్తారు. ఇక మీరు కూడా స్వతంత్రంగా ఓటర్లకు గాలమేసి, వాళ్లను చేపల్లా పట్టుకునే టైమొచ్చింది’’ అని చెప్పాడు. ఇలా చెబుతూనే..ఓటర్ల ను చేపల్లా పట్టేసి, తమ ‘బుట్టలో పడేయడానికి’ ఏమేమి ఎర వేయాలో, ఎలాంటి ఎరలు వాడాలో లాంటి టెక్నిక్స్ కూడా వివరించాడు. ఏడుగురు కొడుకులూ గేలాలు తీసుకుని, ఓటర్ల వేటకు బయల్దేరారు. (ఒకడైతే మరీనూ. చేపల్లాంటి తన ఓటర్లను తాను ‘కాల్చుకు తినడాని’కంటూ ఓ ప్రెషర్ కుక్కర్నూ వెంట తీసుకొని బయల్దేరాడు. సదరు కుక్కరు..చేపల్నీ వండుతుంది, పనిలోపనిగా అది వేసే విజిళ్లతో తనకు ఎంకరేజ్మెంటూ దక్కుతుందనేది అతడి వాదన. ఒకే పనిలో బహుళ ప్రయోజనాల కోసం ప్లానింగ్ చేసే, అలాంటివాడే తనకు సరైన వారసుడంటూ మురిసిపోతాడా నేత. అది వేరే కథ). ఆరుగురు రా.కీ.నేత కుమారులకు ఓటర్లు పడ్డారుగానీ... ఒకడికి మాత్రం పడలేదు. అప్పుడా రా.కీ.నేత కుమారుడిలా ప్రశ్నించాడు. ‘‘ఓటరూ..ఓటరూ..నా గేలానికి నువ్వు ఎందుకు పడలేదు?’’ ‘‘నువ్వు నీ గేలానికి డబ్బు ఎరగా వేయలేదు’’ అతడు మళ్లీ తన పీఏ దగ్గరికెళ్లి అడిగాడు. ‘‘పీయ్యే..పీయ్యే.. గేలానికి ఎరగా డబ్బును ఎందుకు పెట్టలేదు?’’ ‘‘అదే టైముకు ఈడీ, ఇన్కమ్ట్యాక్సు వాళ్లు దాడులు చేసి, డబ్బు ఫ్రీజ్ చేశారు’’ అని జవాబిచ్చాడు పీయ్యే. ఈసారి రా.కీ. నేత కుమారుడు ఈడీ, ఇన్‌కమ్‌ట్యాక్స్ వాళ్ల దగ్గరికి వెళ్లి అడిగాడు. ‘‘ఈడీ వాళ్లూ, ఐటీ వాళ్లూ... మా మీద దాడి ఎందుకు చేశారు?’’ ‘‘మా పైవాళ్లు మాకు ఆదేశాలు ఇచ్చారు’’ చెప్పారు ఈడీ, ఐటీ సిబ్బంది. ‘‘పైవాళ్లూ..పైవాళ్లూ..ఇలా ఆదేశాలు ఎందుకిచ్చారు?’’ ‘‘సార్... మేమేముంది చిన్న చీమల్లాంటి వాళ్లం. మీకు అధిష్టానం ఉన్నట్లే మాకు ప్రధానమైన పైపైవాళ్లు ఒకరుంటారు. వారిని కాదంటే మమ్మల్ని చీమల్లా నలిపేయగలరు కాబట్టి ‘చీమల్లాంటివాళ్లం’ అంటూ మమ్మల్ని మేము అభివర్ణించుకున్నాం. ఆ పైపైవారంటే.. వాళ్లు గతంలోలా కాంగ్రెస్ కావొచ్చు, లేదా ఇప్పట్లోలా బీజేపీ కావొచ్చు. అలా పవర్లో ఉన్నది యూపీఏ అయినా, లేదా ఎన్డీఏ అయినా..కుట్టాల్సింది పొరుగునున్న కర్ణాటక అయినా, పక్కనున్న మహారాష్ట్ర అయినా మరో రాష్ట్రమైనా ఫరక్ పడేదీ ఏదీ ఉండదు, ప్రాసెస్ సేమ్ టు సేమ్. అసలు కేంద్రంలో అధికారంలో ఉన్నది ఏ ప్రభుత్వమైనా..వాళ్ల స్టార్ క్యాంపెయినర్లం మేమే. ఆ అధికారగణాల బంగారు పుట్టలో ఎవరైనా వేలు పెడితే..వాళ్లను మేం కుట్టకుండా ఉంటామా?’’ అంటూ గుట్టు విప్పి, గుసగుసగా చెప్పారు. -
G20 Summit: జిన్‌పింగ్ ఎందుకు రావట్లేదు ?
జీ20 సదస్సుకు కయ్యాలమారి చైనా అంతగా ప్రాధాన్యత ఇవ్వట్లేదా ?. అందుకే అధ్యక్షుడు జిన్‌పింగ్ తనకు బదులు ప్రధాని లీ కియాంగ్‌ను పంపించారా ?. ఇలాంటి ప్రశ్నలకు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు తలో విశ్లేషణ చెబుతున్నారు. జీ20 కూటమి ఆవిర్భావం తర్వాత చైనా అధ్యక్షులు ఒకరు శిఖరాగ్ర సదస్సులో పాల్గొనకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇంతటి ప్రతిష్టాత్మకమైన సదస్సుకు హాజరుకాకుండా జిన్‌పింగ్ చైనాలోని ఉండి ఏం చేస్తున్నారు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2020 మే నెల నుంచి భారత్‌తో సరిహద్దు వెంట ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి దిగడం, భారీగా సైన్యం మొహరింపు వంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతుండటం వల్లే జిన్‌పింగ్ ఆగ్రహంతో సదస్సుకు రావట్లేదని చాలా మంది భావిస్తున్నారు. అసలు కారణం అది కాదని మరో వాదన బలంగా వినిపిస్తోంది. అదే అదుపు తప్పుతున్న చైనా ఆర్థిక పరిస్థితి. జిన్‌పింగ్ ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. అప్పుడే వచ్చిన సాంస్కృతిక విప్లవం ధాటికి ఆయన తండ్రి పేదవాడిగా మిగిలిపోయాడు. దీంతో జిన్‌పింగ్ బాల్యంలో కష్టాలు చూశాడు. పొలంలో సాధారణ కూలీగా పనిచేశాడు. ఆరేళ్లు ఇబ్బందులు పడ్డాడు. అయితే బలీయమైన చైనాకు అధ్యక్షుడిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలతో పోలిస్తే ఆనాటి కష్టాలు గడ్డిపరకతో సమానమే. ‘చైనా రాజ్య విస్తరణ వాదం, దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యం, ప్రపంచ వస్తూత్పత్తి మార్కెట్‌కు ఏకైక దిక్కుగా మారాలన్న వ్యూహాలతో చైనా చాలా ప్రపంచ దేశాలకు శత్రువుగా మారింది. ఇలాంటి తరుణంలో చైనాతో కలిసి జీ20 వేదికను కలిసి పంచుకునేందుకు తోటి దేశాలు విముఖత చూపుతున్నాయి’ అని మేథో సంస్థ కార్నీగ్ చైనా డైరెక్టర్ పాల్ హెనెల్ వ్యాఖ్యానించారు. ఆ అప్రతిష్ట పోగొట్టుకునేందుకే ‘ సదస్సు విజయవంతం అవడానికి అందరితో కలిసి పనిచేస్తాం’ అని బీజింగ్ తాజాగా ప్రకటించింది. ‘విదేశీ పర్యటనకు పక్కనబెట్టి స్వదేశ సమస్యలపై జిన్‌పింగ్ దృష్టిపెట్టారు. దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పొరుగు దేశాలతో కయ్యానికి దిగారు. ఆర్థిక వ్యవస్థ సమస్యల్లో చిక్కుకోవడంతో జిన్‌పింగ్‌కు తలనొప్పి పెరిగింది’ అని సింగపూర్‌లోని నేషనల్ యూనివ ర్సిటీ ప్రొఫెసర్ ఆల్ఫ్రెడ్ వూ వ్యాఖ్యానించారు. దెబ్బకొట్టిన హౌజింగ్ రంగం ఇటీవల దశాబ్దాల కాలంలో ఎన్నడూలేనంతగా పలు సమస్యలు చైనాలో తిష్టవేశాయి. కుటుంబాలు తమ ఖర్చులను తగ్గించుకున్నాయి. కర్మాగారాల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. వ్యాపారవేత్తలు నూతన పెట్టుబడులకు ముందుకు రావట్లేదు. ఎగుమతులు దిగజారాయి. ఆగస్టులో ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.8 శాతం తగ్గాయి. దిగుమతులు 7.3 శాతంపెరిగాయి. నిరుద్యోగిత భారీగా పెరగడంతో ప్రభుత్వం తాజా గణాంకాలు బహిర్గతంచేయడం మానేసింది. ఆస్తుల మార్కెట్ విలువ భారీగా పతనమైంది. ప్రధాన డెవలపర్లు చేతులెత్తేసి దివాలాను ప్రకటించారు. దీంతో రియల్ ఎసేŠట్ట్ రంగం సంక్షోభంలో చిక్కింది. 40 ఏళ్ల భవిష్యత్ అభివృద్ది మోడల్‌ను ఈ అంశాలు తలకిందులుచేసేలా ఉన్నాయి. ప్రాపర్టీ రంగంపై అతిగా ఆధారపడటం, అత్యంత కఠినమైన కోవిడ్ ఆంక్షల విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని నిపుణులు భావిస్తున్నారు. రుణాల పునాదిపై నెలకొల్పిన అభివృద్ధి మోడల్ ఈ పరిస్థితికి మరో కారణం. దేశం అప్పులు పెరిగిపోయాయి. 2023 తొలి త్రైమాసికంలో అప్పులు–జీడీపీ నిష్పత్తి రికార్డు స్థాయిలో 279 శాతంగా నమోదైందని బ్లూమ్‌బర్గ్ విశ్లేషించింది. రుణాలు అతిగా తీసుకొచ్చి మౌలిక వసతులపై ఖర్చుచేసిన పాపం ఇప్పుడు పండిందని మరో వాదన. హౌజింగ్ బుడగ బద్ధలైంది. చైనా ఆర్థిక వ్యవస్థ 25 శాతం ప్రాపర్టీ మార్కెట్‌పైనే ఆధారపడింది. ఇన్నాళ్లూ కేవలం చైనాపై ఆధారపడిన విదేశీ బ్రాండ్లు ఇప్పుడు చైనాతోసహా ఇతర(చైనా ప్లస్ స్ట్రాటజీ) దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. దీని వల్ల ప్రధానంగా లాభపడేది ఇండియానే. ఆపిల్, టెస్లా మొదలుకొని నైక్ వరకు అన్ని ప్రధాన సంస్థల తయారీకేంద్రాలు చైనాలోనే ఉన్నాయి. కార్మికులకు అధిక జీతభత్యాలు, అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో విదేశీ సంస్థలు చైనాకు బదులు వేరే దేశాల వైపు చూస్తున్నాయి. ఆర్మీలో అవిధేయత? చైనా ఆర్మీలో పెరిగిన అవినీతి, పాలక పార్టీ పట్ల తగ్గిన విధేయతపై జిన్‌పింగ్ భయపడుతున్నారని ఆసియా పాలసీ సొసైటీ ఇన్స్టిట్యూట్లో జాతీయ భద్రతా విశ్లేషకుడు లైల్ మోరిస్ చెప్పారు. చైనా సైన్యంలో అణ్వస్త్ర సామర్థ్య రాకెట్ విభాగంలోని జనరల్, డెప్యూటీ జనరల్‌లను తొలగించడాన్ని ఆయన ఉటంకించారు. తనకు నమ్మకస్తుడైన విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌ను జిన్‌పింగ్ తప్పించడంతో పార్టీ వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి రేగింది. జిన్‌పింగ్ పాలనా సామర్థ్యానికి ఈ ఘటనలు మాయని మచ్చలని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇలాంటి సమస్యలు ఇంకొన్ని పెరిగితే డ్రాగన్ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పాలనకు తెరపడే ప్రమాదముందని కొందరు సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. ఇన్ని సమస్యలు ఇంట్లో పెట్టుకునే జిన్‌పింగ్ చైనాను వదలి బయటకు రావట్లేదనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజకీయం.. సరికొత్త సమరం
ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించినా ఆ పార్టీకి సలహాదారులుగా పనిచేసినవారికి మీడియాలో కాస్త ఎక్కువ ప్రచారం ఈమధ్య లభిస్తోంది. ఫలితాలు వెలువడిన రెండు మూడు రోజులకు ఆయా పార్టీల వ్యూహకర్తల గురించి పత్రికలు, న్యూస్ వెబ్సైట్లలో, న్యూస్ టెలివిజన్ చానల్స్‌లో కథనాలు వస్తున్నాయి. ఇలాంటి విషయాలు మీడియాలో వచ్చే ధోరణి భారతదేశంలో 2014 నుంచీ ఎక్కువైంది. నాటి ప్రధాని, కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన 1984 డిసెంబర్ నెలాఖరు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ‘రీడిఫ్యూజన్’ అనే అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ సేవలను కాంగ్రెస్ పార్టీ తొలిసారి వాడుకుంది. ఇంగ్లిష్ సహా వివిధ భాషల్లో వెలువడే దినపత్రికల్లో కాంగ్రెస్ తరఫున పూర్తి పేజీ ప్రచార ప్రకటనలను ఈ ఏజెన్సీ రూపొందించింది. ఈ ఎలెక్షన్ యాడ్స్ పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కమ్యూనికేషన్ల రంగంలో వృత్తి నైపుణ్యం గల ప్రైవేటు సంస్థలకు ఎన్నికల ప్రచారంలో కొంత బాధ్యతను రాజకీయ పక్షాలు అప్పగించడం 1980ల మధ్యలో దేశంలో ఓ మోస్తరుగా ఆరంభమైంది. 1985 ఏప్రిల్ మాసంలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో కూడా నాటి జనతాపార్టీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఒక కార్పొరేట్ యాడ్ ఏజెన్సీ ద్వారా పత్రికల్లో వేసిన ఎన్నికల ప్రచార ప్రకటనలు రూపొందింపజేశారు. తాజాగా కర్ణాటక అసెంబ్లీ 16వ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజు నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించడానికి వెనుక ఉన్న వృత్తి నిపుణులు, మాజీ ఐఏఎస్ అధికారుల గురించి మీడియాలో వివరాలు వెల్లడిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది లేదా ఆరు నెలల ముందు నుంచి ఈ వ్యూహకర్తలు అధికార పార్టీపై ఎలాంటి నినాదాలు రూపొందించారు? ఎలాంటి జన సమీకరణ కార్యక్రమాలు అమలు చేశారు? వంటి వివరాలను ఈ మీడియా సంస్థలు పలు వ్యాసాల్లో చెబుతున్నాయి. మొదట ఫలానా పార్టీ ఈ కారణాల వల్ల ఓడిపోయిందని, ఫలానా ప్రతిపక్ష రాజకీయ పార్టీ ఏఏ కారణాల వల్ల విజయం సాధించిందనే అంశాలను మీడియాలో పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. వివిధ రాజకీయపక్షాల గెలుపోటములకు ఇలా కారణాలు వివరించాక, విజయాల వెనుక ఉన్న వ్యక్తులు, వృత్తి నిపుణుల గురించి రాయడం గత పదేళ్ల నుంచి దేశంలో ఆనవాయితీగా మారింది. పాశ్చాత్య దేశాల్లో కన్సల్టెంట్ల నియామకం వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఓటర్లతో నేరుగా సంపర్కం సాధ్యం కాని అమెరికా, కెనడా, ఇంకా ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి ఐరోపా దేశాల్లో ఎన్నికల కన్సల్టెంట్లు లేదా వ్యూహకర్తల వినియోగం లేదా వారి సేవలు వాడుకోవడం 50 ఏళ్ల క్రితమే మొదలైంది. రాజకీయ పార్టీలకు సలహాదారులు, వ్యూహకర్తలగానే గాక, విడివిడిగా ఆయా పార్టీ అభ్యర్థులకు ఎన్నికల ప్రచారంలో ఈ వృత్తి నిపుణులు సేవలందిస్తున్నారు. (Photo Courtesy:BBC) 2008 నవంబర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బరాక్ ఒబామా తనను గెలిపిస్తే దేశంలో గొప్ప మంచి మార్పు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అందుకోసం ‘ఛేంజ్ వీ కెన్ బిలీవ్ ఇన్’ అనే నినాదం రూపొందించి విస్తృత ప్రచారంలో పెట్టి అమెరికన్ ఓటర్ల మనసులు ఆకట్టుకున్నారు. సాధారణ ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే ఇలాంటి నినాదాల రూపకల్పనలో ఈ కన్సల్టెంట్లు లేదా వ్యూహకర్తలు తోడ్పడతారు. ఇంతకు ముందు పాశ్చాత్య దేశాల్లో, ఇండియాలో ఆయా రాజకీయ పార్టీల నాయకుల్లో కొందరు ఇలాంటి జనాకర్షక నినాదాలు రూపొందించడంలో, తెలివైన ప్రచార వ్యూహాల రచనలో కీలక పాత్ర పోషించేవారు. ఎన్నికల్లో ప్రజలను కలుసుకోవడం, ఎన్నికల హామీలు, వాగ్దానాలు రూపొందించడం, ఇంకా ఇతర కార్యక్రమాల అమలుకే రాజకీయ పార్టీల నాయకుల సమయం సరిపోతోంది. రోజురోజుకు ప్రజలు లేదా ఓటర్ల ఆశలు, అవసరాలు పెరుగుతున్న కారణంగా ఎన్నికల రాజకీయాలు సంక్లిష్టమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజకీయవేత్తలకు ఎన్నికల వ్యూహకర్తలు, సలహాదారుల అవసరం ఏర్పడుతోంది. రాజకీయపక్షాల సభ్యత్వం లేకుండానే ఈ ఎన్నికల నిపుణులు పనిచేయడం అమెరికా వంటి దేశాల్లో మొదలైంది. ఎన్నికల ప్రచారంలో ఒక తరహా శ్రమ విభజనకు ఈ ఎలక్షన్ కన్సల్టెంట్లు, వ్యూహకర్తల నియామకం అవకాశమిస్తోంది. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ సభ్యులు -
Caste Census: నిజంగా కులగణన అవసరమేనా?
భారతదేశంలో కులాల వారీగా జనాభాను లెక్కించాలని చాలా రోజుల నుంచి కొంత మంది కుల సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనూహ్యంగా ఈ కులగణనకు జెండా ఊపడంతో, కులగణన వలన జరిగే ప్రయోజనాలు, సమస్యలు అనే విషయంపై చర్చ మొదలైంది. కులగణన అనే తేనె తుట్టెను నితీష్ కుమార్ కదిలించడం వెనక రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని విమర్శకుల వాదన. కులాల వారీ జనాభా లెక్కల సేకరణ డిమాండ్ వెనక సామాజిక అభివృద్ధి కోణం ఉంటే సమర్థనీయమే. అభిలషణీయమే. ఇక స్వాతంత్య్రానంతరం కొంత మంది మాత్రమే ఈ దేశాన్ని పాలించడంలో, దేశ వనరులను అను భవించడంలో ముందంజలో ఉన్నారు. ఆ పనిలో తాము కూడా ముందు ఉండాలని దూరాలోచన కులగణన సమర్థకుల మనసుల్లో ఉంటే... ఈ విషయంలో వాదాలూ, ప్రతి వాదాలూ, సమస్యలు అనేకం ఉత్పన్నం కావచ్చు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో దేశంలోని అనేక వర్గాలు వెనుకబడి ఉన్న మాట నిజమే. స్వాతంత్య్రానంతరం ఈ దేశాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక దృష్టి కోణంతోనే పాలనను సాగించి, నిమ్న వర్గాల ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ప్రజల సమగ్ర అభివృద్ధికి బాటలు పరిచిందనేది కాదనలేని నిజం. అయితే ఇంకా ఆయా వర్గాలు వెనకబడే ఉన్నాయనీ, అభివృద్ధి ఫలాల్లో ఎవరి వాటా వారికి అందాలంటే కులగణనే మార్గమనీ కొందరంటున్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశ భద్రతకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రజా సంక్షేమానికి ఇవ్వడం లేదనేది కొంతమంది విజ్ఞుల అభిప్రాయం. ఏ కులం వారు ఎంతమంది ఈ దేశంలో ఉన్నారు అనే విషయం తెలిస్తే, ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయపరమైన పదవులు ఏయే కులాల వారికి ఎన్ని దక్కాలి అనే విషయంపై లెక్కలు తేలుతాయని కుల గణనను సమర్థించే నాయకులు చెప్పే మాటలు వాస్తవ విషయంలో నిజం కాకపోవచ్చు. దేశంలో ఇప్పటికే కొన్ని బీసీ కులాల వాళ్ళు తమ కులాలను ఎస్సీలో చేర్చండి అనీ, ఎస్టీల్లో చేర్చండి అనే డిమాండ్లను మొదలుపెట్టారు. కొన్ని ఆధిపత్య కులాలవారు తమను బీసీ వర్గాల్లో చేర్చండి అనే డిమాండు లేవదీస్తున్నారు. ఈ కులగణన చేపడితే ఇటువంటి అనేక డిమాండ్లూ, సమస్యలూ చుట్టు ముట్టవచ్చు. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం 1871లో కులాల వారీగా భారతదేశాన్ని విభజించి చూసే ప్రణాళిక అల్లింది. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. భారతీయుల్లో జాతీయాభిమానం పెరిగి, భారతదేశంలో తమ పెత్తనం చేజారిపోతుందని ఊహించిన బ్రిటిష్ పాలకులు భారతీయ సమాజాన్ని కులాల వారీగా, మతాల వారీగా విభజించడానికే ఈ కులాల వారీ గణనను ప్రారంభించారనేది వాస్తవం. ఈ దేశ సమగ్రత, సమైక్యత, శక్తి మంతమైన భారత్ నిర్మాణం ఇత్యాది విషయాల్లో దేశంలోని మిగతా పార్టీల కంటే భారతీయ జనతా పార్టీది భిన్నమైన దృక్పథం. కులాల వారీగా భారతీయ సమాజాన్ని విభజిస్తే– భారతీయ సంస్కృతికి తాను వారసుణ్ణి అనే భావన లుప్తమై, ప్రజల్లో అసంఘటిత భావాలు ప్రబలి, జాతి వ్యతిరేక శక్తులు బలపడతాయని ఆ పార్టీ భావించే... ఇంతవరకు కులగణనను వ్యతిరేకిస్తూ వచ్చింది. నిజంగా కులగణన అవసరమేనా? ఓట్లను అమ్ముకోకుండా ప్రజలు నీతి, నిజాయతీ, దేశ అభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన నాయకులను ఎన్నుకుంటే సరిపోదా? కులాల లెక్కల వల్ల దేశంలో సౌభ్రాతృత్వ వాతావరణం నెలకొంటుందా? కుల గణనను సమర్థించే వారందరూ ఈ విషయాలను గమనంలో ఉంచుకుంటే కొంత ప్రయోజనం ఉంటుంది. (క్లిక్ చేయండి: స్తబ్ధత నుంచి చైతన్యంలోకి...) - ఉల్లి బాలరంగయ్య రాజకీయ సామాజిక విశ్లేషకులు -
టాప్ 3 టాపిక్స్.. తేల్చేద్దాం గన్‌షాట్‌గా..!
కమలంతో పొత్తు కోసం బాబుగారి వెంపర్లాట.. ఖమ్మంలో కన్నింగ్ ప్లాన్ అదేనా ? గత ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేసిన టీడీపీ చిత్తయ్యింది. కేవలం 23 సీట్లకే పరిమితమై ఘోర పరాభావం చవిచూసింది. అంటే చంద్రబాబును ప్రజలు నమ్మలేదనే విషయం చాలా క్లియర్‌గా అర్థమైంది. మరి ఈసారి కూడా ఒంటిరిగా వెళితే పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందనే భావనలో ఉన్న చంద్రబాబు.. కమలంతో పొత్తుకోసం వెంపర్లాడుతున్నారు. బాబు గారి ఖమ్మం పర్యటన కన్నింగ్ ప్లాన్ అదేనా? విద్యే అత్యంత ప్రాధాన్యమని సీఎం జగన్ భావిస్తున్నారా ? ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. సమాజంలో ఉన్న అంతరాలు తొలగిపోయి.. పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియా, డిజిటల్ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలానికి చెక్ పెట్టే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలి. మంచి విద్యా విధానంతో తలరాతలు మార్చాలనే యోచన సీఎం జగన్‌ది. భావి తరాల పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం. చదువులో సమానత్వం ఉంటేనే ప్రతి కుటుంబంలో అభివృద్ధి ఉంటుందనేది సీఎం జగన్ ఆలోచన. విద్యే అత్యంత ప్రాధాన్యమని సీఎం జగన్ భావిస్తున్నారా? విశాఖ బ్రాండ్ వాల్యూ విశ్వవ్యాప్తం చేస్తున్నారా ? ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్)గా విశాఖపట్నాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంతర్జాతీయంగా బ్రాండింగ్ కల్పించేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. వరుస అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దేశంలోనే అత్యధిక కార్యక్రమాలు జరుగుతున్న (మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ) నగరంగా విశాఖ పేరు మారుమోగేలా చర్యలు చేపట్టింది. వరుసగా ఇక్కడ అంతర్జాతీయ సదస్సులు చేపట్టడానికి విశాఖ బ్రాండ్ వాల్యూనూ విశ్వవ్యాప్తం చేయడానికేనా? తేల్చేద్దాం ...గన్ షాట్‌గా... శనివారం రాత్రి 7 గంటలకు తిరిగి ఆదివారం ఉదయం 7.30 గంటలకు -
టాప్ 3 పొలిటికల్ టాపిక్స్.. తేల్చేద్దాం గన్‌షాట్‌గా..!
బీసీలు, మైనార్టీలను మోసం చేసింది నువ్వే కదా బాబు ? విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ మహాసభ విజయవంతం కావడం టీడీపీ సహించలేకపోతోంది. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపకుండా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే.. మూడున్నరేళ్లలో రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సీఎం వైఎస్ జగన్ వారికి సమున్నత గౌరవం ఇచ్చారు. వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిందెవరు?. బీసీలు, మైనార్టీలను మోసం చేసింది చంద్రబాబు కాదా?.. బీసీలు, మైనార్టీలను మోసం చేసింది నువ్వే కదా బాబు ? రూల్స్ తెలియని వాడు రూలర్ అవుతాడా ? 2019 ఎన్నికల్లో రెండు చోట్ల అసెంబ్లీకి పోటీచేసి ఓటమి పాలైన పవన్ కల్యాణ్ ఇప్పుడు కనీసం తను అయినా గెలవాలని తంటాలు పడుతున్నారు. రాంగ్ రూట్లో పవన్ వెళ్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు మినహా ఏమీ తెలియని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. వారాహి వాహనానికి మిలటరీ వాహనాలకు మాత్రమే వేసే ఆలీవ్ గ్రీన్ రంగు వేశారు. ఇది చట్ట విరుద్ధం కాదా..? రూల్స్ తెలియని వాడు రూలర్ అవుతాడా ? మోదీ బీజేపీ బాహుబలిగా మారారా ? పోయిన చోటే వెతుక్కోవాలంటారు. గత ఎన్నికల్లో త్రుటిలో కోల్పోయిన స్థానాలపై బాగా దృష్టి పెట్టడంలో, దూరమైన వర్గాలను కలుపుకొని పోవడంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించిన బీజేపీ గుజరాత్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. సీఎంగా 13 ఏళ్లు గుజరాత్‌లోనూ, పీఎంగా ఎనిమిదేళ్లుగా కేంద్రంలోనూ తిరుగులేని నాయకునిగా మోదీ సాధించిన పేరు ప్రఖ్యాతులు కూడా ఈసారి ఫలితాలను బాగా ప్రభావితం చేశాయి. ఒక్కడే వచ్చాడు..156 సీట్లు పట్టుకుపోయాడు.. మోదీ బీజేపీ బాహుబలిగా మారారా ? తేల్చేద్దాం గన్‌షాట్‌గా.. శనివారం రాత్రి 7 గంటలకు తిరిగి ఆదివారం ఉదయం 7.30 గంటలకు సాక్షి టీవీలో -
వివాదంలో.. గవర్నర్ గిరీ..! న్యాయ నిపుణులు చెప్తున్నదేంటి?
కె.శ్రీకాంత్‌రావు, సాక్షి ప్రత్యేక ప్రతినిధి దేశంలో గవర్నర్ల వ్యవస్థ వివాదాస్పదం అవుతోంది. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోని వ్యక్తులను గవర్నర్లుగా నియమిస్తుండటంతో.. వారు తమ పూర్వాశ్రమ వాసనలు వదిలిపెట్టలేక పోతున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలనా వ్యవహారాల్లో తలదూరుస్తుండటంతో గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ నాయకులను గవర్నర్లుగా నియమిస్తుండటం, తద్వారా రాష్ట్రాలపై పెత్తనం ఉండేలా చూసుకోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలోని ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం ఏవీ కూడా దీనికి అతీతం కాదు. మరీ గతంలో మాదిరిగా గవర్నర్లు ఆర్టికల్ 356ను వినియోగించి ప్రభుత్వాలను రద్దు చేయకున్నా.. అడ్డంకులు సృష్టించడం, బహిరంగంగా ప్రభుత్వ విధానంపై వ్యాఖ్యానాలు చేయడం జరుగుతోంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా తాత్సారం చేయడమూ కనిపిస్తోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు గవర్నర్లు తమకు లేని అధికారాన్ని పాలనలో చూపించాలని యత్నించినప్పుడు వివాదాలు వస్తున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల నిర్ణయాలను గవర్నర్లు విచక్షణాధికారం పేరిట మోకాలడ్డుతుండటంతో అసలు గవర్నర్ల వ్యవస్థపైనే విమర్శలు వస్తున్నాయి. గవర్నర్ల వ్యవస్థ హద్దులు దాటనంత వరకు మంచిదేనని, రాజ్యాంగ పరిరక్షణకు వారు పరిమితమైతే మంచిదని న్యాయ నిపుణులు అంటున్నారు. గవర్నర్ల మితిమీరిన జోక్యమే ఆ వ్యవస్థ నష్టమని ప్రతిపక్షాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. గవర్నర్లను నియమించే వ్యవస్థలో పారదర్శకత కోసం ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఎంపిక కమిటీ ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాలూ ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ల వ్యవస్థకు సంబంధించి సర్కారియా కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేస్తే ప్రయోజనం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎప్పటి నుంచో వివాదాలు 1984లో నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను గవర్నర్ రామ్‌లాల్ అనైతికంగా పదవీచ్యుతుడిని చేసి నాదెండ్ల భాస్కర్‌రావును సీఎంగా చేసిన సందర్భంలో గవర్నర్ల వ్యవహారశైలిపై తీవ్ర దుమారం చెలరేగింది. అప్పట్లో పెద్దఎత్తున జరిగిన ఆందోళనతో దిగివచ్చిన కేంద్రం తిరిగి ఎన్టీఆర్‌ను సీఎంగా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా గవర్నర్ల వ్యవస్థపై రద్దు కోసం పోరాటం చేశారు. 2013లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ కూడా ఆ రాష్ట్ర గవర్నర్‌ను రీకాల్ చేయాలని, ఢిల్లీ సుల్తాన్ల మనిషిగా గవర్నర్ ఇక్కడ ఉన్నారని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లపాటు ఖాళీగా ఉన్న గుజరాత్ లోకాయుక్తను అప్పటి గవర్నర్ కమలా బెనీవాల్ నియమించడంతో వివాదం రేగింది. దానితో ఆగ్రహించిన మోదీ.. లోకాయుక్త నియామకంలో గవర్నర్ పాత్ర లేకుండా ముఖ్యమంత్రి, మంత్రివర్గమే తుది నిర్ణయం తీసుకునేలా బిల్లు పాస్ చేయించారు. ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ ఏ నిర్ణయమైనా ముఖ్యమంత్రి, మంత్రివర్గం చేసిన సలహా మేరకే తీసుకోవాలని స్పష్టం చేశారు. గవర్నర్లు ఆనవాయితీ పాటిస్తేనే మంచిది రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన అధికార కేంద్రాలు రెండు ఉండవు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే పూర్తి అధికారం. గవర్నర్‌ది రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత మాత్రమే. దానిని అర్థం చేసుకొని మెలగాలి. గవర్నర్ ప్రమాణ స్వీకార ప్రతిజ్ఞకు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ప్రతిజ్ఞకు మధ్య తేడాను గుర్తించాలి. రాజ్యాంగాన్ని, న్యాయాన్ని ప్రిజర్వింగ్, డిఫెండింగ్, ప్రొటెక్టింగ్ అన్నది మాత్రమే గవర్నర్ విధి. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే సలహాలు ఇచ్చి సరిచేయాలి. ఏవైనా అనుమానాలుంటే ముఖ్యమంత్రిని పిలిచి క్లోజ్డ్ డోర్లో నివృత్తి చేసుకోవాలి. అనుమానాలను నివృత్తి చేయడం ముఖ్యమంత్రి బాధ్యత కూడా. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు హద్దులు దాటుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు. పాలనాపరంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా మంత్రి వర్గమే అసెంబ్లీకి, ప్రజలకు జవాబుదారీ. గవర్నర్‌కు ఎలాంటి జవాబుదారీతనం లేదు. ఇటీవలికాలంలో ప్రభుత్వాలకు, గవర్నర్ వ్యవస్థకు మధ్య జరుగుతున్న వివాదాలు చూస్తుంటే.. రెండువైపులా పెద్దరికం అనేది లేకుండా పోయింది. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై గవర్నర్లు బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయడం సరికాదు. రాజ్యాంగం, సంప్రదాయాలు, ఆనవాయితీలను ఇరువైపులా పాటిస్తే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. – సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి బిల్లులు ఆపడం సరికాదు రాజ్యాంగ బద్ధమైన ఒకటి రెండు అంశాల్లో తప్ప రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. కేబినెట్ ఆమోదం తెలిపిన బిల్లులను ఆపడం, మంత్రులను పిలిచి వివరణ కోరడం సరికాదు. అసెంబ్లీ ప్రొరోగ్ అనేది స్పీకర్‌కు సంబంధించిన అంశం. గవర్నర్లు సమస్యలపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరవచ్చు. అధికారులను అడిగి తెలుసుకోవచ్చు. కానీ నేరుగా అధికారులకే ఆదేశాలు జారీ చేయకూడదు. ఇది సమాంతర ప్రభుత్వాన్ని నడిపినట్లే అవుతుంది. – కె.రామకృష్ణారెడ్డి, హైకోర్టు సీనియర్ న్యాయవాది గవర్నర్ కేబినెట్ నిర్ణయాల మేరకే నడుచుకోవాలి ప్రజాస్వామ్యంలో పరిపాలనకు సంబంధించి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే తుది నిర్ణయం. కేబినెట్ నిర్ణయాలను ఆపడానికి, రద్దు చేయడానికి గవర్నర్‌కు అధికారం లేదు. నేరుగా పాలనలో కలగజేసుకోకూడదు. సభ జరగనప్పుడు మాత్రమే కొన్ని నిర్ణయాలను తీసుకోవచ్చు. అదీ అప్పుడున్న కేబినెట్ అనుమతితోనే తీసుకోవాలి. గతంలో ఏర్పాటైన ఓ కమిషన్ కూడా తన నివేదికలో ఇదే అంశాన్ని చెప్పింది. ఇక అసెంబ్లీని ప్రోరోగ్ చేయకుండా నడపడం అనేది స్పీకర్‌కు సంబంధించిన అంశం. అందులోనూ గవర్నర్ పాత్ర ఉండదు. – సత్యప్రసాద్, హైకోర్టు సీనియర్ న్యాయవాది తాజా సంఘటనలకు వస్తే.. ►కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లను మూకుమ్మడిగా తొలగించడం ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌కు ఆగ్రహం తెప్పించింది. గవర్నర్‌కు వర్సిటీల చాన్సలర్ హోదాను తొలగిస్తూ మంత్రివర్గం ఆర్డినెన్స్‌ను ఆమోదించి గవర్నర్‌కు పంపింది. చిత్రమేమిటంటే ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం చేస్తే తప్ప అది అమల్లోకి రాదు. తనను తాను చాన్స్‌లర్ పదవి నుంచి తొలగించుకోవడం ఇష్టం లేని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ దానిని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఆ రాష్ట్రంలో తరచూ గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య ఏదో ఒక అంశంపై వివాదం రగులుతూనే ఉంది. ►పశ్చిమబెంగాల్లో కొంతకాలం కిందటి వరకు మమత సర్కారుకు, నాటి గవర్నర్ జగదీప్ ధన్కర్కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే సాగింది. బహిరంగంగానే విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగింది. ►తమిళనాడు విషయానికి వస్తే.. అక్కడి శాసనసభ ‘నీట్’ నుంచి తమ రాష్ట్ర విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలంటూ బిల్లును పాస్ చేసింది. దానిని రాష్ట్రపతికి పంపకుండా గవర్నర్ ఆర్ఎన్ రవి ఆపి.. తిరిగి శాసనసభకు పంపారు. దీనిపై ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గవర్నర్ సనాతన ధర్మాన్ని పొగడటంపైనా స్టాలిన్, డీఎంకే పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయనను తక్షణమే రీకాల్ చేయాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. స్టాలిన్‌కు, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ►తెలంగాణలో రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించకుండా గవర్నర్ తమిళిసై ఆపడంతో మొదలైన వివాదం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని గవర్నర్ చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకల సమయంలో రాజ్‌భవన్‌కు సీఎం, మంత్రులు రాకపోవడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడం, అసెంబ్లీ ప్రోరోగ్ చేయకుండా కొనసాగించడం వంటివాటితో వివాదాలు కొనసాగాయి. గత వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ఆమోదిస్తే.. అందులో ఒక్క జీఎస్టీ బిల్లు మినహా మిగతా ఏడు బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియమకాలకు సంబంధించి ‘తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బిల్లు’పై గవర్నర్ అనుమానాలు వ్యక్తం చేయడంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు వెళ్లి వివరణ ఇచ్చారు. ఆ బిల్లుకు ఇంకా ఆమోదం తెలపలేదు. గవర్నర్ విలేకరుల సమావేశంలోనే ప్రగతిభవన్ (సీఎం) గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ►మహారాష్ట్రలో మహావికాస్ అగాడి (ఎంవీఏ) కూటమి అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీతో విభేదాలు కొనసాగాయి. ఆయన మంత్రివర్గం సిఫార్సు చేసిన అంశాలను ఆమోదించకుండా విచక్షణాధికారం పేరిట కాలయాపన చేశారు. ఏ సభలోనూ సభ్యుడు కాని ఉద్ధవ్‌ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనమండలికి నామినేట్ చేయాలని మంత్రివర్గం సిఫార్సు చేసింది. కానీ దీనిని నాలుగు నెలల పాటు ఆమోదించకుండా వివాదం రేపారు. -
గ్రేటర్‌లోనూ కమలం వల! ఆకర్ష ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: కమలం ఆకర్ష ఆపరేషన్ వేగం పెరిగినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో గ్రేటర్ కాంగ్రెస్ ముఖ్య నేతలపైనా కమలం వల విసురుతోంది. హస్తం పార్టీలోని అసంతృప్తులను చేర్చుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. మరోవైపు రాజకీయ భవిష్యత్తు కోసం ఉవ్విళ్లూరుతున్న ముఖ్య నేతలపై సైతం దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూచన మేరకు ఇప్పటికే కమలం ముఖ్యనేతలు రంగంలోకి దిగి పలువురితో సంప్రదింపులకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యనేతల చేరిక పూర్తిగా నిర్ధారణ అయి, చేరే దాకా ఆ నేతల పేర్లు బయటకు రాకుండా కమలనాథులు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. నగరంలోని ముఖ్య నేతే టార్గెట్.. కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయికి ఎదిగిన నగరానికి చెందిన ముఖ్యనేతపై కమలం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలై ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ కీలకంగా మారినప్పటికీ.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఓ నాయకుడి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైంది. ఇటీవల తన నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ఆయనను అసంతృప్తికి గురిచేసింది. రెండోసారి అక్కడి నుంచి బరిలో దిగేందుకు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని స్థానిక సమస్యలపై సమరం సాగిస్తుండగా.. కార్పొరేటర్ చేరిక ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. పార్టీ రాష్ట్ర నాయకత్వం తనతో కనీసం సంప్రదింపులు జరపకుండా పార్టీలో చేర్చుకోవడంపై ఆయన తన అనుచరుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిని పసిగట్టిన కమలనాథులు ఆయనపై వల విసురుతున్నారు. బీజేపీతో పాత పరిచయాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయికి ఎదిగిన కారణంగా కమలంపై మొగ్గు చూపాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడిపోయినట్లు తెలుస్తోంది. మైనారిటీ నేతపై కన్ను.. నగరం నడిబొడ్డున ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మూడు నాలుగు పర్యాయాలు బరిలో దిగి స్వల్ప తేడాతో ఓటమి పాలైన కాంగ్రెస్ మైనారిటీ నేతపైనా కమలం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సదరు నాయకుడితో కమలనాథులు టచ్‌లో ఉన్నారు. మజ్లిస్‌ను టార్గెట్‌గా చేసుకుని మాట్లాడే మైనారిటీ నేత ఇటీవల పార్టీ ముఖ్యనేతల నిర్ణయాలను సైతం బహిరంగా విమర్శించడం కాంగ్రెస్‌లో దుమారం రేపింది. దీంతో ఆయనపై అధిష్టానం గుర్రుగా ఉంది. దీనిని తమకు అనువుగా మల్చుకొని పార్టీలో చేర్చుకునేందుకు కమలనాథులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నా చేరికపై మాత్రం ఇంకా స్పష్టత రానట్లు సమాచారం. మరోవైపు నగర శివారులోని కాంగ్రెస్ ముఖ్య నేత సైతం బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. (చదవండి: రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట.. రూ.10,200 కోట్ల రుణాలకు ఓకే) -
పీసీసీలో ‘పీకే’ ఫీవర్! అలా అయితే ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ప్రశాంత్ కిశోర్ (పీకే) టెన్షన్ పట్టుకుంది. ఎన్నికల వ్యూహకర్తగా పేరు గడించిన ఆయన.. కాంగ్రెస్ శిబిరం లోకి వస్తుండటం, మరోవైపు తెలంగాణలో టీఆర్ ఎస్ పక్షాన పనిచేస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం పీకేతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ క్రమంలో ఆయన ప్రాంతీయ సమీకరణాల పేరుతో టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తుకు దారితీయిస్తారేమోనన్న సందేహం రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. దీనితో ఎవరూ అడగకున్నాకూడా.. టీఆర్ఎస్తో ఎలాంటి పొత్తు ఉండదంటూ పార్టీ పెద్దలు ప్రకటనలు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌తో స్పష్టత ఇప్పిం చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై రాహుల్‌గాంధీతో స్పష్టత ఇప్పించి.. టీఆర్ఎస్తో పొత్తు చర్చకు తెరదింపాలని భావిస్తున్నట్టు సమాచారం. లోక్‌సభ నాటికి ఎలా? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేశారు. అదేబాటలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పక్షాన కూడా ఆయన టీం పనిచేస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత, బీజేపీ, కాంగ్రెస్‌ల పరిస్థితిపై పీకే టీం అధ్యయనం చేసి.. టీఆర్ఎస్ అధిష్టానానికి నివేదిక కూడా ఇచ్చినట్టు సమాచారం. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని నేరుగా ధ్రువీకరించకపోయినా.. పీకేతో కలిసి పనిచేస్తే తప్పేమిటని విలేకరుల సమావేశంలోనే పేర్కొనడం గమనార్హం. ఆయన జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు కాంగ్రెస్ అధిష్టానాన్ని పీకే సిద్ధం చేస్తారని.. రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిస్థితి ఆయనకు తెలుసు గనుక కలిసి పోటీ చేయాలని సూచిస్తారేమోననే కాంగ్రెస్ నేతల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకపోయినా.. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవచ్చన్న చర్చ జరుగుతోంది. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీస్తుందని, అందువల్ల వరంగల్ సభ వేదికగా రాహుల్‌తో స్పష్టత ఇప్పించాలని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు. రాహుల్‌తో చెప్పించేందుకు! తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా రాష్ట్రంలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైందని.. 2014 ఎన్నికల్లో అతివిశ్వాసం దీనికి కారణంకాగా, 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కొంప ముంచిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో నిలవాలని.. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి మరీ ఎన్నికల గోదాలోకి దిగాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అంతర్గత విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేస్తున్నామన్న సంకేతాలూ ఇస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామంపై స్పందిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం తామేనని, ప్రజల పక్షాన పోరాడేది తామేనన్న భావనను కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రశాంత్ కిశోర్ తెరపైకి రావడం రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో కలవరం రేపుతోంది. ఇటీవల మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన టీపీసీసీ కీలక నేత ఒకరు ప్రత్యేకం గా పీకే, టీఆర్ఎస్తో పొత్తు అంశాలను ప్రస్తావించారు. ఈ విషయాన్ని రాహుల్‌గాంధీ దగ్గరే తేల్చుకుంటామని వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అయితే తాము టీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధంగా లేమని బహిరంగంగా ప్రకటించారు. ఇటీవల రాహుల్‌తో టీపీసీసీ నేతలు భేటీ అయిన సందర్భంలో.. ఏ పార్టీతో పొత్తు ఉండదని, టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలపై పోరాటాన్ని కొనసాగించాలని రాహుల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కానీ అప్పటికి రాష్ట్ర ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కనుగోలు మాత్రమే ఉన్నారు. పీకే తెరపైకి రాలేదు. ఇప్పు డు పీకే కాంగ్రెస్ శిబిరంలోకి వస్తుండటంతో టీఆర్ఎస్తో పొత్తు ప్రచారం ఊపందుకుంది. -
మూడో ఫ్రంట్ మనగలిగేనా?
దేశంలో సమాఖ్య స్ఫూర్తికి గండి పడుతున్న క్రమంలో దానిపై రాజకీయ స్పృహ పెరుగుతోంది. దశాబ్దాలుగా ప్రబల రాజకీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ చతికిలపడింది. దాంతో బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ రహిత రాజకీయ కూటమికి ఇదే సమయంగా కనబడుతోంది. కానీ, వేర్వేరు రాష్ట్రాల్లో బలమైన శక్తులుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బలమైన కారణం లేకుండా ఒక్కతాటిపైకి వస్తాయా? అందుకే, సమాఖ్య భావనను కేసీఆర్ తలకెత్తుకున్నారు. ఎక్కువ లోక్‌సభ స్థానాలు దక్కించుకోగలిగే పార్టీలు, నామమాత్ర పార్టీలు, బలమైనవే అయినా ప్రస్తుతం కాంగ్రెస్‌తో కలిసున్న పార్టీలు... ఇవన్నీ జట్టు కట్టి, కావాల్సిన సంఖ్య తెచ్చుకోగలవా, పూర్తికాలం మనగలవా, వీటికి ఎవరు నేతృత్వం వహిస్తారు అన్నవి ప్రస్తుతానికి ప్రశ్నలే! ‘నీ ఆలోచనా శక్తి నీలో పుట్టే భావోద్వేగాల కన్నా పటిష్ఠంగా ఉంటే గెలుపు నీదే’ అన్నది గ్రీక్ తాత్వికుల కాలం నుంచీ ప్రాచుర్యంలో ఉన్న నానుడి. అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీ రామారావుకూ, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకూ కొన్ని సామ్యా లున్నా... వైరుద్ధ్యాలే ఎక్కువ. ఇద్దరూ ఆవేశపరులే. కేసీఆర్ ఆవేశం గతపు వివక్ష నుంచో, వర్తమానపు అన్యాయాల నుంచో, భవిష్యత్తు అంచనాల నుంచో పురుడు పోసుకుంటుంది. భావోద్వేగాలను కార్యా చరణగా మలిచే బలమైన కసరత్తు పూర్వరంగంలో ఉంటుంది. ఇటీ వల ఆయన తరచూ మాట్లాడుతున్న ‘ఫెడరల్ ఫ్రంట్’కు నిజంగా ఆస్కారం ఉందా? ఆయన ప్రధాని అవ్వొచ్చా? ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే... సదరు ప్రతికూల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడొచ్చు. ఇదొక అంచనా! ఆ ఫలితాలతో నిమిత్తం లేకుండానే లోక్‌సభ ఎన్నికలప్పుడు యూపీ, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీకి రమారమి సీట్లు తగ్గితే ఎన్డీయే తిరిగి ప్రభుత్వం ఏర్పాటుచేయడం కష్టమే. అప్పుడు ప్రత్యామ్నాయ రాజ కీయ శక్తిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు లేనట్టే. మరేదైనా సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చనుకుంటే, అదేనా... కేసీఆర్ అంటున్న ఫెడరల్ ఫ్రంట్? దేశంలో ఏకపార్టీ స్వామ్యం పోయి సంకీర్ణ శకం మొదలయ్యాక, అంటే 1989 నుంచి, ఇటీవలి బీజేపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాల మాదిరే బీజేపీయేతర, కాంగ్రేసేతర ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పాటైన ప్రయోగాలున్నాయి. అలా ఎనభైల చివర్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడ్డ ‘నేషనల్ ఫ్రంట్’ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు లభించినట్టే, తొంభైల ద్వితీయార్ధంలో వచ్చిన ‘యునెటైడ్ ఫ్రంట్’ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతిచ్చింది. అయితే, ఆ ప్రయోగాలు విఫలమై ఆయా ప్రభుత్వాలు కూలడానికి కూడా సదరు బీజేపీ, కాంగ్రెస్‌లే కారణ మన్నది జగమెరిగిన సత్యం. కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయ డానికైనా, ఏర్పడ్డ ప్రభుత్వాలను కూల్చడానికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కావాలనే రాజకీయ వాతావరణం దేశంలో నెలకొంది. మరి కేసీఆర్ అంటున్నట్టు ‘ఫెడరల్ ఫ్రంట్’ పెట్టి, ప్రభుత్వం ఏర్పరచి, నాలుగు కాలాలు మనగలిగేలా చేయడం సాధ్యమా? సమాఖ్య వాదనకు బలం దేశంలో సమాఖ్య స్ఫూర్తికి గండి పడుతున్న క్రమంలోనే దానిపై రాజ కీయ స్పృహ పెరుగుతోంది. ఎన్డీయే కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన ప్పటికీ గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే మెజారిటీ స్థానాలు సాధిం చింది. రెండో మారు గెలుపుతో పార్టీ వైఖరి మారిపోయింది. ఒకే దేశం, ఒకే ఎన్నికలు, ‘ఒకే’ల క్రమంలో ఒకే ప్రభుత్వం అన్న ధోరణి పెరిగింది. జీఎస్టీ నుంచి వ్యవసాయ చట్టాల వరకు, బడ్జెట్ కేటా యింపుల నుంచి నదుల అనుసంధానం వరకు... రాష్ట్రాల ప్రాధా న్యాన్ని తగ్గిస్తూ అన్నీ తానై కేంద్రం వ్యవహరిస్తోంది. రాజ్యాంగం నిర్దేశించిన మూడు జాబితాల్లోని రాష్ట్ర అంశాల్లోకి తరచూ చొరబడు తున్న కేంద్ర ప్రభుత్వపు ఒంటెద్దు పోకడల్ని చాలా రాష్ట్రాలు జీర్ణించు కోలేకపోతున్నాయి. తిరిగి తెలుగుతేజమే కేంద్రబిందువా? రెండో మారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక, నాటి ముఖ్య మంత్రి ఎన్టీయార్ తన కారు డ్రైవర్‌తో, ‘లచ్చన్నా! నువ్ కూడా రెడీ అయిపో. ఢిల్లీ పోదాం. దేశ పాలన ఏమీ బాగోలేదు. ఈ చట్టాలు అవీ... మనం అక్కడి నుంచే బాగుచేయాలి’ అన్నారట! అన్నట్టుగానే, ఓ అయిదేళ్లకు ‘జాతీయ ఫ్రంట్’కు స్వయంగా నేతృత్వం వహించారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడుతుందనుకునే ఫెడరల్ ఫ్రంట్ సర్కారు లోనూ కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారేమో! కాంగ్రెస్, బీజేపీ, ఈ రెండు జాతీయస్థాయి ప్రధాన పార్టీలు దేశానికి న్యాయం చేయలేక పోయాయి. పాజిటివ్ ఓటు ఎంతో అరుదు! దిక్కుతోచని దేశ పౌరుల వ్యతిరేక అభిప్రాయంతోనే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ప్రాంతీయ ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చడంలో రెండు పార్టీలు ఘోరంగా విఫలమై, పలు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేశాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. దీనికి ఏకైక విరుగుడు ‘ఫెడరల్ ఫ్రంట్ సర్కారు’ అనేది కేసీఆర్ వాదన, ప్రతిపాదన. నిజానికి ఇటువంటి యత్నం ఆయన 2019 ఎన్నికల ముందే చేసినా... కారణాంతరాల వల్ల ఫలించలేదు. ఇప్పట్నుంచి చేస్తే 2024 ఎన్నికల నాటికి ఓ రూపం వస్తుందని ఆయన లెక్క! కాంగ్రెస్‌ను కాదంటే లెక్కలు సరిపోతాయా? దేశానికి స్వాతంత్య్రం తెచ్చి, దశాబ్దాల తరబడి ప్రబల రాజకీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల చతికిలపడింది. బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ రహిత రాజకీయ కూటమికి ఇదే అత్యున్నత సమయం అని కేసీఆర్‌కు తెలుసు. కానీ, వేర్వేరు రాష్ట్రాల్లో బలమైన శక్తులుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏకరీతి ఆలోచనలతో లేవు. బలమైన కారణం, కారకం లేకుండా అవి ఒక్కతాటిపైకి వస్తాయా? అందుకే, సమాఖ్య భావనను ఆయన తలకెత్తుకున్నారు. ఎక్కువ లోక్‌సభ స్థానాలు దక్కించుకునే స్థితిలో ఉన్న మమతా బెనర్జీ (బెంగాల్), అఖిలేష్ యాదవ్ (యూపీ) ఎలా స్పందిస్తారో తెలియదు. దేవెగౌడ (కర్ణాటక), తేజస్వీ యాదవ్ (బిహార్) సాను కూలంగానే ఉన్నా... రేపు వారు దక్కించుకోగలిగే స్థానాలు పరిమితం. ఇక స్టాలిన్ (తమిళనాడు), ఉద్ధవ్ థాక్రే (మహారాష్ట్ర) కేసీఆర్ ఆలోచనలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నా... వారిప్పుడు కాంగ్రెస్‌తో కలిసున్నారు. ఇక కేజ్రీవాల్ (ఆప్), శరద్ పవార్ (ఎన్సీపీ), మాయావతి (బీఎస్పీ), దుష్యంత్ చౌతాలా (జేజేపీ) భవిష్యత్తులో ఎలా వ్యవహరించనున్నారో తెలి యదు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, నవీన్ పట్నాయక్ (ఒడిషా) వంటి వారు తటస్థంగానే ఉంటున్నారు. ఇటువంటి అస్పష్ట పరిస్థి తుల్లో కాంగ్రెస్‌ను కాదని ఇతర పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా జట్టుకట్టి, కావాల్సిన సంఖ్య తెచ్చుకోగలవా అన్నది పెద్ద ప్రశ్న. 2014 ఎన్నికల్లో 44 స్థానాలు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ 223 చోట్ల రెండో స్థానంలో, మరో 63 చోట్ల మూడో స్థానంలో నిలిచింది. కొన్ని చోట్ల బీజేపీకి ప్రధాన పోటీ కాంగ్రెస్‌తోనే! కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హరియాణా, అస్సాం... ఇలా పలు రాష్ట్రాలున్నాయి. ఒక రాష్ట్రంలో బలంగా ఉన్న ప్రాంతీయ శక్తులకు ఇంకో రాష్ట్రంలో కనీస ఉనికైనా లేదు. రాయి చెన్నైలో విసిరితే వచ్చిపడే పాండిచ్చేరీలో కూడా ద్రవిడ పార్టీల ప్రాబల్యం నామమాత్రం. కలయికలు ముందా? తర్వాతా? రాజ్యం చేయకపోయినా... ఈ దేశంలో పలు సందర్భాల్లో కమ్యూని స్టులు ఉత్ప్రేరక పాత్ర పోషించారు. యూపీఏ–1 ప్రభుత్వం 2004– 09 మధ్య పలు మంచి నిర్ణయాలు తీసుకోవడం వెనుక కమ్యూనిస్టుల ఒత్తిడి (కనీస ఉమ్మడి కార్యక్రమం) పని చేసింది. యూపీఏ–2లో ప్రజోపయోగాలు లేకపోగా సర్కారు భ్రష్టుపట్టిపోవడానికి కారణం దూరమైన కమ్యూనిస్టుల ఒత్తిడి, ఉత్ప్రేరక పాత్ర లేకపోవడమే అని విశ్లేషకులంటారు. మరి, రేపు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడితే వారి పాత్ర ఏంటి? ఒకరు ఎన్నికలు ముగిశాక చూద్దాం అంటే, ఇంకొకరు ‘బీజేపీకి వ్యతిరేకంగా మీరు పోరాడండి, మేం మీకు మద్దతుంటాం’ అంటు న్నారు. మిగతా పార్టీల్లో ఎన్నికల ముందు కలిసేదెవరు? తర్వాత కలిసేదెవరు? అన్నదొక సందేహమే. నాయకత్వం ఎవరికి అన్నది ఎప్పటికీ సమస్యే! లోగడ బీజేపీ, కాంగ్రేసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డ ప్పుడు సంఖ్య ఉన్న ప్రాంతీయ పార్టీ నేతల కన్నా ఏకాభిప్రాయం ఉన్న వీపీ సింగ్, ఐ.కె. గుజ్రాల్, దేవెగౌడ వంటి బలహీన నాయకులే ప్రధానులయ్యారు. కానీ, ఈసారి పార్లమెంటులో సంఖ్యాబలం ఉండే నాయకులు కీలక నాయకత్వ స్థానాన్ని వదులుకునే వాతావరణం కనిపించడం లేదు. అయినా... ఇప్పుడే ఆ చర్చ పెడితే, అది పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టిన చందం అవుతుందేమో! వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్; డైరెక్టర్, పీపుల్స్ పల్స్ ఈ–మెయిల్ :peoplespulse.hyd@gmail.com -
2021 రివైండ్: టీడీపీకి పరాభవ ‘నామం’
సాక్షి, అమరావతి: సాధారణ ఎన్నికల్లో అత్యంత అవమానకరమైన ఓటమితో కుదేలైన తెలుగుదేశం పార్టీకి 2021 పరాభవ నామ సంవత్సరంగా మిగిలింది. సాధారణ ఎన్నికల్లో అత్యంత అవమానకరమైన ఓటమితో కుదేలైన ఆ పార్టీ ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలతో పాతాళంలో కూరుకుపోయింది. పార్టీ ఆవిర్భావం తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఏడాది ఘోరమైన ఛీత్కారాలు ఎదురయ్యాయి. ప్రతిపక్ష పాత్ర పోషించలేని స్థితిలో ఎన్నికల్ని బహిష్కరించడం దగ్గర నుంచి తమకు ఓటు వేయలేదనే అక్కసుతో ప్రజలనే నిందించడం, శాపనార్థాలు పెట్టడం ఈ ఏడాది ఆ పార్టీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఏ దశలోను పోటీపడలేక బురద జల్లడమే పనిగా పెట్టుకున్నా ప్రజల నుంచి ఎటువంటి సానుకూలత టీడీపీకి రాలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: వంగవీటి రాధాకు ప్రభుత్వ భద్రత స్థానిక ఎన్నికల ఫలితాలతో కుంగుబాటు ఈ ఏడాది స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అసలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడాన్ని బట్టి ప్రజల్లో ఆ పార్టీకి ఉన్న స్థానం ఏమిటో మరోసారి తేటతెల్లమైంది. స్థానిక ఎన్నికల చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా టీడీపీ చతికిలపడడం చూసి రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యపోయారు. జనవరిలో పార్టీ గుర్తులేకుండా జరిగిన మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో తమకు 35 శాతానికి పైగా పంచాయతీలు వచ్చినట్లు చంద్రబాబు అదేపనిగా బుకాయించి ప్రజల తీర్పును కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. వాస్తవంగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా పది శాతం పంచాయతీలు కూడా దక్కలేదు. కానీ, పార్టీ గుర్తుల్లేకుండా జరిగిన ఎన్నికలు కావడంతో ఆ ఎన్నికల్ని వివాదం చేసి తమ ఓటమిని కప్పిపుచ్చుకోవాలని చూశారు. వాస్తవానికి ఆ ఎన్నికల్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీల్లో టీడీపీ 14 మాత్రమే గెలవడంతో చంద్రబాబు బుకాయింపు గాలి బుడగలా పేలిపోయింది. 30 ఏళ్లు చంద్రబాబుకు అండగా నిలిచిన కుప్పం ప్రజలు తొలిసారి ఆయనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పడంతో టీడీపీకి శరాఘాతంగా మారింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పాతాళానికి.. మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగితే ఒకే ఒక మున్సిపాల్టీని ఆ పార్టీ గెలుచుకోగలిగింది. 11 మున్సిపాల్టీల్లో అసలు టీడీపీ అడుగే పెట్టలేకపోయింది. ప్రజల్లో టీడీపీకి ఉన్న ఆదరణను మున్సిపల్ ఎన్నికల ఓటమి స్పష్టంచేసింది. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలోను చిత్తుగా ఓడిపోయింది. ఇక పోటీ ఇవ్వలేక పరిషత్ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించారు. ఆ తర్వాత బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలోను అభ్యర్థిని ప్రకటించి తర్వాత తప్పుకున్నారు. మలి విడత జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీచేసినా ఆ పార్టీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ఇందులో ఏకంగా కుప్పం మున్సిపాల్టీనే చంద్రబాబు చేజార్చుకున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీ ఒక్క కార్పొరేటర్‌ను కూడా గెలుచుకోలేకపోయింది. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి ఉన్న పట్టు సాధారణ ఎన్నికల కంటే ఇంకా దిగజారినట్లు ఈ ఎన్నికల ద్వారా స్పష్టమైంది. ఓటములతో నేతల అసహన పర్వం ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ప్రజలపైనే విరుచుకుపడుతూ తమ అసహనాన్ని పదేపదే బహిర్గతం చేసుకున్నారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో ప్రజలకు సిగ్గులేదని, ఎవరికి ఓటేయాలో కూడా తెలీదంటూ చంద్రబాబు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం చూసి రాజకీయ విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టారు. రాజకీయంగా కునారిల్లిన దశలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, పట్టాభిరామ్ తదితర నేతలు సీఎం వైఎస్ జగన్, మంత్రులను పరుష పదజాలంతో రాయలేని భాషలో దూషించి ప్రజల దృష్టిలో ఇంకా చులకనయ్యారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. సీఎంను బోషడీకే అంటూ టీడీపీ నాయకుడు పట్టాభి దూషించడం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించగా.. తదనంతరం ప్రజల్లో టీడీపీపై ఆగ్రహం పెల్లుబికింది. పూర్తిగా ప్రజాదరణ కోల్పోయిన టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై బురద జల్లడమే పనిగా ఎల్లో మీడియా, సోషల్ మీడియా ద్వారా అభూత కల్పనలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకున్నారనే అభిప్రాయం నెలకొంది. అన్ని రకాలుగా కుంగిపోయిన టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి పరిమితమయ్యారు. చంద్రబాబు పిలుపు ఇచ్చినా ఆందోళనలు, నిరసనల్లో ఆ పార్టీ కేడర్ పాల్గొనే పరిస్థితి లేకుండాపోయింది. రాజకీయ పతనంలో 2021 సంవత్సరం టీడీపీకి కొత్త కోణాన్ని పరిచయం చేసింది. -
రజనీ, కమల్ పార్టీల ప్రభావంపై ఆరా!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో మనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, తొందర పడవద్దంటూ మక్కల్ ఇయక్కం సభ్యులకు దళపతి విజయ్ హితబోధ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన అభిమాన సంఘంతో ఆయన రెండు రోజులుగా భేటీ అవుతున్నారు. సీనినటుడు, దళపతి విజయ్‌కు అభిమాన లోకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ను రాజకీయాల్లోకి రప్పించేందుకు అభిమానులు, ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఇటీవల విజయ్ మక్కల్ ఇయక్కంను రాజకీయ పార్టీగా మార్చేందుకు సీఈసీకి చంద్రశేఖర్ దరఖాస్తు చేసుకున్నారు. దీనికి విజయ్ వ్యతిరేకత తెలపడంతో వెనక్కు తగ్గారు. చదవండి: రజనీ రెడీ అంటే సీఎం అభ్యర్థిగా పోటీకి సై! ఈ పరిస్థితుల్లో తన అభిమానులు, మక్కల్ ఇయక్కం సభ్యులతో విజయ్ రెండురోజులుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దగ్గర అవుతుండడం సోమవారం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా రజనీ, కమల్ పార్టీల గురించి, వారి ప్రభావం గురించి ఆరా తీస్తున్నట్టు సమాచారం. కొందరు ఇతర పార్టీల వైపు వెళుతున్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. తొందర పడోద్దని, ఉజ్వల భవిష్యత్తు మనకే అంటూ విజయ్ వారికి సూచించడం ప్రాధాన్యతకు దారి తీసింది. ఈ క్రమంలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు దళపతి సమాయత్తం అవుతారేమో అన్న చర్చ మొదలైంది. -
పొలిటికల్ ఎంట్రీపై విజయ్ కీలక భేటీ..
సాక్షి, చెన్నై: తన పేరిట పార్టీ అంటూ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ వ్యవహరించిన తీరుతో సందిగ్ధంలో పడ్డ దళపతి విజయ్ తర్వాత కార్యాచరణపై దృష్టి పెట్టారు. అభిమానసంఘం నేతల్ని చెన్నైకు పిలిపించి భేటీ అయ్యారు. పనయూర్ ఫామ్ హౌస్‌లో సాగిన ఈ భేటీలో కీలక నిర్ణయాల్ని తీసుకున్నారు. నటుడు విజయ్ పేరిట రాజకీయపార్టీని ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో తండ్రి తనయుడి మధ్య అంతరం పెరిగినట్టు పరిస్థితుల్లో చోటుచేసుకున్నాయి. తన తీరును చంద్రశేఖర్ సమర్థించుకుంటున్నారు. తాను చేసిన పనిని ఇప్పుడు వ్యతిరేకించినా, భవిష్యత్తులో విజయ్‌కు ఇది బలంగా నిలవడం ఖాయమని మీడియాతో చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తండ్రి నిర్ణయాన్ని ఖండించడమే కాదు, తన పేరును, ఫొటోను వాడుకుంటే చట్టపరంగా చర్యలు తప్పవన్న హెచ్చరించిన విజయ్ తర్వాత కార్యాచరణపై దృష్టి పెట్టారు. (వివాదంగా మారిన విజయ్ తండ్రి పార్టీ) అభిమానసంఘం నేతలతో భేటీ.. విజయ్ అభిమాన సంఘం నేతలు ఇదివరకు ఎస్ఏ చంద్రశేఖర్‌తో ఎక్కువగా టచ్‌లో ఉండేవారు. విజయ్ మక్కల్ ఇయక్కం ఏర్పాటుతో పాటు తనయుడి వ్యవహారాలన్నీ చంద్రశేఖర్ పర్యవేక్షిస్తుండడంతో ఎక్కువ మంది అభిమాన సంఘం నేతలు దళపతి తండ్రితోనే సన్నిహితంగా మెలిగేవారు. ఈ దృష్ట్యా, ఎక్కడ పార్టీ వ్యవహారాల్లో అభిమాన సంఘం నేతలు జోక్యం చేసుకుంటారో ఏమోనన్న బెంగ విజయ్‌లో బయలుదేరినట్టుంది. దీంతో తన అభిమాన సంఘ ముఖ్యనేతలు యాభై మందిని చెన్నైకు పిలిపించారు. మంగళవారం ఉదయాన్నే చెన్నైకు చేరుకున్న ఈ అభిమాన నేతలు పనయూరులోని విజయ్ ఫామ్ హౌస్‌కు వెళ్లారు. అక్కడ కొన్ని గంటల పాటు భేటీ సాగింది. తన తండ్రి వ్యవహరించిన తీరుపై విజయ్ తీవ్ర మనోవేదనలో ఉన్నట్టు సమాచారం. రాజకీయాలు అవసరమాని విజయ్ ప్రశ్నించగా మెజారిటీ శాతం మంది రాజకీయాల్లో అడుగుపెడదామని చెప్పినట్టు తెలిసింది. అయితే, విజయ్ ఏమాత్రం చిక్కకుండా రాజకీయాలకు దూరం అన్నట్టుగానే అభిమాననేతలకు ఉపదేశం చేశారు. తండ్రి చంద్రశేఖర్‌కు దూరంగా ఉండాలన్న సూచనను అభిమాన నేతలకు చేసినట్టు చర్చ. సమావేశంలో మరికొన్ని అంశాలపై సుదీర్ఘ చర్చ సాగినట్టు, ఆ మేరకు విజయ్ నుంచి కీలక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశాలు ఉన్నట్టుగా అభిమానులు పేర్కొంటున్నారు. ఈ దృష్ట్యా, ఆ ప్రకటన కోసం ఎదురుచూపులు, ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయో అనే ప్రాధాన్యత అభిమానుల్లో పెరిగింది. -
కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ
సాక్షి, కొడిమ్యాల(చొప్పదండి): లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ది ఎక్స్ట్రా ప్లేయర్ పాత్రేనని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం అన్నారు. కొడిమ్యాలలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని పదవి కోసం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉందన్నారు. టీఆర్ఎస్కు ఎదురుగాలి తప్పదన్నారు. కేసీఆర్ అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. బోయినపల్లి వినోద్‌కుమార్ తన పదవీకాలంలో ఢిల్లీకే పరిమితమయ్యారని, ప్రజాసమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. తన సొంత మెడికల్ కాలేజీ కోసం జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్‌ను ఎంతో అభివృద్ధి చేశారని, ఈసారి ఎంపీగా గెలిపించుకోవాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ చిలివేరి నారాయణగౌడ్, మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్ గడ్డం జీవన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, సాయి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీలు మారిన వారే బరిలో
తాండూరు: నమ్మిన పార్టీ కోసం పనిచేసే నాయకులు నేటి రాజకీయాలలో తక్కువగా కనిపిస్తారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే రోజులు పోయాయి. నియోజకవర్గంలో 5 ఏళ్లలో పార్టీలు మారిన నేతలే అధికంగా కనిపిస్తున్నారు. పార్టీ గెలుపునకు కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నాయకులు నేటి రాజకీయాలలో కనిపిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.తాజాగా తాండూరు రాజకీయాలలో పార్టీలు మారుతున్న నాయకులు పొలిటికల్ ట్రెండ్ కొనసాగుతుందనడం గమనార్హం. కండువాలు మార్చిన నాయకులు... తాండూరు రాజకీయాలలో 5ఏళ్లుగా వివిధ పార్టీల నాయకులు జెండాలు మార్చుతున్నారు. అందులో 2014ఎన్నికల సమయంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర రవాణశాఖ మంత్రిగా కొనసాగారు. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన దివంగత మంత్రి చందుమహరాజ్ తనయుడు నరేష్ మహరాజ్ 2014సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ కండువా కప్పుకొని తాండూరు అ సెంబ్లీ బరిలో నిలిచారు. ఎన్నికలు పూర్తయిన ఏడాది తర్వాత తిరిగి నరేష్ మహరాజ్ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం యు.రమేష్‌కుమార్ 4ఏళ్ల కిందట బీజేపీలో చేరి పార్టీని సంస్థాగతంగా పటిష్ట పరిచారు. ముందస్తు ఎన్నికల్లో జంపింగ్‌ల పర్వం... టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసి ముంద స్తు ఎన్నికలకు వెళ్లడంతో రాజకీయ పార్టీలలో జం పింగ్ల పర్వం మొదలయింది. ఈ సారి ఏకంగా నియోజకవర్గ నాయకులు సైతం పార్టీలను మారా రు. బీజేపీ నుంచి తాండూరు అసెంబ్లీ స్థానాన్ని ఆ శించిన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమే ష్‌కుమార్ టికెట్ రాలేదనే కారణంతో టీఆర్ఎస్లో చేరారు. రమేష్‌కుమార్‌తో పాటు బీజేపీ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కీలక పదవులు కలిగిన 30మంది నాయకులు రమేష్‌తో పాటు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి సందల్‌రాజుగౌడ్ టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నారు. మాజీ ఎమెల్యే చూపు టీఆర్ఎస్ వైపు.. తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు చూపు టీఆర్ఎస్పై పడింది. టీఆర్ఎస్లో చేరితే పార్టీలో కీలక భాద్యతలను కట్టబెట్టేందుకు సీఎం కేసీఆర్ హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాండూరులో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే నారాయణరావుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలలో చర్చసాగుతోంది. ఎన్నికల తర్వాత మారాలా.. లేకా ఎన్నికల ముందే మారా లా అనే విషయమై తేల్చుకోలేక పోతున్నారు. కాంగ్రెస్‌లో చేరిన పైలెట్... తాండూరు నియోజకవర్గంలో హట్ టాపిక్‌గా మారిన పైలెట్ రోహిత్‌రెడ్డి దశాబ్ద కాలంగా టీఆర్ఎస్లో కొనసాగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాండూరు టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. టీఆర్ఎస్ ప్రçభుత్వం ఏర్పడ్డాకా పైలెట్ రోహిత్‌రెడ్డిని టీఆర్ఎస్ నుంచి బహిష్కరించారు. నాటి నుంచి యంగ్ లీడర్స్ సంస్థ తరపున తాండూరు ప్రాంతంలో బలం పెంచుకున్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రోహిత్‌రెడ్డి తాండూరు అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు. ట్రెండ్ పేరుతో.. రాజకీయాల్లోనూ ట్రెండ్ కొనసాగుతుంది. ఒకే పార్టీలో ఉంటే విలువ ఉండదని అందుకే పార్టీలు మారుతున్నామని నాయకులు అంటున్నారు. 4దశాబ్దాల కిందట పార్టీ కోసమే నాయకులు కార్యకర్తలు పనిచేశారు. తర్వాత రోజుల్లో నాయకుల కోసం పని చేశారు. ప్రస్తుతం పార్టీ గుర్తించలేదనే కారణంతో పార్టీలను వీడుతున్నారు. అయితే రాజకీయాలలో నేతలు విలువల కోసం పని చేయడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
నాయకులకు సెల్ ఛార్జింగ్ ఆగట్లేదు..!
సాక్షి, తొర్రూరు రూరల్(స్టోరీ): ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అభ్యర్థులు నిత్యం ఫోన్లు చేస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. దీంతో చాలామందికి క్షణం తీరిక ఉండటం లేదు. నాయకులు, అధికారులౖకైతే ఊపిరి పీల్చుకోలేనంత ఇబ్బందిగా మారింది. సెల్ఫోన్లలో మాట్లాడటం నిత్యకృత్యంగా మారింది. తాజా సమాచారం తెలుసుకునేందుకు సామాజిక మాధ్యమాలు తీరిక లేకుండా గమనిస్తున్నారు. అధికారులేమో ఆ సమాచారం ఈ సమాచారం అంటూ జిల్లా కేంద్రం నుంచి డివిజన్, మండల స్థాయి వరకు దాదాపు గంటకు ఇరవైకి తగ్గకుండా కాల్స్ చేస్తున్నారు. అన్ని వివరాలు సెల్‌ఫోన్ ద్వారానే చెప్పాలంటే మధ్యాహ్నానికే ఛార్జింగ్ అయిపోతుందని నాయకులు వాపోతున్నారు. ఛార్జింగ్ లేకపోవడంతో సమాచార సేకరణ ఇబ్బందిగా మారుతుందని అటు నాయకులు, ఇటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది అధికారులను నీరసంగా కనిపిస్తున్నారని అడిగితే ‘ రాత్రంతా కార్యాలయంలోనే ఉన్నాం..పెట్రోలింగ్ తిరుగుతున్నాం’ అని సమాధానం చెప్తున్నారు. రాత్రింబవళ్లు తీరిక లేకుండా కాల్స్ రావడంతో నరాలు లాగేస్తున్నాయి అంటూ తమ పని ఒత్తిడిని వ్యక్తపరుస్తున్నారు. ఇదండీ సంగతి. -
మోదీ ఇమేజ్ గట్టెక్కిస్తుందా..?
సాక్షి,న్యూఢిల్లీ: చుట్టూ చీకటి..దారంతా ముళ్లు..అయినా ఆశలన్నీ ఆ నేతపైనే..భారమంతా అధినేత భుజాలపైనే. ముంచుకొచ్చిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, అటు తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలంటే మోదీ బ్రాండ్‌పైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయితే బీజేపీకి కీలకమైన మోదీ ఇమేజ్ మసకబారుతుండటమే ఇప్పుడు ఆ పార్టీ అగ్రనేతలకు కునుకులేకుండా చేస్తోంది. మూడున్నరేళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోదీపై తొలిసారిగా స్వయంగా సొంత పార్టీలోనే అసమ్మతి స్వరాలు వినిపించడం, ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, ఉద్యోగాలు 12 ఏళ్ల కనిష్టస్థాయికి పతనమవడం ఎంతటి ప్రజాదరణ కలిగిన నేతకైనా ఆందోళన కలిగించే పరిణామాలే.నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో ఆర్థిక వృద్థి దిగజారడం మోదీపై విమర్శలు గుప్పించేందుకు విపక్షాలకు అందివచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో సొంత పార్టీలోనే యశ్వంత్ సిన్హా వంటి సీనియర్లు మోదీని టార్గెట్ చేయడం కమలనాథుల్లో కలవరం కలిగిస్తోంది. ఆర్థిక వ్యవస్థ గాడితప్పడంపై ప్రధాని, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు దిద్దుబాటుకు దిగడం నష్టనివారణ చర్యల్లో భాగంగానే భావించాలని బెంగుళూర్‌కు చెందిన జైన్ వర్సిటీ ప్రో వైస్ ఛాన్స్లర్, రాజకీయ విశ్లేషకులు సందీప్ శాస్ర్తి వ్యాఖ్యానించారు. మాటల యుద్ధం ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా ఇప్పుడు ఆర్థికాంశాలపైన విమర్శలూ రాజకీయ వేడి రాజేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థను మోదీ నడిపిస్తున్న తీరుపై వాజ్‌పేయి హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన యశ్వంత్ సిన్హా నిప్పులు చెరగడం కలకలం రేపింది. పార్టీలో ఇదే అభిప్రాయంతో ఎంతో మంది ఉన్నారని, కానీ వారు భయంతో తనలా మాట్లాడలేకపోతున్నారని సిన్హా కుండబద్దలు కొట్టారు. సిన్హా వ్యాఖ్యలను పార్టీ నేత శత్రుజ్ఞ సిన్హా సమర్థించారు. ఆర్థిక వ్యవస్థను సిన్హా వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇక వాజ్‌పేయి కేబినెట్లోనే మంత్రిగా పనిచేసిన అరుణ్ శౌరీ సైతం నోట్ల రద్దును ఆత్మహత్యాసదృశంగా అభివర్ణించారు. ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభం దిశగా పయనిస్తున్నదని పార్టీ ఎంపీ, మాజీ హార్వార్డ్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారు. ఇక కాంగ్రెస్ నేతల విమర్శలు సరేసరి. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారని ఆ పార్టీ నేత ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు.అయితే ఈ విమర్శలను మోదీ తిప్పికొట్టారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని యూపీఏ హయాంలో ఇంతకంటే దారుణంగా వృద్ధి రేటు పడిపోయిందని చెప్పుకొచ్చారు. నిపుణుల మాటేంటి..? ఆర్థిక అంశాలు రాజకీయ వేడి రగులుస్తున్న క్రమంలో మోదీ విజయ పరంపర కొనసాగడంపై నిపుణులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మోదీ బలాబలాలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.బలమైన విపక్షం లేకపోవడం మోదీకి కలిసివచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తక్షణం ముందుకొచ్చిన ఆర్థిక సవాళ్లను మోదీ పరిష్కరించగలిగితే పెద్ద ప్రమాదం ఉండబోదని రచయిత, రాజకీయ విశ్లేషకులు అజయ్ బోస్ అన్నారు.అయితే మోదీ ఇమేజ్‌పై బీజేపీ భారీ ఆశలు పెట్టుకున్నా నిరుద్యోగ సమస్యను 2019 సార్వత్రిక ఎన్నికల్లోగా దీటుగా ఎదుర్కోని పక్షంలో ఎన్డీఏకు విజయావకాశాలు అంత సులభం కాదని పేర్కొంటున్నారు. నోట్ల రద్దు అనంతరం యూపీ సహా పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం మోదీ మార్కెటింగ్ వ్యూహాల ఫలితమని యశ్వంత్ సిన్హా పేర్కొనడాన్ని చూస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కేవలం మార్కెటింగ్ మంత్రాలే పనిచేయవని, క్షేత్రస్థాయిలో సామాన్యుడికి ఎంతమేర మేలు జరిగిందనే ప్రాతిపదికన ఎన్నికల ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిరుద్యోగులు, రైతుల సమస్యలు మరింత జటిలం కాకుండా చేయడం మోదీ ముందున్న సవాల్‌గా పేర్కొంటున్నారు. ఇప్పటివరకూ మోదీకి దీటైన ప్రత్యామ్నాయం లేదని, అయితే ఎంతటి ప్రతిష్ట కలిగిన నేతకైనా ప్రజాగ్రహం వ్యక్తమైతే మాత్రం దానిముందు ఇమేజ్ డ్యామేజ్ అవడం అసాధ్యమేమీ కాదని అజయ్ బోస్ అన్నారు -
వినేవాడు వెర్రివాడైతే.. చెప్పేవాడు చంద్రబాబు!
సాక్షి, హైదరాబాద్: వినేవాడు వెర్రివాడైతే చెప్పేది చంద్రబాబు అన్న చందం మరోసారి నిజమైంది. తన అభివృద్ధిని అప్పటి ప్రధాని అమెరికాలోనూ మెచ్చుకున్నారని మండలి సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఇంతకీ విషయం ఏంటంటే.. తాను హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన విషయాన్ని అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు అమెరికా పర్యటనలో పొగిడారని, మాక్కూడా మీలాంటి నగరాలున్నాయని హైదరాబాద్ పేరు చెప్పారని చంద్రబాబు గురువారం మండలిలో చెప్పారు. అయితే బాబు సీఎం అయింది 1995 సెప్టెంబరులో. పీవీ నరసింహారావు ప్రధానిగా 1996లో దిగిపోయారు. అంటే చంద్రబాబు పదవిలోకి వచ్చిన 8 నెలల్లోనే హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేశారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. -
నిర్వాసితులంటే ఎందుకీ కక్ష?
పోలవరం డ్యామ్ కోసం నిర్వాసితులైన వారంతా దళితులు, వెనుకబడిన వర్గాలే. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఆ వర్గాలపట్ల దానికి ఎలాంటి శ్రద్ధాలేదని భావించే విధంగా ఉంది. తూర్పు గోదావరిలోని అంగలూరు, పశ్చిమగోదావరిలోని పోలవరం మండలాలలో గ్రామాలను ఖాళీ చేయించడానికి అధికారులు చూపిన అత్యుత్సాహం దారుణం. ఈ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములకు ఇప్పటి వరకు ఇచ్చిన పరిహారం చాలా తక్కువగా ఉందన్న విషయాన్ని గమనించాలి. ‘వేయి తుపాకుల కంటే, ప్రతికూలతతో ఉండే నాలుగు వార్తాపత్రికలంటేనే నేను ఎక్కువ భయపడతాను.’ రెండు వందల ఏళ్ల క్రితం ఫ్రెంచ్ సేనాని నెపో లియన్ బోనాపార్టీ అన్నమాట ఇది. ప్రజాస్వామ్య చైతన్యం వెల్లివిరిసే భారత్ వంటి దేశంలో పత్రికలు నెపోలియన్ కాలానికి మించి ప్రజాభిప్రాయాన్ని నిర్మించే పనిని నిర్వహిస్తున్నాయి. కాబట్టే పోలవరం ప్రాజెక్టు కోసం భూము లు కోల్పోయి నిర్వాసితులుగా మిగిలిపోయిన వేలాది మందికి పత్రికలూ, మీడియాయే ఆశాజ్యోతులుగా కనిపిస్తున్నాయి. కానీ, ఈ వ్యాసం ఉద్దేశం పోలవరం డ్యామ్ ఉపయోగాల గురించి చర్చించడం కాదు. అక్కడి నిర్వాసిత కుటుంబాలకు చెందిన వేలాది మంది మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపు తున్న అమానవీయ ధోరణి గురించి వెల్లడించడంతో పాటు, ఆ సమస్యను ఎంత సులభంగా పరిష్కరించే అవకాశం ఉన్నదో చెప్పడమే. నిర్వాసితులూ, వాళ్ల సమస్యలూ వికారంగా ఉంటాయి తప్ప, సినీతా రల జీవితాల మాదిరిగా తళుకు బెళుకులతో ఆకర్షణీయంగా ఉండవు. చానళ్లు కూడా ఏదైనా ఒక విషాదం పట్ల ఒకరోజుకు మించి దృష్టి పెట్టవు. ఇంతకీ అసలు సమస్య- పోలవరం ప్రాజెక్టు, అందుకు అవసరమైన మౌలిక వస తుల కల్పన, కాలువల తవ్వకం వంటి అవసరాలకు భూమిని సేకరించారు. దీనికి చాలా తక్కువగా, బ్రిటిష్ ఇండియా ఏలుబడిలో రూపొందించిన భూసేకరణ చట్టం-1894 నిర్దేశించిన మేర పరిహారం ప్రకటించారు. కొత్తగా భూసేకరణ చట్టం-2013 అమలులోకి వచ్చింది. కానీ దీనిని ఇక్కడి నిర్వాసితులకు వర్తింపచేయడంలేదు. ఈ నిర్వాసితులలో ప్రధానంగా ఉభ యగోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాల వారు ఉన్నారు. ఈ పథకం కోసం ఇప్పటి దాకా సేకరించినట్టు చెబుతున్న భూమి దాదాపు 30,000 ఎకరాలు. వచ్చే ఐదేళ్లలో మరో రెండు లక్షల ఎకరాలు అవసరమవుతాయి. ఈ పథకం కోసం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలాలలో ఖాళీ చేయించిన గ్రామాల వారు తక్కువ నష్ట పరిహారం పొందుతున్నారు. అంటే ఆ పరిహారం 1894 నాటి భూసేకరణ చట్టం ప్రకారమే తప్ప, కొత్తగా వచ్చిన 2013 భూసేకరణ చట్టం నిబంధనల మేరకు అందడం లేదు. ఇదీ సమస్య. ఇందుకు సంబంధించిన కొన్ని వాస్తవాలు మొదట తెలియాలి. భూసేక రణ చట్టం 2013 ఆమోదం పొందడానికి ముందు ఖాళీ చేయించిన గ్రామా లకు లేదా సేకరించిన భూములకు తాజా పరిహారం గురించి తాము సిఫా రసు చేయలేమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాటుతోంది. ఈ వాస్తవాలను పరి శీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ మూడు జిల్లాలకు చెందిన ఏడు లక్షల మంది నిర్వా సితులకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సంగతి అవగాహనకు వస్తుంది. పోలవరం, దేవీపట్నం మండలాల భూములతో పాటు, డ్యామ్ కుడి, ఎడమ కాలువల నిర్మాణం కోసం ప్రభుత్వం 25,000 ఎకరాల భూమిని కూడా సేక రించింది. ఈ పరిణామాలతో పోలవరం, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాలకు చెందిన రైతులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు దిగ్భ్రాంతిని కలిగిస్తు న్నాయి. సారవంతమైన భూములను ఎకరాకు రూ.1.5 లక్షలు చెల్లించి తీసు కున్నారు. కానీ ప్రస్తుతం వీటి మార్కెట్ ధర ఎకరం రూ.45 లక్షలు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పేదలుగా మార్చింది. అదెలాగంటే, పోలవరం మండలంలో డ్యామ్ కోసం భూములు ఇచ్చి నిర్వాసితులైన వారికి ఇళ్ల స్థలా లు ఇవ్వడానికి బుట్టాయగూడెం మండలం, ముద్దపగడం గ్రామంలో భూమి ని సేకరించారు. ఇలాంటి అవసరాల కోసమే ప్రగడపల్లి అనే చోట కూడా భూమిని సేకరించారు. నివేశన స్థలాల కోసం భూమిని సేకరించడం తప్పు కాదు. కానీ సస్యశ్యామలమైన వారి భూములకు ఎకరాకు రూ. 1.5 లక్షలు వెల కట్టడం ఏమిటి? పైగా కొత్త చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించేం దుకు ముందుకు వస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డడం దేనికి? మరో పక్క, పోలవరం డ్యామ్‌ను జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించినందున, ఇకపై ఆ డ్యామ్ ఖర్చులతో, నష్టపరిహారం చెల్లింపులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అదంతా కేంద్రమే చూసుకోవాలని ఇటీవల రాష్ట్ర ప్రభు త్వం తరచూ చెబుతోంది. కొత్తచట్టం నిర్వాసితులకే అనుకూలం భూములను సేకరించడం, గ్రామాలను ఖాళీ చేయించడం వంటి పను లు 2013 చట్టం కంటే ముందే జరిగినప్పటికీ, కొత్త చట్టంలోని సెక్షన్ 24(2) చాలా సరళమైన భాషలో, సుస్పష్టంగా ‘1894 నాటి చట్టం మేరకే భూ సేకరణ జరిగినప్పటికీ, అందుకు సంబంధించిన పరిహారం చెల్లించినప్పటికీ, సంబంధిత వ్యక్తులు దానిని స్వీకరించినప్పటికీ, కొత్త చట్టం జనవరి 1, 2014కు ఐదేళ్ల ముందే రావలసి ఉంది కాబట్టి వారికి ఆ కొత్త చట్టం మేరకే పరిహారం ఇవ్వాలి’ అని నిర్దేశిస్తున్నది. పోలవరం డ్యామ్ కోసం డిసెంబర్ 31, 2009కు ముందే భూసేకరణ జరిపారు. అదే సెక్షన్లో, అంటే 24(2)లోని రెండో భాగం కూడా నిర్వాసితులకే మరింత అనుకూలంగా ఉంది. ఆ భాగం ఇలా పేర్కొంటున్నది: ‘నిర్వా సితులు డబ్బు స్వీకరించినప్పటికీ, తమ భూములను అప్పగిస్తూ వారు పత్రాల మీద సంతకాలు చేసినప్పటికీ, గ్రామాలను ఖాళీ చేయించి, ఇళ్లు తీసుకున్నప్పటికీ- వారంతా జనవరి 1, 2014 నాటికి అక్కడ ఉన్నవారే. ఆ భూములను సాగు చేసుకుంటున్నవారే. కాబట్టి కొత్త చట్టం మేరకే పరిహారం అందించాలి.’ పోలవరం డ్యామ్ జాతీయ పథకం. రాష్ట్ర ప్రభుత్వానికి దీనితో సంబం ధం లేదు. కానీ కేంద్రం పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు. దీనిని ఆసరా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా తలదూరుస్తున్నది. అయితే డ్యామ్ నిర్మాణం చేపట్టమనీ, నిర్వాసితులకు న్యాయం చేయమనీ త్వర లోనే న్యాయస్థానాలు కేంద్రాన్ని ఆదేశిస్తాయని ఆశించవచ్చు. కేంద్రం డబ్బు ఇస్తే డ్యామ్‌ను నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవ నరుల మంత్రిత్వ శాఖను కోరినట్టు తెలుస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ వేల కోట్ల రూపాయలను తన ఆశ్రీతుల పరం చేస్తుంది. ఇలాంటి అవి నీతికి అనుమతించే విధంగా ఉంటే ఆ శాఖ మంత్రి ఉమాభారతి రాజీ నామా చేయాలి.డ్యామ్ కుడి, ఎడమ కాలువల నిర్మాణం కోసం 2005 నుంచి 25,000 ఎకరాల భూమిని సేకరించారు. కానీ డ్యామ్ నిర్మాణంలో జాప్యం జరి గింది. పూర్తికావడానికి మరో 20 ఏళ్లు పడుతుంది. అంటే వినియోగం లోకి రావడం కంటే 35 ఏళ్లకు ముందే ఆ భూములను సేకరించారు. అది కూడా ఎకరాకు మార్కెట్ ధర రూ.45 లక్షలు (నల్లజర్ల, దేవరపల్లి, ప్రగడపల్లి మండలాలలో) ఉండగా, రూ.1.5 లక్షలే చెల్లించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం డ్యామ్ కోసం సేకరించిన భూమ లకు కొత్త చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి. ఇందుకు ప్రజలు పెట్టుకున్న విన్నపాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానాలు ఇవ్వాలి. నిజానికి జల వనరుల మంత్రిత్వ శాఖ ఇక్కడి నిర్వాసితుల పట్ల సానుకూలంగా స్పందిస్తు న్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుపుల్ల వేస్తున్నది. మరింత నష్టపరిహారం కోసం నిర్వాసితులు కేంద్రంతో పోరాడుతుంటే, కేంద్ర ప్రభుత్వానికి సాయం గా రాష్ట్రం న్యాయవాదులను ఎందుకు పంపించాలి? ఈ వ్యాసకర్త పెట్టుకున్న దరఖాస్తుపై మే 25, 2015న గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సలహా మండలి ఢిల్లీలో ఒక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశానికి వచ్చిన అధికారి వాస్తవాలు తెలుసుకుని విస్తుపోయారు. తాను రాష్ట్ర ప్రభు త్వంతో చర్చించి చెబుతానని వెల్లడించారు. అయినా ఇంతవరకు రాష్ట్ర ప్రభు త్వం నుంచి ఇక్కడి వారికి ఎలాంటి సానుకూల సమాధానం అందలేదు. ‘ఒకరే చనిపోతే అది విషాదం. పది లక్షల మంది చనిపోతే అది గణాంకాల విషయం’- ఇది 70 ఏళ్ల క్రితం రష్యా నేత జోసెఫ్ స్టాలిన్ అన్నమాట. దురదృ ష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం అదే పంథాలో ఆలోచిస్తున్నది. పోలవరం డ్యామ్ కోసం నిర్వాసితులైన వారంతా దళితులు, వెనుకబడిన వర్గాలే. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఆ వర్గాల పట్ల దానికి ఎలాంటి శ్రద్ధా లేదని భావించే విధంగా ఉంది. తూర్పు గోదావరిలోని అంగలూరు, పశ్చిమగోదావరిలోని పోలవరం మండలాలలో గ్రామాలను ఖాళీ చేయించడానికి అధికారులు చూపిన అత్యుత్సాహం దారుణం. కానీ అదే ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరిస్తున్నప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లా వాసులను బంధువులుగా ఆదరించింది. కొత్త భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించడానికి తమకు అభ్యంతరం లేదని ఇప్పటికైనా రాష్ట్రం కేంద్రానికి లేఖ రాయాలి. అంగలూరు, దేవరగొంది, పోలవరం మండలాలలో అత్యుత్సా హం చూపిన అధికారులను శిక్షించాలి. ఈ ప్రాజెక్టు కోసం సేకరించిన భూము లకు ఇప్పటి వరకు ఇచ్చిన పరిహారం బంజారాహిల్స్‌లో ఐదు ఎకరాలకు చెల్లించే పైకం కంటే చాలా తక్కువగా చెల్లించిన విషయాన్ని గమనించాలి. అన్నట్టు మన పాలకులంతా ఉండేది బంజారాహిల్స్‌లోనే మరి! (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) - పెంటపాటి పుల్లరావు e-mail:Drpullarao1948@gmail.com -
వాడు చాలా బాగా రాసిండు
... ఇది మా నాన్న ప్రశంస మాడభూషి శ్రీధర్ కాలమిస్టుగా న్యాయశాస్త్ర ఆచార్యుడిగా పరిచయం. సామాజిక, రాజకీయ విశ్లేషకులుగా తెలిసిన వ్యక్తి. ఆ మధ్య కేంద్ర సమాచార కమిషనర్‌గా ఎదిగారనీ తెలుసు. అంతకంటే ముందు ఆయన పాత్రికేయుడు. పాత్రికేయుల కోసం పాఠాలు రాసిన మేధావి. ఎంత ఎదిగినా కౌమార దశలో తండ్రి నుంచి అందుకున్న ప్రశంసా వాక్యమే మకుటంగా భావిస్తారాయన. మీ బాల్యం, చదువు ఎక్కడ? అంతా వరంగల్‌లోనే. నాన్న ఎం.ఎస్ ఆచార్య, స్వాతంత్య్ర సమరయోధులు, జనధర్మ వారపత్రిక, వరంగల్ వాణి దినపత్రికల వ్యవస్థాపకుడు, సంపాదకుడు. అమ్మ రంగనాయకమ్మ గృహిణి. చదువు అంటారా... ఇంటికి దగ్గరగా ఉన్న చెట్టుకింద బడిలో, వరంగల్ లా కాలేజ్, ఉస్మానియా యూనివర్శిటీలలో సాగింది. న్యాయశాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసి మళ్లీ జర్నలిజంలో పి.జి ఎందుకు చేయాలనిపించింది? మీ ప్రశ్న చిన్నదే. దానికి సమాధానం చెప్పాలంటే నా జీవిత పుస్తకాన్ని తెరవడమే. పెండేకంటి లా కాలేజ్‌లో లా క్లాసులు తీసుకుంటూ రచన జర్నలిజం కాలేజ్‌లో బీసీజే, ఎంసీజే చేశాను. న్యాయశాస్త్రం, జర్నలిజం, సమాచార చట్టం... మొత్తం ఎన్ని పుస్తకాలు, వ్యాసాలు రాసి ఉంటారు? పుస్తకాలు 30కి పైగా. వ్యాసాలు వేలల్లో ఉంటాయి. న్యాయశాస్త్రాన్ని విశ్లేషిస్తూ వ్యాసాలు రాసిన తొలి తెలుగు వ్యక్తి మీరేనేమో! పెద్దలున్నారు. విస్తృతంగా రాసింది నేనే కావచ్చు. సమాచార హక్కు చట్టం సామాన్యుడికి ఎంత వరకు అందుబాటులోకి వచ్చిందంటారు? సామాన్యుడికి సమాచారం కోసం నిలదీసి అడిగే హక్కునిచ్చింది. అధికార వర్గాల్లో సమాచారాన్ని ఇచ్చి తీరాల్సిందే, ఇద్దాం అనే పరిస్థితులు వస్తున్నాయి. ఈ చట్టం సామాన్యుడిని సాధికారిక శక్తిగా మారుస్తుంది. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు ఏమనిపించింది? అది యాదృచ్ఛికమైన అద్భుత సంఘటన. సిఫార్సు లేకుండా దరఖాస్తు ఆధారంగా ఎంపిక కావడం అంటే ఈ వ్యవస్థ నాకు ఇచ్చిన గౌరవం అనిపించింది. కష్టపడితే ఫలితం ఉన్నతంగా ఉంటుందనిపించింది. అప్పటి విధులకు- ఇప్పటి విధులకూ తేడా? జర్నలిస్టుగా, రచయితగా, టీచర్‌గా అప్పుడు సమాచారం ఇవ్వడం నా బాధ్యత. సమాచారాన్ని ఇప్పించడం ఇప్పటి విధి. ఇందుకు అధికారం తోడుంది. మీరు నమ్మే సిద్ధాంతం?... జ్ఞానాన్ని ఇతరులకు చెప్పాలి. అందుకు నేను ఎంచుకున్న మార్గం అక్షరం. కలం గొప్పదని నమ్ముతారా?... నేనూ నిరూపించాను. ఉదయంలో ‘తిరుమల లీలలు’ పేరుతో తిరుమలలో జరుగుతున్న అక్రమాల మీద 9 పరిశోధన వ్యాసాలు రాశాను. నేను రాసిన వాటిలో 90 శాతం రుజువు చేశాను. కలం గొప్పదే. మీ రచనలను నాన్నగారు మెచ్చుక్ను సందర్భం? నాకప్పుడు పదహారేళ్లు. ఎమర్జెన్సీ సమయంలో ‘మనకు స్వరాజ్యం వచ్చింది. కానీ, స్వాతంత్య్రం రాలేదు’- అనే ఇతివృత్తంతో ‘నాకూ స్వాతంత్య్రం వచ్చింది’ అనే వ్యంగ్యరచన చేశాను. అప్పుడు నాన్న... అమ్మతో ‘ఇంత లేడు. వీడు ఇందిర ప్రభుత్వాన్ని విమర్శిస్తాడా’ అని నిలదీశారు. చివరగా ‘అయినా వాడు చాలా బాగా రాసిండు’ అన్నారు. అది నాకు అద్భుతమైన ప్రశంస. ఇప్పుడాయన లేకపోయినా... ఆయన ముఖం, ధోతి చేతిలో పట్టుకుని అంటున్న తీరు కళ్లల్లో మెదులుతూనే ఉంటుంది. పాత్రికేయునిగా- న్యాయశాస్త్ర బోధకునిగా వృత్తిలో తేడా ఎలా అనిపించేది? రెండూ విద్యాబోధనలే. పాత్రికేయ వృత్తిలో వెనువెంట కష్టాలు, కేసులు, బెదిరింపులు... ఉంటాయి. కేసు ఫైలయ్యేటంతటి సాహసాలు చేశారా?... ఎన్నో. టీటీడీ వారి కేసు పదకొండేళ్లు నడిచింది. ఎక్కువ ఆత్మసంతృప్తినిచ్చిన రచన? ...ప్రతిదీ సంతృప్తినిచ్చేదే. అయోధ్య తీర్పు విశ్లేషణ కోసం చాలా కష్టపడ్డాను. ఇటీవల మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును విశ్లేషించాను. మరొకటి రాసే వరకు అదే. ఎన్ని గంటలు పనిచేస్తారు? ఎంతసేపు నిద్రపోతారు? ఎప్పుడూ లెక్కపెట్టుకుంటూ పనిచేయలేదు. ప్రెస్‌లో రాత్రి రెండు వరకూ పనిచేసేవాడిని. ఇప్పటికీ పన్నెండయినా రాసుకుంటూ ఉంటాను. నా నిద్ర నాలుగు గంటలే.పిల్లలు, శ్రీమతి గురించిన వివరాలు... పాప వసుప్రద లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. బాబు సంపత్ రామానుజం ఉద్యోగం చేస్తున్నాడు. నా శ్రీమతి వేదకల్యాణి మా మేనమరదలే. ఆప్టోమెట్రిస్టు. మీ ప్రమేయం ఏ మాత్రం లేకుండా మీరు బాధితులైన సందర్భం ఉందా? 1978లో చాంద్రాయణ గుట్టలో అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను. 25 మంది ఆటో ఆపి నన్ను దింపి కొట్టారు. కేవలం హిందువుననే ఏకైక కారణంతో దెబ్బలు తిన్నాను. దైవికంగా బతికి బయటపడ్డాను. కొట్టిన వారి మీద కోపం రాలేదా?... రాజకీయాల కోసమే ఆ మతకల్లోలాలు. కొట్టేవాడికి, దెబ్బలు తినేవాడికి ఏ పగలూ లేవు. ఎవరి మీద కోప్పడాలి? జీవితానికి మీరిచ్చే నిర్వచనం?... నా దృష్టిలో జీవితం అంటే నిరంతరం పని చేయడమే. అదే మనిషిని ముందుకు తీసుకెళ్తుంది. సోమరితనం ప్రధాన శత్రువు. మీ మీద వృత్తిపరంగా నాన్న ప్రభావం తెలుస్తోంది. అమ్మ నుంచి ఏం నేర్చుకున్నారు? అమ్మతో సాన్నిహిత్యం అపారం. అమ్మ రోజంతా కష్టపడేది. అమ్మ కోసం ఏదో చేయాలనిపించేది. వంటలో సాయం చేసేవాడిని. రోజంతా పనితో అలసిపోయేది. అమ్మకోసం రోజూ రాత్రి వంటగది నేనే కడిగేవాడిని. అది పెద్ద పని అని కాదు. ఆ వయసులో అమ్మకు చేయగలిగిన సాయం. అది నాకూ- అమ్మకూ ఆత్మీయమైన పని కూడా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయవద్దని కలెక్టర్ నాన్నతో చెప్పినందుకు నాన్న బాగా కోప్పడ్డారు. అప్పుడు అమ్మ ‘వాడు రాసిన వ్యాసాన్ని ఎవరికిచ్చారు’ అన్నది. ‘నాకే ఇచ్చాడు’ అన్నారాయన. ‘మరి మీరోసారి చూసుకోవాల్సింది’ అన్నది మెల్లగా. ఆమె అమాయకంగా అన్న అద్భుతమైన మాట అది. -
కేపీ మునిస్వామికి జయ షాక్
మొన్న గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల నుంచి తొలగింపు తర్వాత కార్మికశాఖ కేటాయింపు తాజాగా ఆ శాఖ కూడా గోవిందా! హొసూరు న్యూస్‌లైన్: అన్నా డీఎంకే అధినేత్రి, సీఎం జయలలితకు ఎంతో విశ్వాసపాత్రుడిగా ఉన్న కృష్ణగిరి జిల్లా మంత్రి కేపీ మునిస్వామిపై వేటు పడింది. మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టిన జయలలిత ముగ్గురికి ఉద్వాసన పలికిన జయలలిత మరి కొందరి శాఖలను మార్చిన విషయం తెలిసింది. ముఖ్యమంత్రికి నమ్మకమైన వ్యక్తులుగా ఉన్న నల్గురు మంత్రులలో కృష్ణగిరి జిల్లా మంత్రి కే.పి మునిస్వామి ఒకరు. ఈయన కృష్ణగిరి అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖలను నిర్వహించేవారు. మంత్రి వర్గమార్పులతో కే.పి.మునిస్వామికి షాక్ ఇచ్చిన జయలలిత ఆయనను గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖలను వెనక్కు తీసుకొని కార్మిక సంక్షేమశాఖను కేటాయించింది. మంగళవారం తాజా పరిణామాలు చోటుచేసుకోగా మునిస్వామిని కార్మిక శాఖనుంచి కూడాతొలగించారు. అదేవిధంగా పార్టీ కృష్ణగిరి జిల్లా కార్యదర్శి పదవినుంచి, పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడి పదవినుంచి కూడా ఆయనను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కృష్ణగిరి స్థానం నుంచి అన్నాడీఎంకె అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలుపొందించడంలో కేపీ మునిస్వామి కృషి ఉంది. అయితే ప్రతిష్టాత్మకమైన హొగేనకల్ పథకం అమలుపై ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టకపోవడం, కార్యకర్తలను, నాయకులను కలుపుకొని పోకపోవడం వల్లే ఆయనను మంత్రి పదవులకు దూరం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో కృష్ణగిరి జిల్లాలో కల్తీసారా దుర్ఘటనలో 42 మంది మృతి చెందినఘటనకు సంబంధించి నిందితుల వద్ద మంత్రి డ బ్బు తీసుకుని కేసు మాపీ చేయించినట్లు ఇటీవల ఓ తమిళవారపత్రికలో కథనం ప్రచురితమైంది. శాఖల తొలగింపునకు ఇది కూడా ఒక కారణమై ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
‘ఫ్యాన్’గాలి
సాక్షి, ఒంగోలు: మున్సిపల్ ఎన్నికల్లో ‘ఫ్యాన్’ గాలి బలంగా వీచినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో అద్దంకి, చీరాల, మార్కాపురం, కనిగిరి, చీమకుర్తి, గిద్దలూరు మున్సిపాలిటీల్లో ఆదివారం జరిగిన ఓటింగ్ సరళి ప్రకారం కచ్చితంగా ఆరు మున్సిపాలిటీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని వారు ఘంటాపథంగా చెబుతున్నారు. మున్సిపల్ ఫలితాలపై ఆది నుంచి లెక్కలేస్తున్న అంచనాలే నిజమవుతాయని భావిస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్పక్షాలకు ఈ ఎన్నికల ఫలితాలు గట్టి షాక్నివ్వనున్నట్లు మెజార్టీ అభిప్రాయం వెల్లడవుతోంది. అధికారికంగా నమోదైన పోలింగ్ శాతాల వివరాల్ని పరిశీలిస్తే.. విశ్లేషకుల అభిప్రాయాలకు మరింత బలం చేకూరుతోంది. జిల్లా ఎన్నికల చరిత్రలో నమోదుకాని అత్యధిక పోలింగ్ శాతం ఈ మున్సిపల్ ఎన్నికల్లో కనిపించడాన్ని ఒక ‘ప్రత్యేక’ పరిస్థితిగా అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ప్రస్తుతం చీమకుర్తి మున్సిపాలిటీలో అత్యధికంగా 85.98 శాతం పోలింగ్ నమోదైంది. అద్దంకి నగర పంచాయతీలో కూడా 85.55 శాతానికి మించి పోలింగ్ జరగడం విశేషం. విజయానికి కీలకంగా మహిళా ఓటింగ్.. జిల్లావ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ముందు మున్సిపల్ పోరుపై ప్రారంభం నుంచే తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. అభ్యర్థుల ఖరారు నుంచి నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్ రోజు వరకు జిల్లావ్యాప్తంగా ఇదే చర్చ జరిగింది. ఈక్రమంలో పోలింగ్ ప్రారంభం నుంచే ఓటర్ల క్యూలు బారులు తీరడం, అందులోనూ మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్‌కు హాజరవడం విశ్లేషకుల్ని ఆశ్చర్యపరిచింది. ఆరు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 2,12,179 ఓట్లకు గాను 1,70,066 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మహిళా ఓటింగ్ 91,486 పోలయ్యింది. అంటే 84.39 శాతం మహిళా ఓటింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మహిళలు, వృద్ధులు తమ ఓటును వినియోగించుకునేందుకు ఆసక్తి కనబర్చడమనేది వైఎస్సార్ సీపీకి అనుకూల వాతావరణానికి చిహ్నంగా చెప్పుకోవచ్చనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. చీరాలతో పాటు కనిగిరి, గిద్దలూరులో కూడా మహిళా ఓటింగ్ శాతం అత్యధికంగా నమోదుకావడం విశేషం. జిల్లాలో ఎన్నికల ప్రచారం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పర్యటనతో పట్టణ జనంలో మరింత ఉత్సాహం పెరిగింది. రాష్ట్రవిభజనపై కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు సంబంధించి షర్మిల ప్రసంగాలు యావత్ మహిళా లోకాన్ని కదిలించింది. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన మేలు, పథకాల గురించి షర్మిల గుర్తుచేసిన విషయాలను ఓటర్లు అర్థం చేసుకున్నారు. ఆ ప్రభావమే మున్సిపల్ ఎన్నికల్లో తీవ్రంగా పనిచేసిందని పలువురు విపక్షాల నేతలే చెబుతున్నారు. స్లమ్కాలనీల్లో సాలిడ్ ఓటింగ్.. రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ‘ప్రత్యేక’ పరిస్థితులు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ప్రభావితం చేశాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హఠాన్మరణం, అనంతరం ప్రభుత్వ పాలనలో మారిన మార్పులు, వైఎస్సార్ కుటుంబంపై ఆరోపణలు, ఒత్తిళ్లు, రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చడం.. టీడీపీ, కాంగ్రెస్ మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడి వ్యూహాత్మక రాజకీయాలు నడిపించడంపై ఆయా వర్గాలు తల్లడిల్లిపోయాయి. వారంతా తమ అభిప్రాయాన్ని ఓటురూపంలో చూపేందుకు సిద్ధపడ్డారు. ఆమేరకు పోలింగ్ రోజున ఉదయాన్నే బూత్‌ల వద్ద పెద్దఎత్తున బారులు తీరి స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్నడూ లేనంతగా అద్దంకి, చీమకుర్తి శివారుకాలనీల బడుగు, బలహీనవర్గాల ఓటర్లు పోలింగ్ బూత్లకొచ్చి ఓట్లేయడం గమనార్హం. ఆయా పట్టణాల అగ్రవర్ణాల పోలింగ్‌బూత్‌లతో పోల్చితే, దళిత, బీసీ కాలనీల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బూత్‌లలో అత్యధిక పోలింగ్ శాతం నమోదవడాన్ని గమనించాల్సి ఉంది. ఆయాచోట్ల అగ్రవర్ణాల పోలింగ్ 76 నుంచి 78 శాతం వరకు నమోదైతే, ఇతర సామాజికవర్గాల బూత్‌లలో 85 శాతానికి మించి పోలింగ్ నమోదవడం గమనార్హం. ఇదే అంశాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిసింది. ఎక్కువశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపునే మొగ్గుచూపి ఓట్లేసినట్లు వివిధ నిఘా సంస్థల సర్వేల్లో కూడా వెల్లడైన అంశం. కుమ్మక్కై కుదేలైన టీడీపీ, కాంగ్రెస్‌లు.. అన్నిచోట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను నియంత్రించేం దుకు టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కు కుట్రను అమలుచేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే కొన్నిచోట్ల కాంగ్రెస్ నేతలు టీడీపీల అభ్యర్థులకు పరోక్ష సహకారాన్నందించారు. అదే ప్రచారం చివరి రోజుల్లో నేరుగా కొన్నిచోట్ల ప్రత్యక్షంగానే టీడీపీకి ఓట్లేయాలని కాంగ్రెస్ నేతలు ఓటర్లకు చెప్పడం తెలిసిందే. ఏది ఏమైనా ఆ రెండు పార్టీల కుమ్మక్కు కుట్ర పోలింగ్ రోజున దారుణంగా భగ్నమైంది. చీరాలలో 79.54 శాతం పోలింగ్ నమోదుకాగా, మార్కాపురంలో 73.79 శాతం, అద్దంకిలో 85.55 శాతం, చీమకుర్తి మున్సిపాలిటీ పరిధిలో 85.98 శాతం, గిద్దలూరులో 78.38 శాతం, కనిగిరి మున్సిపాలిటీలో 84.50 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తానికి ప్రజల్లో దివంగత వైఎస్సార్‌పై.. ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డిపై గూడుకట్టుకున్న అభిమానాన్ని ఓటు రూపంలో నిరూపించుకున్నారు. ఇదే ప్రభావం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.