ex husband attack
-
షాకింగ్ ఘటన.. ఆమె చేతులు కట్టేసి భవనం పై నుంచి తోసేసి....: వీడియో వైరల్
భార్యభర్తలు ఇద్దరికి సఖ్యత కుదరకపోతే విడిపోయి ఎవరీ మానన వారు హాయిగా ఉంటారు. దీని వల్ల ఇద్దరూ ఎవరికి నచ్చినంటూ వారు ఉంటూరు. పైగా ఎలాంటి సమస్య ఉండదు. కానీ కొంతమంది మాత్రం విడిపోయాక కూడా వారిపై కక్ష్య పెంచుకుని చంపేందుకు యత్నిస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి అలాంటి దారుణానికే ఒడిగట్టాడు. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆగ్రాలోని నాగ్లా మేవతిలోని అపార్ట్మెంట్లో రితికా సింగ్ ఆనే వివాహిత హత్యకు గురైంది. ఆమె ఘజియాబాద్ నివాసి. ఫిరోజాబాద్ నివాసి అయిన ఆకాశ్ గౌతమ్‌ని 2014లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే 2018లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వారు వేరువేరుగా ఉంటున్నారు. ఈ మేరకు రితికా సింగ్ తన ఫేస్బుక్ స్నేహితుడు విపుల్ అగర్వాల్‌తో నాగ్లామేవతి అపార్ట్మెంట్లో కలిసి ఉంటుంది. ఇందిలా ఉండగా ఆమె మాజీ భర్త, మరో ఇద్దరు మహిళలు కలిసి ఆమె నివాసం వద్దకు వచ్చి దాడి చేసేందుకు యత్నించారు . ఈ హఠాత్పరిణామానికి ఒక్కసారిగా షాక్ అయ్యింది రితికా. వారంతా రితికా ప్రియుడి పై కూడా దాడి చేశారు. ఆ తర్వాత వారు రితికా చేతులు కట్టేసి నాల్గో అంతస్తు నుంచి కిందకు తోసి చంపేశారు. ఈ మేరకు రితికా స్నేహితుడు విపుల్ అగర్వాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఐతే ఈ కేసుకి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశామని, ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. #cctv footage of the incident. pic.twitter.com/fXet0nO5fC — Anuja Jaiswal (@AnujaJaiswalTOI) June 24, 2022 (చదవండి: ప్రియుడే కాలయముడు) -
ఎదుగుదలను ఓర్వలేక పెట్రోల్ పోసి..
బీజింగ్ : 30 ఏళ్ల లాము.. చైనా సోషల్ మీడియాలో కేవలం టిక్‌టాక్ వీడియోస్‌తో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఎలాంటి మేకప్ లేకుండానే చాలా సాధారణంగా ఉంటూ చైనాలోని గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కరిస్తూ వీడియోలు చేసేది. ఆమె వీడియోల్లో ఎలాంటి అశ్లీలతకు తావు ఉండేది కాదు. గ్రామీణ జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ అందరి మనసులను ఆకట్టుకుంటూ జీవితంలోను మంచి ఎదుగుదలను చూసింది. కాని ఆమె పాపులారిటీ చూసి విధికి కన్ను కుట్టిందేమో.. లాము మాజీ భర్త యముడి రూపంలో వచ్చి ఆమెను చంపే ప్రయత్నంలో ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాదాపు రెండు వారాలు మృత్యువుతో పోరాడి తనువు చాలించింది. ఈ విషాద ఘటన సెప్టెంబర్ 14న చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. (చదవండి : విషాదం నుంచి విహారం వైపు..) అసలు విషయంలోకి వెళితే.. సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన 30 ఏళ్ల లాము డౌయిన్ చైనీస్ టిక్‌టాక్ యాప్‌లో వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఆమె అందరిలా కాకుండా కొంచెం కొత్తగా ఆలోచించి సిచువాన్ ప్రావిన్స్‌లోని గ్రామీణ ప్రాంత వాతావరణాన్ని.. అక్కడి మనుషులతో కలిసి చేసిన వీడియోలు చేసేది. ఈ విధంగా లాము సోషల్ మీడియాలో స్టార్ స్టేటస్‌ను సంపాదించింది. దాదాపు 7,82,000 మంది ఫాలోవర్లు, 63 లక్షల లైకులతో ఎవరికి అందనంత ఎత్తులో ఉంది. ఇది లాము జీవితం ముందుబాగం మాత్రమే. ఇక ఆమె జీవితం వెనుక ఉన్న విషాదంలోకి తొంగి చూస్తే.. లాముకు టాంగ్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే పైళ్లైనప్పటి నుంచి టాంగ్.. లామును ప్రతి విషయంలో వేధింపులకు గురి చేస్తూ విపరీతంగా కొట్టేవాడు. రోజులు గడుస్తున్న కొద్ది.. లాము టాంగ్తో విసిగిపోయి అతనికి విడాకులు ఇచ్చి వేరుగా బతకాలనుకుంది. పిల్లల విషయంలో కోర్టుకు వెళ్లగా.. వారిద్దరికి చెరో బిడ్డను అప్పగించింది. అయితే లాము ఎదుగదలను చూసి ఓర్వలేకపోయిన టాంగ్ కొద్ది రోజులుగా ఆమెను తన దగ్గరకు తిరిగి రావాలని పట్టుబట్టాడు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 14న లాము తన ఇంట్లోనే లైవ్ వీడియో తీస్తుండగా.. టాంగ్ వచ్చి లాముతో గొడవపడ్డాడు. లైవ్ నడుస్తుండగానే ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పింటించాడు. వీడియో లైవ్‌లో ఉండడంతో వేలమంది అభిమానుల కళ్లముందే లాము నిర్జీవంగా కాలిపోతున్న దృష్యాలు గగుర్పొడిచేలా ఉన్నాయి. (చదవండి : ఆ అపురూపం వెనక కన్నీళ్లెన్నో!?) దాదాపు 90 శాతం కాలిన గాయాలతో రెండు వారాలు లూమూ ఆసుపత్రిలో నరకయాతన అనుభవిస్తూ మృత్యువుతో పోరాడి చివరకు బుధవారం రాత్రి కన్నుమూసింది. చికిత్స తీసుకుంటున్న సమయంలో సోదరి వైద్యానికి సహాయం చేయాలని లాము సోదరి అభిమానులను కోరగా.. లాముపై ఉన్న అభిమానంతో మిలియన్ యువాన్లు విరాళం అందింది. కానీ విధి వక్రీకరించడంతో లాము ఆరోగ్యం విషమించి కన్నుమూసింది. అయితే ఆమె మరణవార్తను జీర్ణించుకోలేకపోయిన ఆమె అభిమానులు టాంగ్‌ను ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం చైనా మీడియాలో సంచలనంగా మారింది. కాగా లాము గత నెల 14న లైవ్‌లో షో చేస్తుండగా ఒక్కసారిగా స్క్రీన్‌పై పొగలు, పెద్దగా ఏడుస్తున్న శబ్ధాలు వినిపించినట్లు షో చూసిన అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా లాము హత్యకు కారణమైన టాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. -
డయల్ 100తో బతికిపోయింది. కానీ..
సాక్షి, హైదరాబాద్ : మాజీ భార్యను హతమార్చాలని పక్కాప్లాన్ ప్రకారం ఆమెను వెంబడించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, స్టేషన్నుంచి సదరు నిందితుడు పోలీసుల కళ్లుగప్పి కత్తితో సహా ఉడాయించడంతో ఈ కేసులో ట్విస్టు మొదలైంది. వివరాలు..బోరబండకు చెందిన లావణ్య, సాయి కిరణ్‌కు గతంలో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. అయితే, భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. పిల్లలతో కలిసి లావణ్య బండ్లగూడలో నివాసముంటున్నారు. స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పిల్లలను పోషించుకుంటున్నారు. భార్య విడాకులు తీసుకొని వేరుగా ఉండటాన్ని సాయికిరణ్ అవమానంగా భావించాడు. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని పథకం పన్నాడు. ఈక్రమంలో శనివారం ఉదయం బండ్లగూడలో సాయిలావణ్యపై కత్తితో దాడిచేసి హతమార్చాలనుకున్నాడు. అయితే, అనుమానాస్పదంగా సంచరిస్తున్న కిరణ్‌ను గమనించిన లావణ్య.. తన మాజీ భర్తతో ముప్పు ఉందని డయల్ 100కు పోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సత్వరం స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనుంచి ఓ కత్తిని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసులు నిందితుడిని స్టేషన్ బయటే కూర్చోబెట్టడంతో అతను పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో అతను ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనని పోలీసులు ఆందోళనకు గురయ్యారు. తప్పించుకున్న సాయికిరణ్‌ను ఎట్టకేలకు పోలీసులు జూబ్లిహిల్స్ వద్ద పట్టుకుని మళ్లీ స్టేషన్‌కు తరలించారు. మాజీ భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని, తమకు తమ కుటుంబానికి రక్షణ కావాలని లావణ్య కోరుతోంది. -
కత్తితో ఉన్మాది దాడి
తాడేపల్లిగూడెం రూరల్ : తన నుంచి విడాకులు తీసుకున్న భార్య రెండో పెళ్లి చేసుకుంటోందని తెలిసి ఉన్మాదిలా మారిన ఓ వ్యక్తి ఇద్దరు మహిళలు, తోడల్లుడు వరుసైన మరో వ్యక్తిపై కత్తితో దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇమ్మణ్ణి లక్ష్మీప్రసన్నకు భీమడోలు మండలం అంబర్‌పేటకు చెందిన అప్పసాని సునిల్‌తో గతంలో వివాహమైంది. భార్యభర్తలు గొడవలు పడటంతో విడాకులు తీసుకున్నారు. లక్ష్మీప్రసన్నకు తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామానికి చెందిన నరిసింహంతో రెండో పెళ్లి కుదుర్చుకున్నారు. బుధవారం రాత్రి 12.30 గంటలకు ద్వారకాతిరుమలలో వివాహం చేసుకునేందుకు అందరూ సన్నద్ధమవుతున్నారు. రాత్రి 9 గంటలకు వీరంతా వాహనాల్లో ద్వారకాతిరుమల బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో లక్ష్మీప్రసన్న మాజీ భర్త సునిల్ గోడదూకి కత్తితో వచ్చి లక్ష్మీప్రసన్నపై దాడిచేశాడు. అక్కడే ఉన్న ప్రసన్న అక్క పాలడుగుల నాగసత్యదేవిపై కూడా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అలాగే లక్ష్మిప్రసన్నకు వరుసకు బావ అయిన కొండ్రుప్రోలు గ్రామానికి చెందిన ఉప్పలపాటి శేషగిరిరావు అడ్డువెళ్లగా అతని చెయ్యి నరికాడు. అడ్డువచ్చిన మరో మహిళపై కూడా దాడి చేసి పరారయ్యాడు. తీవ్రగాయాలైన వీరందరిని 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. లక్ష్మీప్రసన్నకు, ఆమె అక్క నాగసత్యదేవికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి ఏరియా ఆసుపత్రి వైద్యులు చికిత్సచేసి మెరుగైన చికిత్సకు సిఫారసు చేశారు. పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బాధితుల నుంచి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.