
పాలన్‌పూర్/దేహ్‌గాం: గుజరాత్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు.. రాబోయే 25 ఏళ్లపాటు రాష్ట్ర భవిష్యత్తును తేల్చే ఎన్నికలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన గురువారం బనస్కాంతా జిల్లా పాలన్‌పూర్‌లో, గాంధీనగర్ జిల్లా దేహ్‌గాంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. గుజరాత్‌లో బలమైన ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరారు.
గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం పర్యావరణం, పర్యాటకం, పరిశుభ్రమైన తాగునీరు, సాగునీరు, పశువుల పెంపకం, ప్రజలకు పౌష్టికాహారం వంటివాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ఉద్ఘాటించారు. తాగునీటి కొరత, విద్యుత్ కొరత వంటి సమస్యలను అతి తక్కువ సమయంలోనే పరిష్కరించిందన్నారు. గుజరాత్‌లో బీజేపీ సర్కారు విద్యారంగాన్ని సమూలంగా మార్చివేసిందని చెప్పారు. మరింత శాస్త్రీయంగా, ఆధునికంగా తీర్చిదిద్దిందని ప్రశంసించారు. రాష్ట్రంలో విద్యారంగం బడ్జెట్ ఏకంగా రూ.33,000 కోట్లకు చేరిందని, పలు రాష్ట్రాల మొత్తం విద్యారంగం బడ్జెట్ కంటే ఇది అధికమని చెప్పారు.
డ్రోన్ కలకలం
అహ్మదాబాద్ జిల్లా బావ్లా గ్రామంలో మోదీ సభకు ముందు వేదిక వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టడం అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. డ్రోన్ ద్వారా జనసందోహాన్ని చిత్రీకరించే ప్రయత్నించడంతో స్థానికులు ముగ్గురి అరెస్టు చేíశారు.
విద్యుత్‌తో ఆదాయం పొందాలి
విద్యుత్ ద్వారా ఆదాయాన్ని పొందే రోజులు వచ్చాయని, ఉచితంగా తీసుకునే రోజులివి కావని ప్రధాని వ్యాఖ్యానించారు. అరావళి జిల్లా మోదాసాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీని ఆప్, కాంగ్రెస్ ఇచ్చాయి. ఈ హామీ విపరీతంగా ఆకర్షించడంతో దానిని కౌంటర్ చేయడానికి ప్రధాని ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment