office use
-
అజిత్ పవార్‌కు చేదు అనుభవం
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీలికవర్గం నేత అజిత్ పవార్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర సచివాలయం సమీపంలోని రాష్ట్రవాది భవన్‌ను పార్టీ వ్యవహారాల కోసం నూతన కార్యాలయంగా వాడుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. భవనాన్ని స్వాధీనం చేసుకోవడానికి అజిత్ పవార్ వర్గం నేతలు మంగళవారం అక్కడికి వెళ్లగా తలుపులకు తాళంవేసి ఉండడంతో నిరాశ చెందారు. కొందరు యువకులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. కానీ లోపలి గదులకు తాళాలు వేసి ఉండడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. రాష్ట్రవాది భవన్లో గతంలో మహారాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేత అయిన అంబదాస్ దన్వే నివసించారు. ప్రభుత్వం మరో భవనం కేటాయించడంతో ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇలాఉండగా, అసలైన ఎన్సీపీ తమదేనని అజిత్, శరద్ పవార్ వర్గాలు వాదిస్తున్నాయి. ఏ వర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
ఆఫీసు వాడకానికి ఫేస్బుక్ నుంచి కొత్త వెబ్సైట్!
లింక్డ్ ఇన్ లాంటి సైట్లతో పోటీ పడేందుకు ఆఫీస్ వెర్షన్ ఒకటి ప్రారంభించాలని ఫేస్బుక్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 'ఫేస్బుక్ ఎట్ వర్క్' అనే సైట్ ద్వారా సహోద్యోగులతో చాట్ చేయడానికి, ప్రొఫెషనల్ కాంటాక్టులు పెంచుకోడానికి, డాక్యుమెంట్లు పంచుకోడానికి వీలవుతుందని, దీనిపై చాలా రహస్యంగా పని జరుగుతోందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. రెండో త్రైమాసికంలో ఫేస్‌బుక్‌కు రూ. 4900 కోట్ల లాభం వచ్చింది. ఇది గత సంవత్సరం నాటి దానికంటే దాదాపు రెట్టింపు. ఈ ఫలితాల ప్రకటన సందర్భంలోనే ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ ఈ కొత్త సైట్ విషయాన్ని చూచాయగా చెప్పారు. పెట్టుబడుల విషయంలో తాము మరింత దూకుడుగా వ్యవహరిస్తామని, కంప్యూటింగ్ ప్లాట్‌ఫారాలలో తర్వాతి తరాన్ని రూపొందిస్తామని అన్నారు. ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉందని చెప్పారు. 2004లో కాలేజిలో సహ విద్యార్థులతో కలవడానికి నెట్వర్కింగ్ సైట్‌గా ఫేస్‌బుక్‌ను హార్వర్డ్ కాలేజి స్నేహితులతో కలిసి జుకెర్బెర్గ్ స్థాపించారు.