thrown off
-
షాకింగ్ ఘటన.. ఆమె చేతులు కట్టేసి భవనం పై నుంచి తోసేసి....: వీడియో వైరల్
భార్యభర్తలు ఇద్దరికి సఖ్యత కుదరకపోతే విడిపోయి ఎవరీ మానన వారు హాయిగా ఉంటారు. దీని వల్ల ఇద్దరూ ఎవరికి నచ్చినంటూ వారు ఉంటూరు. పైగా ఎలాంటి సమస్య ఉండదు. కానీ కొంతమంది మాత్రం విడిపోయాక కూడా వారిపై కక్ష్య పెంచుకుని చంపేందుకు యత్నిస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి అలాంటి దారుణానికే ఒడిగట్టాడు. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆగ్రాలోని నాగ్లా మేవతిలోని అపార్ట్మెంట్లో రితికా సింగ్ ఆనే వివాహిత హత్యకు గురైంది. ఆమె ఘజియాబాద్ నివాసి. ఫిరోజాబాద్ నివాసి అయిన ఆకాశ్ గౌతమ్‌ని 2014లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే 2018లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వారు వేరువేరుగా ఉంటున్నారు. ఈ మేరకు రితికా సింగ్ తన ఫేస్బుక్ స్నేహితుడు విపుల్ అగర్వాల్‌తో నాగ్లామేవతి అపార్ట్మెంట్లో కలిసి ఉంటుంది. ఇందిలా ఉండగా ఆమె మాజీ భర్త, మరో ఇద్దరు మహిళలు కలిసి ఆమె నివాసం వద్దకు వచ్చి దాడి చేసేందుకు యత్నించారు . ఈ హఠాత్పరిణామానికి ఒక్కసారిగా షాక్ అయ్యింది రితికా. వారంతా రితికా ప్రియుడి పై కూడా దాడి చేశారు. ఆ తర్వాత వారు రితికా చేతులు కట్టేసి నాల్గో అంతస్తు నుంచి కిందకు తోసి చంపేశారు. ఈ మేరకు రితికా స్నేహితుడు విపుల్ అగర్వాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఐతే ఈ కేసుకి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశామని, ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. #cctv footage of the incident. pic.twitter.com/fXet0nO5fC — Anuja Jaiswal (@AnujaJaiswalTOI) June 24, 2022 (చదవండి: ప్రియుడే కాలయముడు) -
ఢిల్లీలో మరో దారుణం
న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. మొన్న ఢిల్లీలో ఒకమహిళపై నిన్న బిహార్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన ఆందోళన రేపగా, దేశ రాజధానిలో మరో అఘాయిత్యం వెలుగు చూసింది. మహిళ (35)ను కిడ్నాప్ చేసిన దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొన్ని గంటలు కొనసాగిన భయానక అకృత్యాన్ని సాగించిన ఈ ముఠా అనంతరం మహిళను గ్రేటర్ నోయిడా సమీపంలో కారులోంచి బయటకు విసిరి వేయడం కలకలం రేపింది. రాజస్థాన్ భరత్పూర్ నగర్‌కు ఈమె పది రోజుల క్రితం హర్యానాలోని సోహనాకు వచ్చింది. గుర్గావ్లోని సోహనా ప్రాంతంలో సోమవారం ఉదయం 8 గంటలకు మారుతి స్విఫ్ట్ కారులో మహిళను ఎత్తుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు కదిలే కారులో ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం గ్రేటర్ నోయిడాకు తరలించి కారులోంచి విసిరివేసి పారిపోయారు. రోడ్డుపై పడివున్న ఈమెను గమనించిన స్థానిక మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమెపై పలుమార్లు లైంగిక దాడి జరిగినట్టు సీనియర్ పోలీపు అధికారులు ధృవీకరించారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్ట గౌతమ్ బుద్ధ్‌నగర్ సీనియర్సూపరింటెండెంట్ లవ్ కుమార్ చెప్పారు. గ్రేటర్ నోయిడాలో చట్టబద్ధమైన లాంఛనప్రాయాలను పూర్తి చేసిన తర్వాత తిరిగి బాధిత మహిళను సోహనాకు తీసుకువెళ్లినట్టు తెలిపారు. అనుమానితులు పరారీలో ఉన్నారనీ , ఈ విషయాన్ని దర్యాప్తు చేసేందుకు నోయిడా పోలీస్ బృందం సోహానాకు పంపించామన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. కాగా ఢిల్లీలో ఈ నెలలోనే పసిపాపను ఆటోలో తోసేసి మరీ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆందోళన రేపింది. ఈ ఘటనలో తొమ్మిది నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోవైపు బిహార్ 14ఏళ్ల మైనర్‌బాలికపై 6గురు మైనర్ బాలురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం ఆమెను రైల్లో తరలిస్తుండగా, ఆమె స్పృహలోకి రావడంతో రైల్లోంచి తోసేశారు.