చిట్టినగర్: విజయవాడలోని రైల్వే ఆర్పీఎఫ్ కార్యాలయానికి నగర పాలక సంస్థ అధికారులు శనివారం మధ్యాహ్నం తాళాలు వేశారు. ఓ కాల్వ నిర్మాణ పనుల విషయమై ఆర్పీఎఫ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో.. ప్రతిగా కార్యాలయానికి తాళం వేసి మున్సిపల్ అధికారులు తమ తడాఖా చూపించారు. కేఎల్‌రావు నగర్‌లో అవుట్‌పాల్ డ్రెయిన్ పనులను వీఎంసీ అధికారులు చేపట్టారు. వీటిని ఆర్పీఎఫ్ సిబ్బంది అడ్డుకోవడంతో వారి మధ్య వివాదానికి దారి తీసింది. ఆర్పీఎఫ్ వైఖరిపై వీఎంసీ అధికారులకు చిర్రెత్తుకురావడంతో...తమకు బకాయిపడ్డ పన్నులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్పీఎఫ్ కార్యాలయానికి తాళాలు వేశారు.