33 ఏళ్ల మహిళ, ఆమె కొడుకు మూడేళ్లుగా స్వచ్ఛంద గృహ నిర్బంధంలోనే ఉండిపోయారు. అదీ కూడా అద్దె ఇంట్లోనే అలా నిర్బంధంలో ఉండిపోయారు. పోలీసుల రంగంలోకి దిగి వారిని ఆస్పత్రికి తరలించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గురుగ్రామ్‌లోని చక్కర్ పూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..మున్మున్ మాఝీ అనే మహిళ తన ఎనిమిదేళ్ల కొడుకు కోవిడ్ మహామ్మారి వచ్చినప్పటి నుంచి అంటే సరిగ్గా 2020 నుంచి ఇప్పటి వరకు గృహ నిర్బంధంలో ఉండిపోయారు. కనీసం ఆ మహిళ కొడుకు సూర్యుడు ఉదయించడాన్ని కూడా చూడకుండా అలానే ఇంట్లో ఉండిపోయాడు. ఆఖరికి ఆ భయంతో ఆమె తన భర్త సుజన్‌మార్జీను అస్సలు ఇంట్లోకి రానివ్వలేదు. ఆమె భర్త ఒక ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతను మొదట్లో స్నేహితులు, బంధవుల ఇళ్లల్లో తలదాచుకున్నాడు.
ఇక రాను రాను కష్టమవ్వడంతో మరో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండటం ప్రారంభించాడు. అప్పుడప్పుడూ వీడియో కాల్‌లోనే మాట్లాడుతుండే వాడు. తన భార్య కొడుకు ఉన్న ఇంటి అద్దె, తదితరాలు కట్టడం, వారికి కావాల్సిన వస్తువులు డోర్ ముంగిట పెట్టి వెళ్లిపోవడం ఇలానే మూడేళ్లు గడిచిపోయాయి. ఐతే మున్మున్ మాత్రం లాక్‌డౌన్ ఎత్తేసి మాములుగా అయిపోయినా ఇంకా అలా స్వయం నిర్బంధంలోనే ఉండిపోయింది. భర్త ఎంత నచ్చచెప్పిన వినక పోయే సరికి చక్కర్‌పూర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి బయటు తీసుకువచ్చారు.
ఆ తల్లి కొడుకులను గురుగ్రామ్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐతే మున్మున్ కాస్త సైక్రియాట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేగాదు వారి ఇల్లు చాలా అపరిశుభ్రంగా చెత్త పేరుకు పోయి ఉందని చెప్పారు. ఇంకొన్ని రోజులు ఆగి ఉంటే అవాంఛనీయమైన ఘటన జరిగి ఉండేదని పోలీసులు చెబుతున్నారు. ఆ మహిళ కనీసం వంటగ్యాస్ కానీ, నీటిని గానీ వినయోగించ లేదని వెల్లడించారు. కాగా ఆమె భర్త సుజన్ తన భార్య కొడుకుని బయటకు తీసుకొచ్చినందుకు పోలీసులకు దన్యావాదాలు తెలిపాడు. తొందరలోనే వాళ్లిద్దరూ కోలుకుంటారని మళ్లీ తాము మునుపటిలా హాయిగా ఉంటామని సంబంరంగా చెబుతున్నాడు సుజన్.
(చదవండి: బీబీసీకి ఆ స్వేచ్ఛ ఉంది! భారత్‌లో పరిణామాలపై బ్రిటన్ స్పందన)
Comments
Please login to add a commentAdd a comment