ప్రతీకాత్మక చిత్రం
తాండూరు: నమ్మిన పార్టీ కోసం పనిచేసే నాయకులు నేటి రాజకీయాలలో తక్కువగా కనిపిస్తారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే రోజులు పోయాయి. నియోజకవర్గంలో 5 ఏళ్లలో పార్టీలు మారిన నేతలే అధికంగా కనిపిస్తున్నారు. పార్టీ గెలుపునకు కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నాయకులు నేటి రాజకీయాలలో కనిపిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.తాజాగా తాండూరు రాజకీయాలలో పార్టీలు మారుతున్న నాయకులు పొలిటికల్ ట్రెండ్ కొనసాగుతుందనడం గమనార్హం.
కండువాలు మార్చిన నాయకులు...
తాండూరు రాజకీయాలలో 5ఏళ్లుగా వివిధ పార్టీల నాయకులు జెండాలు మార్చుతున్నారు. అందులో 2014ఎన్నికల సమయంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర రవాణశాఖ మంత్రిగా కొనసాగారు. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన దివంగత మంత్రి చందుమహరాజ్ తనయుడు నరేష్ మహరాజ్ 2014సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ కండువా కప్పుకొని తాండూరు అ సెంబ్లీ బరిలో నిలిచారు. ఎన్నికలు పూర్తయిన ఏడాది తర్వాత తిరిగి నరేష్ మహరాజ్ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం యు.రమేష్‌కుమార్ 4ఏళ్ల కిందట బీజేపీలో చేరి పార్టీని సంస్థాగతంగా పటిష్ట పరిచారు.
ముందస్తు ఎన్నికల్లో జంపింగ్‌ల పర్వం...
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసి ముంద స్తు ఎన్నికలకు వెళ్లడంతో రాజకీయ పార్టీలలో జం పింగ్‌ల పర్వం మొదలయింది. ఈ సారి ఏకంగా నియోజకవర్గ నాయకులు సైతం పార్టీలను మారా రు. బీజేపీ నుంచి తాండూరు అసెంబ్లీ స్థానాన్ని ఆ శించిన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమే ష్‌కుమార్ టికెట్ రాలేదనే కారణంతో టీఆర్‌ఎస్‌లో చేరారు. రమేష్‌కుమార్‌తో పాటు బీజేపీ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కీలక పదవులు కలిగిన 30మంది నాయకులు రమేష్‌తో పాటు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి సందల్‌రాజుగౌడ్ టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నారు.
మాజీ ఎమెల్యే చూపు టీఆర్‌ఎస్ వైపు..
తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు చూపు టీఆర్‌ఎస్‌పై పడింది. టీఆర్‌ఎస్‌లో చేరితే పార్టీలో కీలక భాద్యతలను కట్టబెట్టేందుకు సీఎం కేసీఆర్ హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాండూరులో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తే నారాయణరావుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలలో చర్చసాగుతోంది. ఎన్నికల తర్వాత మారాలా.. లేకా ఎన్నికల ముందే మారా లా అనే విషయమై తేల్చుకోలేక పోతున్నారు.
కాంగ్రెస్‌లో చేరిన పైలెట్...
తాండూరు నియోజకవర్గంలో హట్ టాపిక్‌గా మారిన పైలెట్ రోహిత్‌రెడ్డి దశాబ్ద కాలంగా టీఆర్‌ఎస్‌లో కొనసాగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాండూరు టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రçభుత్వం ఏర్పడ్డాకా పైలెట్ రోహిత్‌రెడ్డిని టీఆర్‌ఎస్ నుంచి బహిష్కరించారు. నాటి నుంచి యంగ్ లీడర్స్ సంస్థ తరపున తాండూరు ప్రాంతంలో బలం పెంచుకున్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రోహిత్‌రెడ్డి తాండూరు అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు.
ట్రెండ్ పేరుతో..
రాజకీయాల్లోనూ ట్రెండ్ కొనసాగుతుంది. ఒకే పార్టీలో ఉంటే విలువ ఉండదని అందుకే పార్టీలు మారుతున్నామని నాయకులు అంటున్నారు. 4దశాబ్దాల కిందట పార్టీ కోసమే నాయకులు కార్యకర్తలు పనిచేశారు. తర్వాత రోజుల్లో నాయకుల కోసం పని చేశారు. ప్రస్తుతం పార్టీ గుర్తించలేదనే కారణంతో పార్టీలను వీడుతున్నారు. అయితే రాజకీయాలలో నేతలు విలువల కోసం పని చేయడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment