immolates self
-
‘అసెంబ్లీలో కలకలం: ఆత్మహత్యకు యత్నం’
న్యూఢిల్లీ: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో సమస్యలు ఉన్నాయని.. అవి పరిష్కారానికి నోచుకోవడం లేదని ఓ ప్రజాప్రతినిధి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె అధికార పార్టీకి చెందిన నాయకురాలే కావడం గమనార్హం. ఆమె చర్యతో ఆ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. చివరకు అందరూ కల్పించుకుని ఆమెతో ఆ ప్రయత్నం విరమింపజేశారు. అనంతరం ఆ సమస్యపై ఆమె ప్రభుత్వ పెద్దలకు ఆల్టిమేటం జారీ చేసింది. ఢిల్లీలోని మల్కాగంజ్ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్ గుడి దేవి మంగళవారం నిర్వహించిన మున్సిపల్ సమావేశానికి హాజరైంది. అయితే సమావేశానికి కిరోసిన్ బాటిల్‌తో వచ్చింది. తన ప్రాంతంలో ఉన్న మున్సిపల్ కార్మికులను తొలగించారని ఆమె ఆందోళన చేసింది. 206 మంది ఉండాల్సిన కార్మికుల్లో 115 మందిని తొలగించడంతో ప్రస్తుతం 85 మంది ఉన్నారని తెలిపింది. దీంతో తన ప్రాంతంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోయింది. సమస్య పరిష్కరిస్తారా లేదా అని కిరోసిన్ బాటిల్‌తో గుడి దేవి హల్చల్ చేసింది. వెంటనే స్పందించిన అధికారులు ఆమె చేతిలో నుంచి కిరోసిన్ డబ్బాను తీసుకుని శాంతపరిచారు. ఈ సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని మేయర్ హామీ ఇచ్చారు. -
‘భారత్ మాతా కీ జై’ అంటూ ఆత్మాహుతి
జైపూర్: కులం, మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు, ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్నారనే నిరసనలతో గత కొన్ని రోజులుగా దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల పట్ల మనస్తాపంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రఘువీర్ శరణ్ అగర్వాల్ (45) ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని వైశాలీ నగర్లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. తనను తాను కాల్చుకున్న అనంతరం దాదాపు 100 మీటర్ల దూరం ‘భారత్ మాతా కీ జై’ అంటూ శరణ్ పరుగెత్తడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అతని ఒంటిపై నీరు పోసి మంటలార్పే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. తీవ్రమైన మంటల కారణంగా అతని శరీరం దాదాపు 80 శాతం కాలిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న బాధితున్ని మొదటగా సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శరణ్ మంగళవారం ఉదయం మరణించారు. శరణ్ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారనీ.. ఆయన మృతి వెనుక ఆర్థిక, కుటుంబ పరమైన కారణాలు కూడా ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు. కలతే కారణం కావొచ్చు.. కులం, మతం ఆధారంగా రిజర్వేషన్లు, దళితులు చేపట్టిన భారత్‌బంద్ హింసాత్మకంగా మారి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చెలరేగిన విధ్వంసకర పరిస్థితుల పట్ల చరణ్ కలత చెంది ఉంటారని ఆర్ఎస్ఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 10న మరోమారు భారత్ బంద్ అనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ చర్యకు పాల్పడొచ్చని అభిప్రాయపడింది. -
ఆగిన టాయిలెట్ నిర్మాణం.. మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, బెంగళూరు : మరుగుదొడ్డి నిర్మాణాన్ని ప్రభుత్వాధికారులు నిలిపివేయడంతో ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి దిగింది. ఈ ఘటన కర్నాటకలో సంచలనం సృష్టిస్తోంది. కర్నాటకలోని దావణగెరె జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరులో.. ఒక కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకుంటోంది. ఇందుకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా నిధులు కూడా విడుదలయ్యాయి. మొదట్లో నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన గ్రామ పంచాయితీ తరువాత.. సరైన పత్రాలు లేవని నిర్మాణాన్ని నిలిపివేసింది. టాయిలెట్ నిర్మాణాన్ని గ్రామపంచాయితీ అధికారులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన మహిళ ఒంటిమీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అనూహ్య ఘటనతో గ్రామపంచాయితీ అధికారులు అక్కడనుంచి పరారయ్యారు. చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై దావణగెరె జిల్లా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ప్రభుత్వం చెబుతుంటే.. నిర్మాణంలో ఉన్న టాయిలెట్‌ని ఆపడమేంటని జిల్లా అధికారులు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనకు కారణమైన 14 మంది గ్రామ పంచాయితీ అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
శివైక్యం కోసం యువతి ఏం చేసిందంటే....
న్యూఢిల్లీ: ఈ ప్రపంచంలో ఉండలేనంటూ ఓ యువతి దారుణానికి పాల్పడింది. అస్థిరమైన ప్రపంచాన్ని విడిచి, శివుడిలో ఏకం కావాలంటూ ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గురుగావ్ కి 30 కిలోమీటర్ల దూరంలో పటౌడీ గ్రామంలోని దేవాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శివుడి భార్య పార్వతిగా అవతరించాలంటూ ఏకంగా దేవాలయంలోనే అగ్నికి ఆహుతి కావడం కలకలం రేపింది. బాధితురాల్ని షేర్పూర్ గ్రామానికి అనిష శర్మ(22) గా పోలీసులు గుర్తించారు. ఎంఎ చదువుతున్న అనిష శర్మ ఈ తాత్కాలిక ప్రపంచంలో ఉండలేకే తాను తనువును చాలిస్తున్నట్టుగా సూసైడ్ నోట్ లో పేర్కొంది. అంతేకాదు మరుజన్మలో శివుడి భార్య పార్వతిగా అవతరించాలని కోరుకుంటున్నాననీ, తన ఆఖరి కోరికను నెరవేర్చాల్సిందిగా శివుడిని వేడుకొంది. ఘటనా స్థలంలో అనిష పర్స్ నుంచి సూసైట్ నోట్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆలయం పూజారి గోపాల్ దాస్ వివరాల ప్రకారం, శుక్రవారం ఇచ్ఛాపురి మందిరానికి చేరుకున్న అనిష పూజలు నిర్వహించిన అనంతరం టాయిలెట్ లోకి వెళ్లి నిప్పంటించుకుంది. ఇది గమనించిన పూజారి, స్తానికి పంచాయతీ పెద్దలకు, పోలీసులకు సమాచారం అందించారు. అయితే గంటల తరబడి గదిలో కూర్చుని మతపరమైన బొమ్మలు చిత్రించడం ఆమెకు ఆలవాటని కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ లో తాంత్రిక చికిత్స పొందుతోందని పటౌడీ పోలీస్ అధికారి జితేందర్ చెప్పారు. ఆత్మహత్య కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమితం తరలించినట్టు చెప్పార.