fabindia
-
ఫ్యాబిండియా ఐపీవో రద్దు
న్యూఢిల్లీ: కళాత్మక వస్తువులు, లైఫ్‌స్టైల్ ఉత్పత్తుల రిటైల్ రంగ కంపెనీ ఫ్యాబిండియా పబ్లిక్ ఇష్యూ యోచనను విరమించుకుంది. ప్రస్తుత మార్కెట్ ఆటుపోట్ల నేపథ్యంలో ఐపీవో ద్వారా రూ. 4,000 కోట్ల సమీకరణ ప్రణాళికలను రద్దు చేసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. వెరసి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించింది. ఇష్యూ పరిమాణంరీత్యా ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేనట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ఐపీవో ద్వారా 2.5 కోట్ల షేర్లను ఆఫర్ చేయాలని భావించింది. ప్రాస్పెక్టస్ గడువు 2023 ఏప్రిల్‌తో ముగియనున్న నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎన్సీడీల స్వచ్చంద చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులను వెచ్చించాలని కంపెనీ తొలుత ప్రణాళికలు వేసింది. -
#NoBindiNoBusiness: మరో వివాదంలో ఫ్యాబ్ఇండియా
సాక్షి, ముంబై: పండుగలు అంటే సాంప్రదాయబద్దంగా జరుపుకుంటాం. ఎవరి మతాచారాలకు తగ్గట్టు వాళ్లు పండగలు చేసుకుంటారు. ఇక హిందూ పర్వదినాల విషయానికి వస్తే.. ముఖ్యంగా మహిళలు.. సాప్రదాయబద్దంగా తయారవడానికి ఇష్టపడతారు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా పండుగనాడు మాత్రం పట్టుబట్టలు, బొట్టు, పూలు, గాజులతో అందంగా ముస్తాబవుతారు. ఆధునికంగా కనిపిస్తూనే సాంప్రదాయంగా తయారవుతారు. ఇక హిందూ సమాజంలో బొట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మిగతా రోజుల్లో ఎలా ఉన్న పండుగలు, పర్వదినాలు, శుభకార్యాల్లో తప్పనిసరిగా బొట్టు పెట్టుకుంటారు. అలాంటిది దీపావళి వంటి పర్వదినం నాడు ఏ భారతీయ మహిళ కూడా ఇలా తయారవదు అంటూ ఫ్యాబ్ఇండియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. కారణం ఏంటంటే దీపావళి సందర్భంగా ఫ్యాబ్ఇండియా తీసుకువచ్చిన దుస్తుల కలెక్షన్ యాడ్ ఇప్పటికే వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అది పూర్తిగా సద్దుమణగముందే మరో వివాదం తెరమీదకు వచ్చింది. ఈ ఫ్యాబ్ఇండియా యాడ్‌లో మోడల్స్ ఎవరూ కూడా బొట్టు పెట్టుకోలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. ఈ నేపథ్యంలో నుదుటన బొట్టు ధరించిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేస్తూ.. నోబిందినోబిజినెస్ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. (చదవండి: ఫ్యాబ్ ఇండియా యాడ్‌పై దుమారం, తొలగించిన సంస్థ) Speaking for myself. Not buying anything for #Deepawali from ANY brand that shows models without a bindi. #NoBindiNoBusiness — Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) October 20, 2021 ఈ యాడ్ చూసిన నెటిజనులు ఫ్యాబ్ ఇండియా యాడ్‌లో మోడల్స్ బొట్టు పెట్టుకోలేదని.. భారతీయ మహిళలు ఎవరూ పండగకి ఇలా తయారవ్వరని మండిపడుతున్నారు. అంతేకాక బిందీ, బొట్టుబిళ్లలు ధరించిన ఫోటోలు షేర్ చేస్తూ.. నోబిందినోబిజినెస్ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్లో #Bindi, #NoBindiNoBusiness అనే హ్యాష్‌టాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. (చదవండి: ఫార్చ్యూన్ కొంపముంచిన గంగూలీ ‘గుండెపోటు’) Proudly flaunting my Bindi#NoBindiNoBusiness#BindiTwitter pic.twitter.com/xcrBLG40co — Adv Pragya Bhushan🌐 (@pragya_bhushan) October 21, 2021 రానున్న దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన యాడ్‌పై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేసిన తన కలెక్షన్‌ను జష్న్-ఈ-రివాజ్ పేరిట బ్రాండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. హిందూ పండుగల సందర్భంగా సెక్యులరిజాన్ని, ముస్లిం సిద్ధాంతాలను అనవసరంగా పెంపొందింస్తోందంటూ మండి పడ్డారు. దీంతో బాయ్‌కాట్ ఫ్యాబ్ ఇండియా హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. చదవండి: కేవలం 'యాడ్స్'తో స్నేహ దంపతులు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? My bindi (Tilak) is my identity. #BindiTwitter #NoBindiNoBusiness #NOFILTER pic.twitter.com/6jK3kozweD — Raghuram (@Raghura75818432) October 21, 2021 మరికొందరు ఈ హ్యాష్‌ట్యాగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొట్టు పెట్టుకోకపోవడం పెద్ద నేరమేమి కాదు.. పుట్టుకతోనే ఎవరూ బొట్టుతో జన్మించలేదు. బొట్టు పెట్టుకోవాలో.. లేదో మేం నిర్ణయించుకుంటాం. దీనిలో పురుషుల జోక్యం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Most of the time I don't wear a bindi, and when I do, I wear it because I like it so all those preaching on Twitter that there should be bindi on a woman's forehead as it's mandatory in our religion can go to hell. Not wearing bindi won't make me any less hindu or Indian! — Pooja Kopargaonkar (@thekopargaonkar) October 19, 2021 -
బ్రాండ్ ప్రమోషన్..సిన్ రివర్స్
-
ఫ్యాబ్ ఇండియా యాడ్‌పై దుమారం, తొలగించిన సంస్థ
సాక్షి, ముంబై: పాపులర్ డిజైనర్ వస్త్ర వ్యాపార సంస్థ ఫ్యాబ్ ఇండియా వివాదంలో చిక్కుకుంది. రానున్న దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన యాడ్‌పై దుమారం రేగింది. ప్రేమకు, కాంతికి చిహ్నమైన దీపావళికి పండుగకు స్వాగతం. జష్న్-ఇ-రివాజ్ పేరుతో ఫ్యాబ్ ఇండియా తీసుకొస్తున్న దీపావళి కలెక్షన్, భారతీయ సంస్కృతికి అందమైన సేకరణ అంటూ దీపావళి కలెక్షన్ యాడ్‌ను ట్వీట్ చేసింది. ఇదే ఇపుడు వివాదాస్పదమైంది. (Meghana Raj :ఇంతకంటే మంచి సమయం లేదు: మేఘన) రాబోయే దీపావళి పండుగ గురించి చేసిన ప్రకటనలో తమ కలెక్షన్‌ను 'జష్న్-ఇ-రివాజ్' గా బ్రాండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై సోషల్ మీడియాలో ప్రతికూల స్పందనతో వివాదాస్పదమైంది. హిందూ పండుగల సందర్భంగా సెక్యులరిజాన్ని, ముస్లిం సిద్ధాంతాలను అనవసరంగా పెంపొందింస్తోందంటూ మండి పడ్డారు. దీంతో బాయ్‌కాట్ ఫ్యాబ్ ఇండియా హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఫలితంగా కంపెనీ తన అసలు ట్వీట్‌ను తొలగించింది. బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్య ట్విటర్లో ఈ ప్రకటనను తీవ్రంగా ఖండించారు. ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్ఒ టీవీ మోహన్ దాస్ పై కూడా విమర్శలు గుప్పించడం గమనార్హం. మరోవైపు ఆ యాడ్‌లో తప్పేమీ లేదు. దయచేసి వివాదం సృష్టించ వద్దు అంటూ కొంతమంది ప్రముఖులు, ఇతర నెటిజన్లు కోరుతున్నారు. (Samantha: అంత పవర్ ఎలా ... మీరంటే భయం అందుకే : సమంత) Deepavali is not Jash-e-Riwaaz. This deliberate attempt of abrahamisation of Hindu festivals, depicting models without traditional Hindu attires, must be called out. And brands like @FabindiaNews must face economic costs for such deliberate misadventures. https://t.co/uCmEBpGqsc — Tejasvi Surya (@Tejasvi_Surya) October 18, 2021 Maan you do not get it! Use of Alien terms for a Hindu festival is a deliberate attempt to take away our heritage and subvert it! You can use any brand name you want post Diwali but at this time,linking it to Diwali shows a perverted mindset! @sankrant https://t.co/N1HRNPjHIc — Mohandas Pai (@TVMohandasPai) October 18, 2021 Hello @FabindiaNews , You have named your company as Fab India but don't even know how Indians dress up during Diwali . You call your collection traditional but forgot traditions of India. pic.twitter.com/xJP7KmsV4H — Superstar Raj 🇮🇳 (@NagpurKaRajini) October 18, 2021 -
స్మృతి సీరియస్‌గా తీసుకున్నారా..!
పనాజీ: మెల్లమెల్లగా సర్దుమణిగి పోతుందనుకున్న ఫ్యాబిండియా సీసీటీవీ కెమెరా కేసు వివాదం తాజాగా వేగం పుంజుకొంది. గురువారం తమ ముందుకు వచ్చి వివరణలు ఇవ్వాల్సిందిగా సంస్థ ఎండీ, సీఈవోకు తాజాగా గోవా పోలీసులు సమన్లు అందజేశారు. మరో పదకొండుమంది ఉద్యోగులకు కూడా ప్రశ్నించేందుకు పిలిచారు. కాండోలిమ్లోని ఫ్యాబిండియాలో షాపింగ్‌కు వెళ్లిన స్మృతి ఇరానీ.. ట్రయల్ రూమ్ వద్ద సీసీటీవీ కెమెరాను గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో గోవా బీజేపీ నేత మైఖెల్ లోబో ఫిర్యాదు మేరకు ఫ్యాబిండియాపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి నలుగురుని పోలీసులు అరెస్టు చేసినా తిరిగి వారు బెయిల్‌పై బయటకు వచ్చారు. అనంతరం, బీజేపీ నేతలు స్వయంగా ఈ ఘటనను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు. అనంతరం ఈ కేసులో పెద్దగా అభివృద్ధేమి లేదని, ఫ్యాబిండియా స్మృతి ఇరానీకి క్షమాపణలు చెప్పడంతో వివాదం సర్దుమణిగినట్లేనని అందరూ భావించారు. కానీ, తాజాగా ఆ సంస్థ ఎండీ, సీఈవోకు సమన్లు పంపించడం చూస్తుంటే పైకి కనిపించకపోయినా కేంద్రమంత్రి ఈ విషయాన్ని కాస్త తీవ్రంగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఫ్యాబ్ ఇండియా తప్పేమీ లేదు: సీఎం
ట్రయల్ రూంలో రహస్య కెమెరాల వ్యవహారంలో గోవా సీఎం లక్ష్మికాంత్ పర్సేకర్ ఫ్యాబ్ ఇండియా సంస్థకు అనుకూలంగా మాట్లాడారు. ఇందులో ఆ సంస్థ తప్పేమీ లేదన్నారు. దేశంలోని ప్రఖ్యాత బొటిక్‌లలో ఫ్యాబ్ ఇండియా ఒకటని, ఉద్యోగి దుర్మార్గుడైనంత మాత్రాన సంస్థ మొత్తాన్ని నిందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. 'సాక్షాత్తు కేంద్ర మంత్రి ఫిర్యాదు చేయడంతో ఈ కేసుకు ప్రాధాన్యం లభించింది. ఇలాంటివి మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. గోవాలో మహిళలకు పూర్తి రక్షణ ఉంది. అని పర్సేకర్ అన్నారు. గోవాలోని ఫ్యాబ్ ఇండియా షోరూంలో దుస్తులు మార్చుకునే గదిలో కెమెరా ఉండటాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గుర్తించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
ఫ్యాబ్ ఇండియా ఎండీకి సమన్లు..?
పనాజి: ఫ్యాబ్ ఇండియా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కేసులో గోవా క్రైమ్ బ్యాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా శాఖలున్న ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ఫ్యాబ్ ఇండియా ఎండీకి సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సాక్షాత్తు కేంద్ర మంత్రికే ఇలాంటి అవాంఛనీయ సంఘటన ఎదురుకావడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. దీంతో గోవా ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాగా ఈ కేసులో ఇప్పటికే దుకాణంలో పనిచేసే నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. షాపులో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని, విచారణ వేగవవంతం చేశామని ఎస్పీ కార్తీక కశ్యప్ తెలిపారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి గోవాలో ఫ్యాబ్ ఇండియా స్టోర్‌లో షాపింగ్‌కు వెళ్లిన సందర్భంగా అనూష్య సంఘటన చోటు చేసుకుంది. ట్రయల్ రూంలోని రహస్య కెమెరాలను చూసి షాకైన మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గత మూడు నాలుగు నెలలుగా ఆ షోరూంలో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు స్టోర్స్ హార్డ్‌డిస్కును పరిశీలించిన అధికారులు వెల్లడించారు.