secret camera
-
మహిళా యజమాని బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టిన పనోడు..ఆ తర్వాత..
గురుగ్రాంలో షాకింగ్ ఘటన జరిగింది. పనిమనిషి తనకు తెలియకుండా బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టాడని ఓ మహిళ ఆరోపించింది. ఆపై తన ప్రైవేటు వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి రూ.2లక్షలు డిమాండ్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయంపై వారు విచారణ చేపట్టారు. యజమాని చెప్పిన వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం ఓ ప్లేస్మెంట్ ఏజెన్సీ ద్వారా ఈమె పనిమనిషిని నియమించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అతడు బెడ్రూంలో స్పై కెమెరా ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత ఆమె ప్రైవేటు వీడియోలను సేకరించాడు. అయితే గతవారం ఇల్లు శుభ్రం చేసే సమయంలో యజమానికి సీక్రెట్ కెమెరా కన్పించింది. దీంతో వెంటనే పనిమనిషిని పనిలోనుంచి తీసేసింది. ఈ విషయం ఎవరికీ తెలియవద్దనే భయంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ.. పనిమనిషి డబ్బుకోసం యజమానిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. రూ.2 లక్షలు ఇవ్వకపోతే ఆమె ప్రైవేటు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో గత్యంతరం లేక ఆమె ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసుకుని నిందితుడు శుభం కుమార్‌ను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. చదవండి: ఇంటి ఓనర్ పాడు పని.. అమ్మాయిలకు తెలియకుండా బెడ్రూమ్, బాత్రూంలో... -
13 మందిపై అత్యాచారం, వీడియో రికార్డింగ్.. బాలేశ్ ధన్కర్ అకృత్యాలు
సిడ్నీ: ఉద్యోగాల పేరుతో ఇంటర్వ్యూలకు పిలిచి, మత్తు కలిపిన డ్రింక్స్ తాగించి వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు.. ఆ దురాగతాలను వీడియో రికార్డింగ్ చేసేవాడు. కొరియా మహిళలంటే ఇతడికి పిచ్చి. బాధితుల్లో వీరే ఎక్కువమంది. వీరి పేర్లు, వివరాలను దాచుకున్నాడు. అతడి గదిలో బెడ్ పక్కనే అలారం క్లాక్‌లోని సీక్రెట్ కెమెరా ద్వారా అన్నీ రికార్డయ్యేవి...ఇవన్నీ ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన భారత సంతతి వ్యక్తి బాలేశ్ ధన్కర్ అకృత్యాలు. 2018 జనవరి– అక్టోబర్కాలంలో ఇతడు 13 మంది ఇతడు మహిళలను రేప్ చేశాడు. 2018 అక్టోబర్‌లో పోలీసులు ఇతడి సొంత ఫ్లాట్‌తోపాటు ఓ హోటల్ గదిలో సోదాలు జరపగా మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్స్ బాటిళ్లు, రేప్ దృశ్యాలు, మహిళలతో ఏకాంతంగా ఉండగా తీసిన మొత్తం 47 వీడియోలతో హార్డ్‌డ్రైవ్ దొరికింది. బాలేశ్ నేరాలపై న్యూసౌత్ వేల్స్ జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది. కొన్ని వీడియోల్లోని అసహ్యకర దృశ్యాలను జడ్జీలు కూడా చూడలేకపోయారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. -
Hyderabad: మెకానిక్‌తో వచ్చి.. రహస్య కెమెరా అమర్చి!
సాక్షి, హైదరాబాద్: అల్వాల్‌కు చెందిన ఓ మహిళ మొబైల్ షాప్‌ను నిర్వహిస్తుంది. అక్కడికి వివో మొబైల్ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్న గాజులరామారానికి చెందిన సయ్యద్ రియాజ్ సెల్‌ఫోన్ విక్రయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తరుచు వచ్చేవాడు. ఈ క్రమంలో సదరు మహిళతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. ఓ రోజు మహిళ షాపులో ఉన్న సమయంలో తన భర్తతో సెల్ఫోన్లో గీజర్, ఏసీ రిపేర్ విషయమై మాట్లాడుతుండగా.. అదే సమయంలో అక్కడికి వచ్చిన రియాజ్ మెకానిక్‌ను ఏర్పాటు చేస్తానని మహిళను ఒప్పించాడు. మర్నాడు మెకానిక్‌ను తీసుకుని మహిళ ఇంటికెళ్లిన రియాజ్.. ఆమెకు తెలియకుండా ఇంట్లో రహస్య కెమెరాను అమర్చాడు. ఈ క్రమంలో ఆమె ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తన వద్ద నగ్న వీడియోలు, ఫొటోలు ఉన్నాయని, ఇంటికి పిలవకపోతే వీటిని వైరల్ చేస్తానని బెదిరించసాగాడు. తాను చెప్పినట్లు నడుచుకోకపోతే ఫొటోలు ప్రింట్ తీసి ఆమె ఇంటి పరిసరాల్లో గోడల మీద అతికిస్తానని బెదిరించాడు. ఓ రోజు మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డాడు. భయంతో ఆమె కేకలు పెట్టడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో బాధితురాలు పేట్ బషీరాబాద్ షీ టీమ్స్‌ను సంప్రదించింది. వారి సూచన మేరకు అల్వాల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ►ఈ ఒక్క కేసే కాదు.. పార్క్‌లో వాకింగ్ చేస్తున్న మహిళపై ఫ్లాష్ లైట్లు కొట్టిన ఆకతాయి, లిఫ్ట్‌లో మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరీ, పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి పరారైన వ్యక్తి తదితరులకు షీటీమ్స్ చెక్ పెట్టింది. 126 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్.. గత నెలలో సైబరాబాద్ షీ టీమ్స్‌కు 98 ఫిర్యాదులు అందాయి. వీటిల్లో 29 కేసులు నమోదు చేయగా.. 4 క్రిమినల్ కేసులు, 25 పెట్టీ కేసులున్నాయి. అత్యధికంగా 74 ఫిర్యాదులు వాట్సాప్ ద్వారా అందాయి. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్‌లో 126 మంది ఆకతాయిలకు గురువారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇందులో 20 మంది మైనర్లున్నారు. అర్ధరాత్రి డెకాయ్.. ఐటీ కంపెనీలకు నిలయమైన సైబరాబాద్‌లో రాత్రి వేళల్లో కూడా పలు కంపెనీలు పనిచేస్తుంటాయి. దీంతో మహిళా ఉద్యోగుల భద్రత, రక్షణ కోసం సైబరాబాద్ షీ టీమ్స్ అర్ధరాత్రి డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఫుడ్ కోర్ట్లు, వసతి గృహాలు, మెట్రో స్టేషన్లు, మాదాపూర్‌లోని 100 ఫీట్ల రోడ్, కూకట్పల్లి ఏరియా బస్ స్టాప్‌లు తదితర ప్రాంతాల్లో మఫ్టీలో సంచరిస్తున్న షీ టీమ్స్ బృందాలు గత నెలలో మహిళలను వేధిస్తున్న 60 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత నెల రోజుల్లో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో 477 డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించగా 31 మంది ఆకతాయిలు పట్టుబడ్డారు. -
హౌస్ కీపర్ బెనర్జీ కెమెరా పెట్టిన రోజే దొరికేసాడు
-
షాకింగ్ : టాయిలెట్లో కెమెరా అమర్చారు..
పుణే : పుణేలోని ఒక కేఫ్‌లో టాయిలెట్ లోపల దాచిన కెమెరాను ఒక మహిళ ఫోటోలు తీసి సోషల్‌మీడియాలో షేర్ చేయడం వైరల్‌గా మారింది. అంతేగాక సదరు మహిళ తాను కెమెరాను ఎలా కనుగొన్నది ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రీన్షాట్ల రూపంలో వివరించింది. ఈ ఘటనపై స్పందించిన పూణే పోలీసులు స్పందిస్తూ.. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం పంపించామని, కేఫ్‌పై తగిన చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మూడు రోజుల క్రితం పూణేలోని హింజావాడి ఏరియాలోని కేఫ్ బిహైవ్‌కు ఓ మహిళ కాఫీ తాగేందుకు వచ్చింది. రెస్ట్ రూమ్‌కు అని వెళ్లిన సదరు మహిళ టాయిలెట్లో కెమెరా ఉన్నట్లు గుర్తించి వాటిని ఫోటోలు తీసుకుంది. ఇదే విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురాగా ఆమెను 10 నిమిషాలు బయటికి పంపించి కెమెరాను రహస్యంగా తొలగించారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు తనకు లంచం కూడా ఇవ్వబోయారని సదరు మహిళ పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ .. ఇలాంటి అసభ్యకరమైన పనులు చేస్తున్న కేఫ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు. Have deleted my previous tweet, as someone pointed out a mistake. Behive, Hinjewadi was filming women in the ladies toilet. This is the limit of perversion. They have to be brought to book. RT widely. @PuneCityPolice pic.twitter.com/sPW7lWLSYS — TheRichaChadha (@RichaChadha) 6 November 2019 -
ఉద్యోగిని దుస్తులు మార్చుకుంటుండగా..
రామచంద్రపురం: రైల్వే స్టేషన్‌లోని ఓ గదిలో తోటి ఉద్యోగిని దుస్తులు మార్చుకుంటుండగా రహస్య కెమెరాతో చిత్రీకరించిన ఓ సూపరింటెండెంట్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం రైల్వేస్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం రైల్వే స్టేషన్లో మహ్మద్ రియాజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇదే స్టేషన్లో ఓ వివాహిత గేట్‌కీపర్‌గా సుమారు ఏడాది నుంచి విధులు నిర్వహిస్తోంది. ఇటీవల స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ ఎత్తివేయడంతో ఆ గదిలో మహిళా ఉద్యోగి దుస్తులు మార్చుకుని యూనిఫాం వేసుకుంటోంది. ఇది గమనించిన రియాజ్ గదిలోని ఓ ప్రదేశంలో రహస్య కెమెరాను అమర్చి చిత్రీకరణకు పాల్పడ్డాడు. గత కొంతకాలంగా ఈ తతంగం సాగుతుండగా బుధవారం గదిలో దుస్తులు మార్చుకుంటున్న సమయంలో కెమెరాకు ఉన్న చిన్న ఎల్ఈడీ బల్బు వెలుగు కనిపించడంతో అనుమానం వచ్చి తీసి చూడగా అసలు విషయం బయటపడింది. సూపరింటెండెంట్ ల్యాప్‌టాప్‌లో కెమెరాలో చిత్రీకరించిన వీడియోలను గుర్తించిన బాధితురాలు పైఅధికారులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సతీష్ తన సిబ్బందితో రామచంద్రపురం రైల్వే స్టేషన్‌కు చేరుకొని రహస్య చిత్రీకరణను నిర్ధారించారు. కెమెరాను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి రైల్వే డీఆర్ఎంకు నివేదిక అందించారు. డీఆర్ఎం ఆదేశాల మేరకు నిందితుడు మహ్మద్ రియాజ్‌ను సస్పెండ్ చేశారు. -
నా జీవితం నీ అశ్లీల చిత్రం కాదు
దక్షిణ కొరియాలో ‘రహస్య కెమెరాలతో చిత్రీకరణ’ సమస్య తీవ్రరూపం దాల్చింది. బీచులు, స్విమ్మింగ్‌పూల్స్ మాత్రమే కాకుండా పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనూ ఇలాంటి చిత్రీకరణలు పెరిగిపోయి వ్యక్తిగత గోప్యతకు ఆటంకంగా మారుతున్నాయి. ఇది ఎంతవరకు వెళ్లిందంటే.. ఇలా సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది మహిళలు ‘నా జీవితం నీ అశ్లీల చిత్రం కాదు’ (మై లైఫ్ ఈజ్ నాట్ యువర్ పోర్న్) అనే ప్లకార్డులు చేపట్టి ఇటీవల వీధుల్లో నిరసనలు తెలిపే వరకు! నిరసనల వరకే మహిళలు పరిమతం కాలేదు. ఇలాంటి వీడియోలు రికార్డ్ చేస్తున్న, వీక్షిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ దేశాలతో పాటు దక్షిణ కొరియాలోనూ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఏడాది నుంచి ‘మీ టూ ఉద్యమం’ సాగుతోంది. ఈ ఉద్యమం ద్వారా బాధితులు బయటికి వచ్చి.. లైంగికదాడులు, వేధింపులకు పాల్పడిన అధికార డెమొక్రాటిక్ పార్టీ నేత యాన్ హి–జింగ్ సహా పలువురు ప్రముఖులను సైతం ఎండగట్టగలిగారు. ఈ నేపథ్యంలోనే తమను రహస్య కెమెరాల్లో చిత్రీకరించడంపైనా మహిళలు గళమెత్తారు. ఏమిటిది అకస్మాత్తుగా! పార్కులు, స్విమ్మింగ్‌పూల్స్, బీచ్లలోని రెస్ట్రూమ్లు, గదుల్లో దుస్తులు మార్చుకుంటున్న మహిళలను రహస్య కెమెరాల ద్వారా రికార్డ్ చేస్తున్న ఘటనలు దక్షిణ కొరియాలో ఇటీవల కాలంలో తరచూ బయటపడుతున్నాయి. వీటిపై మహిళల నుంచి ఒక్కసారిగా ఫిర్యాదులు పెరిగిపోవడంతో పోలీసు బృందాలు స్కానర్లతో రంగంలోకి దిగి బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో కనిపెట్టి వాటిని తొలగించే చర్యలు చేపడుతున్నారు. అయితే చిన్న చిన్న కెమెరాలు ఎక్కడ పెట్టారనేది మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా లెక్కకు మించి తనిఖీలు చేపడుతున్నా ఈ సమస్యకు చెక్ పెట్టలేకపోతున్నారు. పెరుగుతున్న బాధితులు 2012–16 మధ్యకాలంలో రహస్య చిత్రీకరణ బాధితులుæ 26 వేల మందికి పైగానే ఉన్నారని, వారిలో 80 శాతం మంది మహిళలేనని గుర్తించారు. తమను రికార్డ్ చేశారన్న సంగతి కూడా వారిలో చాలా మందికి తెలియదని పోలీసులు చెబుతున్నారు. అయితే వారు చెబుతున్న దాని కంటే కనీసం పదింతలు ఎక్కువగా బాధితుల సంఖ్య ఉండొచ్చునని సూన్‌చున్హ్ యాంగ్ వర్సిటీ క్రిమినాలజీ (నేరశాస్త్రం) ప్రొఫెసర్ ఓహ్ యూన్–సంగ్ అంటున్నారు. ‘‘ఇది రోజువారి జీవితంలో భాగమై పోయింది. ఇలాంటి వాటికి పాల్పడిన వారిపై మరింత కఠినచర్యలు తీసుకోవాల్సి ఉంది’’ అని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు మూన్ జో–ఇన్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. 2011లో 1,354 మందిని సీక్రెట్ కెమెరా నేరస్థులను పోలీసులు గుర్తించగా, 2017 నాటికి వారి సంఖ్య 5,363 మందికి పెరిగింది. సులభంగా స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉండడంతో పాటు సోషల్ మీడియా వ్యాప్తి కూడా ఈ నేరానికి దోహదపడుతోందని సామాజిక పోడకల అధ్యయనవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ‘ఐదేళ్ల శిక్ష చాలదు’ పోలీసు అధికారులు కెమెరా హార్డ్‌వేర్ అమ్మకాలపై నిఘాతో పాటు రహస్య చిత్రీకరణలు పెద్ద నేరమనే అంశానికి ప్రచారం కల్పిస్తున్నారు. అంతేకాకుండా బహిరంగప్రదేశాల్లో ఏయే రూపాల్లో అతిచిన్న కెమెరాల ద్వారా రికార్డింగ్‌కు వీలుందో పౌరులకు అవగాహన కల్పిస్తున్నారు. రహస్య రికార్డింగ్‌లకు పాల్పడిన వారికి అయిదేళ్ల శిక్ష లేదా రూ.6.2 లక్షల జరిమానా విధిస్తున్నారని, అయితే ఇంతకంటే కఠినమైన శిక్షలుండాలని కొరియా మహిళా న్యాయవాదుల సంఘం నేత కిమ్ యంగ్–మి డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారిలో 5.3 శాతం మాత్రమే జైలుకు వెళ్లినట్టుగా అయిదేళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఊహించని చోట్ల కెమెరాలు! బేస్‌బాల్ టోపి, బెల్టు, గడియారం, లైటర్, యూఎస్బీ పరికరం, చొక్కాపై ధరించే టై, కారుతాళాలు, పాదరక్షలు ఇలా ప్రతి వస్తువుపై అతిచిన్న రహస్య కెమెరాలు అమరుస్తున్నారు. మాల్‌లు, షాపింగ్ సెంటర్లు, బీచ్‌లు, స్విమ్మింగ్ పూల్‌లు, దుస్తులు మార్చుకునే గదుల్లో డోర్‌లాకర్లు, ఫ్రేమ్‌లు, స్నానపు గదుల్లోని షవర్లు, టాయ్లెట్లలో ఎక్కడబడితే అక్కడ వీటిని పెట్టి దృశ్యాలు రికార్డ్ చేస్తున్నారు. వాటిని వెబ్సైట్లతో పాటు సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేస్తున్నారు. దీన్ని అదుపుచేయడంతో పాటు ఆన్లైన్, ఇతర వెబ్ కంటెంట్‌లో ఇలాంటి అక్రమ రికార్డింగ్‌లు పెట్టకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని దక్షిణ కొరియాలోని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. – కె. రాహుల్ -
బాత్ రూంలో రహస్య కెమెరా పెట్టి..
సాక్షి, బనశంకరి: ఓ యువకుడు చేసిన వికృతచేష్టలకు కటకటాల పాలయ్యాడు. ఓ వ్యక్తి పక్కింటిలో ఉన్న బాత్రూంలో రహస్య కెమెరా అమర్చాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బనశంకరిలో చోటుచేసుకుంది. వివరాలివి.. మైకోలేఔట్ స్వారభౌమనగర్కు చెందిన జీవన్సెఠ్ ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. తన ఇంటి పక్కన ఉన్న మరో ఇంటి బాత్రూంలో కెమెరా అమర్చాడు. ఉదయం స్నానాల గదిలోకి వెళ్లిన సదరు ఇంటి మహిళ కెమెరా ఉన్నట్లు గమనించి భర్తకు తెలిపింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన మైకో లేఔట్ పోలీసులు జీవన్‌ను గురువారం అరెస్టు చేశారు. -
ఫ్యాబ్ ఇండియా ఎండీకి సమన్లు..?
పనాజి: ఫ్యాబ్ ఇండియా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కేసులో గోవా క్రైమ్ బ్యాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా శాఖలున్న ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ఫ్యాబ్ ఇండియా ఎండీకి సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సాక్షాత్తు కేంద్ర మంత్రికే ఇలాంటి అవాంఛనీయ సంఘటన ఎదురుకావడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. దీంతో గోవా ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాగా ఈ కేసులో ఇప్పటికే దుకాణంలో పనిచేసే నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. షాపులో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని, విచారణ వేగవవంతం చేశామని ఎస్పీ కార్తీక కశ్యప్ తెలిపారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి గోవాలో ఫ్యాబ్ ఇండియా స్టోర్‌లో షాపింగ్‌కు వెళ్లిన సందర్భంగా అనూష్య సంఘటన చోటు చేసుకుంది. ట్రయల్ రూంలోని రహస్య కెమెరాలను చూసి షాకైన మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గత మూడు నాలుగు నెలలుగా ఆ షోరూంలో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు స్టోర్స్ హార్డ్‌డిస్కును పరిశీలించిన అధికారులు వెల్లడించారు. -
కేంద్రమంత్రికే అలా జరిగితే సామాన్యుల పరిస్థితేంటి?
తిరుపతి: గోవాలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఎదురైన చేదు అనుభవంపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. ఈ ఘటన చాలా దారుణమని పేర్కొన్నారు. నాలుగు నెలలుగా వస్త్ర దుకాణంలోని ట్రయల్ రూములో సీసీ కెమెరాలు ఉన్నాయంటే.. దేశంలో ఇంతకంటే దారుణం మరోటి లేదన్నారు. కేంద్రమంత్రికే ఇంత అవమానం జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలపై నిర్భయ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. స్మృతి ఇరానీ ఘటన మొదటికాదని, హైదరాబాద్ లో చాలా చోటుచేసుకున్నాయని రోజా ఆరోపించారు. గోవాలో ఉన్న ఓ స్టోర్‌లో దుస్తులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన స్మృతి ఇరానీకి ట్రయల్ రూములో రహస్య కెమెరాలు కనబడడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ట్రయల్ రూంలో కెమెరా: స్మృతి ఇరానీకి షాక్!
-
గోవా ట్రయల్ రూంలో రహస్య కెమెరా: స్మృతి ఇరానీకి షాక్!
కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి గోవాలో పెద్ద షాక్ తగిలింది. గోవాలో ఉన్న ఓ స్టోర్‌లో దుస్తులు కొనుగోలు చేసేందుకు ఆమె వెళ్లారు. తీరా దుస్తులు మార్చుకునే ట్రయల్ రూంలోకి వెళ్తే.. అక్కడ ఆమెకు రహస్య కెమెరాలు కనిపించాయి. దాన్ని వెంటనే గుర్తించిన ఆమె.. ఆ విషయాన్ని పోలీసులకు అప్పటికప్పుడే తెలియజేశారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి వెళ్లిన దుకాణంలోనే ఇలా రహస్య కెమెరాలు కనిపించడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. గోవాలో ఇలా జరగడంతో ఒక్కసారిగా గగ్గోలు పుట్టింది. సెలవలు గడిపేందుకు గోవా వెళ్లిన స్మృతి ఇరానీ.. పనజికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలాంగుటె అనే ప్రాంతంలో గల బొటిక్కు వెళ్లారు. తీరా ఆమె కొన్ని దుస్తులు తీసుకుని ట్రయల్ రూంలోకి వెళ్లారు. కాసేపటికి ఆమె సహాయకుల్లో ఒకరు ట్రయల్ రూం వెలుపల ఉన్న కెమెరాను గుర్తించారు. ఆ కెమెరా సరిగ్గా ట్రయల్ రూం లోపలి దృశ్యాలను చిత్రీకరించేలా అమర్చి ఉంది. వెంటనే ఆమె అప్రమత్తమై.. మంత్రికి కూడా విషయం చెప్పారు. ఆమె వెంటనే మైకేల్ లోబో అనే స్థానిక బీజేపీ నాయకుడికి విషయం చెప్పారు. ఆయనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన నేరంపై పోలీసులు కేసు పెట్టారు. అసలు ఆ కెమెరాను అక్కడ ఎవరు పెట్టారో దర్యాప్తు చేస్తున్నారు. స్మృతి ఇరానీ స్వయంగా వెళ్లి పోలీసులకు తన స్టేట్మెంట్ ఇచ్చారు. తాను పోలీసులతో కలిసి స్టోర్స్ హార్డ్‌డిస్కును పరిశీలిస్తున్నానని, గత మూడు నాలుగు నెలలుగా ఈ వ్యవహారం ఆ షోరూంలో జరుగుతున్నట్లు తనకు తెలిసిందని లోబో చెప్పారు. అయితే.. బీజేపీయే అధికారంలో ఉన్న గోవా రాష్ట్రంలో ఇలా జరగడంతో కాంగ్రెస్ నాయకులు దీన్ని 'ఛేంజింగ్ రూం స్కాం'గా అభివర్ణిస్తున్నారు.