దేశీయ అథ్లెట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రీడల పండుగకు మూహూర్తం ఖరారైంది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ క్రీడల నిర్వహణకు మోక్షం లభించింది. ఈ ఏడాది చివర్లో 36వ జాతీయ క్రీడలను నిర్వహించేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు గుజరాత్ వేదికగా జాతీయ క్రీడలు నిర్వహించనున్నట్లు ఐవోఏ ప్రకటించింది.
ఈ విషయాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ట్విటర్ ద్వారా ధృవీకరించారు. దేశీయ క్రీడల పండుగ నిర్వహణకు అవకాశం కల్పించినందుకు ఐవోఏకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, నేషనల్ గేమ్స్ చివరిసారిగా 2015లో కేరళ వేదికగా జరిగాయి. ఆ తర్వాత పలు కారణాల వల్ల క్రీడా సంబురం వాయిదా పడుతూ వస్తుంది. 2020లో గోవా వేదికగా వీటిని నిర్వహించాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.
చదవండి: Wimbledon 2022: ఎదురులేని జొకోవిచ్
Comments
Please login to add a commentAdd a comment