A Woman Alleged That the Maid Put a Secret Camera in Her Bedroom - Sakshi
Sakshi News home page

మహిళా యజమాని బెడ్‌రూంలో సీక్రెట్‌ కెమెరా పెట్టిన పనోడు..ఆ తర్వాత..

May 14 2023 11:03 AM | Updated on May 14 2023 1:21 PM

Domestic Help Fix Spy Camera In Women Bedroom - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

యజమాని చెప్పిన వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం ఓ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ ద్వారా ఈమె పనిపనిషిని నియమించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అతడు బెడ్‌రూంలో స్పై కెమెరా ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత ఆమె ప్రైవేటు వీడియోలను సేకరించాడు. 

గురుగ్రాంలో షాకింగ్ ఘటన జరిగింది. పనిమనిషి తనకు తెలియకుండా బెడ్‌రూంలో సీక్రెట్ కెమెరా పెట్టాడని ఓ మహిళ ఆరోపించింది. ఆపై తన ప్రైవేటు వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించి రూ.2లక్షలు డిమాండ్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయంపై వారు విచారణ చేపట్టారు.

యజమాని చెప్పిన వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం ఓ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ ద్వారా ఈమె పనిమనిషిని నియమించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అతడు బెడ్‌రూంలో స్పై కెమెరా ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత ఆమె ప్రైవేటు వీడియోలను సేకరించాడు. 

అయితే గతవారం ఇల్లు శుభ్రం చేసే సమయంలో యజమానికి సీక్రెట్ కెమెరా  కన్పించింది. దీంతో వెంటనే పనిమనిషిని పనిలోనుంచి తీసేసింది. ఈ విషయం ఎవరికీ తెలియవద్దనే భయంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు.

కానీ.. పనిమనిషి డబ్బుకోసం యజమానిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. రూ.2 లక్షలు ఇవ్వకపోతే ఆమె ప్రైవేటు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో గత్యంతరం లేక ఆమె ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసుకుని నిందితుడు శుభం కుమార్‌ను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు.
చదవండి: ఇంటి ఓనర్ పాడు పని.. అమ్మాయిలకు తెలియకుండా బెడ్‌రూమ్‌, బాత్‌రూంలో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement