Shocking: Delhi Women Thrown Off 4th Floor Balcony By Ex Husband, Video Viral - Sakshi
Sakshi News home page

Shocking Video: ఆమె చేతులు కట్టేసి భవనం పై నుంచి తోసేసి....: వీడియో వైరల్‌

Jun 26 2022 12:07 PM | Updated on Jun 26 2022 12:52 PM

Delhi Women Thrown Off 4th Floor Balcony By Ex Husband Video Viral - Sakshi

భార్యభర్తలు ఇద్దరికి సఖ్యత కుదరకపోతే విడిపోయి ఎవరీ మానన వారు హాయిగా ఉంటారు. దీని వల్ల ఇద్దరూ ఎవరికి నచ్చినంటూ వారు ఉంటూరు. పైగా ఎలాంటి సమస్య ఉండదు. కానీ కొంతమంది మాత్రం విడిపోయాక కూడా వారిపై కక్ష్య పెంచుకుని చంపేందుకు యత్నిస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి అలాంటి దారుణానికే ఒడిగట్టాడు.

వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆగ్రాలోని నాగ్లా మేవతిలోని అపార్ట్‌మెంట్‌లో రితికా సింగ్‌ ఆనే వివాహిత హత్యకు గురైంది. ఆమె ఘజియాబాద్‌ నివాసి. ఫిరోజాబాద్‌ నివాసి అయిన ఆకాశ్‌ గౌతమ్‌ని 2014లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే 2018లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వారు వేరువేరుగా ఉంటున్నారు. ఈ మేరకు రితికా సింగ్‌ తన ఫేస్‌బుక్‌ స్నేహితుడు విపుల్‌ అగర్వాల్‌తో నాగ్లామేవతి అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటుంది. ఇందిలా ఉండగా ఆమె మాజీ భర్త, మరో ఇద్దరు మహిళలు కలిసి ఆమె నివాసం వద్దకు వచ్చి దాడి చేసేందుకు యత్నించారు .

ఈ హఠాత్పరిణామానికి ఒక్కసారిగా షాక్‌ అయ్యింది రితికా. వారంతా రితికా ప్రియుడి పై కూడా దాడి చేశారు. ఆ తర్వాత వారు రితికా చేతులు కట్టేసి నాల్గో అంతస్తు నుంచి కిందకు తోసి చంపేశారు.  ఈ మేరకు  రితికా స్నేహితుడు విపుల్‌ అగర్వాల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఐతే ఈ కేసుకి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశామని, ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: ప్రియుడే కాలయముడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement