ఢిల్లీలో మరో దారుణం | Woman kidnapped in Gurgaon, gangraped for hours in moving car, thrown off in Greater Noida | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మరో దారుణం

Published Tue, Jun 20 2017 8:53 AM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM

ఢిల్లీలో మరో దారుణం - Sakshi

ఢిల్లీలో మరో దారుణం

న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది.  మొన్న  ఢిల్లీలో ఒకమహిళపై నిన్న  బిహార్‌లో మైనర్‌ బాలికపై  సామూహిక అత్యాచార ఘటన ఆందోళన రేపగా, దేశ రాజధానిలో మరో అఘాయిత్యం  వెలుగు  చూసింది.  మహిళ (35)ను కిడ్నాప్ చేసిన దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  కొన్ని గంటలు కొనసాగిన భయానక అకృత్యాన్ని సాగించిన  ఈ ముఠా అనంతరం  మహిళను  గ్రేటర్ నోయిడా సమీపంలో  కారులోంచి బయటకు విసిరి వేయడం కలకలం రేపింది.

రాజస్థాన్ భరత్పూర్ నగర్‌కు ఈమె  పది రోజుల క్రితం హర్యానాలోని సోహనాకు వచ్చింది. గుర్గావ్‌లోని సోహనా ప్రాంతంలో సోమవారం ఉదయం 8 గంటలకు మారుతి స్విఫ్ట్ కారులో మహిళను ఎత్తుకొచ్చిన  ముగ్గురు వ్యక్తులు  కదిలే కారులో ఆమెపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు.   అనంతరం గ్రేటర్ నోయిడాకు తరలించి కారులోంచి విసిరివేసి పారిపోయారు. రోడ్డుపై పడివున్న ఈమెను గమనించిన స్థానిక మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు దర్యా‍ప్తు ప్రారంభించారు.

ఆమెపై పలుమార్లు లైంగిక దాడి జరిగినట్టు సీనియర్‌ పోలీపు అధి​కారులు ధృవీకరించారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా  సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్ట గౌతమ్ బుద్ధ్‌నగర్ సీనియర్సూపరింటెండెంట్ లవ్ కుమార్ చెప్పారు.  గ్రేటర్ నోయిడాలో చట్టబద్ధమైన లాంఛనప్రాయాలను పూర్తి చేసిన తర్వాత  తిరిగి బాధిత మహిళను సోహనాకు తీసుకువెళ్లినట్టు తెలిపారు. అనుమానితులు పరారీలో ఉన్నారనీ , ఈ విషయాన్ని దర్యాప్తు చేసేందుకు నోయిడా పోలీస్ బృందం సోహానాకు పంపించామన్నారు.  దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

కాగా ఢిల్లీలో ఈ నెలలోనే పసిపాపను ఆటోలో తోసేసి మరీ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆందోళన రేపింది. ఈ ఘటనలో  తొమ్మిది నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన   సంగతి తెలిసిందే. మరోవైపు బిహార్‌ 14ఏళ్ల మైనర్‌బాలికపై  6గురు మైనర్‌ బాలురు గ్యాంగ్‌ రేప్‌కు   పాల్పడ్డారు. అనంతరం ఆమెను రైల్లో తరలిస్తుండగా,  ఆమె స్పృహలోకి రావడంతో రైల్లోంచి తోసేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement