Maharashtra Political Crisis
-
Maharashtra political crisis: పవార్ X పవార్
మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో పోరు ముదురుతోంది. ఎన్సీపీ ఎవరిది? శరద్ పవార్‌దా? అజిత్ పవార్‌దా? ఎవరికి వారే పార్టీ తమదేనని వాదిస్తున్నారు. చిన్నాన్నపై ఎదురు తిరిగి అధికార బీజేపీ కూటమితో కలిసిపోయిన అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక పార్టీ అధ్యక్ష పదవి నుంచి శరద్ పవార్‌ను తొలగించామని తమదే అసలైన ఎన్సీపీ అంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్సీపీ ఎన్నికల గుర్తు గడియారం తమకే కేటాయించాలని ఆ లేఖలో కోరారు. ఆ మర్నాడే జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన శరద్ పవార్ తానే అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. ఇలా ఇరు వర్గాలు పోటాపోటీగా బలప్రదర్శన కోసం సమావేశాలు ఏర్పాటు చేస్తూ మహారాష్ట్రలో రాజకీయ వేడిని పెంచాయి. పారీ్టల్లో చీలికలు, ఏది అసలు సిసలు పార్టీ అన్న ప్రశ్నలు కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్తేం కాదు. ఇదే ఏడాది మహారాష్ట్రలో శివసేనలో చీలికలు ఏర్పడినప్పుడు ఏక్నాథ్ షిండే చీలిక వర్గానికే విల్లు బాణాలు గుర్తుని కేటాయించి అదే అసలైన శివసేన అంటూ ఈసీ తేల్చి చెప్పింది. ఇప్పుడు ఎన్సీపీ వంతు వచి్చంది. ఎవరి బలాలు ఏంటి? మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకున్న 53 మంది ఎమ్మెల్యేలకు గాను ప్రస్తుతానికి 32 మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట ఉన్నారు. ఆ సంఖ్య 36కి చేరుకుంటే ఎలాంటి అనర్హత వేటు లేకుండా అధికార పక్షంలో కలిసిపోవచ్చు. ఇక ఎన్నికల గుర్తు రావాలన్నా మెజారీ్టయే కీలకం. అజిత్ పవార్ నాలుగు దశాబ్దాలుగా ఎన్సీపీలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఆయనకు పట్టు ఉంది. ఎంతో మంది కార్యకర్తలు, జిల్లా స్థాయి నాయకుల మద్దతు అజిత్ పవార్‌కు ఉంది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన బలం మరింత పెరిగే అవకాశాలున్నాయి. అయితే పవార్‌కు ఇలా పార్టీని వీడడం కొత్త కాదు. గతంలో పలు మార్లు బయటకు వచ్చి తిరిగి శరద్ పవార్‌కే జై కొట్టిన సందర్భాలున్నాయి. అందుకే ఎమ్మెల్యేలు ఆయనను ఎంతవరకు నమ్ముతారన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ, శివసేన (షిండే వర్గం)తో కలిసి పోటీ చేస్తే టికెట్లు ఎంతమందికి వస్తాయన్న అనుమానాలు ఉన్నాయి. ఎన్డీయేతో కలిస్తే ముస్లిం, దళిత ఓట్లు పోగొట్టుకుంటామన్న ఆందోళన కూడా చాలా మంది ఎమ్మెల్యేల్లో ఉంది. అందుకే ఆఖరి నిమిషంలో ఎంతమంది అజిత్ పవార్ వెంట నడుస్తారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఇక మహారాష్ట్ర దిగ్గజ నాయకుడిగా శరద్ పవార్‌కున్న పాపులారిటీయే వేరు. గత కొన్ని దశాబ్దాలుగా గౌరవప్రదమైన రాజకీయ నాయకుడిగా హోదా అనుభవిస్తున్నారు. ఆయన కనుసైగ చేస్తే చాలు ఎలాంటి పనినైనా చక్కపెట్టగల అనుచరగణం ఉంది. 82 ఏళ్ల శరద్ పవార్‌కు ఆయన వయసే ప్రతిబంధకంగా మారింది. మెజారీ్టయే శిరోధార్యం ఏ పారీ్టలోనైనా మెజార్టీ ఎమ్మెల్యేలు, పార్టీలో జిల్లా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అత్యధికులు ఎవరివైపు ఉంటే వారిదే అసలైన పార్టీ అని ఈసీ తేలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు నిర్వహించి పార్టీని స్థాపించిన వారు కాకుండా మెజార్టీ ఎవరి వైపు ఉంటే వారికే పారీ్టని, గుర్తుని కేటాయిస్తుంది. 1968లో ఎన్నికల గుర్తుకు సంబంధించిన స్పష్టమైన ఉత్తర్వులున్నాయి. ఈ ఉత్తర్వుల కింద మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పారీ్టలో చీలికల కేసుని పరిష్కరించారు.1969లో కె.కామరాజ్, నీలం సంజీవరెడ్డి, ఎస్. నిజలింగప్ప, అత్యుల ఘోష్ వంటి నాయకులు ఒక్కటై ఇందిరాగాందీని పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో పార్టీ రెండుగా విడిపోయింది. నిజలింగప్ప ఆధ్వర్యంలో పాత కాంగ్రెస్‌కే అధికారిక గుర్తు కాడెద్దులు గుర్తు దక్కింది. 1968కి ముందు ఎన్నికల నిబంధనలు, 1961 కింద కార్యనిర్వాహక ఉత్తర్వుల జారీతో ఈసీ ఈ వివాదాన్ని పరిష్కరించేది. 1964లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) చీలిక అతి పెద్దదిగా చెప్పుకోవాలి. సీపీఐ (మార్క్సిస్టు) వర్గం తమని ప్రత్యేక పారీ్టగా గుర్తించాలని కోరింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎంపీలు మద్దతుగా ఉన్నట్టుగా ఈసీకి లేఖ సమరి్పంచింది. ఏదేమైనా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరి వెంట ఎక్కువ మంది ఉంటే వారిదే అసలు సిసలు పారీ్టగా ఎన్నికల సంఘం గుర్తించడం ఆనవాయితీగా వస్తోంది. లోక్‌సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ? మహారాష్ట్ర ఎన్సీపీలో సంక్షోభం వచ్చే లోక్‌సభ ఎన్నికలపై పడే ప్రభావంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. బీజేపీ వెనక ఉండి నడిపించినట్టు ఆరోపణలు వస్తున్న ఆపరేషన్ అజిత్ పవార్‌తో ఇప్పటికిప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే లాభమేమీ లేదు. ఇప్పటికే ఏక్నాథ్ షిండే సర్కార్ పూర్తి స్థాయి మెజారీ్టతో బలంగానే ఉంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొనే బీజేపీ అజిత్ పవార్ తిరుగుబాటును ప్రోత్సహించినట్టుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర, 48 ఎంపీ స్థానాలతో ఈ రాష్ట్రం పార్లమెంటు ఎన్నికల్లో అత్యంత కీలకంగా ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ–శివసేన కూటమి 41 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాయి. కానీ ఇప్పుడు ఎన్డీయేతో శివసేన లేకపోవడంతో ఆ పారీ్టలో చీలికలు తెచ్చి ఏక్నాథ్ షిండే వర్గాన్ని తమ వైపు లాక్కుంది. అయినప్పటికీ గత ఎన్నికల మాదిరిగా సీట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో ఎన్సీపీని కూడా చీల్చడానికి ప్రయతి్నంచిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విపక్షాలను బలహీన పరచడమే కాకుండ ప్రజాకర్షణ బలంగా ఉన్న మరాఠా నాయకులైన ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వంటి వారి అండ బీజేపీ వైపు ఉంది. ఈ సారి కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ వర్గంతో ఎన్సీపీ శరద్ పవార్ వర్గం చేతులు కలిపినప్పటికీ తమ వైపు ఉన్న నాయకులే బలంగా ఉన్నట్టుగా బీజేపీ నమ్ముతోంది. ఓ రకంగా మహారాష్ట్ర బీజేపీ చెయ్యి జారిపోకుండా కాపాడుకోవడానికే ఇదంతా చేస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీ సభ్యులు: 53 శరద్ పవార్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు:15 అజిత్ పవార్ సమావేశానికి హాజరైనవారు:32 ప్రస్తుతానికి తటస్థంగా ఉన్న ఎమ్మెల్యేలు: 6 –సాక్షి, నేషనల్ డెస్క్ -
అజిత్ పవార్‌కు చేదు అనుభవం
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీలికవర్గం నేత అజిత్ పవార్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర సచివాలయం సమీపంలోని రాష్ట్రవాది భవన్‌ను పార్టీ వ్యవహారాల కోసం నూతన కార్యాలయంగా వాడుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. భవనాన్ని స్వాధీనం చేసుకోవడానికి అజిత్ పవార్ వర్గం నేతలు మంగళవారం అక్కడికి వెళ్లగా తలుపులకు తాళంవేసి ఉండడంతో నిరాశ చెందారు. కొందరు యువకులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. కానీ లోపలి గదులకు తాళాలు వేసి ఉండడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. రాష్ట్రవాది భవన్లో గతంలో మహారాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేత అయిన అంబదాస్ దన్వే నివసించారు. ప్రభుత్వం మరో భవనం కేటాయించడంతో ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇలాఉండగా, అసలైన ఎన్సీపీ తమదేనని అజిత్, శరద్ పవార్ వర్గాలు వాదిస్తున్నాయి. ఏ వర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
రసకందాయంలో ఎన్సీపీ రగడ.. ఎత్తులు, పై ఎత్తులు
ముంబై/సతారా: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పారీ్ట (ఎన్సీపీ)పై ఆధిపత్యం కోసం అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అజిత్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శరద్ పవార్ వర్గం, శరద్ వర్గం ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని అజిత్ వర్గం పట్టుబడుతున్నాయి. శరద్ వర్గం నాయకులను పార్టీ పదవుల నుంచి అజిత్ వర్గం తొలగించింది. అసెంబ్లీలో ఎన్సీపీ పక్షనేతగా అజిత్ పవార్ నియమితులైనట్లు ఆయన వర్గం చెబుతోంది. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్ పవార్‌తోపాటు మంత్రులుగా ప్రమాణం చేసిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఎన్సీపీ అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు ఫిర్యాదు చేసింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం 9 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా తేల్చడానికి తగిన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. శరద్ పవార్ వర్గం నేత జితేంత్ర అవద్ ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ మేరకు స్పీకర్‌కు విజ్ఞాపన అందించారు. ఇదిలా ఉండగా, అజిత్ పవార్‌తో సహా 9 మంది ఎమ్మెల్యేలకు శరద్ పవార్ వర్గం సోమవారం నోటీసులు జారీ చేసింది. ఎన్సీపీతో వారికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఇక ఏ వేదికపైనా ఎన్సీపీ ప్రతినిధులుగా చెప్పుకోవద్దని వారికి తేల్చిచెప్పింది. పార్టీని ధిక్కరించి బయటకు వెళ్లిపోయిన వారు పార్టీ నేతలమని చెప్పుకోవడం చట్టవ్యతిరేకం అవుతుందని ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ స్పష్టం చేశారు. 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయడానికి వీలుగా ఎన్సీపీ క్రమశిక్షణా కమిటీ ఇప్పటికే ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్సీపీ ఫిర్యాదు తగిన నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ చెప్పారు. పవార్‌కు ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నదీ తనకు తెలియదన్నారు. పటేల్, తత్కారే బహిష్కరణ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, లోక్‌సభ సభ్యుడు సునీల్ తత్కారేను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోమవారం తమ పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వారిపై ఈ మేరకు చర్య తీసుకున్నట్లు ట్విట్టర్లో వెల్లడించారు. ఇక మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడిగా లోక్‌సభ సభ్యుడు సునీల్ తత్కారేను నియమించినట్లు ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. అసెంబ్లీలో ఎన్సీపీ పక్ష నేతగా అజిత్ వ్యవహరిస్తారని అన్నారు. గరిష్ట సంఖ్యలో ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్ అన్నారు. అజిత్ కు బీజేపీ సీఎం పదవి ఎర: కాంగ్రెస్ అజిత్‌కు సీఎం పదవి కట్టబెడతామని బీజేపీ హామీ ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ‘‘బీజేపీ–శివసేన ప్రభుత్వంలో అజిత్ చేరుతారని ఎప్పుడో తెలుసు. 16 మంది సేన(షిండే) ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించి షిండేను సీఎం పదవి నుంచి దింపేస్తారు. అజిత్‌ను కూచోబెడతారు’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. శివసేన (ఉద్ధవ్) పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలోనూ ఇదే విషయం రాసింది. అజిత్ తిరుగుబాటు వెనుక నా ప్రమేయం లేదు: పవార్ తన ఆశీస్సులతోనే అజిత్ పవార్ తిరుగుబాటు చేశారంటూ వినిపిస్తున్న వాదనలను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఖండించారు. బీజేపీ–శివసేన ప్రభుత్వంలో అజిత్ చేరడం వెనుక తన ప్రమేయం ఎంతమాత్రం లేదన్నారు. ఆయన సోమవారం సతారా జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ఎన్సీపీ బలోపేతం కోసం ప్రజల్లోకి వెళ్తానని, రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని తెలిపారు. -
Maharashtra political crisis: ‘మహా కుదుపు’.. నిలువునా చీలిన ఎన్సీపీ
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో అలజడి. ఒక్కరోజులోనే రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ప్రతిపక్ష నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నిట్టనిలువునా చీలిపోయింది. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆ పార్టీ అధినేత శరద్ పవార్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆయన సోదరుడి కుమారుడు, ఎన్సీపీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి వేరు కుంపటి పెట్టుకున్నారు. ఆదివారం బీజేపీ–శివసేన(షిండే వర్గం) ప్రభుత్వంలో చేరారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ వర్గం ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందికి మంత్రి పదవులు లభించాయి. కాగా, పార్టీని ధిక్కరించి, ప్రభుత్వంలో చేరినవారిపై చర్యలు తీసుకోవడం ఖాయమని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తేల్చిచెప్పారు. త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ముంబై/పుణే/న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో అలజడి. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆయన సోదరుడి కుమారుడు, ఎన్సీపీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి వేరు కుంపటి పెట్టుకున్నారు. ఆదివారం బీజేపీ–శివసేన(షిండే వర్గం) ప్రభుత్వంలో చేరారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ వర్గం ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందికి మంత్రి పదవులు లభించాయి. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే పరిణామాలు వేగంగా మారిపోయాయి. అజిత్ పవార్‌తో ఉప ముఖ్యమంత్రిగా, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, ఆదితీ తట్కారే, ధర్మారావు , అనిల్ పాటిల్, సంజయ్ బాంసోడేతో మంత్రులుగా రాష్ట్ర గవర్నర్ రమేశ్ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో స్పీకర్ తోపాటు డిప్యూటీ స్పీకర్ నరహరి, ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. విపక్ష నేత పదవికి అజిత్ రాజీనామా అజిత్ పవార్ తొలుత ముంబైలోని తన అధికారిక నివాసం ‘దేవగిరి’లో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో, కొందరు నాయకులతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం శానససభలో ప్రతిపక్ష నేత పదవికి అజిత్ రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఆమోదించినట్లు అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత అజిత్ తన ఎమ్మెల్యేలలో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకొని, ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 40 మంది తమ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే స్పష్టం చేశారు. అయితే, అజిత్ పవార్‌కు 36 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారని ఆయన సన్నిహితుడొకరు చెప్పారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసమే చేరాం: అజిత్ æ దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రభుత్వంలో చేరామని అజిత్ చెప్పారు. ప్రభుత్వంలో చేరాలన్న నిర్ణయానికి పార్టీ ప్రజాప్రతినిధులందరూ మద్దతునిచ్చారని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీలో ఎలాంటి చీలిక లేదని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఎన్సీపీ పేరుతో, ఎన్సీపీ గుర్తుపైనే పోటీ చేస్తామని అన్నారు. పరిపాలనలో తమకు ఎంతో అనుభవం ఉందని, ప్రజలకు మేలు చేయడానికి ఈ అనుభవాన్ని ఉపయోగించుకుంటామని వ్యాఖ్యానించారు. తనతోపాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనిమిది మందికి త్వరలోనే శాఖలు కేటాయించనున్నట్లు అజిత్ వెల్లడించారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా తమ వెంటే ఉన్నారన్నారు. ప్రధాని∙మోదీ నాయకత్వంపై అజిత్‡ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఇప్పుడు త్రిబుల్ ఇంజన్ ప్రభుత్వంగా మారిందని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో అభివృద్ధి ఇక వేగం పుంజుకుటుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్ మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవద్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఎన్సీపీ ప్రకటించింది. ఇప్పటిదాకా ప్రతిపక్ష నేతగా పనిచేసిన అజిత్ పవార్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జితేంద్రను నియమించినట్లు పేర్కొంది. పార్టీ ఎమ్మెల్యేలంతా తాను చేసే విప్‌నకు కట్టుబడి ఉండాలని జితేంద్ర అవద్ పేర్కొన్నారు. బీజేపీ వాషింగ్ మెషీన్..: కాంగ్రెస్ మహారాష్ట్ర రాజకీయ వ్యవహారాలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ వ్యంగ్యంగా స్పందించారు. బీజేపీ వాషింగ్ మెషిన్ మళ్లీ పని ప్రారంభించిందని అన్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్సీపీ నాయకులు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారని, ఇక వారందరికీ క్లీన్ చిట్ వస్తుందని చెప్పారు. బీజేపీ కబంధ హస్తాల నుంచి మహారాష్ట్రకు విముక్తి కలి్పంచడమే తమ లక్ష్యమని తెలిపారు. శరద్‌కు ఖర్గే, రాహుల్ గాంధీ మద్దతు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించారు. ఇద్దరు నేతలు పవార్‌తో ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితి తెల్సుకున్నారు. పార్టీని ధిక్కరించినవారిపై చర్యలు తప్పవు: శరద్ పవార్ పార్టీని ధిక్కరించి, ప్రభుత్వంలో చేరినవారిపై చర్యలు తీసుకోవడం ఖాయమని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తేలి్చచెప్పారు. త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆయన ఆదివారం పుణేలో మీడియాతో మాట్లాడారు. పార్టీలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై స్పందిస్తూ.. ఇలాంటివి చూడడం తనకు కొత్తేమీ కాదన్నారు. బీజేపీ–శివసేన ప్రభుత్వం చేరాలన్నది తమ పార్టీ నిర్ణయం ఎంతమాత్రం కాదన్నారు. కొందరు నాయకులు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులకు భయపడి ప్రభుత్వంలో చేరినట్లున్నారని అభిప్రాయపడ్డారు. ఇది తన ఇంటి సమస్య కాదని, ప్రజల సమస్య అని చెప్పారు. మద్దతు కోసం సోమవారం నుంచే ప్రజల్లోకి వెళ్తానని, పార్టీని పునర్నిరి్మస్తానని శదర్ పవార్ పేర్కొన్నారు. త్వరలో తమ పార్టీ నాయకులతో సమావేశమవుతానని, పార్టీకి సంబంధించిన నిర్ణయాలపై చర్చిస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో త్వరలో జరిగే విపక్షాల సమావేశంలో తాను పాల్గొంటానని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా అస్థిరతే నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల తర్వాత ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఉద్ధవ్ ఠాక్రే పట్టుబట్టగా బీజేపీ అంగీకరించకపోవడమే ఇందుకు కారణం. దాంతో కొన్నాళ్లు రాష్ట్రపతి పాలన కొనసాగింది. తర్వాత బీజేపీకి అజిత్ అండగా నిలిచారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ ప్రమాణం చేశారు. ఆ ప్రభుత్వం కేవలం 80 గంటలపాటు మనుగడ సాగించింది. ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. గత ఏడాది జూన్‌లో శివసేన నేత షిండే తిరుగుబాటు చేశారు. శివసేనలో చీలిక ఏర్పడింది. ఎంవీఏ ప్రభుత్వం కూలింది. బీజేపీతో మద్దతుతో షిండే గత ఏడాది జూన్ 30న ముఖ్యమంత్రి అయ్యారు. సరిగ్గా ఏడాది తర్వాత ప్రభుత్వంలో అజిత్‡ చేరడం ఆసక్తికరంగా మారింది. నాలుగేళ్లలో మూడుసార్లు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పొలిటికల్ పవర్ ఇదీ! అజిత్ పవార్.. ఎన్సీపీని నిట్ట నిలువుగా చీల్చి మరోసారి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చి కొద్ది రోజులు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన ఇప్పుడు అధినేత శరద్ పవార్‌కు షాక్ ఇస్తూ పార్టీని చీల్చారు. 2019 నవంబర్ నుంచి 2022 జూన్ వరకు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పని చేశారు. అజిత్ 2019 తర్వాత ముచ్చటగా మూడోసారి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. గతంలో కూడా కాంగ్రెస్–ఎన్సీపీ కలిసి 15 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన సమయంలో అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్ హయాంలో డిప్యూటీ సీఎంగా చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీలో గట్టి పట్టున్న నాయకుడు. ప్రస్తుతం అజిత్ పవార్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు వారి వారి చక్కెర సహకార సంఘాల్లో అవినీతి ఆరోపణల్ని, ఈడీ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. అజిత్ పవార్ పార్టీని చీల్చడానికి ఈ కేసులు కూడా ఒక కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ రాష్ట్రంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల కుంభకోణం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది మేలో ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, కార్యకర్తల ఒత్తిడితో శరద్ పవార్ వెనక్కి తీసుకున్న సమయంలో అజిత్ పవార్ ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలుసుకున్నారు. ఇక శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలేకి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పజెప్పడం అజిత్ పవార్‌కు మింగుడు పడలేదని, అందుకే ఆయ పార్టీని చీల్చారన్నది బహిరంగ రహస్యమే. మహారాష్ట్రలో పార్టీల బలాబలాలు 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీ స్థానాలు బీజేపీ 105 శివసేన 56 ఎన్సీపీ 54 కాంగ్రెస్ 44 ఇతర పార్టీలు+స్వతంత్రులు 29 ఏ మొత్తం అసెంబ్లీ స్థానాలు 288 ప్రస్తుతం పార్టీల బలాబలాలు పార్టీ స్థానాలు బీజేపీ 105 శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) 16 శివసేన(షిండే) 40 ఎన్సీపీ(శరద్ పవార్) 18 ఎన్సీపీ(అజిత్ పవార్) 36 కాంగ్రెస్ 44 ఇతర పార్టీలు+స్వతంత్రులు 29 -
షిండేకు పదవీ గండం.. ఏ క్షణమైనా మహారాష్ట్రకు కొత్త సీఎం?
ముంబై: ఎంతో నమ్మకంగా సుదీర్ఘకాలం కొనసాగిన పార్టీలోనే తిరుగుబాటు చేసి మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి తెరతీశారు ఏక్నాథ్ షిండే. బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇప్పటికీ రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. అయితే.. తాజాగా ఏక్నాథ్ షిండే వర్గంలోనే చీలకలు వచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి పదవికి ఎసరు వచ్చేలా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు ఆయనపై అసంతృప్తితో ఉన్నట్లు ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన.. తన అధికారిక పత్రిక సామ్నాలో ఈ మేరకు వెల్లడించింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలోని 40 మందిలో 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు పేర్కొంది సామ్నా. ఏక్నాథ్ షిండేను బీజేపీ తాత్కాలికంగా ఆ పదవిలో కూర్చోబెట్టిందని పేర్కొనటం గమనార్హం. ‘ఆయన ముఖ్యమంత్రి పదవి ఏ క్షణమైనా కోల్పోతారని ప్రతిఒక్కరికి అర్థమైంది. అంధేరీ ఈస్ట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో షిండే వర్గం పోటీ చేయాలని భావించింది. కానీ, అందుకు బీజేపీ నిరాకరించింది. గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించామని షిండే వర్గం చెప్పటం పూర్తిగా తప్పు. 22 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. వారిలోని చాలా మంది బీజేపీతో కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ’అని ఉద్ధవ్ థాక్రే వర్గం పేర్కొంది. ఏక్నాథ్ షిండే తనకు తాను, మహారాష్ట్రకు చాలా నష్టం చేశారని, రాష్ట్ర ప్రజలు వదిలిపెట్టరని పేర్కొంది శివసేన. షిండేను తమ స్వప్రయోజనాల కోసం బీజేపీ వినియోగించుకోవటం కొనసాగిస్తుందని తెలిపింది. బీజేపీ నాయకుడి వ్యాఖ్యలను ఉద్ఘాటించింది. ప్రభుత్వం 40 మంది ఎమ్మెల్యేలతో నడుస్తోందని, వారంతా సీఎంఓ నియంత్రణలో ఉన్నారని పేర్కొంది. నిర్ణయాలన్నింటిని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకుంటున్నారని, ఆ నిర్ణయాలను షిండే ప్రకటిస్తున్నారని ఆరోపించింది. ఇదీ చదవండి: పెళ్లైన మరుసటి రోజే డబ్బు, నగలతో వధువు పరార్.. వరుడికి ఫోన్ చేసి..! -
థాక్రేకు బిగ్ షాక్.. బీజేపీలోకి ఆ నలుగురు ఎమ్మెల్యేలు!
ముంబై: ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న వేడి ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదు. శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వర్గానికి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. ఇప్పటికే అధికారం కోల్పోయి.. శివసేన గుర్తును కాపాడుకునేందుకే ఇబ్బందులు పడుతున్న థాక్రే వర్గానికి మరో దెబ్బ తగలనుంది. నలుగురు ఎమ్మెల్యేలు అధికార పక్షంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారటా! ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన నలుగురు శివసేన ఎమ్మెల్యేలు అధికార వర్గంలో చేరేందుకు తమతో టచ్‌లో ఉన్నారని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే శనివారం వెల్లడించారు. అంధేరీ అసెంబ్లీ ఉప ఎన్నికల వేళ ఎమ్మెల్యేలు అధికారపక్షంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలపటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరనేది బయటకు వెల్లడించలేదు రాణే. ‘మొత్తం 56 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 6-7 ఎమ్మెల్యేలు ఉన్నారు.(ఉద్ధవ్ థాక్రే వర్గంలో) వారు కూడా బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు. కానీ, వారి పేర్లు నేను వెల్లడించను.’ అని తెలిపారు. పుణెలో నిర్వహించిన ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో ఈ మేరకు వెల్లడించారు. ఉద్ధవ్ థాక్రేపై విమర్శలు గుప్పించారు రాణే. ఆయన రాజకీయం కేవలం మాతోశ్రీ వరకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. అయితే, ఈ విషయంపై ఉద్ధవ్ థాక్రే వర్గం ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఇదీ చదవండి: ‘బ్రిటన్ ప్రధానిగా బోరిస్ సరైన వ్యక్తి’.. భారత సంతతి ఎంపీ మద్దతు -
Maharashtra political crisis: రాజ్యాంగపరమైన ప్రశ్నలెన్నో!
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శివసేన, రెబల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లు పార్టీల్లో చీలిక, విలీనం, ఫిరాయింపులు, అనర్హత తదితరాలకు సంబంధించి పలు రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. వీటన్నింటినీ విస్తృత ధర్మాసనం లోతుగా మదింపు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలేందుకు దారితీసిన పరిస్థితులకు సంబంధించి ఉద్ధవ్, సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన ఆరు పిటిషన్లపై జస్టిస్ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ మురారి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వాదనలు సాగాయి. సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ ఉద్ధవ్ వర్గం తరఫున, హరీశ్ సాల్వే తదితరులు షిండే వర్గం తరఫున వాదనలు వినిపించారు. ప్రజా తీర్పుకు విలువేముంది: సిబల్ మహారాష్ట్రలో జరిగినట్టు అధికార పార్టీని ఇష్టానుసారం చీలుస్తూ పోతే ప్రజా తీర్పుకు విలువేముందని సిబల్ ప్రశ్నించారు. ‘‘ఫిరాయింపులను నిరోధించే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌కు కూడా విలువ లేకుండా పోతుంది. వేరే పార్టీలో విలీనానికే తప్ప ఇలాంటి చీలికలకు ఫిరాయింపుల నుంచి రక్షణ వర్తించబోదు. అలా కాదని మెజారిటీ సూత్రాన్నే అంగీకరించాల్సి వస్తే దేశంలో ఎన్నికైన ప్రతి ప్రభుత్వాన్నీ సులువుగా కూలదోయవచ్చు. పార్టీల్లో చీలికలను నిషేధిస్తున్న రాజ్యాంగ రక్షణకు అర్థమే ఉండదు. ఇదో ప్రమాదకరమైన పోకడకు దారితీస్తుంది’’ అన్నారు. బీజేపీ నిలబెట్టిన స్పీకర్ అభ్యర్థికి ఓటేసినందుకు షిండే వర్గానికి చెందిన 40 మంది సేన ఎమ్మెల్యేలపై పదో షెడ్యూల్లోని రెండో పేరా ప్రకారం అనర్హత వేటు పడ్డట్టేనని వాదించారు. అంతేగాక వివాదం సుప్రీంకోర్టులో ఉండగా గవర్నర్ కొత్త ప్రభుత్వంతో ప్రమాణస్వీకారం చేయించడమూ సరికాదన్నారు. సీఎంను మారిస్తే కొంపలేమీ మునగవు: సాల్వే సిబల్ వాదనలను సాల్వే తోసిపుచ్చారు. ముఖ్యమంత్రిని మార్చినంత మాత్రాన కొంపలు మునగవన్నారు. నాయకున్ని మార్చాలని పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు కోరుకుంటే అందులో తప్పేముందని ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు ఒక్కటై ప్రధానిని కూడా వద్దు పొమ్మని చెప్పవచ్చు. కాబట్టి మహారాష్ట్ర ఉదంతానికి సంబంధించినంత వరకు ప్రజాస్వామ్య సంక్షోభం తదితరాల్లోకి పోకుండా స్పీకర్ ఎన్నిక చట్టబద్ధంగా జరిగిందా లేదా అన్నదానికే వాదనలు పరిమితం కావాలి’’ అని సూచించారు. ఈ దశలో సీజేఐ జస్టిస్ రమణ స్పందిస్తూ మహారాష్ట్ర ఉదంతం పలు రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తిందన్నారు. ‘‘10వ షెడ్యూల్లో మూడో పేరా తొలగింపు తర్వాత పార్టీలో చీలికకు గుర్తింపు లేకుండా పోయింది. దీని తాలూకు పరిణామాలెలా ఉంటాయో ఆలోచించాల్సి ఉంది. పార్టీ చీలికను గుర్తించే విధానం లేకపోవడం, పార్టీలో మైనారిటీలో పడ్డ నాయకునికి చట్టసభల్లోని తమ పార్టీ నేతను తొలగించే అధికారముందా వంటివన్నీ లోతుగా చర్చించాల్సన అంశాలు. ఇరుపక్షాల వాదనలూ విన్నాక, వీటిలో పలు అంశాలను అవసరమైతే విస్తృత ధర్మాసనానికి నివేదిస్తాం. అందుకే ఏయే అంశాలపై విచారణ జరపాలో ఇరు వర్గాలూ ఆలోచించుకుని జూలై 27కల్లా మా ముందుంచాలి’’ అంటూ ఆదేశాలు జారీ చేశారు. విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు. బలపరీక్ష, స్పీకర్ ఎన్నిక సందర్భంగా పార్టీ విప్‌ను ఉల్లంఘించినందుకు ఉద్ధవ్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న షిండే వర్గం విజ్ఞప్తిపై అప్పటిదాకా ఏ చర్యలూ చేపట్టొద్దని స్పీకర్‌ను ఆదేశించారు. -
థాక్రేకు మళ్లీ నిరాశే.. షిండే వర్గానికి ఆగస్టు 1వరకు గడువిచ్చిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. పార్టీపై ఆధిపత్యం కోసం థాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్ల విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అప్పటిలోగా ఏక్నాథ్ షిండే వర్గం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎమ్మెల్యేల అనర్హత విషయానికి సంబంధించి స్పీకర్ కూడా అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పష్టం చేసింది. దీంతో థాక్రే వర్గానికి మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ పిటిషన్లలోని కొన్ని విషయాలను పరిశీలిస్తే.. వీటి విచారణకు విస్తృత ధర్మాసనం అవసరం అవుతుందని బలంగా నమ్ముతున్నట్లు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచనప్రాయంగా తెలిపారు. దీంతో ఈ పిటిషన్ల కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక ధర్మానాన్ని ఏర్పాటు చేసే అవకాశం కన్పిస్తోంది. షిండే వర్గం చేసిన పనిని సమర్థిస్తే దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలన్నీ కూలిపోయే పరిస్థితి వస్తుందని థాక్రే వర్గం తరఫున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. మరోవైపు షిండే వర్గం తరఫున సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. అనర్హత వేధింపుల వల్ల పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదని కోర్టుకు చెప్పారు. థాక్రే వర్గం పిటిషన్లపై తాము అఫిడవిట్ దాఖలు చేసేందుకు కాస్త గడువు కావాలని, కేసును వచ్చేవారం వాయిదా వేయాలని కోరారు. వాదోపవాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత విషయం పెండింగ్‌లో ఉండగానే.. షిండే వర్గాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అనుమతించడాన్ని థాక్రే వర్గం సవాల్ చేసింది. పార్టీ విప్‌ను దిక్కరించి కొందరు ఎమ్మెల్యేలు స్పీకర్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారని, వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. మరోవైపు షిండే వర్గం మాత్రం.. శివసేన పార్టీ తమదే అని వాదిస్తోంది. 20మంది ఎమ్మెల్యేలు కూడా మద్దతివ్వని వ్యక్తిని కోర్టుల సాయంతో అధికారంలో కూర్చోబెట్టే దుస్థితిలో మనం ఉన్నామా అంటూ షిండే తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. చదవండి: షిండే మంత్రివర్గంలో చోటుకు రూ.100 కోట్లు.. ఆ ఎమ్మెల్యేకు ఆఫర్! -
తెగని ‘మహా’ పంచాయితీ.. ఇంతకూ అసలైన ‘సేన’ ఎవరిది?
కొన్ని వారాలుగా మహా రాష్ట్ర రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగాయి. శివ సేన సీనియర్ నేత ఏక్నాథ్ శిందే 34 మంది ఎమ్మెల్యే లతో తిరుగుబాటు చేసి, ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ మద్దతుతో శిందే వర్గం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గింది. మహారాష్ట్ర అసెంబ్లీ సభ్యుల సంఖ్య 288 కాగా 164 మంది సభ్యుల మద్దతు శిందే వర్గానికి లభించింది. ఈ మొత్తం సంక్షోభంలో ఒక కీలక ప్రశ్నకు సమా ధానం లభించలేదు. తమదే నిజమైన శివసేన అని ఇరు పక్షాలూ ప్రకటించుకుంటున్న నేపథ్యంలో శిందే, అతడి రెబల్ ఎమ్మెల్యేలకు ఉన్న రాజ కీయ అనుబద్ధత ఏమిటి? శిందేకు స్పష్టంగానే శివసేన శాసన సభ్యుల మద్దతు ఉంది. కానీ ఆ ప్రాతిపదికన మొత్తం శివసేన తనదే అని హక్కును చాటు కోవడానికి ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే సరి పోతుందా? ఏది నిజమైన శివసేన అనేదాన్ని ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్ణయిస్తుంది. పార్టీ అధినేతగా ఠాకరేని తొలగించి పార్టీ స్టేటస్‌ని మార్చాల్సిందిగా శిందే వర్గం ఇప్పటికే ఈసీని కలిసింది. కానీ ఈ అంశంపై చట్టం చాలా స్పష్టంగా ఉంది. రాజ్యాం గంలోని పదవ షెడ్యూల్ ఆర్టికల్ 191 (2)లో దీనికి సమాధానం కనబడుతుంది. ఫిరాయింపు దారులను ‘అనర్హుల’ను చేసే నిబంధనలు పదో షెడ్యూ ల్లో ఉన్నాయి. వీటిని రాజ్యాంగ (52వ సవరణ) చట్టం, 1985లో పొందుపరిచారు. పార్టీనుంచి ఫిరాయిం చిన ప్రజాప్రతినిధిని అనర్హుడిని చేయాలని ఇది స్పష్టంగా పేర్కొంది. ఏ పార్టీ అయినా మరొక పార్టీలో విలీనం కావాలంటే పార్టీ సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది ఆ విలీనానికి అను కూలతను ప్రదర్శించాలని రాజ్యాంగ (91వ సవరణ) చట్టం–2003 పేర్కొంది. పదవులిస్తామనో, ఇతర ఆశలు చూపో రాజ కీయ ఫిరాయింపులకు పాల్పడే దుష్టకార్యాలను నిరోధించడమే పదో షెడ్యూల్ లక్ష్యం. ఎందుకంటే ఫిరాయింపులు మన ప్రజాస్వామ్య పునాదులను ప్రమాదంలోకి నెడతాయి. అందుకే పార్లమెంటు ఉభయ సభలకు లేదా శాసన సభలకు చెందిన సభ్యుడిని అనర్హుడిని చేయడమే ఫిరాయింపులకు తగిన చికిత్స అని పదో షెడ్యూల్ నిర్దేశించింది. పదో షెడ్యూల్ శాసనసభా పార్టీలో చీలికను గుర్తించ లేదు. దానికి బదులుగా అది విలీనాన్ని గుర్తిస్తోంది. కాబట్టే ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేల సంఖ్య రీత్యా చూస్తే ఉద్ధవ్ ఠాకరే వర్గం ఇప్పుడు మైనారిటీలో ఉంటోంది కాబట్టి తమదే నిజమైన శివసేన అని చెప్పుకునే స్వతంత్ర హక్కు శివసేన రెబల్స్‌కు లేదు. అనర్హత నుంచి తప్పించుకోవా లంటే ఒక పార్టీలోని మూడింట రెండొంతుల సభ్యులు మరో పార్టీలో విలీనం కావలసి ఉంటుంది. శివసేన రాజ్యాంగానికి తాము కట్టుబడి ఉండాల్సి ఉంటుందన్న వాస్తవం రెండు వర్గాలకూ తెలుసు. సేన రాజ్యాంగంలో పార్టీ పతాక, పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తు వంటివాటి కోసం విడి విడిగా ఆర్టికల్స్ ఉన్నాయి. ముంబై దాదర్ లోని సేన భవన్ పార్టీ రిజిస్టర్డ్ ఆఫీసుగా ఉంది. ఇది సంస్థాగత చట్రాన్ని అందిస్తుంది. ఈ చట్రంలో శివసేన అధ్య క్షుడికి పార్టీలో కీలక స్థానం ఉంటుంది. సేన అధ్యక్షు డికి సర్వాధికారాలు ఉంటాయి. రాష్ట్రీయ కార్యకా రిణి సభ్యుల నుంచి ప్రతినిధి సభకు ఎన్నికైన సభ్యులు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. శివసేన రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి పార్టీలో అత్యున్నత అధికారం ఉంటుంది. పార్టీ పాలసీ, యంత్రాంగానికి సంబంధించిన అన్ని విష యాల్లో అతడి నిర్ణయమే ఫైనల్ అవుతుంది. పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 8 పేర్కొన్న ఏ పదవినైనా, నియామకాన్నయినా పార్టీ అధ్యక్షుడు నిలిపి వుంచ గలడు లేదా తొలగించగలడు. శివసేన శాసన సభా పక్షనేతకైనా ఇదే వర్తిస్తుంది. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అధ్యక్షుడికి తప్ప మరే ఇతర పార్టీ ఆఫీస్ బేరర్‌కి గానీ, సభ్యుడికి గానీ ఎవరినీ పార్టీ నుంచి బహిష్కరించే అధికారం లేదు. ఆఫీసు బేరర్లు, ప్రజా సంఘాల పనులకు సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించే అధికారం రాష్ట్రీయ కార్యకారిణికి ఉండగా, దాని సమావేశా లను నిర్ణయించే అధికారం పార్టీ అధ్యక్షు డికి ఉంటుంది. అధ్యక్షుడి నిర్ణయమే ఫైనల్. కాబట్టి పార్టీ సభ్యులను, ఆఫీస్ బేరర్లను తొలగించే అధికారం పార్టీ రాజ్యాంగం ప్రకారం శివసేన అధ్యక్షుడిగా ఠాకరేకి ఉంటుంది. శిందేకు గానీ, తిరుగుబాటు ఎమ్మెల్యేలకుగానీ అలాంటి అధికారాలు ఉన్నాయని ప్రకటించుకునే అధికారం లేదు. తిరుగుబాటుదారులకు మూడింట రెండొం తుల మెజారిటీ ఉన్నప్పటికీ పార్టీ అధ్యక్షుడి అధి కారాలను తమవిగా వీరు ప్రకటించుకోలేరు. మహా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గానీ, సుప్రీంకోర్టుగానీ ఇలాంటి అధికారాలను రెబెల్స్‌కి ఇవ్వలేరు. ఎన్నికల కమిషన్ వద్ద అయినా, శిందే వర్గం శివసేనపై తన చట్టబద్ధతనూ, హక్కులనూ నిరూ పించుకోవడం కష్టమే. పార్టీ చిహ్నం, పార్టీ గుర్తుపై ఎలాంటి హక్కు ప్రక టించుకోవాలన్నా శివసేనలోని రెండు వర్గాలూ పార్టీ రాజ్యాంగంపైనే ఆధారపడాలి. శివసేన పార్టీ అధ్యక్షుడిగా ఠాకరేని తొలగిస్తే తప్ప, రెబల్స్ పార్టీపై ఎలాంటి హక్కునూ ప్రకటించు కోలేరు. పార్టీ చిహ్నం, పార్టీ ఎన్నికల గుర్తు వంటి వాటిపై అసోసియేట్ హక్కులను కూడా వీరు పొందలేరు. వ్యాసకర్త: అభయ్ నెవగీ, సీనియర్ న్యాయవాది (‘ది వైర్’ సౌజన్యంతో...) -
వచ్చే వారంలో మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ వచ్చే వారంలో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు. ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో సంపూర్ణ చర్చల తర్వాత మంత్రిమండలి కూర్పు ఉంటుందని తెలిపారు. శనివారం షిండే, ఫడ్నవీస్‌లు ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేపట్టారు. రాష్ట్రపతి కోవింద్, ప్రధానమంత్రి మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలుసుకున్నారు. అనంతరం సంయుక్తంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెబుతున్న మాటల్ని షిండే తోసిపుచ్చారు. 164 మంది ఎమ్మెల్యేలతో తమ ప్రభుత్వం బలంగా ఉందని, పూర్తి కాలం తను పదవిలో ఉంటానని ధీమాగా చెప్పారు. ఒకప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవీస్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కావడం పట్ల అసంతృప్తిగా లేదా అన్న ప్రశ్నకు తాను పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటానని బదులిచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రే నాయకుడని, షిండే నాయకత్వంలో పని చేస్తామనన్నారు. ప్రభుత్వాన్ని పూర్తికాలం విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. శుక్రవారం హోం మంత్రి అమిత్ షాతో షిండే, ఫడ్నవీస్ సుదీర్ఘంగా జరిపిన చర్చల్లో అధికార పంపిణీ కసరత్తు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. -
Sakshi Cartoon: అందుకే ఆర్నెళ్ల కోసమే ఆయనను సీఎం చేశాం!
అందుకే ఆర్నెళ్ల కోసమే ఆయనను సీఎం చేశాం! -
తెగని పంచాయితి.. మహారాష్ట్రలో ఆ 16 మంది ఎమ్మెల్యేల పరిస్థితేంటి?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గంతో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన ఎమ్మెల్యేలకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించినందుకు ఠాక్రే వర్గంలోని 16 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని శివసేన (షిండే వర్గం) చీఫ్ విప్ భరత్ గోగావలే అసెంబ్లీ స్పీకర్‌కు పిటిషన్ అందించారు. నిబంధనలను అతిక్రమించినందుకు వారిపై చర్యలు తోసుకోవాలని కోరారు. దీంతో ఠాక్రే వర్గంలోని 16 మంది ఎమ్మెల్యేలకు సస్పెన్షన్ నోటీసులు జారీ చేయనున్నట్లు స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. సీఎం ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన రెండు వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన స్పీకర్ ఎన్నికలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు పార్టీ ఎమ్మెల్యేలకు వేర్వేరు విప్ జారీ చేశాయి. చదవండి👉Maharashtra political crisis: విల్లు బాణమెవరికో? షిండే వర్గం బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్‌గా అనుకూలంగా, ఠాక్రే వర్గం శివసేన అభ్యర్థి రాజన్ సాల్వీకి అనుకూలంగా ఓటు వేశాయి. రాహుల్ నర్వేకర్‌కు 164 ఓట్లు రాగా, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) అభ్యర్థి, శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వీకి కేవలం 107 ఓట్లు పోలయ్యాయి. స్పీకర్ ఎన్నిక అనంతరం పార్టీ విప్‌ను కొందరు సభ్యులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు(ఠాక్రే వర్గం) డిప్యూటీ స్పీకర్‌కు ఓ లేఖ అందజేశారు. పార్టీ ఆదేశాలను 39 మంది ఎమ్మెల్యేలు ధిక్కరించారని సభలో సునీల్ ప్రభు చెప్పారు. ఠాక్రే వర్గంలోని 16 ఎమ్మెల్యేలే పార్టీ విప్‌ను ధిక్కరించారని షిండే వర్గం చీఫ్ విప్.. స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన వారిపై చర్యలకు ఉపక్రమించే అవకాశాలున్నాయి. చదవండి👉బల పరీక్షలో నెగ్గిన ఏక్నాథ్ షిండే ప్రభుత్వం -
Maharashtra political crisis: విల్లు బాణమెవరికో?
సిసలైన శివసేన ఎవరిది? మహారాష్ట్ర పెద్దపులి బాల్ ఠాక్రే స్థాపించిన పార్టీ ఎవరి సొంతమవుతుంది? పార్టీ చిహ్నమైన విల్లుబాణం సీఎం షిండే పరమయ్యేనా? ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రే కనీసం పార్టీనైనా కాపాడుకోగలరా? ఇదిప్పుడు ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర కొద్ది రోజులుగా తెర వెనుక వ్యూహ ప్రతివ్యూహాలతో, ఎత్తులూ పై ఎత్తులతో పూటకో మలుపుగా సాగిన రాజకీయ రగడ ముఖాముఖి పోరుగా మారుతోంది. చీలిక వర్గం నాయకుడైన సీఎం ఏక్నాథ్ షిండేను శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి బహిష్కరిస్తే, అసెంబ్లీలో పార్టీ శాసనసభా పక్ష కార్యాలయానికి షిండే వర్గం తాళం వేసింది. సీఎం పీఠం మాదిరిగా పార్టీని కూడా సొంతం చేసుకోవడానికి పెద్ద పులి వారసుడితో ఢీకొట్టేందుకు షిండే సిద్ధమయ్యారు. కానీ పార్టీని, గుర్తును దక్కించుకోవడం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు షిండే ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఎమ్మెల్మేల మద్దతుకు అదనంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పార్టీ యంత్రాంగం షిండేకే జై కొట్టాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఎలా నిర్ధారిస్తుంది? ఎన్నికల చిహ్నాల (రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్) ఉత్తర్వులు, 1968 ప్రకారం గుర్తింపున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తు కేటాయింపు, రద్దు అధికారం ఎన్నికల సంఘానిదే. ఒకే గుర్తుపై పార్టీలో రెండు వర్గాలు పట్టుబడితే వారిలో ఎవరో ఒకరికి కేటాయించవచ్చు. లేదంటే ఇరు వర్గాలకూ ఇవ్వకుండా సదరు గుర్తును ఫ్రీజ్ చేయొచ్చు. దీనిపై కేవలం ఎమ్మెల్యేల బలాబలాల ఆధారంగా ఈసీ నిర్ణయం తీసుకోదు. పార్టీలో ఎన్నో విభాగాలు, కమిటీలు, మండళ్లు ఉంటాయి. అత్యున్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే కార్యనిర్వాహక వర్గం, యువత, మహిళ తదితర విభాగాలు, ఆఫీసు బేరర్లు, జిల్లాస్థాయిలో పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే కార్యకర్తలు ఇలా అందరు ఎవరి వైపు ఉంటారో విచారిస్తుంది. ఎవరి నాయకత్వం వైపు మొగ్గు చూపిస్తున్నారో స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు పార్టీ గుర్తు, గుర్తింపులతో పాటుగా ఆస్తిపాస్తులన్నీ వాళ్లపరమే అవుతాయి. ఈసీ నిర్ణయంపై కోర్టుకు వెళ్లొచ్చు కూడా. తొలి కేసు ఇందిరదే పార్టీ గుర్తు కోసం ఈసీ ముందుకు వెళ్లిన తొలి కేసు దివంగత ప్రధాని ఇందిరాగాంధీదే. 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిగా నిలబెడితే, ప్రధానిగా ఉన్న ఇందిర ఆ నిర్ణయాన్ని బేఖాతర్ చేసి ఉప రాష్ట్రపతి వి.వి.గిరిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.నిజలింగప్ప జారీ చేసిన విప్‌ను ధిక్కరించి గిరికి మద్దతు నిలిచారు. ఆత్మప్రబోధ నినాదంతో ఆయన్ను గెలిపించుకున్నారు కూడా. దాంతో ఇందిరను పార్టీ నుంచి బహిష్కరించారు. ఫలితంగా కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. నిజలింగప్ప ఆధ్వర్యంలో కాంగ్రెస్ (ఒ), ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ (ఆర్) అప్పటి పార్టీ చిహ్నమైన కాడెద్దుల గుర్తు కోసం పోటీ పడ్డాయి. చివరికి కాడెద్దుల గుర్తు నిజలింగప్ప వర్గానికే దక్కింది. ఇందిర వర్గానికి ఆవు, దూడ గుర్తు ఎన్నికల చిహ్నంగా వచ్చింది. తర్వాత దాదాపు పదేళ్లకు 1978లో మళ్లీ కాంగ్రెస్‌లో చీలిక వచ్చినప్పుడు ఇందిరా కాంగ్రెస్ (ఐ)కి హస్తం గుర్తు లభించింది. తాజా వివాదాలు... గత అక్టోబర్‌లో బిహార్‌లో లోక్ జనశక్తి పార్టీలో చిరాగ్ పాశ్వాన్, పశుపతి కుమార్ పరాస్ చీలిక వర్గం మధ్య విభేదాలొస్తే పార్టీ పేరు, గుర్తు, బంగ్లాను తమ తుది నిర్ణయం దాకా ఎవరూ వాడొద్దంటూ ఈసీ ఆంక్షలు విధించింది. దాంతో ఉప ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ లోక్‌జనశక్తి (రామ్‌విలాస్ పాశ్వాన్) పేరుతో, హెలికాప్టర్ గుర్తుతో; పరాస్ వర్గం రాష్ట్రీయ లోక్‌జనశక్తి పేరుతో, కుట్టు మిషన్‌తో పోటీ చేశాయి. తమిళనాడులో జయలలిత మరణానంతరం రెండాకుల గుర్తు కోసం అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు పోటీపడ్డాయి. దాంతో ఆ గుర్తును 2017 మార్చి దాకా ఈసీ స్తంభింపజేసింది. అవినీతి కేసుల్లో జైలు పాలైన శశికళపై నాటి సీఎం పళనిస్వామి తిరుగుబాటు చేసి పన్నీర్ సెల్వంతో చేతులు కలపడంతో రెండాకుల గుర్తు వారి పరమైంది. యూపీలో 2017లో సమాజ్‌వాదీ పార్టీలో తండ్రి ములాయంపై కుమారుడు అఖిలేశ్ తిరుగుబాటు చేసి పార్టీని తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అసలు పార్టీ తనదేనంటూ ములాయం ఈసీకి ఫిర్యాదు చేసినా యంత్రాంగమంతా అఖిలేశ్ వైపు నిలవడంతో సైకిల్ గుర్తు ఆయనకే దక్కింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మహా’ స్పీకర్‌గా నర్వేకర్.. అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు!
ముంబై: మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు సభాపతి ఎన్నిక నిర్వహించారు. నూతన స్పీకర్‌గా బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్(45) ఎన్నికయ్యారు. ఆయనకు 164 ఓట్లు రాగా, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) అభ్యర్థి, శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వీకి కేవలం 107 ఓట్లు పోలయ్యాయి. దేశంలో ఇప్పటిదాకా అత్యంత పిన్నవయస్కుడైన అసెంబ్లీ స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్ రికార్డుకెక్కారని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. రాహుల్ మామ, ఎన్సీపీ నేత రామ్‌రాజే నాయక్ మహారాష్ట్ర శాసనమండలి చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. కొత్త స్పీకర్ వెంటనే రంగంలోకి దిగారు. శివసేన శాసనసభాపక్ష నేతగా అజయ్ చౌదరిని తొలగించారు. ఆ స్థానంలో సీఎం షిండేను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తిరుగుబాటుకు ముందు షిండేనే ఎల్పీ నేతగా ఉన్న విషయం తెలిసిందే. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది. శివసేన సభ్యుడు రమేశ్ లాట్కే మరణంతో ఖాళీ ఏర్పడింది. డిప్యూటీ స్పీకర్, ఎన్సీపీ నేత నరహరి జిర్వాల్ ఓటు వేయలేదు. కొందరు శివసేన ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించి, ప్రత్యర్థికి ఓటు వేశారని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని నరహరి జిర్వాల్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 287 మంది ఎమ్మెల్యేలకు గాను 271 మంది ఓటు వేశారు. వివిధ కారణాలతో పలువురు గైర్హాజరయ్యారు. పూర్తి పారదర్శకంగా స్పీకర్ ఎన్నిక జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలాసాహెబ్ థోరట్ ఒక ప్రకటనలో ప్రశంసించారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు పటిష్టమైన భద్రత మధ్య సమీపంలోని హోటల్ నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. మహారాష్ట్ర నూతన సర్కారు బలపరీక్ష సోమవారం అసెంబ్లీలో జరుగనుంది. శివసేన ఎమ్మెల్యేలకు రెండు విప్‌లు శివసేన రెండు వర్గాలు విడిపోయింది. స్పీకర్ ఎన్నికలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు పార్టీ ఎమ్మెల్యేలకు వేర్వేరు విప్ జారీ చేశాయి. షిండే వర్గం బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్‌గా అనుకూలంగా, ఠాక్రే వర్గం శివసేన అభ్యర్థి రాజన్ సాల్వీకి అనుకూలంగా ఓటు వేశాయి. పార్టీ విప్‌ను కొందరు సభ్యులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు(ఠాక్రే వర్గం) డిప్యూటీ స్పీకర్‌కు ఓ లేఖ అందజేశారు. పార్టీ ఆదేశాలను 39 మంది ఎమ్మెల్యేలు ధిక్కరించారని సభలో సునీల్ ప్రభు చెప్పారు. తమ వర్గంలో లేని 16 మందికి కూడా విప్ జారీ చేశామని షిండే వర్గం ఎమ్మెల్యే దీపక్ చెప్పారు. సేన శాసనసభాపక్ష కార్యాలయానికి సీల్ విధాన భవన్లో శివసేన శాసనసభాపక్ష కార్యాలయాన్ని ఏక్నాథ్ షిండే వర్గంఆదివారం మూసివేసింది. తలుపులు బిగించి, తెల్లకాగితం అతికించి, దానిపై టేప్ వేశారు. శివసేన శాసనసభా పక్షం ఆదేశాల మేరకు ఆఫీసును మూసివేస్తున్నట్లు రాశారు. కసబ్‌కు కూడా ఇంత సెక్యూరిటీ లేదు: ఆదిత్య రెబల్ ఎమ్మెల్యేల కోసం ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం పట్ల శివసేన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాది కసబ్‌కు కూడా ఇంత సెక్యూరిటీ లేదని అన్నారు. ఇలాంటి పరిస్థితి ముంబైలో ఎప్పుడూ చూడలేదన్నారు. ‘‘ప్రభుత్వానికి భయమెందుకు? ఎవరైనా జారుకుంటారని భయపడుతున్నారా?’’ అని ఎద్దేవా చేశారు. -
Maharashtra political crisis: ముంబైకి రెబల్ ఎమ్మెల్యేలు
ముంబై: మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎన్నిక, సభలో ప్రభుత్వ బలనిరూపణకు రంగం సిద్ధమయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఆదివారం, సోమవారాల్లో రెండు రోజులపాటు జరుగనున్నాయి. గోవాలో ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం చార్టర్డ్ విమానంలో ముంబైకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉదయమే గోవాకు వెళ్లి, రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ముంబైకి తిరిగివచ్చారు. వారు ముంబైలోని ఓ హోటల్లో బస చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం వారంతా హోటల్ నుంచి నేరుగా అసెంబ్లీకి బయలుదేరుతారు. ఉద్ధవ్ లేఖను సవాలు చేస్తాం: రెబల్ వర్గం ‘శివసేన నేత’ పదవి నుంచి షిండేను తొలగిస్తూ ఉద్ధవ్ ఠాక్రే జారీ చేసిన లేఖను సవాలు చేస్తూ సరైన వేదికను ఆశ్రయిస్తామని రెబల్ వర్గం ఎమ్మెల్యే దీపక్ కేసార్కర్ శనివారం చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణాలతో షిండేను శివసేన నేత పదవి నుంచి తప్పిస్తూ ఉద్ధవ్ ఠాక్రే జూన్ 30 తేదీతో లేఖ విడుదల చేశారు. షిండే అదేరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్ధవ్ లేఖ మహారాష్ట్ర ప్రజలను అవమానించేలా ఉందని దీపక్ కేసార్కర్ విమర్శించారు. తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలంతా తమ నాయకుడిగా షిండేను ఎన్నుకున్నారని గుర్తుచేశారు. -
మాజీ సీఎం.. తాజాగా డిప్యూటీ సీఎం.. ఫడ్నవీస్ పేరిట ఓ రికార్డు
ముంబై: ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారు అనంతర కాలంలో మంత్రి పదవులు చేపట్టడం రావడం అరుదనే చెప్పాలి. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా తాజాగా బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర ఫడ్నవీస్ పేరిట ఇలాంటి రికార్డు నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి, అనంతరం అంతకంటే తక్కువ పదవులతోనే సరిపెట్టుకున్న నాలుగో మాజీ సీఎం అయ్యారు ఫడ్నవీస్. 2014–19 సంవత్సరాల్లో బీజేపీకి చెందిన ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం శివసేనతో విభేదాలు తలెత్తాయి. ఎన్సీపీ ఎమ్మెల్యేల అండతో సీఎం పదవిని చేపట్టినా పొత్తు పొసగక మూడు రోజుల్లోనే సీటు దిగిపోయారు. మహారాష్ట్ర సీఎంగా 1975లో కాంగ్రెస్ నేత శంకర్రావు చవాన్ బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల అనంతరం వసంతదా పాటిల్ సీఎం అయ్యారు. 1978లో శరద్ పవార్ ఆయన ప్రభుత్వాన్ని కూలదోసి సీఎం అయ్యారు. చదవండి👉🏻నాకు చేసినట్లు ముంబైకి ద్రోహం చేయకండి: షిండే ప్రభుత్వానికి ఉద్దవ్ వార్నింగ్ పవార్ కేబినెట్లో చవాన్ ఆర్థిక మంత్రిగా కొనసాగారు. 1985–86 సంవత్సరాల్లో శివాజీరావు పాటిల్ ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం, 2004లో సుశీల్ కుమార్ షిండే కేబినెట్లో ఆయన ఆర్థిక మంత్రి అయ్యారు. శివసేనకు చెందిన నారాయణ రాణే 1999లో మహారాష్ట్ర సీఎం అయి తక్కువ కాలంలోనే వైదొలిగారు. అనంతరం కాంగ్రెస్‌కు చెందిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. చదవండి👉🏻కర్మ అనుభవించక తప్పదు.. ఉద్ధవ్ రాజీనామాపై రాజ్‌ఠాక్రే స్పందన -
సీఎంగా షిండే.. పక్కా ప్లాన్‌తోనే బీజేపీ అలా చేసిందా?
ముంబై: మహారాష్ట్ర సీఎం బాధ్యతలను ఏక్నాథ్ షిండేకు అప్పగిస్తూ బీజేపీ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, ఈ పరిణామం వెనుక అనేక కారణాలున్నాయి. బీజేపీ అన్ని కోణాల్లోనూ ఆలోచించాకే ఈ అడుగు వేసిందని పరిశీలకులు భావిస్తున్నారు. అందులో ముఖ్య కారణాలేవంటే.. ► 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన ఉమ్మడిగా పోటీ చేశాయి. ఫలితాలు వెలువడ్డాక సీఎం పదవి చేపట్టే విషయమై విభేదాలు తలెత్తి రెండు పార్టీలు విడిపోయాయి. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో అనూహ్యంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ హడావుడి పొత్తు ఎంతోకాలం కొనసాగలేదు. ఫడ్నవీస్ దిగిపోయారు. ఈ పరిణామం మాత్రం బీజేపీకి అధికార కాంక్ష ఎక్కువనే అభిప్రాయం కలిగించింది. అందుకే, తమకు అధికారం ముఖ్యం కాదనే అభిప్రాయం కలిగించడానికి తాజాగా ఏక్నాథ్ షిండేను సీఎంగా బలపరిచింది. చదవండి👉🏻ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ.. ► సీఎం పదవికి రాజీనామా చేసిన ఉద్ధవ్ ఠాక్రే పదవి నుంచి దిగిపోతూ బీజేపీ తనను వెన్నుపోటు పొడిచిందనే భావం ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నించారు. బాలా సాహెబ్ కొడుకుని మీరు(బీజేపీ) గద్దె దించారు’ అంటూ రాజీనామా సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల్లో ఉద్వేగాలను రగిలించి, సానుభూతి పొందడంలో సఫలమయ్యారు. ► అదే సమయంలో బీజేపీ కూడా శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ వారసత్వానికే తాము మద్దతిస్తామనే ఇమేజ్ను ప్రజల్లో కలిగించాలని కోరుకుంది. బాలాసాహెబ్ ఆకాంక్షల మేరకు శివసైనికుడే సీఎం పదవిలో ఉంటారని చెప్పడంలో ఆంతర్యం కూడా ఇదే. ► మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో అసలైన శివసేన ఎవరిదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరికొంత కాలం ఈ ప్రశ్నకు సమాధానం దొరక్కపోవచ్చు. బాలాసాహెబ్ నిజమైన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతామని ఏక్నాథ్ షిండే అంటున్నారు. అసలైన శివసేన తమ వెంటే ఉందని చెబుతూ 2024 ఎన్నికలకు వెళ్తే సానుకూలత ఉంటుందని కూడా బీజేపీ భావిస్తోంది. ► ఏక్నాథ్ షిండేకు ప్రస్తుతం శివసేన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మద్దతిచ్చినా మున్ముందు రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు. అయితే, ప్రభుత్వాన్ని వీరే నడుపుతూ ఉంటే శివసేనను వీడేందుకుసుముఖంగా ఉండకపోవచ్చు. రెబెల్స్ శిబిరాన్ని చెదరకుండా ఉంచేందుకే బీజేపీ సీఎం పదవిని వదులుకుందని భావిస్తున్నారు. చదవండి👉🏻నాకు చేసినట్లు ముంబైకి ద్రోహం చేయకండి: షిండే ప్రభుత్వానికి ఉద్దవ్ వార్నింగ్ -
‘మహా’ ట్విస్ట్.. సీఎం పీఠం వదులుకున్న బీజేపీ..
ముంబై: మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే ఈరోజు (గురువారం) సాయంత్రం 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఇప్పటి వరకు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం.. ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం అవుతారని అందరూ భావించారు. కానీ అంచనాలు తలకిందులు చేస్తూ ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారణం చేయనున్నట్లు ఫడ్నవీస్ స్వయంగా ప్రకటించారు. వ్యూహం మార్చిన బీజేపీ గత పది రోజులుగా ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మహారాష్ట్రలో బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకుంది. ఉద్దవ్ సర్కార్‌ను కూలదోసామన్న పేరు రాకుండా జాగ్రత్త పడింది. దీంతో మహారాష్ట్ర సర్కార్‌ను బీజేపీ వెనకుండి నడిపించేందుకు సిద్ధమైంది. ఎవరూ ఊహించని విధంగా ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో మహారాష్ట్ర సర్కార్ కొలువుదీరనుంది. సీఎం పదవి ఆశించలేదు ముఖ్యమంత్రి పదివిని ఏనాడు ఆశించలేదని ఏక్నాథ్ షిండే తెలిపారు. బీజేపీ పెద్ద మనసుతో సీఎం పదవి మాకు ఇచ్చిందని ఆయన అన్నారు. బాల్ థాక్రే ఆశయాలను కొనసాగిస్తానని, హిందుత్వ ఎజెండా కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ‘ఔరంగాబాద్ పేరు మార్చడం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నియోజకవర్గ సమస్యలపై సీఎంను కలవడానికి ప్రయత్నించా. ఉద్దవ్ ఠాక్రే మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు.’ అని ఏక్నాథ్ షిండే అన్నారు. అంతకుముందు ఏక్నాథ్ షిండే గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గోవా నుంచి ముంబై చేరుకున్నారు. ముంబై చేరిన ఏక్నాథ్ షిండే తొలుత బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు కలిసి రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు గురించి చర్చించారు. చదవండి: శివసేనకు వెన్నుపోటు పొడిచింది ఆయనే! -
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక మలుపు
ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక మలుపు తీసుకుంది. డిప్యూటీ స్పీకర్ తమపై ఇచ్చిన అనర్హత వేటు నోటీసులను సవాల్ చేస్తూ.. షిండే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డిప్యూటీ స్పీకర్ నోటీసుతో పాటు.. శివసేన శాసనసభాపక్ష నేతగా అజయ్ చౌదరిని నియమించడంపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరుతూ.. రెండు పిటిషన్ల దాఖలు చేసింది. చదవండి: ‘మహా’ ట్విస్ట్: పోలీస్ శాఖతో గవర్నర్ చర్చలు.. రాష్ట్రపతి పాలన తప్పదా? సోమవారం ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. కాగా.. సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు వ్యక్తిగతంగా తమ వద్దకు వచ్చి అనర్హత నోటీసుపై వివరణ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ ఆదేశించడంతో.. షిండే న్యాయపోరాటానికి దిగారు. మహారాష్ట్ర శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే అజయ్ చౌదరిని నియమించాలన్న శివసేన ప్రతిపాదనను డిప్యూటీ స్పీకర్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ లేఖను శివసేన కార్యాలయ కార్యదర్శికి డిప్యూటీ స్పీకర్ కార్యాలయం పంపింది. రెబల్ ఏక్ నాథ్ షిండే స్థానంలో ఆయన ఉండనున్నారు. మరోవైపు ఏక్నాథ్ షిండేకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే 38 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. తాజాగా మరో మంత్రి సైతం ఆయన గూటికి చేరనున్నట్లు తెలిసింది. విద్యాశాఖ మంత్రి ఉదయ్ సామంత్ సైతం గౌహతికి బయలుదేరినట్లు సమాచారం. ఆయన సైతం షిండే వర్గంలో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. -
Maharashtra Political Crisis శివ సైనికులకు కేంద్ర మంత్రి అథవాలే వార్నింగ్!
సాక్షి, ముంబై: మహా రాజకీయ సంక్షోభం ముదురుతున్న వేళ బీజేపీ ‘వేచి చూసే ధోరణి’ని అవలంభిస్తోంది. అవకాశం వస్తే వదులుకోం అన్న సంకేతాలను పార్టీ నేతలు కొందరు ఇస్తుండగా మరికొందరు శివసేన ఇంటి పంచాయితీలో వేలు పెట్టబోమని అంటున్నారు. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తాజాగా అటువంటి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాల మధ్య పంచాయితీలో జోక్యం చేసుకోమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సింది వారేనని అన్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో శుక్రవారం జరిగిన భేటీ అనంతరం అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనే తమకు లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుందని పేర్కొన్నారు. శివసేన అంతర్గత విషయాల్లో తలదూర్చకూడదని ఫడ్నవీస్ కూడా అభిప్రాయపడినట్టు అథవాలే తెలిపారు. అది ఎలా సాధ్యం? చాలామంది శివసేన ఎమ్మెల్యేలు పార్టీని ధిక్కరించి క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. అయినప్పటికీ సభలో మెజారిటీ నిరూపించుకుంటామని మహావికాస్ అఘాడి సీనియర్లు శరద్ పవార్, అజిత్ పవార్, ఉద్ధవ్ థాక్రే, సంజయ్ రౌత్ చెప్పడం విడ్డూరంగా ఉందని అథవాలే అన్నారు. సొంత పార్టీ నుంచి 37 మంది, 7 నుంచి 8 మంది స్వతంత్ర ఎమ్మేల్యేలు తన వెంట ఉన్నారని ఏక్నాథ్ చెప్పడం కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఇక రెబెల్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు, వారి కార్యాలయాలపై దాడుల ఘటనలపై అథవాలే స్పందించారు. శివసేన ఎమ్మెల్యేలు దాదాగిరి చేస్తే సహించబోమని అన్నారు. తాము కూడా అంతే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి వార్నింగ్ ఇచ్చారు. కాగా, పుణెలోని శివసేన రెబెల్ఎమ్మెల్యే తానాజి సావంత్ కార్యాలయంపై శనివారం దాడి జరిగింది. శివసైనికులు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. వెన్నుపోటుదారులందరికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. -
‘మహా’పతనం: అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు
గువహటి: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అసోంలో వరదలపై దృష్టి పెట్టకుండా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు గౌహతి హోటల్లో ఆతిథ్యమిచ్చారనే ఆరోపణలపై ఆయన స్పందించారు. మహారాష్ట్ర రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ మద్దతు ఉందని పేర్కొన్నారు. ‘మహా’ సంక్షోభంలో జోక్యం చేసుకోనని చెప్పారు. అసోంకు వచ్చే అతిథులు ఎవరైనా వారికి రక్షణ కల్పించడం మా బాధ్యత అన్నారు. చదవండి: తెర మీదకు శివసేన కొత్త పార్టీ!.. అగ్గి రాజుకుంటుందని హెచ్చరికలు మరో వైపు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక దశకు చేరుకుంది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు రంగం సిద్ధమైంది. 16 మందికి ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు గ్రూప్ లీడర్ ఏక్నాథ్ షిండే ప్రకటించారు. ఈ మేరకు డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాసే యోచనలో ఉన్నారు షిండే. అయితే కొత్త పార్టీ పేరు శివసేన(బాలాసాహెచ్)గా ఉండొచ్చని షిండే వర్గీయులు చెప్తున్నారు. బాల్‌థాక్రే సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఉండబోతున్నట్లు సమాచారం.