- స్టాఫ్‌నర్సు, సిబ్బంది తీరుపై ఆందోళన
- కుక్కకాటుకు గురైన చిన్నారికి
- అందని వైద్యం
- రాజమండ్రి ఆస్పత్రికి తరలింపు
కాండ్రకోట పీహెచ్‌సీకి తాళాలు
Published Fri, Apr 28 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM
కాండ్రకోట (పెద్దాపురం) :
స్థానిక 24 గంటల ఆస్పత్రిలో యాంటీ రేబిస్ వ్యాక్సి¯ŒS అందుబాటులో లేకపోవడం, గ్రామంలో స్టాఫ్‌నర్సు వైద్య సేవలు అందించకపోవడాన్నిS నిరసనగా కాండ్రకోట గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. పీహెచ్‌సీకి వారు తాళాలు వేసి అక్కడ బైఠాయించారు. ఉదయం 10.30కు కూడా సిబ్బంది రాలేదని వారు నిరసన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు జోకా నానాజీ మనుమరాలు లంకా పావనిశ్రీని బుధవారం సాయంత్రం కుక్క కరిచింది. ఆస్పత్రిలో సిబ్బంది లేకపోవడంతో గ్రామంలో ఉంటున్న స్టాఫ్‌నర్సు రామలక్షి్మకి ఫో¯ŒS చేశారు. అయితే రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేదని, రావడం కష్టమని సమాధానం చెప్పడంతో ఆ బాలికను రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో, ఆస్పత్రి నిర్వహణ, సిబ్బంది పనితీరుకు నిరసనగా గురువారం ఉదయం నానాజీ, గవరసాని సూరిబాబు, జోకా సీతబాబు, గంటా రామస్వామి, పల్లా గంగారావు, గంటా శేషు, సత్తిబాబు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలోకి సిబ్బందిని వెళ్లనీయలేదు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రావాలి్సందేనని భీష్మించారు. ఆస్పత్రి వైద్యురాలు జె.శ్రీలత వారిని వారించినా వారు పట్టు వీడలేదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, వ్యాక్సి¯ŒS ఇప్పుడు అందుబాటులో ఉందన్నారు. స్టాఫ్‌నర్సు రామలక్షి్మపై చర్యలు ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తానని, ఇలాంటి పొరబాటు భవిష్యత్‌లో తిరిగి జరగకుండా చూస్తామని ఆమె హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
Advertisement
Advertisement