locked
-
Maha Kumbh : అయ్యో తల్లీ! పుణ్యానికి పోతూ ఇదేం పనిరా కొడకా!
మహాకుంభమేళా(Maha Kumbh Mela) పవిత్ర త్రివేణి సంగమంలో మూడు మునుగులు మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళా స్నానాన్ని రాజస్నానం (Holybath)గా పరిగణిస్తారు. ఇక్కడ స్నానం చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ, పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందనీ భక్తుల నమ్మకం. అందుకే ఎన్నికష్టాలకోర్చి అయినా కుంభమేళాలో స్నానం చేయడానికి వెళతారు. అంతేకాదు 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు వృద్ధులైన తల్లిదండ్రులను కూడా తోడ్కొని వెడతారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా ఇలాంటి దృశ్యాలెన్నింటినో మనం చూశాం కూడా. అయితే జార్ఖండ్‌లోని ఒక వ్యక్తి ఇందుకు భిన్నంగా, సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. 65 ఏళ్ల తల్లిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో వదిలి మహాకుంభమేళాకు వెళ్లాడు. దీంతో ఆకలి బాధకు తట్టుకోలేక, ఆ వృద్ధతల్లి నానా యాతన పడింది. మూడు రోజుల పాటు అటుకులను ఆహారంగా సేవించింది. ఆఖరికి అవి కూడా అయిపోవడంతో ప్లాస్టిక్‌ను తినేందుకు కూడా ప్రయత్నించింది. ఈ విషయం ఎలా బయటికి వచ్చింది.జన్మనిచ్చిన తల్లి, అనారోగ్యంతో బాధపడుతోందున్న కనికరం కూడా లేకుండా ఆమెను ఇంట్లో బంధించి భార్యా పిల్లలు, అత్తామామలను వెంటబెట్టుకొని మహా కుంభమేళాకు వెళ్లిపోయాడు. మూడు రోజులపాటు అటుకులతో కడుపు నింపుకుంది. ఉన్న కాసిన్ని అటుకులూ అయిపోవడంతో ఇక ఆకలి బాధకు తాళలేక ఆమె గట్టిగా కేకలు వేసింది. బిగ్గరగా రోదించడం మొదలు పెట్టింది. దీంతో ఇరుగుపొరుగు తక్షణమే స్పందించారు. చుట్టుపక్కల వారిచ్చిన సమాచారంతో పోలీసులొచ్చి తాళం పగులగొట్టి బాధితురాలిని బయటకు తెచ్చారు. ఆమెకు ఆహారం ఇచ్చి, సేద తీరిన తరువాత, చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి కుమార్తె చాందినీ దేవికి సమాచారం అందించారు.(వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!)బాధితురాలు రామ్‌గఢ్ జిల్లా కేంద్రానికి చెందిన 65 ఏళ్ల సంజూదేవి. ఆమె కుమారుడు అఖిలేశ్ కుమార్ ప్రజాపతి. సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL) ఉద్యోగి. అయితే తల్లికి ఇంట్లో భోజనం, తదితర ఏర్పాట్లన్నీ చేసే, తాము ప్రయాగ్ రాజ్ వెళ్లామని కుమారుడు అఖిలేశ్ వాదిస్తున్నాడు. అనారోగ్యంతో ఉందనే ఆమెను తమవెంట తీసుకెళ్లలేదని చెప్పాడు. మరోవైపు రామ్‌గఢ్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) పరమేశ్వర్ ప్రసాద్ తల్లిని సీసీఎల్ క్వార్టర్ లోపల బంధించాడని ధృవీకరించారు. ఇదీ చదవండి: నీతా అంబానీ లుక్: వందేళ్లకు పైగా చరిత్ర, తయారీకి రెండేళ్లుకాగా మహా కుంభమేళా 40వ రోజు, సంగమంలో భక్తులు స్నానాలు ఉత్సాహంగా అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు జైలులో ఉన్న ఖైదీలు కూడా ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు. ఇప్పటివరకు 58 కోట్లకు పైగా భక్తులు పవిత్ర గంగానదిలో స్నానం చేశారని జాతర నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీవరకు మహా కుంభమేళా జరగనుంది. -
12 ఏళ్లుగా భార్యను గదిలో బంధించిన భర్త.. ఎందుకంటే!
బెంగళూరు: కట్టుకున్న భార్యపట్ల అమానవీయంగా ప్రవర్తించాడో భర్త. అర్థం లేని అనుమానాలతో ఆమెను గృహ నిర్బంధంలో బంధించాడు. కనీసం వాష్‌రూమ్ సదుపాయం లేని ఓ గదిలో ఉంచి తాళం వేశాడు. తన పిల్లలను కూడా కలవనివ్వలేదు. ఒకటి కాదు రెండు దాదాపు గత 12 ఏళ్లుగా భార్యను ఇలాగే వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు శాడిస్టు భర్త. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ దారుణం చుట్టు పక్కల వాళ్లకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ మహిళకు బయటకు తీసుకువచ్చి జరిగిన విషయం గురించి తెలుసుకొని నివ్వెర పోయారు. భర్త ఏ పనిమీద బయటకు వెళ్లినా తనను ఇంట్లో ఉంచి తాళం వేసి వెళ్తాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడనివ్వకుండా, పదే పదే కొట్టేవాడని చెప్పింది. గత 12 ఏళ్లుగా మానసిక క్షోభకు గురి చేశాడని, ఇంట్లోనే బంధించి ఇంటిని జైలుగా మార్చాడని పేర్కొంది. చాలా కాలంగాచి ఈ బాధతో కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. తనను బంధించిన గదిలోనే ఒక చిన్న పెట్టెలో కాలకృత్యాలు తీర్చుకొనే దానినని బాధితురాలు వాపోయింది. విషయం తెలిసిన పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని ఈ విషయమై కౌన్సెలింగ్ ఇచ్చారు. భర్తపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు నిరాకరించింది. ఇకపై అతడికి విడాకులు ఇచ్చి పుట్టింట్లో ఉంటానని తెలిపింది. కాగా అతడికి బాధితురాలు మూడో భార్య మొదట రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ అతడి వేధింపులకు తాళలేక వారిద్దరూ వదిలేసి వెళ్లిపోయారు. వీరికి ఇద్దరు పిల్లల -
మేడ్చల్: బాలికను బడిలోనే ఉంచి తాళం వేసుకెళ్లిన సిబ్బంది
సాక్షి, మేడ్చల్: రోజూ బడికి వెళ్లే ఆరేళ్ల కూతురు స్కూల్ అయిపోయిన తరువాత సాయంత్రమైనా ఇంటికి రాకపోతే..ఆ తల్లిదండ్రులకు ఎంత నరకం.. ఎక్కడికెళ్లిందో.. ఏమో..ఎవరెత్తుకెళ్లారోనన్న ఆందోళన..! వెంటనే తెలిసిన వారందరినీ అడుగుతారు.. వారు తెలియదని సమాధానం చెబితే నరకం..!ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాదు.. ఎక్కడని వెతకాలి..పోలీసులకు ఫిర్యాదు చేయాలి.. ఈ టెన్షన్లో ఉన్న అమ్మానాన్నలకు వారి కూతురు పాఠశాలలోనే ఉందని తెలిస్తే వారి ఆనందం వర్ణనాతీతం.. అయితే ఆ బాలికను లోపలే ఉంచి తాళం వేసుకెళ్లారని చెబితే ఇంతకంటే దారుణం మరొకరటి ఉండదేమో. మరి.. ఇలాంటి సంఘటనే బాచుపల్లిలో చోటుచేసుకుంది. పాఠశాల సిబ్బంది బాలికను పాఠశాలలోనే ఉంచి గమనించకుండా తాళం వేసి నిర్లక్ష్యంగా వెళ్లిపోయారు. బాచుపలిలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం, ప్రభావతి దంపతులకు వేదాంజలి(6) అనే కుమార్తె ఉంది. ఆ చిన్నారి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. ►రోజూ మాదిరిగానే గురువారం పాఠశాలకు వెళ్లిన చిన్నారి సాయంత్రం 4 గంటలకు స్కూల్ ముగిసిన తరువాత ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి చూడగా తాళం వేసి ఉండటంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. ►మరోమారు పాఠశాల వద్ద వెతుకుతుండగా తరగతి గది నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో తమ కుమార్తె తరగతి గదిలో ఉందని గ్రహంచిన సుబ్రహ్మణ్యం, ప్రభావతిలు చుట్టు పక్కల వారి సహాయంతో పాఠశాల తరగతి గది తాళం పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా చిన్నారి రోదిస్తూ కనిపించింది. దీంతో తమ కుమార్తెను అక్కున చేర్చుకుని ఇంటికి తీసుకువెళ్లారు. ►పాఠశాల ఆయా తప్పిదం వల్లే తమ చిన్నారి తరగతి గదిలో ఉండి పోయిందని.. పాఠశాల ముగిసిన తరువాత తరగతి గదిలో చిన్నారులు బయటకు వెళ్లారో లేదో చూసుకోకుండా తాళం వేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: Tandur: ఓ పార్టీ నుంచి అడ్వాన్స్ తీసుకుని.. మరో పార్టీలోకి జంప్ -
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు .. తెలిస్తే ఫుల్ ఖుషీ అవ్వాల్సిందే!
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనుంది. ఇప్పటికే వినియోగదారులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్న వాట్సాప్ తాజాగా సీక్రెట్ కోడ్‌తో పాటు ఇతర ఫీచర్లను విడుదల చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఆ కొత్త ఫీచర్లు ఏంటి? అవి ఎలా పనిచేస్తాయో తెలుసా? వాట్సాప్ త్వరలో సీక్రెట్ కోడ్ ఫీచర్, సెర్చ్ ఫీచర్ ఫర్ అప్డేట్ ట్యాబ్, పిన్న్డ్ మెసేజెస్,రీడైజన్చాట్, ఐపీ ప్రైవసీ ఫీచర్లపై పనిచేస్తుంది. మరికొద్ది రోజుల్లో సీక్రెట్ కోడ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత మిగిలిన ఫీచర్లు అప్డేట్ కానున్నాయి. వాట్సాప్ అప్డేట్లను అందిచే వీబీటా ఇన్ఫో తాజాగా ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌లోని ఐదు ఫీచర్ల వివరాల్ని వెలుగులోకి తెచ్చింది. సీక్రెట్ కోడ్ ఫీచర్ ఫోన్లో మెయిన్ పాస్వర్డ్ ఎలా ఉందో.. ఇప్పుడు వాట్సాప్‌లోని చాట్లకు పిన్, బయోమెట్రిక్ అథంటికేషన్‌ను అందుబాటులోకి తేనుంది. తద్వారా, ఫోన్లో మీరు చేసిన పర్సనల్ చాటింగ్, ఫోటోలు, వీడియోలు ఇతరులు చూసే వీలుండదు. అంతేకాదు, మీరు లాక్ చేసిన ఆ చాటింగ్ సమాచారం అంతా సపరేట్ సెక్షన్లో కనిపించనుంది. ఒకవేళ అగంతకులు ఆ చాట్‌ను ఓపెన్ చేసి చూడాలంటే మీరు ఎంటర్ చేసిన పిన్ లేదంటే బయో మెట్రిక్ అథంటికేషన్ ఇవాల్సి ఉంటుంది. సెర్చ్ ఫీచర్ ఈ ఫీచర్ ఇప్పటికే ఎంపిక చేసిన యూజర్లు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. తర్వలోనే అందరికి అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ సాయంతో మీరు ఫాలో అయ్యే వాట్సాప్ ఛానెల్స్, వెరిఫైడ్ చానెల్స్‌లో ఎవరెవరు ఏం స్టేటస్ పెట్టారో సెర్చ్ బటన్ ఫీచర్లో పేరు ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. పిన్న్డ్ మెసేజెస్ పిన్న్డ్ మెసేజెస్ ఈ ఫీచర్‌తో సాయంతో ముఖ్యమైన మెసేజ్‌లను చాట్ కన్వర్షన్లో మీకు కనపడేలా పిన్ చేయొచ్చు. రీడిజైన్ చాట్ అటాచ్మెంట్ ఈ రీడిజైన్ చాట్ అటాచ్మెంట్ అప్డేట్తో వాట్సాప్ ఫ్రెష్‌లుక్‌తో కనిపించనుంది. వాట్సాప్‌లో వీడియో, కంటెంట్, ఆడియో ఫైల్స్ షేరింగ్ చేసే విధానం మారనుంది. ఐపీ అడ్రస్‌ను కనిపెట్టలేరు అగంతకులు మీ వాట్సాప్ ఐపీ అడ్రస్ ఏంటనేది కనిపెట్టలేరు. యూజర్ల సాధారణంగా ఐపీ అడ్రస్‌తో వాట్సాప్‌లో మనం చేసే వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, ఇతర వివరాల్ని సేకరించవచ్చు. అయితే తాజాగా అప్డేట్తో ఐపీ అడ్రస్ గుర్తించలేని విధంగా సెక్యూరిటీ ఫీచర్‌ను అప్డేట్ చేయనుంది. -
అజిత్ పవార్‌కు చేదు అనుభవం
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీలికవర్గం నేత అజిత్ పవార్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర సచివాలయం సమీపంలోని రాష్ట్రవాది భవన్‌ను పార్టీ వ్యవహారాల కోసం నూతన కార్యాలయంగా వాడుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. భవనాన్ని స్వాధీనం చేసుకోవడానికి అజిత్ పవార్ వర్గం నేతలు మంగళవారం అక్కడికి వెళ్లగా తలుపులకు తాళంవేసి ఉండడంతో నిరాశ చెందారు. కొందరు యువకులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. కానీ లోపలి గదులకు తాళాలు వేసి ఉండడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. రాష్ట్రవాది భవన్లో గతంలో మహారాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేత అయిన అంబదాస్ దన్వే నివసించారు. ప్రభుత్వం మరో భవనం కేటాయించడంతో ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇలాఉండగా, అసలైన ఎన్సీపీ తమదేనని అజిత్, శరద్ పవార్ వర్గాలు వాదిస్తున్నాయి. ఏ వర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
నా జాగా తీసుకున్నరు.. ఆ సంగతేమైంది సారూ?
సాక్షి, ఖమ్మం: తనకు ఇచ్చిన హామీ నెరవేర్చడంలో జాప్యం ప్రదర్శిస్తున్న అధికారుల తీరుపై ఓ వ్యక్తి వినూత్న రీతిలో అసహనం ప్రదర్శించాడు. అది అలాఇలా కాదు.. ఏకంగా ఆ ఊరి సబ్స్టేషన్కే తాళం వేసి!. పైగా భార్యాపిల్లలతో పాటు ఆ సబ్‌స్టేషన్ ముందు నిరసన చేపట్టాడు. ఖమ్మంలోని రఘునాథపాలెం మండల పరిధిలోని బావోజి తండాలో ఇది చోటు చేసుకుంది. బావోజి తండాకు చెందిన తేజవత్ మహేందర్ గతంలో తమ ఊరి సబ్‌స్టేషన్ నిర్మాణం కోసమని తన భూమిని ఇచ్చాడు. అయితే.. తమ కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ జాబ్ ఇస్తామనే హామీ మేరకు అతని ఆ భూమిని అప్పగించాడట. ఈ క్రమంలో అధికారులు ఆ హామీ నెరవేర్చకపోవడంతో అలా తాళం వేశాడట. అంతేకాదు.. తన ఇద్దరు కూతుళ్లు, భార్యతో కలిసి ఆ గేటు ముందు నిల్చుని నిరసన చేపట్టాడు. ఊరి కోసం తన భూమిని ఇచ్చానని, కానీ, ఇప్పుడు కుటుంబ పోషణ భారం కావడంతోనే తాను ఈ పనికి దిగాల్సి వచ్చిందని అంటున్నాడతను. అయితే.. అధికారులు మాత్రం మరోలా స్పందించారు. మహేందర్‌కు కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చామని చెబుతున్నారు. అంతేకాదు.. గతంలోనూ మహేందర్ ఓసారి ఇలాగే గేటుకు తాళం వేశాడని, అప్పుడు మాట్లాడి తాము అతన్ని శాంతిపజేశామని అంటున్నారు. -
అర్జంట్‌గా పోయాలి.. కానీ తాళం తీయట్లేదు.? ఇవ్వేం పబ్లిక్ టాయిలెట్లురా బాబోయ్
లగ్జరీ వాష్‌రూంల పేరిట కార్పొరేట్ స్థాయిలో నగరంలో నిర్మించిన లూకేఫ్ టాయిలెట్లు నిరుపయోగంగా మారాయి. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా లక్ష్యం నెరవేరకపోవడంతో టాయిలెట్లకు వెచ్చించిన నిధులు వృథా అయ్యాయి. – వరంగల్ అర్బన్ లూకేఫ్ టాయిలెట్లు.. కార్పొరేట్ తరహాలో నిర్మించారు. గ్రేటర్ వరంగల్ నగరంలో రెండున్నర ఏళ్ల కిందట అవసరం పేరిట ఒకటి, రెండు కాదు.. 5 చోట్ల నిర్మించారు. దేశ వ్యాప్తంగా పేరు మోసిన బడా కాంట్రాక్టు సంస్థ రూ.కోటి వ్యయంతో వీటి నిర్మాణం చేపట్టింది. సగానికి పైగా బిల్లులు కూడా కట్టబెట్టారు. మిగతా సొమ్ము కోసం సదరు సంస్థ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తుండటంతో ఓ ప్రజారోగ్య విభాగం అధికారి, మరో ఇంజనీర్ కలిసి ఆ బిల్లు కూడా ఇప్పించేందుకు తోడ్పాటు అందిస్తున్నారు. మరి ఇవి ఉపయోగంలో ఉన్నాయా అని బల్దియా అధికారులను అడిగితే ‘మాకేం తెలుసు’అన్న సమాధానం వస్తోంది. ఉత్సవ విగ్రహాలేనా..? నగరంలో ప్రజా మురుగుదొడ్ల నిర్వహణ నిధుల మేతగా మారింది. జీడబ్ల్యూఎంసీ ద్వారా నిర్మితమై న ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు చాలా వరకు మరుగున పడ్డాయి. లూకేఫ్ సంస్థ కంటైనర్ తరహాలో రూ.కోటితో కాజీపేట నిట్, కలెక్టరేట్, సర్క్యూట్ గెస్ట్‌హౌస్, వరంగల్ పోచమ్మమైదాన్, ఖిలా వరంగ ల్ ఖుష్‌మహల్ వద్ద టాయిలెట్లను నిర్మించింది. ఒక్కో ప్రాంతంలో ఆరు సీట్లతో ఏర్పాటు చేశారు. వీటిని వ్యాపార కేంద్రాలుగా మారుస్తూ బల్దియాపై ఎలాంటి భారం లేకుండా పలు సంస్థలకు, నిరుద్యోగులకు అప్పగించారు. లూకేఫ్ టాయిలెట్లను నిర్వహిస్తూ, ప్రజలు ఉచితంగా మరుగుదొడ్లు ఉపయోగించుకునేలా నిర్ణయించారు. వీటి పక్కన జిరాక్స్, టీ, పాన్‌షాపు తదితర చిన్న తరహా షాపులు ఏర్పాటు చేసుకున్నారు. కానీ అనువైన స్థలాల్లో నిర్మించకపోవడం.. ప్రజలకు అందుబాటులో లేకపోవడం, చిరు వ్యాపారాలు నడవకపోవడంతో చేతులెత్తేశారు. దీంతో లూకేఫ్ టాయిలెట్లు అలంకా ర ప్రాయంగా మారాయి. హనుమకొండ కలెక్టరేట్ కొత్తగా నిర్మాణం కావడం వల్ల లూకేఫ్ టాయిలెట్ ను కూల్చివేయడం పూర్తయింది. సమన్వయ లోపం.. నిధులు నిరుపయోగం బల్దియా టౌన్ ప్లానింగ్, ఇంజనీర్ల మధ్య సమన్వ య లోపం స్పష్టంగా కనిపిస్తోంది. జనరద్దీ కలిగిన ప్రాంతాల్లో కాకుండా ఇష్టమొచ్చిన, ప్రభుత్వ స్థలా లు ఉన్న చోట నిర్మాణాలు చేపట్టారు. దీంతో ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, అవగా హనా రాహిత్యం తదితర కారణాల వల్ల లూకేఫ్‌లు మూలకు చేరాయి. బల్దియా పట్టణ ప్రగతి నిధులు మాత్రం నిరుపయోగంగా మారాయి. ఇవేకాకుండా నగరంలో నాలుగు చోట్ల నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్ల పరిస్థితీ దయనీయంగా మారింది. -
ఆ భయంతో.. మూడేళ్లుగా గృహనిర్బంధంలో తల్లీకొడుకులు!
33 ఏళ్ల మహిళ, ఆమె కొడుకు మూడేళ్లుగా స్వచ్ఛంద గృహ నిర్బంధంలోనే ఉండిపోయారు. అదీ కూడా అద్దె ఇంట్లోనే అలా నిర్బంధంలో ఉండిపోయారు. పోలీసుల రంగంలోకి దిగి వారిని ఆస్పత్రికి తరలించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గురుగ్రామ్‌లోని చక్కర్ పూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..మున్మున్ మాఝీ అనే మహిళ తన ఎనిమిదేళ్ల కొడుకు కోవిడ్ మహామ్మారి వచ్చినప్పటి నుంచి అంటే సరిగ్గా 2020 నుంచి ఇప్పటి వరకు గృహ నిర్బంధంలో ఉండిపోయారు. కనీసం ఆ మహిళ కొడుకు సూర్యుడు ఉదయించడాన్ని కూడా చూడకుండా అలానే ఇంట్లో ఉండిపోయాడు. ఆఖరికి ఆ భయంతో ఆమె తన భర్త సుజన్‌మార్జీను అస్సలు ఇంట్లోకి రానివ్వలేదు. ఆమె భర్త ఒక ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతను మొదట్లో స్నేహితులు, బంధవుల ఇళ్లల్లో తలదాచుకున్నాడు. ఇక రాను రాను కష్టమవ్వడంతో మరో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండటం ప్రారంభించాడు. అప్పుడప్పుడూ వీడియో కాల్‌లోనే మాట్లాడుతుండే వాడు. తన భార్య కొడుకు ఉన్న ఇంటి అద్దె, తదితరాలు కట్టడం, వారికి కావాల్సిన వస్తువులు డోర్ ముంగిట పెట్టి వెళ్లిపోవడం ఇలానే మూడేళ్లు గడిచిపోయాయి. ఐతే మున్మున్ మాత్రం లాక్డౌన్ ఎత్తేసి మాములుగా అయిపోయినా ఇంకా అలా స్వయం నిర్బంధంలోనే ఉండిపోయింది. భర్త ఎంత నచ్చచెప్పిన వినక పోయే సరికి చక్కర్‌పూర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి బయటు తీసుకువచ్చారు. ఆ తల్లి కొడుకులను గురుగ్రామ్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐతే మున్మున్ కాస్త సైక్రియాట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేగాదు వారి ఇల్లు చాలా అపరిశుభ్రంగా చెత్త పేరుకు పోయి ఉందని చెప్పారు. ఇంకొన్ని రోజులు ఆగి ఉంటే అవాంఛనీయమైన ఘటన జరిగి ఉండేదని పోలీసులు చెబుతున్నారు. ఆ మహిళ కనీసం వంటగ్యాస్ కానీ, నీటిని గానీ వినయోగించ లేదని వెల్లడించారు. కాగా ఆమె భర్త సుజన్ తన భార్య కొడుకుని బయటకు తీసుకొచ్చినందుకు పోలీసులకు దన్యావాదాలు తెలిపాడు. తొందరలోనే వాళ్లిద్దరూ కోలుకుంటారని మళ్లీ తాము మునుపటిలా హాయిగా ఉంటామని సంబంరంగా చెబుతున్నాడు సుజన్. (చదవండి: బీబీసీకి ఆ స్వేచ్ఛ ఉంది! భారత్‌లో పరిణామాలపై బ్రిటన్ స్పందన) -
దళితులను నిర్బంధించి చిత్రహింసలు.. మహిళకు గర్భస్రావం!
చిక్కమగళూరు: కర్ణాటకలోని చిక్కమగళూరులో ఓ వ్యక్తి తన ప్లాంటేషన్‌లో దళితులను నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన ఘటన సంచలనం రేపుతోంది. జగదీశగౌడకు జెనుగడ్డె గ్రామం వద్ద కాఫీ ప్లాంటేషన్ ఉంది. ఇతడి నుంచి రోజువారీ కూలీలైన బాధితులు రూ.9 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ సొమ్మును తిరిగి చెల్లించలేకపోవడంతో మొత్తం 16 మందిని జగదీశ తన ప్లాంటేషన్‌లో నిర్బంధించాడు. జగదీశ గౌడ దెబ్బలతో ఒక మహిళకు గర్భస్రావం అయింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులు జగదీశ గౌడ, అతడి కుమారుడు తిలక్ కోసం గాలింపు చేపట్టారు. తమ బంధువులను జగదీశ గౌడ చిత్రహింసలు పెడుతున్నారంటూ కొందరు వ్యక్తులు ఈనెల 8వ తేదీన ఫిర్యాదు చేశారు. మరుసటి రోజే ఆ ఫిర్యాదును వారు వెనక్కి తీసుకున్నారని బలెహొన్నూర్ పోలీసులు చెప్పారు. ఆ మరునాడు బాధితురాలైన గర్భవతిని ఆస్పత్రిలో చేర్పించి, చిక్కమగళూరులో మరోసారి వీరు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో తాము వెళ్లి బందీలుగా ఉన్న నాలుగు కుటుంబాలకు చెందిన మొత్తం 16 మందిని విడిపించామన్నారు. వీరిని 15 రోజులుగా నిర్బంధంలోనే ఉంచినట్లు తేలిందన్నారు. వీరిలో రెండు నెలల గర్భవతి అయిన అర్పిత కూడా ఉంది. జగదీశ గౌడ ఈమె ఫోన్ లాగేసుకుని ఒక రోజు నిర్బంధించాడని, కొట్టడంతో గర్భస్రావం అయిందని ఆమె తల్లి ఆరోపించింది. జగదీశ గౌడ నుంచి అడ్వాన్స్ డబ్బులు తీసుకున్న వారు ఎటో వెళ్లిపోవడంతో అతడు తమను నిర్బంధించినట్లు బాధితులు తెలిపారని చిక్కమగళూరు ఎస్పీ ఉమా ప్రశాంత్ చెప్పారు. కాగా, జగదీశ గౌడ బీజేపీ నేత అంటూ వచ్చిన వార్తలను బీజేపీ ఖండించింది. జగదీశ గౌడతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ జిల్లా ప్రతినిధి వరసిద్ధి వేణుగోపాల్ తెలిపారు. ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. నిర్లక్ష్యంగా కారు డోరు తెరవటంతో ఘోర ప్రమాదం -
ట్రస్టీల మధ్య గొడవ.. విద్యార్థులను గదుల్లోనే ఉంచి
సాక్షి, మైసూరు(కర్ణాటక): ట్రస్టు సభ్యులు వారిలో వారు గొడవపడి, కళాశాలకు వచ్చిన విద్యార్థులను గదుల్లో బంధించిన ఘటన నగరంలోని విజయనగరలో ఉన్న ప్రైవేట్ పీయూ కళాశాలల్లో మంగళవారంచోటు చేసుకుంది. ట్రస్టీలు వనితా, సలోని, రునాల్, రేణుకా, అశోక్ కుమార్ అనే ఐదుమంది ట్రస్టీలు ఉన్నారు. విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజులు దుర్వినియోగం చేశారని వనితా, రేణుకాను ట్రస్టు నుంచి సస్పెండ్ చేశారు. ఒక స్థలం విషయమై కూడా రేణుకాతో మిగతావారికి రగడ జరిగింది. రేణుకాకు చెందిన వారు రోజూ కళాశాల వద్దకు వచ్చి ఈ స్థలం మాది అని గొడవ చేస్తున్నారు. మంగళవారం మళ్లీ వచ్చి కాలేజీ గదులకు తాళాలు వేయడంతో పాటు టీవీ, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. డిడిపియు శ్రీనివాస్ మూర్తి వచ్చి పరిశీలించారు. విజయనగర పోలీసులు పిల్లలను బయటకు పంపి గొడవచేసిన వారిపై కేసు నమోదు చేశారు. -
ఆస్తి తగాదా.. వారం రోజులుగా తల్లికొడుకులని ఇంట్లో బంధించి..
భువనేశ్వర్: ఆస్తి తగాదా నేపథ్యంలో తల్లీకొడుకులు గృహనిర్బంధానికి గురైన అరుదైన సంఘటన స్థానిక సిర్పి ఛక్ ప్రియదర్శిని మార్కెట్ దగ్గర సంచలనం రేకిత్తించింది. వారం రోజులుగా 76 ఏళ్ల వృద్ధురాలు అనసూయ మహంతి, ఆమె కొడుకు గృహ బంధీలుగా ఉండడం చూసి, చుట్టుపక్కల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారిని చూసేందుకు జనాలు పోటెత్తడంతో అక్కడ 144 సెక్షన్ విధించి, పోలీసులు చర్యలు చేపడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. కైలాస్ చంద్రమహంతి(లేటు) తొలి భార్య అనసూయ మహంతి. దాదాపు 20 ఏళ్ల నుంచి ఈమె భర్త నుంచి వేరుగా కొడుకుతో కలిసి నివాసముంటోంది. ఈ క్రమంలో కైలాస్ మహంతి రెండో భార్యతో కలిసి ఇంట్లో ఉంటూనే ఇటీవల ఆయన చినిపోయారు. భర్త తదనంతరం ఆస్తిపై హక్కు కోసం అనసూయ మహంతి కోర్టుని ఆశ్రయించింది. 2021 అక్టోబరులో స్థానిక దిగువ కోర్టుకు ఈమెకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుని సవాలు చేస్తూ రెండో భార్య ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. ఇది విచారణ దశలో ఉండగా, తుది తీర్పు వెలువడేంతవరకు యథాతథ స్థితి(స్టేటస్–కో) కొనసాగుతుందని ఉన్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించి మరీ కొడుకుతో కలిసి భర్త ఉంటున్న ఇంట్లోకి చొరబడడంతో కైలాస్ మహంతి రెండో భార్య ఇంటి గేటు తలుపులకు తాళం వేసింది. దీంతో వారం రోజులుగా వారు అదే ఇంట్లో బంధీలుగా ఉన్నారు. న్యాయస్థానం పరిధిలో వీరి వివాదం ఉన్నందున శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు తాళాలు తీసి, తమకు స్వేచ్ఛ కల్పించాలని బాధితులు అభ్యర్థిస్తున్నారు. -
బెదిరించి.. 2 గంటల పాటు గదిలో బంధించి.. ఆపై
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ తనను బెదిరింపులకు గురిచేయడంతో పాటు రెండుగంటల పాటు గదిలో బంధించారంటూ కార్యదర్శి మురళీ ముకుంద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం జరిగిన పాలకమండలి సమావేశంలో అధ్యక్షుడు రవీంద్రనాథ్‌తో పాటు కొంతమంది సభ్యులు రికార్డు గది తాళాలను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ► మార్చిలో జరిగిన పాలకమండలి ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో అధ్యక్షుడిగా రవీంద్రనాథ్, కార్యదర్శిగా మురళీ ముకుంద్తో పాటు పాలకమండలి ఏర్పాటైంది. కొన్నిరోజులుగా పాలకమండలిలోని సభ్యుల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్‌నెం–78లోని స్థలం కేటాయింపు వ్యవహారంలో అధ్యక్షుడు రవీంద్రనాథ్‌తో పాటు కోశాధికారిపై ఆరోపణలు రావడంతోపాటు కేసు నమోదైంది. ► సొసైటీలో గతంలో చేసిన అవకతవకలకు వ్యతిరేకంగా గెలిచిన కొత్త ప్యానెల్‌పై కూడా అవినీతి మరకపడటంతో పాలకమండలి సభ్యుల్లో కొంతమంది మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాలకమండలి సమావేశంలో రసాభాసా చోటు చేసుకుంది. సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌కు, కార్యదర్శి మురళీముకుంద్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ► సొసైటీలో జరిగిన వ్యవహారాలపై సాక్ష్యాలుగా ఉండే కొన్ని ఫైళ్లు మాయమైనట్లు ఆరోపణలు రావడంతో ఈ విషయంపై జోరుగా చర్చ నడిచినట్లు తెలుస్తోంది. కాగా సొసైటీ రికార్డు రూమ్ తాళాలను తనకు ఇవ్వాలంటూ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌తో పాటు కొంతమంది సభ్యులు తనను విపరీతమైన ఒత్తిడికి గురిచేశారని, తనను సుమారు 2గంటల పాటు గదిలో బంధించారంటూ గురువారం సాయంత్రం సొసైటీ కార్యదర్శి మురళీ ముకుంద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ► సొసైటీ బైలాస్ ప్రకారం లాకర్ రూమ్‌లోని ఫైళ్లను కాపాడడం తన బాధ్యత అని, తాళాలను లాక్కోవడం కోసం ప్రయతి్నంచడంతోపాటు తనను బెదిరింపులకు గురిచేసిన సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ తదితరులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ► పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రికార్డు గదిని సీజ్ చేశారు. సొసైటీలో గందరగోళ పరిస్థితి నెలకొందని, వెంటనే ప్రత్యేక అధికారిని నియమించి ఫైళ్లను రక్షించాలంటూ కార్యదర్శి మురళీముకుంద్ సహకారశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా మురళీ ముకుంద్ ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. -
కాంగ్రెస్ నేతలకు షాకిచ్చిన ట్విటర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం కాంగ్రెస్ పార్టీకి ట్విటర్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతాను ఇప్పటికే లాక్ చేసిన ట్విటర్ తాజాగా మరో ఐదుగురు కాంగ్రెస్ సీనియర్ నేతల అకౌంట్లను తాత్కాలికంగా బ్లాక్ చేయడం దుమారం రేపింది. దీంతోపాటు కాంగ్రెస్ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌ను కూడా బ్లాక్ చేసింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. పార్టీ మీడియా హెడ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, లోక్ సభలో పార్టీ విప్ మాణిక్యం ఠాగూర్, మాజీ మంత్రి జితేంద్ర సింగ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ ట్విటర్ అకౌంట్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ విషయాన్ని పార్టీ నేత ప్రణవ్ ఝా ట్విటర్ ద్వారా వెల్లడించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ట్విటర్ చీఫ్ జాక్ డోర్సేపై విమర్శలు గుప్పించారు. తమ సీనియర్ నేతలతోపాటు దాదాపు 5 వేలమంది ఇతర నాయకులు, కార్యకర్తల ఖాతాలు బ్లాక్ అయ్యాయని ఆరోపించిన కాంగ్రెస్ మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తింది. మోదీజీ ఇంకెంత భయపడతారంటూ ఎద్దేవా చేసింది. దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పోరాడింది, ప్రజల ఆకాంక్షను కేవలం సత్యం, అహింస తోనే సాధించిందనీ, అప్పుడూ గెలిచాం, మళ్లీ గెలిచి తీరుతాం అంటూ కాంగ్రెస్ తన ఇన్‌స్టా పేజీ పోస్ట్‌లో పేర్కొంది. ప్రజలకోసం పనిచేస్తున్న తమను ఇలాంటి చర్యలు ఏమాత్రం అడ్డుకోలేవంటూ ట్విటర్ ఇండియాకు సవాల్ విసిరింది. కాగా ఢిల్లీలో ఇటీవల తొమ్మిదేళ్ల బాలిక హత్యాచార ఘటన నేపథ్యంలో రాహుల్ బాధిత బాలిక, తలిదండ్రుల ఫోటోలను షేర్ చేసిననేపథ్యంలో ఆయన అధికారిక ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసింది. మరోవైపు బాధితుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై సీరియస్‌గా స్పందించిన జాతీయ బాలల హక్కుల సంఘం రాహుల్‌పై చర్య తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Congress (@incindia) -
జీతం ఎంతో చెప్పాలంటూ కాబోయే అల్లున్ని గదిలో బంధించి...
వివాహా ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు పెద్దవారు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు. ముఖ్యంగా ఆడపిల్లను పంపే ఇంటి వారు కాస్త స్థితిమంతులు అయితే బాగుండు అనుకుంటారు. అందుకే తమ స్తోమతకు మించి.. అప్పు చేసి మరి మంచి ఉద్యోగం, ఆస్తి ఉన్న కుటుంబానికి ఆడపిల్లను వివాహం చేసి పంపిస్తారు. ఇలా తేలుసుకోవడం మంచిదే. అయితే దేని గురించి అయిన అడగడానికి ఓ పద్దతి ఉంటుంది. కాదని హద్దు మీరి ప్రవర్తిస్తే.. అసలుకే మోసం వస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాబోయే అల్లుడి జీతం ఎంతో తెలుసుకోవడం కోసం.. ఓ అత్తమామ.. అతడి దగ్గర నుంచి మొబైల్ లాక్కుని.. ఓ గదిలో బంధించి టార్చర్ పెట్టారట. ఆగ్రహించిన సదరు వ్యక్తి వివాహం క్యాన్సిల్ చేద్దామనుకున్నాడట. కానీ చివరకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందట. రెడిట్‌లో పోస్ట్ చేసిన ఈ కథనం వివరాలు.. ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది.. ఏంటి అనే వివరాలు లేవు. కానీ పోస్ట్ ప్రకారం.. ఓ వ్యక్తికి కొద్ది రోజుల క్రితం పెళ్లి కుదిరింది.ఆ తర్వాత అతడి కొత్తగా జాబ్ వచ్చింది. ఈ నేపథ్యంలో అతడి కాబోయే అత్తమామ అల్లుడికి ఎంత జీతం వస్తుందో తెలుసుకోవాలని భావించారు. అతడిని పిలిచి ప్రైవేట్‌గా మాట్లాడాలనుకున్నారు. ఓ రోజు అతడికి కాల్ చేసి ఇంటికి రమ్మన్నారు. బాధితుడు ఇంటికి వెళ్లే సరికే అతడి కాబోయే భార్య ఇంట్లో లేదు.. అత్త, మామ మాత్రమే ఉన్నారు. గెస్ట్ రూమ్‌లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత అతడి దగ్గర నుంచి మొబైల్ ఫోన్, బైక్ కీ తీసుకుని దాచిపెట్టారు. ఆ తర్వాత అతడి గొత్త ఉద్యోగం గురించి చర్చించసాగారు. బాధితుడు మాట్లాడుతూ.. ‘‘నా కాబోయే మావ కొత్త ఉద్యోగంలో జీతం ఎంత వస్తుందని ప్రశ్నించారు. నాకు చెప్పడం ఇష్టం లేక దాటవేసే ప్రయత్నం చేశాను. కానీ వారు ‘‘నీకు మా కుమార్తెను ఇస్తున్నాను.. నీ సంపాదన ఎంతో తెలుసుకోవాల్సిన హక్కు నాకుంది. కచ్చితంగా చెప్పి తీరాల్సిందే’’ అని డిమాండ్ చేయసాగారు. నేను బాగానే సంపాదిస్తున్నాను.. మీ కుమార్తెను బాగా చూసుకుంటాను అని వారికి హామీ ఇచ్చాను. కానీ వారు నా మాట వినలేదు. నా అత్త ‘‘డబ్బులు చాలా ముఖ్యం. నువ్వు కుటుంబాన్ని పోషించగలవో లేదో తెలియాలి కదా.. ఎంత సంపాదిస్తున్నావో చెప్పాల్సిందే’’ అని డిమాండ్ చేశారు’’ అని తెలిపాడు. ‘‘వాళ్లు ఎంతకి ఆ టాపిక్ మార్చకపోవడంతో నేను అక్కడి నుంచి బయటకు వెళ్లిపోదామని భావించాను. బాత్రూంకి వెళ్తాను అని చెప్పి.. బయటకు వెళ్లే ప్రయత్నం చేశాను. నేను లేవగానే నా కాబోయే అత్త గారు నన్ను బంధించమని గట్టిగా అరిచారు. ఇక మావ నన్ను గదిలో పెట్టి లాక్ చేశారు. మీ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది అంటూ అసహనం వ్యక్తం చేశాను. ఇంతలో నా కాబోయే భార్య వచ్చింది. ఇది గమనించి ఆమె తల్లిదండ్రులు డోర్ తెరిచి ఏడ్వడం ప్రారంభించారు. ఇక నా ఫియాన్సీ జరిగిన విషయం ఏంటో తెలియకుండా.. నేను తన తల్లిదండ్రులను అవమానించి తనను కూడా బాధపెట్టానని ఆరోపించిది. వారికి క్షమాపణలు చెప్పమని కోరింది’’ అన్నాడు. ‘‘వారి ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చలేదు. ఇలాంటి కుటుంబానికి అల్లుడిని అయితే ఇక నా జీవితం ఎలా ఉంటుందో తల్చుకుంటేనే భయమేసింది. కానీ నా తల్లిదండ్రుల బలవంతం మీద వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కాకపోతే నా భార్య చాలా మంచిది. తను నన్ను చాలా ప్రేమిస్తుంది. ఇక అత్తమామల వల్ల ఇప్పటికి అప్పుడప్పుడు మా ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి’’ అని తెలిపాడు. చదవండి: కొడుక్కి ఎంతైనా ఇస్తా.. కూతురికి ఇవ్వను! షాకింగ్: భార్య ప్రేమను అమ్మకానికి పెట్టి మరీ.. -
వైద్యుల తొలగింపు: ఆస్పత్రికి గ్రామస్తుల తాళం
జయపురం: పదేళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించి కొత్తవారిని చేర్చుకున్నందుకు ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు, గ్రామస్తులు ఆగ్రహించి ప్రాథమిక వైద్య కేంద్రానికి బుధవారం తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. చివరికి ఎమ్మెల్యే హామీతో ఆందోళన విరమించారు. వివరాలిలా ఉన్నాయి. నవరంగపూర్ సమితి గుమగుడ గ్రామం పీహెచ్సీలో 10 సంవత్సరాలుగా నైట్ వాచ్‌మన్‌గా దుర్యోధన హరిజన్, స్వీపర్‌గా ధనమతి గౌడ పనిచేస్తున్నారు. వారిద్దరినీ తొలగించి కొత్త వారిని కాంట్రాక్టర్ ఆ పోస్టుల్లో నియమించాడు. కొత్తగా నియామకం పొందిన వారు హాస్పిటల్‌కు రావడంతో గ్రామ ప్రజల సహకారంతో బాధిత ఉద్యోగులు హాస్పిటల్ గేట్‌కు తాళాలు వేశారు. దీంతో డాక్టర్లు, సిబ్బంది లోపలే ఉండిపోయారు. ఆ సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి కారు ఆపి విషయం తెలుసుకున్నారు. వెంటనే నవరంగపూర్ వైధ్యాధికారులు, డీఆర్డీఏ పీడీతో ఫోన్లో విధుల నుంచి తొలగించిన వారిని మళ్లీ చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా ఉద్యోగాలలో చేర్చుకుంటామని బాధితులకు ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో గ్రామస్తులు హాస్పిటల్ తాళాలు తీశారు. -
వెబ్ సిరీస్ రివ్యూ: థ్రిల్ చేసే ‘లాక్డ్’
కరోనా దెబ్బతో ఎంటర్టైన్మెంట్ కరువైంది. సినిమాలు, సీరియళ్లు,స్పోర్ట్స్ టోర్నమెంట్లు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుప్పుడే అవన్నీ తిరిగి ప్రాంభమవుతున్నా.. పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు సమయం పట్టనుంది. అలాంటి తరుణంలో ఇళ్లవద్ద ఒకరకంగా క్వారంటైన్ పరిస్థితులు అనుభవించిన జనాన్ని ఎంటైర్‌టైన్ చేయడానికి మేమున్నామంటూ వెబ్ సిరీస్‌లు అందుబాటులోకొచ్చాయి. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లతో మొదటైన వెబ్ సిరీస్‌ల ట్రెండ్ తెలుగులోనూ షురూ అయింది. తెలుగు స్ట్రీమింగ్ యాప్ ‘ఆహా’ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు అలరిస్తోంది. ఈ మధ్య విడుదలై సక్సెస్ సాధించిన ‘లాక్డ్’ వెబ్ సిరీస్ రివ్యూ ఓసారి చూద్దాం! టైటిల్: లాక్డ్ నటీనటులు: సత్యరాజ్, శ్రీలక్ష్మీ, ఇంటూరి వాసు, అభిరామ్ వర్మ, సంయుక్త హొర్నాడు తదితరులు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రదీప్ దేవకుమార్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ:నిజాయ్ గౌతమ్ సంగీతం: ప్రశాంత్ శ్రీనివాస్ నిర్మాతలు: కేఎస్.మధుబాల, హెచ్.శణ్ముగ రాజా జానర్: థిల్లర్ కథ: డాక్టర్ ఆనంద్ చక్రవర్తి (సత్యదేవ్) ఓ గొప్ప న్యూరో సర్జన్. ప్రాణం పోయే పరిస్థితుల్లో ఎంతో మందిని, అతి సంక్లిష్టమైన ఆపరేషన్లు చేసి రక్షిస్తుంటాడు. తినేందుకు కూడా తీరిక లేకుండా సేవలందిస్తుంటాడు. అయితే, ఓ రోజు రాత్రి పని ముగించుకుని వచ్చిన అతనిపై ఇంట్లోకి చొరబడ్డ ఓ వ్యక్తి దాడి చేసి పెట్టెలో బంధిస్తాడు. అదే సమయంలో ఆనంద్ ఇంట్లో ఇద్దరు మహిళలు పద్మిని బామ్మ (శ్రీలక్ష్మీ), వైష్ణవి (సంయుక్త) దొంగతనం చేసేందుకు వస్తారు. ఆనంద్‌ని బంధించిన ఆ వ్యక్తే ఇంటి యజమాని అని భ్రమపడి మత్తుమందు చల్లి తాళ్లతో కట్టేసి సోఫాలో బంధిస్తారు. లాకర్లో ఉన్న డబ్బులు దోచుకుని వెళ్లిపోయే సమయానికి వైష్ణవి మరింత డబ్బు, నగలు ఇంట్లో ఉండొచ్చునని ఓ పెట్టె తెరుస్తుంది. అందులో ఆనంద్ ఉండటంతో ఇద్దరు దొంగలు అతని కట్లు విప్పి రక్షిస్తారు. అతనే ఇంటి యజమాని అని తెలియడంతో.. కారు పాడై సాయం కోసం వస్తే.. నీ స్థానంలో ఉన్న వ్యక్తి మాతో అసభ్యంగా ప్రవర్తించాడని, అందుకే కట్టివేశామని కథ అల్లుతారు. అయితే, పోలీసులకు సమాచారం ఇస్తానని, వాళ్లు వచ్చి తనను బంధించిన వ్యక్తి పని చెప్తారని ఆనంద్ చెప్పడంతో.. ఆ దొంగలు అక్కడ నుంచి పారేపోయేందుకు యత్నిస్తారు. దీంతో ఇంట్లో చొరబడ్డ వ్యక్తి, దొంగతనం చేసిన ఇద్దరు మహిళలను ఆనంద్ వేర్వేరుగా బంధిస్తాడు. ఈక్రమంలోనే భార్యతో గొడవ కావడంతో ఆనంద్ కొలీగ్ మిస్బా, మరో పోలీస్ అధికారిని వెంటబెట్టుకుని అదే ఇంటికొస్తాడు. మందు పార్టీ చేసుకుంటారు. పార్టీలో పాల్గొంటూనే ఆ ఇంట్లో తాము ముగ్గురం కాకుండా ఇంకెవరో ఉన్నారని పోలీస్ వ్యక్తి అనుమానంగా ఉంటాడు. ఇంటి వెనకాల అతను చూసిన వస్తువులు అతని అనుమానాన్ని మరింత పెంచుతాయి. దాంతోపాటు డాక్టర్ ఆనంద్ బంధించిన మహిళలు కూడా అతని కంటబడతారు. అయితే, అనూహ్యంగా డాక్టర్ ఆనంద్ ఆ పోలీస్ వ్యక్తిని చంపేయడంతో అసలు కథ మొదలవుతుంది. డాక్టర్ ఇంట్లో లాక్ అయిన ఆ వ్యక్తులు ఎలా బయటపడ్డారు. అసలు ఆనంద్ వెనకున్న మిస్టరీ ఏంటీ అనేది ప్రధాన కథ. (చదవండి: అది అదృష్టంగా భావిస్తున్నా) విశ్లేషణ: కథలో చాలా భాగం ఒక ఇంట్లోనే జరుగుతుండటంతో స్క్రీన్ ప్లే చక్కగా కుదిరింది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. నలుగురికి మంచి జరిగేందుకు ఒక్కడు చనిపోతే ఫరవాలేదని కథాంశం. అయితే, ఆ ఒక్కరు ఎవరేనేది ప్రశ్న! ఇక కథానాయకుడు ఆనంద్ పాత్రలో సత్యదేవ్ చక్కగా నటించాడు. మనసున్న డాక్టర్‌గా, సైకో థ్రిల్లర్‌గా రెండు కోణాలున్న పాత్రలో ఒదిగిపోయాడు. మొత్తం ఏడు ఏపిసోడ్లుగా ఉన్న ఈ సిరీస్‌లో తొలి మూడు ఎపిసోడ్లు పాత్రల పరిచయంతో సరదాగా సాగిపోగా.. నాలుగో ఎపిసోడ్ నుంచి థ్రిలింగ్ మొదలవుతుంది. ఇక లాక్డ్ ప్రేక్షకుల్ని కట్టిపడేయడంలో సక్సెస్ అయిందంటే సినిమాటోగ్రఫీ మూలంగానే. దాంతోపాటు సన్నివేశాలకు తగ్గట్టుగా ప్రశాంత్ శ్రీనివాస్ మ్యూజిక్ కంపోజిషన్ నటన పరంగా సీనియర్ నటి శ్రీలక్ష్మీ చాలా రోజుల తర్వాత ఓ మంచి, ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించి మెప్పించారు. సంయుక్త, వాసు ఇంటూరి, అభిరామ్ వర్మ తమ పరిధి మేరకు నటించారు. ఆపరేషన్లకు సంబంధించి ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కీలకంగా పనిచేసింది. మొత్తంగా నిర్మాణ విలువలు బాగున్నాయి. అక్కడక్కడా లాజికల్‌గా కొన్ని సీన్లు కన్ఫ్యూజ్ చేస్తాయి. ప్రేక్షకులు థ్రిల్‌ను కోరుకున్నప్పటికీ.. మరీ ఎక్కువ సేపు చీకటి వాతావరణకం కొంచెం విసుగ్గా తోచే అవకాశముంది. క్లైమాక్స్‌లో కొంచెం క్లారిటీ మిస్ అయినట్టుగా ఉంది. అయితే, ఈ సిరీస్‌కు రెండో పార్ట్ కూడా తీసే ఉద్దేశంతో ఫుల్ క్లారిటీ ఇవ్వలేదేమో! (చదవండి: ఇంట్లోనే విడాకుల వాదనలు వకాలత్ ఫ్రమ్ హోమ్) బలం: కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, సత్యదేవ్ నటన బలహీనతలు కొన్ని చోట్ల లాజికల్‌గా సెట్ కానీ సీన్లు సిరీస్ అధిక భాగం చీకట్లో ఉండటం. -
కారు డోర్ లాక్ అయి బాలుడు మృతి
సాక్షి, కొవ్వూరు రూరల్: కారులోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఏడేళ్ల బాలుడు సాయిబాబా ఊపిరి ఆడక మృతిచెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన కళ్లేపల్లి రాధా కుమార్తె లక్ష్మికి దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన అనిశెట్టి శ్రీనివాసరావుతో వివాహం జరిపించారు. వారికి ఇద్దరు పిల్లలు. సాయిబాబా (7), రెండేళ్ల కుమార్తె వైసు ఉన్నారు. శ్రీనివాసరావు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో లక్ష్మి ఇద్దరు పిల్లలతోపాటు దొమ్మేరులో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. సోమవారం సాయిబాబా ఆడుకుంటూ అక్కడ పార్క్ చేసి ఉన్న కారులోకి ఎక్కాడు. డోర్ వేసుకోవడంతో లాక్‌పడింది. కొంతసేపటికి ఊపిరి ఆడక మృతిచెందాడు. సాయంత్రం కారు వద్దకు వచ్చి డోర్ తీసిన యజమాని లోపల బాలుడు మరణించి ఉండటాన్ని గుర్తించారు. చిన్నారి మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. -
యడ్యూరప్ప కార్యాలయానికి తాళం
జయనగర: విధాన సౌధలోని మూడో అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయానికి తాళం పడింది. గురువారం ఉదయం ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన అనంతరం విధాన సౌధ మూడవ అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయం చేరుకున్నారు. యడ్యూరప్ప పూజలు నిర్వహించి సీఎం సీటులో ఆశీనులయ్యారు. కొన్ని గంటలపాటు అక్కడే గడిపారు. కార్యాలయం ముందు సిద్దరామయ్య బోర్డు తొలగించి యడ్యూరప్ప నామఫలకం కూడా తగిలించారు. అయితే శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయానికి తాళం పడింది. బలపరీక్ష నెగ్గేవరకు పాలనాపరమైన ఎలాంటి నిర్ణయాలను తీసుకోరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో విధానసౌధ అధికారులు ముఖ్యమంత్రి యడ్యూరప్ప కార్యాలయానికి తాళంవేశారు. -
మూడేళ్ల నుంచి బందీగా యువకుడు
జయపురం(ఒరిస్సా) : మానవత్వం మంట గలిసిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది కొరాపుట్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన. గ్రామస్తుల కఠిన వైఖరితో ఓ యువకుడు(20) మూడేళ్లుగా పశువుల శాల లాంటి గదిలో చేతులకు గొలుసులతో బందీగా ఉన్నాడు. ఈ విషయం జిల్లా అధికార యంత్రాం గాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ సంఘటన జిల్లా ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న వెంటనే సంబంధిత అధికారులు ఆ యువకుడిని విముక్తిడిని చేసి కొరాపుట్ సహిధ్ లక్ష్మణ నాయక్ వైద్య కళాశాల హాస్పిటల్లో చేర్చా రు. వివరాలిలా ఉన్నాయి. కొరాపుట్ జిల్లాలోని దశమంతపూర్ సమితి ముజంగ గ్రామ పంచాయతీలోని మారుమూల గ్రామంలో ఈ సంఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన యువకుడిని మానసిక వ్యాధి గ్రస్తుడుగా గ్రామస్తులు నిర్ధారించిన తరువాత గొలుసులతో బంధించి పశువుల శాల లాంటి ఒక చీకటి గదిలో బంధించారు. ఆ యువకుడి సోదరి ప్రతిరోజూ ఆహారం తీసుకువచ్చి తినిపిస్తోంది. అతని మరో సోదరుడు ఆ గ్రామంలోనే వేరే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. వారి తల్లిదండ్రులు మూడేళ్ల కిందట మరణించారు. తల్లి దండ్రులు ఉన్నంత వరకు ఆ యువకుడు మంచి ప్రవర్తన కలిగి, కూలి పనులు చేస్తుండేవాడు. అయితే తల్లిదండ్రులు పోయిన తరువాత ఆ యువకుడు అంతవరకు పనిచేస్తున్న కాంట్రాక్టర్ దగ్గర పని మానివేశాడు. అందుకు ఆ యువకుడి మానసిక పరిస్థితే కారణమని గ్రామస్తులు అంటున్నారు. నాటి నుంచి ఆ యువకుడు ప్రజలపైన, ఇళ్ల పైకప్పులపై రాళ్లు విసరడం చేస్తుండేవాడు. దీంతో ఇళ్లపై వేసిన సిమెంట్ రేకులు పగిలిపోవడం, ప్రజలకు దెబ్బలు తగలడం తదితర నష్టాలు సంభవించేవి. ఈ నేపథ్యంలో గ్రామప్రజలు ఏకమై నిర్ణయం తీసుకుని ఆ యువకుడిని బయటకు రాకుండా బంధించాలని తీర్మానించి ఒక ఇంటిలో బంధించి చేతులకు గొలుసులు కట్టి తాళం వేశారు. ఆ యువకుడిని హాస్పిటల్‌కు కూడా తీసుకువెళ్లకుండా స్థానిక నాటు వైద్యునితో చికిత్స చేయించారు. అయినా ఏమాత్రం నయం కాలేదు. పాత్రికేయుని చొరవతో వెలుగులోకి ఆ ప్రాంతానికి చెందిన ఓ పాత్రికేయుడు ఈ విషయం తెలుసుకుని వెలుగులోకి తీసుకు రావడంతో జిల్లా అధికారులు వెంటనే స్పందించి వెంటనే విషయం తెలుసుకోవాలని డీసీపీఓను ఆదేశించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు డీసీపీఓ రాజశ్రీ దాస్ వెంటనే ఆ గ్రామానికి వెళ్లి గొలుసులతో కట్టి తాళాలు వేసి బందీని చేసిన యువకుడిని చూసి గ్రామ ప్రజలతో చర్చించి విషయాలు తెలుసుకున్నారు. ఆమె ఈ విషయంపై సహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాల వైద్యులతో చర్చించగా ఆ యువకుడికి ఉచితంగా వైద్యం చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. నిరక్షరాస్యత, మూఢాచారాలు, అమాయకత్వం, పేదరికం, తాండవించే మారుమూల గ్రామాల్లో ఇలాంటి అనేక అవాంఛనీయ సంఘటనలు సంభవిస్తుండడం పరిపాటిగా మారింది. అటువంటి పాంతాలపై పత్రికా రంగం, జిల్లా అధికార యంత్రాంగం, సమాజసేవకులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తే ఇటువంటి వాటిని అరికట్టవచ్చని సీనియర్ పాత్రికేయులు సీహెచ్ శాంతాకర్ అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా అలాంటి మారుమూల గ్రామాల ప్రజలను చైతన్య పరిచేందుకు సామూహిక ఉద్యమం అవసరమని పలువురు పరిశీలకులు సూచిస్తున్నారు. -
కాంగ్రెస్ ఆఫీసుకు తాళాలు
జయపురం : జయపురంలో గల జిల్లా కాంగ్రెస్ కార్యాలయం భవనాలకు తాళాలు వేలాడుతున్నాయి. అయితే తాళాలు ఎవరు వేశారోనని కాంగ్రెస్ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి రోజూ కార్యాలయానికి వచ్చి కూర్చునే పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు రెండు రోజుల నుంచి పార్టీ కార్యాలయానికి తాళాలు వేసి ఉండడంతో చూసి షాక్ అయ్యారు. ముఖ్యంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ చంద్ర నేపక్, ఎస్సీ కాంగ్రెస్ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు రామనాయక్, పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు కాంత పాఢి, ఇటీవల ఏఐసీసీ సభ్యుడిగా నియమితుడైన రవీంద్ర మహాపాత్రో, రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ బిరెన్ మోహన్ పట్నాయక్ తదితర ముఖ్యలతో పాటు కొంతమంది పార్టీ కార్యకర్తలు ప్రతిరోజు పార్టీ కార్యాలయంలో కూర్చుని ముచ్చటించుకోవడం పరిపాటి. అలా గే పార్టీ కార్యాలయానికి వచ్చే వార్తా పత్రికలను చదివేవారు. వీరి లో ఎక్కువమంది ఎంఎల్ఏ గురించే చర్చించుకునే వారు. అయితే బుధవారం వారు వచ్చే సరికి కార్యాలయ ప్రధాన గేటుతో పాటు లోపల గేటుకు, కార్యాలయ తలుపులకు తా ళాలు వేసి ఉండడంతో కంగుతున్నారు. అసలు ఈ కార్యాలయానికి ఎవరు తాళాలు వేశారన్నది చర్చనీయా ంశమైంది. ఈ పని స్థానిక ఎంఎల్ఏ తారాప్రసాద్ బాహిణీపతి అనుచరులదేనని కొంత మంది అనుమానిస్తున్నారు. అయితే ఇంతవరకు తాళాలు ఎవరు వేశారో వెల్లడి కాలేదు. ఈ పరిణామం జయపురంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు దర్పణం పడుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నేటి వరకు కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే పార్టీలో విభేదాలు మాత్రం కొనసాగుతున్నాయి. -
తాడేపల్లిగూడెం సబ్‌జైలుకు తాళం
-
ట్విన్ సిస్టర్స్‌ను మింగేసిన కారు
గుర్గావ్: హృదయాన్ని కలచి వేసే దుర్ఘటన ఇది. ముద్దులొలికే కవల పిల్లలు బలైపోయారు. అప్పటిదాకా అమ్మమ్మ తాతాయ్యలతో వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన అక్కాచెల్లెళ్లు(5) కానరాని తీరాలకు చేరడం ఆ కుటుంబంలో అంతులేని దుఃఖాన్ని మిగిల్చింది. గుర్గావ్ లో బుధవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. మీరట్‌లో ఆర్మీ అధికారిగా పనిచేస్తున్న గోవింద్ కవల పిల్లలు హర్ష , హర్షిత వేసవి సెలవుల్లో పటౌడీ, జమల్ పూర్ గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. అక్కడున్న చిన్నకుక్క పిల్లలతో ఆడుకోవడం అలవాటైంది. ఈ క్రమంలో సమీపంలో పార్క్ చేసిన ఉన్న కారులోకి ఎలా వెళ్లారో తెలియదుగానీ...అనుకోకుండా కార్ డోర్స లాక్ అయిపోయాయి. దాదాపు రెండు గంటలపాటు అలా కారులోనే ఉండిపోయారు. ఇంతలో పిల్లలు కనిపించడకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెదుకులాట ప్రారంభించారు. చివరికి సాయంత్రం 6.15గం.లకు ఇంటిముందు పార్క్‌చేసినున్న కారు ముందు సీటులో ఒకరు, వెనుక సీటులో అపస్మారక స్థితిలో పడి వుండగా గమనించారు. దీంతో కారు తలుపులు పగుల గొట్టి చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం జరిగింది. సుమారు 4.45 ని.లకు పిల్లలకు లెమన్ డ్రింక్ ఇచ్చినట్టు తాత కన్వర్ సింగ్ చెప్పారు. బుధవారం వీరు మీరట్ వెళ్లాల్సి ఉందనీ, ఇంతలోనే తమ బిడ్డలు ఇక ఎప్పటికీ లేకుండా పోయారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే గోవింద్ కజిన్‌కు చెందిన ఈ కారు గత కొన్ని నెలలుగా వాడడంలేదని తెలుస్తోంది. కారు తలుపులు, విండోస్ లాక్ అవడం వల్లనే పాపలు చనిపోయినట్టు బిలాస్పూర్ పోలీస్ స్టేషన్ ఎఎస్ఐ మహేష్ కుమార్ ధృవీకరించారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు చెప్పారు. -
కాండ్రకోట పీహెచ్‌సీకి తాళాలు
స్టాఫ్‌నర్సు, సిబ్బంది తీరుపై ఆందోళన కుక్కకాటుకు గురైన చిన్నారికి అందని వైద్యం రాజమండ్రి ఆస్పత్రికి తరలింపు కాండ్రకోట (పెద్దాపురం) : స్థానిక 24 గంటల ఆస్పత్రిలో యాంటీ రేబిస్ వ్యాక్సి¯ŒS అందుబాటులో లేకపోవడం, గ్రామంలో స్టాఫ్‌నర్సు వైద్య సేవలు అందించకపోవడాన్నిS నిరసనగా కాండ్రకోట గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. పీహెచ్‌సీకి వారు తాళాలు వేసి అక్కడ బైఠాయించారు. ఉదయం 10.30కు కూడా సిబ్బంది రాలేదని వారు నిరసన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు జోకా నానాజీ మనుమరాలు లంకా పావనిశ్రీని బుధవారం సాయంత్రం కుక్క కరిచింది. ఆస్పత్రిలో సిబ్బంది లేకపోవడంతో గ్రామంలో ఉంటున్న స్టాఫ్‌నర్సు రామలక్షి్మకి ఫో¯ŒS చేశారు. అయితే రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేదని, రావడం కష్టమని సమాధానం చెప్పడంతో ఆ బాలికను రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో, ఆస్పత్రి నిర్వహణ, సిబ్బంది పనితీరుకు నిరసనగా గురువారం ఉదయం నానాజీ, గవరసాని సూరిబాబు, జోకా సీతబాబు, గంటా రామస్వామి, పల్లా గంగారావు, గంటా శేషు, సత్తిబాబు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలోకి సిబ్బందిని వెళ్లనీయలేదు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రావాలి్సందేనని భీష్మించారు. ఆస్పత్రి వైద్యురాలు జె.శ్రీలత వారిని వారించినా వారు పట్టు వీడలేదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, వ్యాక్సి¯ŒS ఇప్పుడు అందుబాటులో ఉందన్నారు. స్టాఫ్‌నర్సు రామలక్షి్మపై చర్యలు ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తానని, ఇలాంటి పొరబాటు భవిష్యత్‌లో తిరిగి జరగకుండా చూస్తామని ఆమె హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. -
తణుకులో భారీ చోరీ
తణుకు: తణుకులోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో చోరీ జరిగింది. తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొం గలు అరవై రెండున్నర కాసుల బంగారు ఆభరణాలు, నాలుగు కిలోల వెండి వస్తువులు అపహరించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సజ్జాపురంలోని హరిశ్చంద్ర టవర్స్ ఫేజ్–2లోని 405 ఫ్లాట్‌లో చిరుకూరి సుధ కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా ఈనెల 17న కుటుంబ సభ్యులంతా పుట్టపర్తి వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు చొరబడ్డారు. గురువారం రాత్రి 11 గంటల తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు అపార్టుమెంటులోకి చొరబడి ఫ్లాట్ తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలోని అరవై రెండున్నర కాసుల బంగారు ఆభరణాలతోపాటు నాలుగు కిలోల వెండి వస్తువులు దోచుకుపోయారు. ఇంటి ప్రధాన గుమ్మం గొళ్లెం విరగ్గొట్టిన దుండగులు చాకచక్యంగా లోనికి ప్రవేశించి ఇనుప బీరువాను మంచంపై పడుకోబెట్టి మరీ పగులగొట్టారు. ముందుగానే రెక్కీ నిర్వహించుకుని చోరీకి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. అదను చూసి దోచేశారు కుటుంబ యజమానికి బ్యాంకు లాకర్ ఉండటంతో కొన్ని బంగారు ఆభరణాలు బ్యాంకులో దాచుకున్నారు. మిగిలిన ఆభరణాల కోసం మరో లాకర్ అడగటంతో సోమవారం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఆభరణాలను ఇంట్లో ఉంచి పుట్టపర్తి వెళ్లడం దొంగలకు అదనుగా మారింది. సంఘటనా స్థలాన్ని సీఐ చింతా రాంబాబు, పట్టణ ఎస్సై జి.శ్రీనివాసరావు పరిశీలించి బా«ధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ పరిశీలించి ఆధారాలు సేకరించారు. వాచ్మెన్ ఉన్నా.. సజ్జాపురంలోని హరిశ్చంద్ర టవర్స్‌లోకి ప్రవేశించా లంటే ముందు ఉన్న హరిశ్చంద్ర టవర్స్ ఫేజ్–1 పక్క నుంచి వెళ్లాలి. అపార్టుమెంట్‌కు వాచ్మెన్ ఉన్నా దుండగులు చాకచక్యంగా మెట్లదారి గుండా ప్రవేశించినట్టు తెలుస్తోంది. అయితే గతంలో ఇదే అపార్టుమెంట్లో పట్టణ పోలీసులు సమావేశం ఏర్పాటు చేసి చోరీలపై అవగాహన కల్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించినా కెమెరాలు లేవు. ఇంట్లో అంతా నిద్రిస్తుండగా.. కొవ్వూరు: కొవ్వూరు మండలంలోని ఆరికిరేవులలో మల్లిపూడి పెరుమళ్లరావు అనే వ్యక్తి ఇంట్లో గురువా రం రాత్రి దొంగలు పడ్డారు. రెండు కాసుల బంగారు ఉంగరాలు, 15 తులాల వెండి సామగ్రి దోచుకుపోయారు. వివరాలిలా ఉన్నాయి.. పెరుమళ్లరావు తన చిన్నాన్నతో కలిసి రాత్రి కొవ్వూరు సినిమాకి వెళ్లారు. ఆ సమయంలో అతని తల్లిదండ్రులు ఇంట్లోనే నిద్రిస్తున్నారు. సినిమా చూసి రాత్రి 12.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. ఉదయం నిద్రలేచి చూ సేసరికి బీరువా తలుపులు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్టు గుర్తించారు. బీరువాలోని రెండు బంగారు ఉంగరాలు, 15 తులాల వెండి సామగ్రి కనిపించడం లేదని పెరుమళ్లరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై డి.గంగాభవాని తెలిపారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
మోత్కూరు: తాళం వేసిన ఇంట్లోకి చొరబడి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి మోత్కూరు మండలంలోని ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ మందుల విజయ–కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పట్టేటి యాదగిరి తన భార్య అనారోగ్యం భారిన పడటంతో ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లారు. గమనించిన దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో దాచిన రూ.30 వేలను అపహరించుకుపోయారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
భువనగిరి అర్బన్ : తాళం వేసి ఉన్న ఇంట్లో బంగారు నగలు, నగదు అపహరించుకుపోయారు. ఈ సంఘటన మండలంలోని వీరవెల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వీరవెల్లి గ్రామ పరిధిలోని పొలిశెట్టి జోజప్ప వ్యవసాయం చేసుకుంటూ, తనకున్న ట్యాక్సీ కారును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన ఇంట్లో తనతో పాటు భార్య మరియమ్మ ఉంటారు. రోజులాగే భార్యభర్తలు రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి ఇంటి ముందు నిద్రించారు. ఇది గమనించి గుర్తు తెలియని వ్యక్తులు తాళం తీసి ఇంట్లోకి వెళ్లారు. బీరువా తలుపులు తీసి అందులో ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలు, 14 తులాల వెండీ, రూ.20 వేల నగదును అపహరించుకుపోయారు. తెల్లవారుజామున లేచి చూడగానే తలుపులు తీసి, లైట్లు వేసి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువ తెరచి ఉంది. అందులో ఉన్న నగలు, నగదు కనబడక పోవడంతో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులు, గ్రామస్తులకు సమచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇంటి పరిసరాలను పరిశీలించారు. అనంతరం నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఇంటి పరిసరాలను, చుట్టు పక్కల ఇళ్లను పరిశీలించారు. జోజప్ప ఫిర్యాదుతో కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ సాజిదుల్లా తెలిపారు. -
రైల్వే ఆర్పీఎఫ్ కార్యాలయానికి తాళాలు
చిట్టినగర్: విజయవాడలోని రైల్వే ఆర్పీఎఫ్ కార్యాలయానికి నగర పాలక సంస్థ అధికారులు శనివారం మధ్యాహ్నం తాళాలు వేశారు. ఓ కాల్వ నిర్మాణ పనుల విషయమై ఆర్పీఎఫ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో.. ప్రతిగా కార్యాలయానికి తాళం వేసి మున్సిపల్ అధికారులు తమ తడాఖా చూపించారు. కేఎల్‌రావు నగర్లో అవుట్‌పాల్ డ్రెయిన్ పనులను వీఎంసీ అధికారులు చేపట్టారు. వీటిని ఆర్పీఎఫ్ సిబ్బంది అడ్డుకోవడంతో వారి మధ్య వివాదానికి దారి తీసింది. ఆర్పీఎఫ్ వైఖరిపై వీఎంసీ అధికారులకు చిర్రెత్తుకురావడంతో...తమకు బకాయిపడ్డ పన్నులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్పీఎఫ్ కార్యాలయానికి తాళాలు వేశారు. -
అద్దె చెల్లించలేదని పోస్టాఫీసుకు తాళం
తిరుపతి అర్బన్: చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్ మండలం పెరుమాళ్లపల్లి గ్రామంలోని సబ్‌పోస్టాఫీసుకు అద్దె చెల్లించలేదన్న కారణంగా మంగళవారం ఉదయం తాళం వేశారు. ఏడాది పాటు అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని మంగళవారం తాళం వేశాడు. ఎన్నిసార్లు అడిగినా, నోటీసులు ఇచ్చినా పోస్టల్ యాజమాన్యం స్పందించకపోవడంతో విధిలేక పోస్టాపీసుకు తాళం వేశానని యజమాని చెబుతున్నారు. -
పోచమ్మ ఆలయానికి తాళం వేసిన పోలీసులు
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడలోని పోచమ్మ ఆలయానికి పోలీసులు మంగళవారం తాళాలు వేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. గ్రామ సర్పంచ్ సునీతా రాజ్‌కుమార్, మాజీ సర్పంచ్ కసూర్తి నరేందర్ మధ్య విబేధాలే తాజా పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ఇరు వర్గాలూ దసరా ఉత్సవాల నిర్వహణకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ సోమవారం ఇరు వర్గాలతో సమావేశమయ్యారు. సర్పంచ్, మాజీ సర్పంచ్ వర్గాల నుంచి చెరో ఏడుగురు చొప్పున మొత్తం 14 మందితో కమిటీ వేసుకుని దసరా ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో సర్పంచ్ సునీతా రాజ్‌కుమార్ ఏడుగురి పేర్లను ఇచ్చారు. అయితే, కస్తూరి నరేందర్ వర్గం నుంచి పేర్లను ప్రకటించలేదు. దీంతో పోచమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సర్పంచ్ సునీతా రాజ్‌కుమార్ వర్గీయులు సమాయత్తం అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని తాళాలు వేశారు. మాజీ సర్పంచ్ వర్గీయులు కూడా వస్తే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగే ప్రమాదం ఉందన్న ముందస్తు జాగ్రత్తతో చర్యలు తీసుకున్నారు. -
లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు
ప్రకాశం: ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా సింగరకొండ సమీపంలో అద్దంకి రూరల్ మండలం వేల్చూరు సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి వస్తున్న సప్తగిరి ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో బస్సు డోర్లు లాకయ్యాయి. ఈ ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడినప్పటికీ బస్సు డోర్లు లాక్ కావడంతో ప్రయాణీకులు బస్సులోనే ఇరుక్కు పోయారు. దీంతో చేసేదేమీలేక ప్రయాణికులతో అలానే బస్సును ఒంగోలు వరకు తీసుకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కారు డోర్ లాక్ కావడంతో బాలుడి మృతి
-
పోస్టాఫీసులకు తాళాలు
గుంటూరు : గ్రామీణ తపాలా ఉద్యోగుల ఆందోళన మరింత ఉధృత రూపం దాల్చింది. గురువారం గుంటూరు జిల్లా రేపల్లెలో ప్రధాన పోస్టాఫీసుతోపాటు సబ్ పోస్టాఫీసులకు ఉద్యోగులు తాళాలు వేసి నిరసన తెలిపారు. ప్రధాన తపాలా ఉద్యోగుల వేతనాల స్థాయిలో తమకూ వేతనాలు ఇవ్వాలని, ఇందుకోసం జ్యుడీషియల్ కమిటీ వేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు ఏఐటీయూసీ, సీఐటీయూ తదితర కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. (రేపల్లె)