ఫ్యాబ్ ఇండియా ఎండీకి సమన్లు..?
పనాజి: ఫ్యాబ్ ఇండియా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కేసులో గోవా క్రైమ్ బ్యాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా శాఖలున్న ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ఫ్యాబ్ ఇండియా ఎండీకి సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సాక్షాత్తు కేంద్ర మంత్రికే ఇలాంటి అవాంఛనీయ సంఘటన ఎదురుకావడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. దీంతో గోవా ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాగా ఈ కేసులో ఇప్పటికే దుకాణంలో పనిచేసే నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. షాపులో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నామని, విచారణ వేగవవంతం చేశామని ఎస్పీ కార్తీక కశ్యప్ తెలిపారు.
కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి గోవాలో ఫ్యాబ్ ఇండియా స్టోర్లో షాపింగ్కు వెళ్లిన సందర్భంగా అనూష్య సంఘటన చోటు చేసుకుంది. ట్రయల్ రూంలోని రహస్య కెమెరాలను చూసి షాకైన మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గత మూడు నాలుగు నెలలుగా ఆ షోరూంలో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు స్టోర్స్ హార్డ్డిస్కును పరిశీలించిన అధికారులు వెల్లడించారు.