ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీలికవర్గం నేత అజిత్ పవార్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర సచివాలయం సమీపంలోని రాష్ట్రవాది భవన్‌ను పార్టీ వ్యవహారాల కోసం నూతన కార్యాలయంగా వాడుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. భవనాన్ని స్వాధీనం చేసుకోవడానికి అజిత్ పవార్ వర్గం నేతలు మంగళవారం అక్కడికి వెళ్లగా తలుపులకు తాళంవేసి ఉండడంతో నిరాశ చెందారు.
కొందరు యువకులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. కానీ లోపలి గదులకు తాళాలు వేసి ఉండడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. రాష్ట్రవాది భవన్‌లో గతంలో మహారాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేత అయిన అంబదాస్ దన్వే నివసించారు. ప్రభుత్వం మరో భవనం కేటాయించడంతో ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇలాఉండగా, అసలైన ఎన్సీపీ తమదేనని అజిత్, శరద్ పవార్ వర్గాలు వాదిస్తున్నాయి. ఏ వర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment