Bhupendra Patel
-
‘రామాలయం’ సమీపాన ఆ రాష్ట్ర భవనం!
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైన దరిమిలా దేశ, ప్రపంచ మ్యాప్‌లో ఈ నగరానికి ప్రాధాన్యత మరింతగా పెరిగింది. లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి దేశంలోని నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు వస్తున్నారు. దేశంలోని ప్రముఖ రాష్ట్రాల్లో ఒకటైన గుజరాత్ తమ రాష్ట్రంలోని భక్తులకు అయోధ్యలో సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమయ్యింది. అయోధ్యలో గుజరాత్ భవన్ నిర్మించేందుకు గుజరాత్ ప్రభుత్వం అయోధ్యలో భూమిని కొనుగోలు చేసింది. సమీప భవిష్యత్తులో భవన నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి. గుజరాత్ ప్రజలు పెద్ద సంఖ్యలో తీర్థయాత్రలకు తరలి వెళుతుంటారు. ఈ నేపధ్యంలో అయోధ్యలోని రామాలయాన్ని చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అటువంటి పరిస్థితిలో తమ రాష్ట్ర పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని, గుజరాత్ ప్రభుత్వం అయోధ్యలో గుజరాత్ భవన్ నిర్మించడానికి భూమిని కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హృషికేశ్ పటేల్ మాట్లాడుతూ.. అయోధ్యలో రామభక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసిందని, గుజరాతీలకు చక్కని సౌకర్యాలు అందించేలా సమీప భవిష్యత్తులో అత్యుత్తమ భవనాన్ని నిర్మిస్తామన్నారు. కాగా ముంబై, ఢిల్లీ, కోల్‌కతాతో సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ‘గుజరాత్ భవన్’లను నిర్మించారు. వీటిలో గుజరాతీ ప్రజలకు రాయితీ ధరలకు వసతి సౌకర్యాలు అందిస్తుంటారు. -
గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు
గుజరాత్‌కు చెందిన ప్రముఖ గర్బా నృత్యాన్ని యునెస్కో ‘ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’ (ఐసీహెచ్)జాబితాలో చేర్చిందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో నిర్వహించే గర్బాను ఈ జాబితాలో చేర్చాలంటూ భారతదేశం నామినేట్ చేసింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పటేల్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘అమ్మవారి ఎదుట భక్తిని చాటే ఈ గర్భా నృత్యం ఒక పురాతన సంప్రదాయం. ఇది సజీవంగా వర్ధిల్లుతోంది. గుజరాత్‌కు గుర్తింపుగా నిలిచిన గర్బాను యునెస్కో తన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్‌లో చేర్చింది. ఈ గుర్తింపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుజరాతీలకు గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశ వారసత్వ సంపదకు ప్రాముఖ్యతనిస్తూ, ప్రపంచవ్యాప్తంగా వీటికి గుర్తింపును తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నానికి ఫలితం దక్కింది. గుజరాత్ ప్రజలకు అభినందనలు’ అని పేర్కొన్నారు. గర్బా అనేది ఒక నృత్య రూపకంగా ప్రాచుర్యం పొంది, సంప్రదాయాన్ని కలబోస్తూ, అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేసేదిగా నిలుస్తున్నదని యునెస్కో పేర్కొంది. ఇది కూడా చదవండి: ఆ మూడు రాష్ట్రాల్లో సీఎం లేదా డిప్యూటీ సీఎంలుగా మహిళలు? -
మన పెళ్లికి మా ఇంట్లో వారు ఒప్పుకున్నారు!
మన పెళ్లికి మా ఇంట్లో వారు ఒప్పుకున్నారు! -
ప్రేమ పెళ్లిళ్లకు పెద్దల అనుమతి తప్పనిసరి చేస్తే?
గాంధీనగర్: ప్రేమ వివాహాలపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండేలా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు వ్యాఖ్యానించారాయన. ప్రేమ వివాహాల విషయంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉంటే ఎలా ఉంటుంది?. ఈ విషయంపై మా ప్రభుత్వం అధ్యయనం జరపాలనుకుంటోంది. అది రాజ్యాంగబద్ధంగా సాధ్యమవుతుందా? అనే కోణంలో పరిశీలించాకే ముందుకెళ్లాలనుకుంటున్నాం అని వ్యాఖ్యానించారాయన. పటీదార్ లాంటి కమ్యూనిటీల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇలాంటి డిమాండ్లు వినిపిస్తున్నాయని ఆదివారం మెహసనాలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారాయన. ఆరోగ్య శాఖ మంత్రి రుషికేష్ పటేల్ ఈ విషయంలో సలహా ఇచ్చారు. ఇంట్లోంచి పారిపోయి పెళ్లిళ్లు చేసుకున్న ఘటనలపై అధ్యయనం చేపట్టాలని కోరారు. వాటి ఆధారంగా ఇక నుంచి ప్రేమ వివాహాలకు పెద్దల అంగీకారం ఉండేలా విధివిధానాలు రూపకల్పన చేయాలని సూచించారు అని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు. రాజ్యాంగం గనుక అందుకు అనుమతిస్తే.. అధ్యయనం కొనసాగించి మంచి ఫలితం సాధిస్తాం అని తెలిపారాయన. ఈ విషయంలో ఓ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే సైతం అలాంటి చట్టమేదైనా తెస్తే.. తాను ప్రభుత్వానికి మద్దతు ఇస్తానంటూ తనతో అన్నారాని సీఎం భూపేంద్ర వ్యాఖ్యానించారు. ఆయన పేరు ఇమ్రాన్ ఖేదావాలా. ‘‘ప్రమే వివాహాల విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉన్నా.. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచన చేయాలని కోరుతున్నా. ఒకవేళ అసెంబ్లీలో చట్టం లాంటిది తెస్తే.. దానికి నా మద్దతు ఉంటుంది’’ అని ప్రకటించారాయన. ఇదిలా ఉంటే.. గుజరాత్ ఫ్రీడమ్ ఆఫ్ రెలిజియన్ యాక్ట్ 2021(సవరణ) ప్రకారం వివాహం వంకతో బలవంతంగా మతం మార్చడం లాంటివి చేస్తే కఠిన శిక్షలు ఉంటాయి. దోషిగా తేలితే పదేళ్ల దాకా శిక్ష పడుతుంది. అయితే గుజరాత్ హైకోర్టు ఈ చట్టంపై స్టే విధించగా.. ప్రస్తుతం ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. -
Gujarat: సీఎం ప్రసంగిస్తుండగా కునుకు తీశాడు.. సస్పెండ్ చేశారు
గాంధీనగర్: స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొని, ప్రసంగిస్తున్న సభలో కునుకు తీశాడు ఆ అధికారి. అయితే మామూలుగా అయితే విషయం ఎవరూ పట్టించుకునేవాళ్లు కారేమో. పాపం.. కెమెరా కళ్లన్నీ ఆయన మీదే పడ్డాయి. లోకల్ మీడియాలో పదే పదే ఆ దృశ్యాలు టెలికాస్ట్ అయ్యాయి. ఫలితంగా.. ఆయనపై కమిట్మెంట్ను ప్రశ్నిస్తూ సస్పెన్షన్ వేటు వేసింది అక్కడి ప్రభుత్వం. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్ భూపేంద్ర పటేల్ పాల్గొన్న కార్యక్రమంలో కునుకు తీశారన్న కారణంగా ఓ అధికారి సస్పెన్షన్‌కు గురయ్యారు. శనివారం భుజ్‌లో ఈ ఘటన జరిగింది. ఆ అధికారిని భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్‌గా గుర్తించారు. కచ్ జిల్లాలో.. 2001 నాటి గుజరాత్ భూకంప బాధితులకు పునరావాసంలో భాగంగా 14 వేల ఇళ్ల పట్టాలను సీఎం భూపేంద్ర పటేల్ అందించారు. అయితే.. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా.. ముందు వరుసల్లో కూర్చున్న జిగర్ పటేల్ కునుకు తీస్తూ కెమెరాలకు చిక్కారు. ఆ వీడియో విపరీతంగా మీడియా, సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యింది. దీంతో గంటల వ్యవధిలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ. విధి పట్ల నిబద్ధతా లోపం, పైగా ఆయన ప్రవర్తన నిర్లక్ష్యపూరితంగా ఉందన్న విషయం.. వీడియోల ఆధారంగా ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. అందుకే గుజరాత్ సివిల్ సర్వీస్ రూల్స్ 1971, రూల్ 5(1)(a) ప్రకారం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకొంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ మనీష్ షా. మరోవైపు వేటుపై ఆ అధికారి స్పందన కోసం మీడియా యత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. Kutch News: ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલને સસ્પેન્ડ કરાયા, CMના કાર્યક્રમમાં ઉંઘતા હોવાથી કરાયા સસ્પેન્ડ #gujarat #kutch #bhuj #vtvgujarati pic.twitter.com/2nnJIv12no — VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 30, 2023 Video Credits: VtvGujarati ఇదీ చదవండి: అవును, శివుని కంఠంపై సర్పాన్ని: మోదీ -
అహ్మదాబాద్ లో కైట్ ఫెస్టివల్
-
గుజరాత్ సీఎంగా భూపేంద్ర ప్రమాణం.. మోదీ సహా కీలక నేతల హాజరు
అహ్మదాబాద్: గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత భూపేంద్ర పటేల్(60).. నేడు(సోమవారం) ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని కొత్త సెక్రటేరియట్ సమీపంలో ఉన్న హెలిప్యాడ్ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గుజరాత్ 18వ సీఎంగా భూపేంద్రతో ప్రమాణం చేయించారు. సీఎంతోపాటు బీజేపీ నేతలు హర్ష సంఘవి, జగదీష్ విశ్వకర్మ గుజరాత్ కేబినేట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అదే సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి 200 మంది సాధువులకు ప్రత్యేక ఆహ్వానం అందించడం గమనార్హం. BJP leaders Harsh Sanghavi and Jagdish Vishwakarma take oath as ministers in the Gujarat cabinet. pic.twitter.com/IYzM8sHPWy — ANI (@ANI) December 12, 2022 ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 182 సీట్లకు గాను 156 స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేనంతగా 53 శాతం ఓటు బ్యాంక్ సాధించింది ఆ పార్టీ. కాగా కిందటి ఏడాది సెప్టెంబర్‌లో విజయ్ రూపానీని తప్పించి.. భూపేంద్రను సీఎంగా ఎపింక చేసింది గుజరాత్ బీజేపీ. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఘన విజయం సాధించారాయన. ఈ తరుణంలో.. నేడు వరుసగా రెండోసారి సోమవారం ప్రమాణం చేశారు. -
Gujarat Election 2022: రేపే భూపేంద్రకు పట్టం
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ (60) వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. శనివారం జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా ఆయన్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం ‘కమలం’లో జరిగిన ఈ భేటీకి పార్టీ కేంద్ర పరిశీలకులుగా సీనియర్ నేతలు రాజ్‌నాథ్‌సింగ్, యడ్యూరప్ప, అర్జున్ ముండా హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 2021లో విజయ్ రూపానీ స్థానంలో సీఎంగా భూపేంద్ర పగ్గాలు చేపట్టారు. గురువారం వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 182 స్థానాలకు గాను ఏకంగా 156 సీట్లను కొల్లగొట్టి బీజేపీ రికార్డు విజయం సొంతం చేసుకోవడం తెలిసిందే. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా మంత్రివర్గంతో పాటుగా భూపేంద్ర శుక్రవారం రాజీనామా చేశారు. శనివారం ఎల్పీ నేతగా ఎన్నికయ్యాక గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. సోమవారం ఆయన రాష్ట్ర 18వ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గాందీనగర్‌లోని హెలిప్యాడ్ మైదానంలో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. ఇదీ చదవండి: హిమాచల్ సీఎంగా సుఖు -
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రాజీనామా.. 12న ప్రమాణ స్వీకారం
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ అఖండ విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆయన మంత్రివర్గం శుక్రవారం రాజీనామా చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు చేరుకుని రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు రాజీనామా పత్రాలను సమరించారు. సీఎం భూపేంద్ర పటేల్‌తో పాటు గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్, పార్టీ చీఫ్ విప్ పంకజ్ దేశాయ్‌లు హాజరయ్యారు. గురువారం వెలువడిన ఫలితాల్లో 182 స్థానాలకు గానూ బీజేపీ 156 సీట్లు గెలుపొంది రికార్డులు తిరగరాసింది. భూపేందర్ పటేల్ మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపడతారని ఎన్నికలకు ముందే ప్రకటించింది బీజేపీ. ఫలితాలు వెలువడిన క్రమంలో గురువారం బీజేపీ రాష్ట్ర చీఫ్ సైతం అదే విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో ఫార్మాలిటీ కోసం రాజీనామాలు చేశారు. మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆయన మంత్రివర్గం రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు పటేల్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. గాంధీనగర్‌లోని కమలం పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. మధ్యాహ్నానికి పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నికపై గవర్నర్‌కు తెలియజేస్తాం. గవర్నర్ సూచనల మేరకు సీఎం, కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది.’ అని తెలిపారు పార్టీ చీఫ్ విఫ్ పంకజ్ దేశాయ్. మరోవైపు.. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం గాంధీనగర్‌లోని హెలిపాడ్ గ్రౌండ్లో సోమవారం ఉంటుందని పార్టీ చీఫ్ సీఆర్ పాటిల్ ప్రకటించారు. సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు హాజరవుతారని చెప్పారు. ఇదీ చదవండి: Gujrat Polls 2022: మున్సిపాలిటీ సభ్యుడి నుంచి సీఎం స్థాయికిపాలిటీ సభ్యుడి నుంచి సీఎంగా -
Gujrat Polls 2022: మున్సిపాలిటీ సభ్యుడి నుంచి సీఎం స్థాయికి
అహ్మదాబాద్: పార్టీ పట్ల అంకితభావం, కష్టించే తత్వం భూపేంద్ర పటేల్‌ను మున్సిపాలిటీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేర్చాయి. గుజరాత్ శానససభ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించడంతో ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భూపేంద్ర పటేల్ ఈ నెల 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ ప్రకటించారు. గుజరాత్లో ఎన్నికలకు సరిగ్గా ఏడాది క్రితం ముఖ్యమంత్రిని మార్చాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. విజయ్ రూపానీ స్థానంలో పటేల్ సామాజిక వర్గానికి చెందిన భూపేంద్ర వైపు మొగ్గుచూపింది. అధిష్టానం అంచనాలకు తగ్గట్టే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథం వైపు నడిపించారు. 2017లో రికార్డు స్థాయి మెజార్టీ భూపేంద్రబాయ్ పటేల్ అలియాస్ భూపేంద్ర పటేల్ 1962 జూలై 15న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జlచారు. 1982 ఏప్రిల్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో చేరారు. తొలుత అహ్మదాబాద్ జిల్లాలోని మేమ్‌నగర్ మున్సిపాలిటీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించారు. రెండు సార్లు అదే మున్సిపాలిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2010 నుంచి 2015 దాకా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2015 నుంచి 2017 వరకు అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ(ఏయూడీఏ) చైర్మన్‌గా సేవలందించారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాంధీదీనగర్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఘట్లోడియా శాసనసభ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. చదవండి: గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రాజీనామా.. 12న ప్రమాణ స్వీకారం ఏకంగా 1.17 లక్షల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్‌పై ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం విశేషం. 2021 సెప్టెంబర్ 13న గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా జరిగిన(2022) అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్లోడియా స్థానం నుంచి 1.92 లక్షల మెజార్టీతో నెగ్గడం గమనార్హం. -
Gujarat Assembly Election 2022:: 38 మంది సిట్టింగ్‌లకు బీజేపీ మొండిచెయ్యి
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ 160 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. ఏకంగా 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి మొండిచెయ్యి చూపడం గమనార్హం. వీరిలో ఐదుగురు మంత్రులు సైతం ఉన్నారు. తీగల వంతెన దుర్ఘటన జరిగిన మోర్బీ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి బ్రిజేశ్ మెర్జాకు టికెట్ నిరాకరించారు. మరో నలుగురు మంత్రులు.. రాజేంద్ర త్రివేది, ప్రదీప్ పర్మార్, అరవింద్ రైయానీ, ఆర్.సి.మక్వానాకు తొలి జాబితాలో స్థానం దక్కలేదు. శాసనసభ స్పీకర్ నీమాబెన్ ఆచార్యకు కూడా నిరాశే ఎదురయ్యింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన సొంత నియోజకవర్గం ఘాట్లోడియా నుంచి మరోసారి బరిలోకి దిగబోతున్నారు. పాటిదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా బీజేపీ తొలి జాబితాలో స్థానం దక్కించుకున్నారు. విరామ్‌గామ్ స్థానం నుంచి హార్దిక్ పటేల్, జామ్‌నగర్ నార్త్ స్థానం నుంచి రివాబా జడేజా అధికార పార్టీ టికెట్లపై వారు పోటీ చేయబోతున్నారు. 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. వారి అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తొలి జాబితాలో 69 మంది సిట్టింగ్‌లు గుజరాత్లో తొలి దశలో డిసెంబర్ 1న 89 స్థానాలకు, రెండో దశలో 5న 93 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగున్నాయి. తొలి దశ ఎన్నికలకుగాను 84 స్థానాల్లో, రెండో దశ ఎన్నికలకు గాను 76 స్థానాల్లో తమ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అభ్యర్థుల పేర్లను బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ బుధవారం ఖరారు చేసింది. 160 మందిలో ఓబీసీలు 49 మంది, పటేళ్లు 40 మంది, క్షత్రియులు 19, బ్రాహ్మణులు 13 మంది ఉన్నారు. జైన వర్గానికి చెందిన మరో ఇద్దరు చోటు సంపాదించారు. తొలి జాబితాలోని మొత్తం అభ్యర్థుల్లో 35 మంది 50 ఏళ్లలోపువారే కావడం విశేషం. తొలి జాబితాలో 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి పోటీచేసే అవకాశం కల్పిస్తున్నామని, వీరిలో 14 మంది మహిళలు, 13 మంది ఎస్సీలు, 24 మంది ఎస్టీలు ఉన్నారని భూపేంద్ర యాదవ్ తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌తోపాటు మరికొందరు సీనియర్ నాయకులు ఈ ఎన్నికల్లో పోటీపడొద్దని నిర్ణయించుకున్నారని, ఈ విషయాన్ని పార్టీకి లిఖితపూర్వకంగా తెలియజేశారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మరోసారి విజయం సాధించబోతున్నామని, గత రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ 1995 నుంచి మధ్యలో రెండేళ్లు మినహా అవిచ్ఛిన్నంగా అధికారంలో కొనసాగుతోంది. -
శాసనసభ ఎన్నికల వేళ గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం
అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యునిఫామ్ సివిల్ కోడ్ -యూసీసీ)ని అమలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. శనివారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యూసీసీ ప్యానల్లో సభ్యుల వివరాలను గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘవి వెల్లడించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. కేబినెట్ సమావేశం అనంతరం ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. ‘కేబినెట్ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని పరిశీలించేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని యూసీసీపై ముసాయిదాను సిద్ధం చేస్తుంది’ అని భూపేంద్ర పటేల్ తెలిపారు. గత మే నెలలో యూసీసీని తమ రాష్ట్రంలో అమలు చేస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భాజపా ఈ హామీని ప్రకటించింది. అన్నట్లుగానే పుష్కర్ సింగ్ ధామీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే యూసీసీని అమలు చేసేందుకు నిపుణులతో కూడిన హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. అదే నెలలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సైతం యూసీసీ అమలు చేస్తామని వెల్లడించారు. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడ సైతం ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: 7 నెలలగా అచేతన స్థితిలో గర్భిణీ.. పండండి ఆడబిడ్డకు జన్మ -
National Games 2022: సర్వీసెస్‌కు అగ్రస్థానం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో మళ్లీ సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) జట్టే సత్తా చాటుకుంది. ‘సెంచరీ’ని మించిన పతకాలతో ‘టాప్’ లేపింది. సర్వీసెస్ క్రీడాకారులు మొత్తం 128 పతకాలతో అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో 61 స్వర్ణాలు, 35 రజతాలు, 32 కాంస్యాలున్నాయి. అట్టహాసంగా ఆరంభమైన 36వ జాతీయ క్రీడలకు బుధవారం తెరపడింది. 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 8000 పైచిలుకు అథ్లెట్లు ఈ పోటీల్లో సందడి చేశారు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 38, అక్వాటిక్స్లో 36 జాతీయ క్రీడల రికార్డులు నమోదయ్యాయి. ఆఖరి రోజు వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. తదుపరి జాతీయ క్రీడలకు వచ్చే ఏడాది గోవా ఆతిథ్యమిస్తుంది. ► వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ జాతీయ క్రీడలు గోవాలో జరగాలి. కానీ అనూహ్యంగా గుజరాత్‌కు కేటాయించగా... నిర్వాహకులు వంద రోజుల్లోపే వేదికల్ని సిద్ధం చేయడం విశేషం. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఇండోర్ స్టేడియంలో ముగింపు వేడుకలు జరిగాయి. ► పురుషుల విభాగంలో ఎనిమిది పతకాలు సాధించిన కేరళ స్విమ్మర్ సజన్ ప్రకాశ్ (5 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారుడు’గా... మహిళల విభాగంలో ఏడు పతకాలు సాధించిన కర్ణాటకకు చెందిన 14 ఏళ్ల స్విమ్మర్ హషిక (6 స్వర్ణాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారిణి’గా పురస్కారాలు గెల్చుకున్నారు. గత జాతీయ క్రీడల్లోనూ (2015లో కేరళ) సజన్ ప్రకాశ్ ‘ఉత్తమ క్రీడాకారుడు’ అవార్డు అందుకోవడం విశేషం. ► చివరిరోజు తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ ‘పసిడి పంచ్’తో అలరించాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ సర్వీసెస్ తరఫున ఈ క్రీడల్లో పాల్గొన్నాడు. 57 కేజీల ఫైనల్లో హుసాముద్దీన్ 3–1తో సచిన్ సివాచ్ (హరియాణా)పై గెలిచాడు. ► ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఓవరాల్ చాంప్ సర్వీసెస్‌కు ‘రాజా భళీంద్ర సింగ్’ ట్రోఫీని అందజేశారు. సర్వీసెస్ నాలుగోసారి ఈ ట్రోఫీ చేజిక్కించుకుంది. 39 స్వర్ణాలు, 38 రజతాలు, 63 కాంస్యాలతో కలిపి మొత్తం 140 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచిన మహారాష్ట్రకు ‘బెస్ట్ స్టేట్’ ట్రోఫీ లభించింది. ఓవరాల్‌గా సర్వీసెస్‌కంటే మహా రాష్ట్ర ఎక్కువ పతకాలు సాధించినా స్వర్ణాల సంఖ్య ఆధారంగా సర్వీసెస్‌కు టాప్ ర్యాంక్ దక్కింది. ► తెలంగాణ 8 స్వర్ణాలు, 7 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలతో 15వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 2 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 21వ స్థానంలో నిలిచాయి. 2015 కేరళ జాతీయ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 33 పతకాలతో 12వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 6 స్వర్ణా లు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచాయి. హషికకు ట్రోఫీ ప్రదానం చేస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా -
అహ్మదాబాద్‌లో శ్రీవారి ఆలయానికి భూమి
సాక్షి, అమరావతి/తిరుమల: అహ్మదాబాద్‌లో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ నిర్మాణానికి అనువైన భూమి కేటాయిస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ పటేల్ హామీ ఇచ్చారు. పాలక మండలి సభ్యుడు కేతన్ దేశాయ్‌తో కలిసి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం అహ్మదాబాద్‌లో సీఎం పటేల్‌ని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీవారి ప్రసాదం అందించి, శాలువాతో సత్కరించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారానికి టీటీడీ చేపట్టిన కార్యక్రమాలను వైవీ సుబ్బారెడ్డి గుజరాత్ సీఎంకి వివరించారు. ఇందులో భాగంగా జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణం జరుగుతోందని, ఇటీవలే భువనేశ్వర్‌లోనూ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. త్వరలోనే ముంబైలోనూ స్వామివారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నామని చెప్పారు. గుజరాత్లో కూడా స్వామివారి ఆలయ నిర్మాణం నిమిత్తం టీటీడీకి ఉచితంగా భూమి కేటాయించాలని కోరారు. ఈ ప్రతిపాదనకు గుజరాత్ సీఎం సంతోషం వ్యక్తంచేసి అధికారులతో చర్చించి అవసరమైన భూమిని అనువైన ప్రదేశంలో టీటీడీకి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. -
అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్లో కీలక పరిణామం.. ఆ మంత్రులకు షాక్!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఆఖర్లో జరగనున్నాయి. ఈ తరుణంలో బీజేపీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇద్దరు కీలక కేబినెట్ మంత్రులకు కేటాయించిన శాఖలను తగ్గించారు. ఇద్దరు రాష్ట్ర మంత్రుల శాఖలను తగ్గిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి రాజేంద్ర త్రివేది పోర్టిఫోలియోల నుంచి కీలక శాఖ అయిన రెవెన్యూను, పూర్ణేశ్ మోదీ శాఖల్లోని కీలకమైన రోడ్డు, భవనాల శాఖను ముఖ్యమంత్రి తొలగించారు. కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అకస్మాత్తుగా ఇలా మంత్రివర్గంలో మార్పులు చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజేంద్ర త్రివేది, పుర్ణేశ్ మోదీల నుంచి తొలగించిన రెండు శాఖలను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పర్యవేక్షించనున్నారు. రాజేంద్ర త్రివేది వద్ద న్యాయ, విపత్తు నిర్వహణ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు ఉన్నాయి. మరోవైపు.. పూర్ణేశ్ మోదీ వద్ద రవాణా, పౌర విమానయాన, పర్యటకం, దేవాదాయ అభివృద్ధి శాఖలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. భూపేంద్ర పటేల్ ప్రభుత్వంలోని 10 కేబినెట్ ర్యాంక్ మంత్రుల్లో త్రివేది, మోదీలు ఉన్నారు. అయితే, రోడ్లు, భవనాల విభాగం, రెవెన్యూ విభాగల పనితీరు సరిగా లేదని సీఎంకు ప్రభుత్వ వర్గాలు సూచించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. హర్ష రమేశ్‌కుమార్ సంఘ్వీకి రెవెన్యూ శాఖ సహాయ మంత్రిగా, జగదీశ్ ఐశ్వర్ పంచల్‌కు రోడ్లు, భవనాల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు సీఎం భూపేంద్ర పటేల్. గత ఏడాది సెప్టెంబర్‌లో విజయ్ రూపానీ స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు భూపేంద్ర పటేల్. ఇప్పుడు సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగిన తాజా పరిణామం వెనుకున్న కారణం ఏంటన్నది మాత్రం తెలియరాలేదు. Gujarat | In state cabinet rejig before Assembly elections, Revenue ministry taken from Rajendra Trivedi while Road and Building Ministry take from Purnesh Modi, both the ministries will now be handled by CM Bhupendra Patel pic.twitter.com/2VavVSJQBI — ANI (@ANI) August 20, 2022 ఇదీ చదవండి: ‘ఈ జిమ్మిక్కులు ఏమిటి.. మోదీ జీ?’.. ట్రావెల్ బ్యాన్పై మనీశ్ సిసోడియా విమర్శలు -
ఏడేళ్ల తర్వాత క్రీడల పండుగ.. ఎక్కడంటే..?
దేశీయ అథ్లెట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రీడల పండుగకు మూహూర్తం ఖరారైంది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ క్రీడల నిర్వహణకు మోక్షం లభించింది. ఈ ఏడాది చివర్లో 36వ జాతీయ క్రీడలను నిర్వహించేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు గుజరాత్ వేదికగా జాతీయ క్రీడలు నిర్వహించనున్నట్లు ఐవోఏ ప్రకటించింది. ఈ విషయాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ట్విటర్ ద్వారా ధృవీకరించారు. దేశీయ క్రీడల పండుగ నిర్వహణకు అవకాశం కల్పించినందుకు ఐవోఏకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, నేషనల్ గేమ్స్ చివరిసారిగా 2015లో కేరళ వేదికగా జరిగాయి. ఆ తర్వాత పలు కారణాల వల్ల క్రీడా సంబురం వాయిదా పడుతూ వస్తుంది. 2020లో గోవా వేదికగా వీటిని నిర్వహించాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. చదవండి: Wimbledon 2022: ఎదురులేని జొకోవిచ్ -
విషాదం: డెంగ్యూతో బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి
గాంధీనగర్: గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఆశాబెన్ పటేల్ (44) కన్నుమూశారు. డెంగ్యూతో బాధపడుతున్న ఆమె అహ్మదాబాద్‌లోని జైడస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస వదిలారు. గతంలో ఆమె కోవిడ్ బారినపడినట్టు తెలిసింది. ఆమె మరణ వార్తను ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ వీఎన్ షా ధ్రువీకరించారు. 2015లో ఆశాబెన్ పాటిదార్ రిజర్వేషన్ల అంశంపై పోరాడిన కీలక వ్యక్తుల్లో ఒకరు. ఆమె హార్దిక్ పటేల్‌కు సన్నిహితురాలు కూడా. 2017లో ఉంఝా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఆమె విజయం సాధించారు. ఆరుసార్లు బీజేపీ తరపున ఆ స్థానం నుంచి గెలిచి సత్తా చాటిన మాజీ మంత్రి నారాయణ్ పటేల్‌ని ఆమె ఆ ఎన్నికల్లో మట్టి కరిపించారు. (చదవండి: Transgender VRO: ఒక్క ఫోన్ కాల్.. హిజ్రా ద్రాక్షాయణికి ఉద్యోగం) అయితే, పార్టీతో విభేదాలు రావడంతో 2019 ఆమె కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆశాబెన్ అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (చదవండి: పసికందును రైలులో వదిలేసి.. ప్రియుడితో కలిసి)