కేంద్రమంత్రికే అలా జరిగితే సామాన్యుల పరిస్థితేంటి?
తిరుపతి: గోవాలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఎదురైన చేదు అనుభవంపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. ఈ ఘటన చాలా దారుణమని పేర్కొన్నారు. నాలుగు నెలలుగా వస్త్ర దుకాణంలోని ట్రయల్ రూములో సీసీ కెమెరాలు ఉన్నాయంటే.. దేశంలో ఇంతకంటే దారుణం మరోటి లేదన్నారు. కేంద్రమంత్రికే ఇంత అవమానం జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
ఇలాంటి ఘటనలపై నిర్భయ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. స్మృతి ఇరానీ ఘటన మొదటికాదని, హైదరాబాద్ లో చాలా చోటుచేసుకున్నాయని రోజా ఆరోపించారు. గోవాలో ఉన్న ఓ స్టోర్లో దుస్తులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన స్మృతి ఇరానీకి ట్రయల్ రూములో రహస్య కెమెరాలు కనబడడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.