trial room
-
స్మార్ట్ఫోనే ట్రయల్ రూం: ట్రూపిక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆన్లైన్లో కొన్న దుస్తులు ఎలా ఫిట్ అవుతాయో వేసుకుంటేగానీ తెలియదు. ప్రత్యక్షంగా వేసుకోకున్నా అవి ఎలా ఫిట్ అవుతాయో స్మార్ట్‌ఫోన్‌లో చూపించే వ్యవస్థను ట్రూపిక్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. ట్రూపిక్తో చేతులు కలిపిన బ్రాండ్ స్టోర్‌లో 3డీ మ్యాపింగ్ విధానంలో 360 డిగ్రీల కోణంలో కస్టమర్‌ను చిత్రిస్తారు. తద్వారా 3డీ డిజిటల్ వ్యక్తిని సృష్టిస్తారు. కస్టమర్ తాను ఎక్కడున్నా ట్రూపిక్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై తనకు నచ్చిన డ్రెస్‌ను క్లిక్ చేయగానే డిజిటల్ వ్యక్తి ప్రత్యక్షంగా ఆ దుస్తులను వేసుకున్నట్టు కనపడుతుందని కంపెనీ ఫౌండర్ శ్రీధర్ తిరుమల తెలిపారు. -
ట్రయల్ రూం మీ స్మార్ట్‌ఫోన్‌లో..!
♦ 3డీ బాడీ మ్యాపింగ్‌తో సాధ్యం ♦ అందుబాటులోకి తెచ్చిన ట్రూపిక్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో నచ్చిన బ్రాండ్ దుస్తులు కొంటున్నారా? ఇంతకీ ఆ దుస్తులు మీకు ఎలా ఫిట్ అవుతాయో వేసుకుంటేగానీ తెలియదు. ప్రత్యక్షంగా వేసుకోకున్నా అవి ఎలా ఫిట్ అవుతాయో స్మార్ట్‌ఫోన్‌లో చూపించే వ్యవస్థను ట్రూపిక్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. ట్రూపిక్తో చేతులు కలిపిన ఏదైనా బ్రాండ్ స్టోర్‌కు కస్టమర్ ఒకసారి వెళ్లి పేరు నమోదు చేసుకుంటే చాలు. స్టోర్‌లో అత్యాధునిక 3డీ మ్యాపింగ్ విధానంలో 360 డిగ్రీల కోణంలో కస్టమర్‌ను చిత్రిస్తారు. తద్వారా 3డీ డిజిటల్ వ్యక్తిని సృష్టిస్తారు. ఇక కస్టమర్ తాను ఎక్కడున్నా ట్రూపిక్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై తనకు నచ్చిన డ్రెస్‌ను క్లిక్ చేయగానే డిజిటల్ వ్యక్తి ప్రత్యక్షంగా ఆ దుస్తులను వేసుకున్నట్టు కనపడుతుంది. అన్ని వైపుల నుంచి ఆ డ్రెస్ ఎలా ఫిట్ అయిందో చూడొచ్చు. ఫేస్బుక్ వేదికగా స్నేహితుల నుంచి సలహాలూ కోరవచ్చు. నచ్చితే ఆర్డరు చేయొచ్చు. సౌకర్యంగా ఉంటుంది... ఆర్డరు చేయగానే దగ్గరలోని బ్రాండ్ స్టోర్ ప్రతినిధి కస్టమర్‌కు దుస్తులను డెలివరీ చేసి వెళ్తారు. డెలివరీ సమయంలో డబ్బులు చెల్లించాలి. ‘సాధారణంగా షాపింగ్‌కు గంటల తరబడి సమయం వెచ్చించాలి. ఆన్లైన్లో కొన్నట్టయితే సైజు తేడా వచ్చే సమస్యలున్నాయి. ట్రూపిక్లో అయితే అటువంటి సమస్యలేవీ లేవు’ అని సీఈవో శ్రీధర్ తిరుమల శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. రేమండ్, ఇండియన్ టెరైన్, అలెన్ సాలీ, విల్స్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్‌తో చేతులు కలిపామన్నారు. మరో 11 బ్రాండ్లు త్వరలో చేరనున్నాయని చెప్పారు. -
ఫ్యాబ్ ఇండియా ఎండీకి సమన్లు..?
పనాజి: ఫ్యాబ్ ఇండియా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కేసులో గోవా క్రైమ్ బ్యాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా శాఖలున్న ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ఫ్యాబ్ ఇండియా ఎండీకి సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సాక్షాత్తు కేంద్ర మంత్రికే ఇలాంటి అవాంఛనీయ సంఘటన ఎదురుకావడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. దీంతో గోవా ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాగా ఈ కేసులో ఇప్పటికే దుకాణంలో పనిచేసే నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. షాపులో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని, విచారణ వేగవవంతం చేశామని ఎస్పీ కార్తీక కశ్యప్ తెలిపారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి గోవాలో ఫ్యాబ్ ఇండియా స్టోర్‌లో షాపింగ్‌కు వెళ్లిన సందర్భంగా అనూష్య సంఘటన చోటు చేసుకుంది. ట్రయల్ రూంలోని రహస్య కెమెరాలను చూసి షాకైన మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గత మూడు నాలుగు నెలలుగా ఆ షోరూంలో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు స్టోర్స్ హార్డ్‌డిస్కును పరిశీలించిన అధికారులు వెల్లడించారు. -
ట్రయల్ రూంలో కెమెరా: స్మృతి ఇరానీకి షాక్!
-
గోవా ట్రయల్ రూంలో రహస్య కెమెరా: స్మృతి ఇరానీకి షాక్!
కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి గోవాలో పెద్ద షాక్ తగిలింది. గోవాలో ఉన్న ఓ స్టోర్‌లో దుస్తులు కొనుగోలు చేసేందుకు ఆమె వెళ్లారు. తీరా దుస్తులు మార్చుకునే ట్రయల్ రూంలోకి వెళ్తే.. అక్కడ ఆమెకు రహస్య కెమెరాలు కనిపించాయి. దాన్ని వెంటనే గుర్తించిన ఆమె.. ఆ విషయాన్ని పోలీసులకు అప్పటికప్పుడే తెలియజేశారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి వెళ్లిన దుకాణంలోనే ఇలా రహస్య కెమెరాలు కనిపించడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. గోవాలో ఇలా జరగడంతో ఒక్కసారిగా గగ్గోలు పుట్టింది. సెలవలు గడిపేందుకు గోవా వెళ్లిన స్మృతి ఇరానీ.. పనజికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలాంగుటె అనే ప్రాంతంలో గల బొటిక్కు వెళ్లారు. తీరా ఆమె కొన్ని దుస్తులు తీసుకుని ట్రయల్ రూంలోకి వెళ్లారు. కాసేపటికి ఆమె సహాయకుల్లో ఒకరు ట్రయల్ రూం వెలుపల ఉన్న కెమెరాను గుర్తించారు. ఆ కెమెరా సరిగ్గా ట్రయల్ రూం లోపలి దృశ్యాలను చిత్రీకరించేలా అమర్చి ఉంది. వెంటనే ఆమె అప్రమత్తమై.. మంత్రికి కూడా విషయం చెప్పారు. ఆమె వెంటనే మైకేల్ లోబో అనే స్థానిక బీజేపీ నాయకుడికి విషయం చెప్పారు. ఆయనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన నేరంపై పోలీసులు కేసు పెట్టారు. అసలు ఆ కెమెరాను అక్కడ ఎవరు పెట్టారో దర్యాప్తు చేస్తున్నారు. స్మృతి ఇరానీ స్వయంగా వెళ్లి పోలీసులకు తన స్టేట్మెంట్ ఇచ్చారు. తాను పోలీసులతో కలిసి స్టోర్స్ హార్డ్‌డిస్కును పరిశీలిస్తున్నానని, గత మూడు నాలుగు నెలలుగా ఈ వ్యవహారం ఆ షోరూంలో జరుగుతున్నట్లు తనకు తెలిసిందని లోబో చెప్పారు. అయితే.. బీజేపీయే అధికారంలో ఉన్న గోవా రాష్ట్రంలో ఇలా జరగడంతో కాంగ్రెస్ నాయకులు దీన్ని 'ఛేంజింగ్ రూం స్కాం'గా అభివర్ణిస్తున్నారు.