ఎదుగుదలను ఓర్వలేక పెట్రోల్‌ పోసి.. | Chinese Social Media Star Burnt By Ex Husband During Live Stream | Sakshi
Sakshi News home page

ఎదుగుదలను ఓర్వలేక పెట్రోల్‌ పోసి సజీవ దహనం

Published Fri, Oct 2 2020 4:31 PM | Last Updated on Fri, Oct 2 2020 4:40 PM

Chinese Social Media Star Burnt By Ex Husband During Live Stream - Sakshi

బీజింగ్‌ : 30 ఏళ్ల లాము.. చైనా సోషల్‌ మీడియాలో కేవలం టిక్‌టాక్‌ వీడియోస్‌తో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఎలాంటి మేకప్‌ లేకుండానే చాలా సాధారణంగా ఉంటూ చైనాలోని గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కరిస్తూ వీడియోలు చేసేది. ఆమె వీడియోల్లో ఎలాంటి అశ్లీలతకు తావు ఉండేది కాదు. గ్రామీణ జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ అందరి మనసులను ఆకట్టుకుంటూ జీవితంలోను మంచి ఎదుగుదలను చూసింది. కాని ఆమె పాపులారిటీ చూసి విధికి కన్ను కుట్టిందేమో.. లాము మాజీ భర్త యముడి రూపంలో వచ్చి ఆమెను చంపే ప్రయత్నంలో ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దాదాపు రెండు వారాలు మృత్యువుతో పోరాడి తనువు చాలించింది. ఈ విషాద ఘటన సెప్టెంబర్‌ 14న  చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. (చదవండి : విషాదం నుంచి విహారం వైపు..)

అసలు విషయంలోకి వెళితే..  సిచువాన్‌ ప్రావిన్స్‌కు చెందిన 30 ఏళ్ల లాము డౌయిన్ చైనీస్‌ టిక్‌టాక్‌ యాప్‌లో వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఆమె అందరిలా కాకుండా కొంచెం కొత్తగా ఆలోచించి సిచువాన్‌ ప్రావిన్స్‌లోని గ్రామీణ ప్రాంత వాతావరణాన్ని.. అక్కడి మనుషులతో కలిసి చేసిన వీడియోలు చేసేది. ఈ విధంగా లాము సోషల్‌ మీడియాలో స్టార్‌ స్టేటస్‌ను సంపాదించింది. దాదాపు 7,82,000 మంది ఫాలోవర్లు, 63 లక్షల లైకులతో ఎవరికి అందనంత ఎత్తులో ఉంది. ఇది లాము జీవితం ముందుబాగం మాత్రమే.

ఇక ఆమె జీవితం వెనుక ఉన్న విషాదంలోకి తొంగి చూస్తే.. లాముకు టాంగ్‌ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే పైళ్లైనప్పటి నుంచి టాంగ్‌.. లామును ప్రతి విషయంలో వేధింపులకు గురి చేస్తూ విపరీతంగా కొట్టేవాడు. రోజులు గడుస్తున్న కొద్ది.. లాము టాంగ్‌తో విసిగిపోయి అతనికి విడాకులు ఇచ్చి వేరుగా బతకాలనుకుంది. పిల్లల విషయంలో కోర్టుకు వెళ్లగా.. వారిద్దరికి చెరో బిడ్డను అప్పగించింది. అయితే లాము ఎదుగదలను చూసి ఓర్వలేకపోయిన టాంగ్‌ కొద్ది రోజులుగా ఆమెను తన దగ్గరకు తిరిగి రావాలని పట్టుబట్టాడు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్‌ 14న లాము తన ఇంట్లోనే  లైవ్‌ వీడియో తీస్తుండగా.. టాంగ్‌ వచ్చి లాముతో గొడవపడ్డాడు. లైవ్‌ నడుస్తుండగానే ఆమె ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పింటించాడు. వీడియో లైవ్‌లో ఉండడంతో వేలమంది అభిమానుల కళ్లముందే లాము నిర్జీవంగా కాలిపోతున్న దృష్యాలు గగుర్పొడిచేలా ఉన్నాయి. (చదవండి : ఆ అపురూపం వెనక కన్నీళ్లెన్నో!?)

దాదాపు 90 శాతం కాలిన గాయాలతో రెండు వారాలు లూమూ ఆసుపత్రిలో నరకయాతన అనుభవిస్తూ మృత్యువుతో పోరాడి చివరకు బుధవారం రాత్రి కన్నుమూసింది. చికిత్స తీసుకుంటున్న సమయంలో సోదరి వైద్యానికి సహాయం చేయాలని లాము సోదరి అభిమానులను కోరగా.. లాముపై ఉన్న అభిమానంతో  మిలియన్ యువాన్లు విరాళం అందింది. కానీ విధి వక్రీకరించడంతో లాము ఆరోగ్యం విషమించి కన్నుమూసింది. అయితే ఆమె మరణవార్తను జీర్ణించుకోలేకపోయిన ఆమె అభిమానులు టాంగ్‌ను ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం చైనా మీడియాలో సంచలనంగా మారింది. కాగా లాము గత నెల 14న లైవ్‌లో షో చేస్తుండగా ఒక్కసారిగా స్క్రీన్‌పై పొగలు, పెద్దగా ఏడుస్తున్న శబ్ధాలు వినిపించినట్లు షో చూసిన అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా లాము హత్యకు కారణమైన టాంగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement