శివైక్యం కోసం యువతి ఏం చేసిందంటే.... | 22-yr-old woman immolates self near Gurgaon ‘to be united with Lord Shiva | Sakshi
Sakshi News home page

శివైక్యం కోసం యువతి ఏం చేసిందంటే....

Published Sat, Jan 7 2017 12:29 PM | Last Updated on Thu, Sep 27 2018 2:31 PM

శివైక్యం కోసం  యువతి ఏం చేసిందంటే.... - Sakshi

శివైక్యం కోసం యువతి ఏం చేసిందంటే....

న్యూఢిల్లీ:  ఈ ప్రపంచంలో ఉండలేనంటూ ఓ  యువతి దారుణానికి పాల్పడింది.  అస్థిరమైన ప్రపంచాన్ని విడిచి,  శివుడిలో ఏకం కావాలంటూ  ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.  గురుగావ్ కి  30 కిలోమీటర్ల దూరంలో పటౌడీ గ్రామంలోని దేవాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శివుడి భార్య పార్వతిగా అవతరించాలంటూ ఏకంగా దేవాలయంలోనే అగ్నికి ఆహుతి కావడం కలకలం  రేపింది.
 
బాధితురాల్ని షేర్పూర్ గ్రామానికి అనిష శర్మ(22) గా  పోలీసులు గుర్తించారు. ఎంఎ చదువుతున్న అనిష శర్మ ఈ తాత్కాలిక ప్రపంచంలో ఉండలేకే తాను తనువును చాలిస్తున్నట్టుగా సూసైడ్ నోట్ లో  పేర్కొంది. అంతేకాదు మరుజన్మలో శివుడి భార్య పార్వతిగా అవతరించాలని  కోరుకుంటున్నాననీ, తన ఆఖరి కోరికను నెరవేర్చాల్సిందిగా శివుడిని వేడుకొంది. ఘటనా స్థలంలో అనిష పర్స్ నుంచి సూసైట్ నోట్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఆలయం పూజారి గోపాల్ దాస్ వివరాల ప్రకారం, శుక్రవారం ఇచ్ఛాపురి మందిరానికి చేరుకున్న అనిష  పూజలు నిర్వహించిన అనంతరం  టాయిలెట్ లోకి వెళ్లి నిప్పంటించుకుంది.  ఇది గమనించిన పూజారి, స్తానికి పంచాయతీ పెద్దలకు, పోలీసులకు సమాచారం అందించారు.

అయితే గంటల తరబడి గదిలో  కూర్చుని మతపరమైన బొమ్మలు  చిత్రించడం ఆమెకు ఆలవాటని కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా  పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్  లో తాంత్రిక చికిత్స పొందుతోందని  పటౌడీ పోలీస్ అధికారి  జితేందర్  చెప్పారు. ఆత్మహత్య కేసు  నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమితం తరలించినట్టు చెప్పార.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement