ఆఫీసు వాడకానికి ఫేస్బుక్ నుంచి కొత్త వెబ్సైట్! | Facebook working on new site for office use | Sakshi
Sakshi News home page

ఆఫీసు వాడకానికి ఫేస్బుక్ నుంచి కొత్త వెబ్సైట్!

Published Mon, Nov 17 2014 12:57 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఆఫీసు వాడకానికి ఫేస్బుక్ నుంచి కొత్త వెబ్సైట్! - Sakshi

ఆఫీసు వాడకానికి ఫేస్బుక్ నుంచి కొత్త వెబ్సైట్!

లింక్డ్ ఇన్ లాంటి సైట్లతో పోటీ పడేందుకు ఆఫీస్ వెర్షన్ ఒకటి ప్రారంభించాలని ఫేస్బుక్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 'ఫేస్బుక్ ఎట్ వర్క్' అనే  సైట్ ద్వారా సహోద్యోగులతో చాట్ చేయడానికి, ప్రొఫెషనల్ కాంటాక్టులు పెంచుకోడానికి, డాక్యుమెంట్లు పంచుకోడానికి వీలవుతుందని, దీనిపై చాలా రహస్యంగా పని జరుగుతోందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. రెండో త్రైమాసికంలో ఫేస్బుక్కు రూ. 4900 కోట్ల లాభం వచ్చింది. ఇది గత సంవత్సరం నాటి దానికంటే దాదాపు రెట్టింపు.

ఈ ఫలితాల ప్రకటన సందర్భంలోనే ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ ఈ కొత్త సైట్ విషయాన్ని చూచాయగా చెప్పారు. పెట్టుబడుల విషయంలో తాము మరింత దూకుడుగా వ్యవహరిస్తామని, కంప్యూటింగ్ ప్లాట్ఫారాలలో తర్వాతి తరాన్ని రూపొందిస్తామని అన్నారు. ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉందని చెప్పారు. 2004లో కాలేజిలో సహ విద్యార్థులతో కలవడానికి నెట్వర్కింగ్ సైట్గా ఫేస్బుక్ను హార్వర్డ్ కాలేజి స్నేహితులతో కలిసి జుకెర్బెర్గ్ స్థాపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement