సాక్షి, తొర్రూరు రూరల్(స్టోరీ): ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అభ్యర్థులు నిత్యం ఫోన్లు చేస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. దీంతో చాలామందికి క్షణం తీరిక ఉండటం లేదు. నాయకులు, అధికారులౖకైతే ఊపిరి పీల్చుకోలేనంత ఇబ్బందిగా మారింది. సెల్‌ఫోన్లలో మాట్లాడటం నిత్యకృత్యంగా మారింది. తాజా సమాచారం తెలుసుకునేందుకు సామాజిక మాధ్యమాలు తీరిక లేకుండా గమనిస్తున్నారు.
అధికారులేమో ఆ సమాచారం ఈ సమాచారం అంటూ జిల్లా కేంద్రం నుంచి డివిజన్, మండల స్థాయి వరకు దాదాపు గంటకు ఇరవైకి తగ్గకుండా కాల్స్ చేస్తున్నారు. అన్ని వివరాలు సెల్‌ఫోన్ ద్వారానే చెప్పాలంటే మధ్యాహ్నానికే ఛార్జింగ్ అయిపోతుందని నాయకులు వాపోతున్నారు. ఛార్జింగ్ లేకపోవడంతో సమాచార సేకరణ ఇబ్బందిగా మారుతుందని అటు నాయకులు, ఇటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది అధికారులను నీరసంగా కనిపిస్తున్నారని అడిగితే ‘ రాత్రంతా కార్యాలయంలోనే ఉన్నాం..పెట్రోలింగ్ తిరుగుతున్నాం’ అని సమాధానం చెప్తున్నారు. రాత్రింబవళ్లు తీరిక లేకుండా కాల్స్ రావడంతో నరాలు లాగేస్తున్నాయి అంటూ తమ పని ఒత్తిడిని వ్యక్తపరుస్తున్నారు. ఇదండీ సంగతి.
Comments
Please login to add a commentAdd a comment