బెంగళూరు: తర్జన భర్జనల అనంతరం కర్ణాటక సర్కారులో మంత్రులకు శాఖలను కేటాయించారు. సీఎం కుమారస్వామి ఆర్థిక శాఖను తనవద్దే ఉంచుకోగా.. డిప్యూటీ సీఎం పరమేశ్వర హోం బాధ్యతలు నిర్వహించనున్నారు. కుమారస్వామి సోదరుడు రేవణ్ణకు ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ), కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు భారీ, మధ్య నీటిపారుదల, వైద్య విద్య శాఖలను కేటాయించారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆర్వీ దేశ్‌పాండేకు రెవెన్యూ, కేజే జార్జ్‌కు భారీ, మధ్యతరహా పరిశ్రమలు అప్పగించారు. ఏకైక మహిళామంత్రి జయమాలకు మహిళా, శిశుసంక్షేమ శాఖ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కృష్ణ బైర గౌడకు గ్రామీణాభివృద్ధి, శివ శంకర రెడ్డికి వ్యవసాయం, ప్రియాంక్ ఖర్గేకు సాంఘిక సంక్షేమæ శాఖ బాధ్యతలను అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment