Sichuan province
-
చస్తే చావండి.. బయటకు మాత్రం పోనివ్వం!
వైరల్: ఈ వీడియో చూస్తే ఇంత దుర్మార్గమా? అని ఎవరైనా అనకుండా ఉండలేరు. ఒకవైపు ప్రకంపనలు వస్తుంటే.. భయంతో జనాలు పరుగులు తీయకుండా ఉంటారా?. కానీ, ఏం జరిగినా బయటకు పంపేదే లేదని వాళ్లను అడ్డుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా విషయంలో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుని చాలాకాలమే అవుతోంది. అయితే.. చైనాలో జీరో-కొవిడ్ పాలసీ కఠినాతీకఠినంగా అమలు అవుతోంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు టెస్టింగ్.. ఐసోలేషన్‌ను ఇంకా కొనసాగిస్తున్నారు అక్కడ. ఆ దెబ్బకు జనాలు పిచ్చెక్కిపోతున్నారు. తాజాగా.. మరో దారుణం బయటపడింది. చైనాలో సోమవారం రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. 2017 తర్వాత సిచువాన్ ప్రావిన్స్‌లో సంభవించిన భారీ భూకంపం ఇదే. కొండచరియలు ఉండే ప్రాంతం కావడంతో భారీగానే నష్టం వాటిల్లింది. కనీసం 50 మంది దాకా మరణించగా.. 100 మందికి పైగా గాయాలయ్యాయి. At least 46 people killed after strong earthquake hits China's Sichuan province - Xinhua#Chinaearthquake pic.twitter.com/WWADoioVrX — Rani joshi (@RaniJoshi16) September 5, 2022 成都一小区志愿者阻拦因地震跑出屋的市民,居民:我们就该等死? 求生逃生是本能,中共的体制已经让这些人没有了本能,只有服从。#四川 #四川地震 #成都 #防疫 pic.twitter.com/OeHnZa2fdj — Sylvia (@Sylvia9988777) September 6, 2022 樱花【时事要闻】 #四川 大白拦着,不给出去 #地震 https://t.co/ozQg4DQZ7K pic.twitter.com/FDa2LOL8Ee — 荣耀678(意农🇭🇺) (@Antonio55184671) September 6, 2022 అయితే భూకంపం సమయంలోనూ లాక్డౌన్, ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లను బయటకు వదల్లేదు ఆరోగ్య సిబ్బంది. పైగా బిల్డింగ్ కూలితే ఇందులోనే చావాలే తప్ప.. బయటకు వెళ్లకూడదంటూ అడ్డుకున్న వీడియోలు కొన్ని నెట్లో వైరల్ అవుతోంది ఇప్పుడు. ఈ క్రమంలో కొందరితో సిబ్బంది దురుసుగా సైతం వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు చైనా ట్విటర్ హ్యాండిల్స్ నుంచే వైరల్ అవుతుండడం గమనార్హం. అయితే వీటిపై చైనా అధికారులు స్పందించాల్సి ఉంది. అంతేకాదు భూకంప బాధితులకు సాయాన్ని సైతం కరోనా టెస్టుల క్లియరెన్స్ తర్వాత ఇస్తామని అధికారులు చెప్తున్నారంటే.. పరిస్థితి ఎంత ఘోరమో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చైనాలో పలు నగరాల్లో లక్షల మంది ఇంకా కరోనా కట్టడిలోనే ఉండిపోయారు. ఇదీ చదవండి: మీజిల్స్ విజృంభణ.. 700 మంది చిన్నారుల మృతి -
ఎదుగుదలను ఓర్వలేక పెట్రోల్ పోసి..
బీజింగ్ : 30 ఏళ్ల లాము.. చైనా సోషల్ మీడియాలో కేవలం టిక్‌టాక్ వీడియోస్‌తో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఎలాంటి మేకప్ లేకుండానే చాలా సాధారణంగా ఉంటూ చైనాలోని గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కరిస్తూ వీడియోలు చేసేది. ఆమె వీడియోల్లో ఎలాంటి అశ్లీలతకు తావు ఉండేది కాదు. గ్రామీణ జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ అందరి మనసులను ఆకట్టుకుంటూ జీవితంలోను మంచి ఎదుగుదలను చూసింది. కాని ఆమె పాపులారిటీ చూసి విధికి కన్ను కుట్టిందేమో.. లాము మాజీ భర్త యముడి రూపంలో వచ్చి ఆమెను చంపే ప్రయత్నంలో ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాదాపు రెండు వారాలు మృత్యువుతో పోరాడి తనువు చాలించింది. ఈ విషాద ఘటన సెప్టెంబర్ 14న చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. (చదవండి : విషాదం నుంచి విహారం వైపు..) అసలు విషయంలోకి వెళితే.. సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన 30 ఏళ్ల లాము డౌయిన్ చైనీస్ టిక్‌టాక్ యాప్‌లో వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఆమె అందరిలా కాకుండా కొంచెం కొత్తగా ఆలోచించి సిచువాన్ ప్రావిన్స్‌లోని గ్రామీణ ప్రాంత వాతావరణాన్ని.. అక్కడి మనుషులతో కలిసి చేసిన వీడియోలు చేసేది. ఈ విధంగా లాము సోషల్ మీడియాలో స్టార్ స్టేటస్‌ను సంపాదించింది. దాదాపు 7,82,000 మంది ఫాలోవర్లు, 63 లక్షల లైకులతో ఎవరికి అందనంత ఎత్తులో ఉంది. ఇది లాము జీవితం ముందుబాగం మాత్రమే. ఇక ఆమె జీవితం వెనుక ఉన్న విషాదంలోకి తొంగి చూస్తే.. లాముకు టాంగ్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే పైళ్లైనప్పటి నుంచి టాంగ్.. లామును ప్రతి విషయంలో వేధింపులకు గురి చేస్తూ విపరీతంగా కొట్టేవాడు. రోజులు గడుస్తున్న కొద్ది.. లాము టాంగ్తో విసిగిపోయి అతనికి విడాకులు ఇచ్చి వేరుగా బతకాలనుకుంది. పిల్లల విషయంలో కోర్టుకు వెళ్లగా.. వారిద్దరికి చెరో బిడ్డను అప్పగించింది. అయితే లాము ఎదుగదలను చూసి ఓర్వలేకపోయిన టాంగ్ కొద్ది రోజులుగా ఆమెను తన దగ్గరకు తిరిగి రావాలని పట్టుబట్టాడు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 14న లాము తన ఇంట్లోనే లైవ్ వీడియో తీస్తుండగా.. టాంగ్ వచ్చి లాముతో గొడవపడ్డాడు. లైవ్ నడుస్తుండగానే ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పింటించాడు. వీడియో లైవ్‌లో ఉండడంతో వేలమంది అభిమానుల కళ్లముందే లాము నిర్జీవంగా కాలిపోతున్న దృష్యాలు గగుర్పొడిచేలా ఉన్నాయి. (చదవండి : ఆ అపురూపం వెనక కన్నీళ్లెన్నో!?) దాదాపు 90 శాతం కాలిన గాయాలతో రెండు వారాలు లూమూ ఆసుపత్రిలో నరకయాతన అనుభవిస్తూ మృత్యువుతో పోరాడి చివరకు బుధవారం రాత్రి కన్నుమూసింది. చికిత్స తీసుకుంటున్న సమయంలో సోదరి వైద్యానికి సహాయం చేయాలని లాము సోదరి అభిమానులను కోరగా.. లాముపై ఉన్న అభిమానంతో మిలియన్ యువాన్లు విరాళం అందింది. కానీ విధి వక్రీకరించడంతో లాము ఆరోగ్యం విషమించి కన్నుమూసింది. అయితే ఆమె మరణవార్తను జీర్ణించుకోలేకపోయిన ఆమె అభిమానులు టాంగ్‌ను ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం చైనా మీడియాలో సంచలనంగా మారింది. కాగా లాము గత నెల 14న లైవ్‌లో షో చేస్తుండగా ఒక్కసారిగా స్క్రీన్‌పై పొగలు, పెద్దగా ఏడుస్తున్న శబ్ధాలు వినిపించినట్లు షో చూసిన అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా లాము హత్యకు కారణమైన టాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. -
32 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకి..
బీజింగ్ : చిన్నప్పుడు కిడ్నాప్‌కి గురైన వ్యక్తి చివరకు 32 ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యులను చేరుకోగలిగాడు. 1988లో రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు మావో ఇన్ అపహరణకు గురయ్యాడు. షాంగ్జీ ప్రావిన్స్‌లో గ్జియాన్‌లోని తమ నర్సరీ నుంచి ఇంటికి వెళుతుండగా, కుమారుడికి నీళ్లు తీసుకురావడానికి వెళ్లినప్పుడు కొందరు దుండగులు బాబును అపహరించారు. అప్పటి నుంచి తన కుమారుడి జాడ తెలిస్తే చెప్పాలని మావో ఇన్ తల్లిదండ్రులు కనిపించిన ప్రతి ఒక్కరినీ విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. గ్జియాన్ నగరంలో దాదాపు ప్రతి ఇంటికి వెళ్లి తమ బాబు కనిపించాడా అని అడిగారు. పోస్టర్లు అంటించారు. చివరకు తమ బాబు దొరకడేమనని నిరాశతో కుంగిపోయారు. మావో ఇన్ తల్లి లీ జింగ్జీ తన ఉద్యోగాన్ని కూడా వదిలేసి 10 ప్రావిన్స్‌లలోని అన్ని మున్సిపాలిటీలలో లక్షకుపైగా పాంప్లెట్లను పంచిపెట్టారు. ఎన్నో ఏళ్లుగా కొన్ని వందల టెలివిజన్ కార్యక్రమాల్లో తన కుమారుడి సమాచారం తెలిస్తే చెప్పాల్సిందిగా వేడుకున్నారు. తమ కుమారుడి పోలీకలకు దగ్గరగా ఉండి, అదే సమయంలో అపహరణకు గురైన దాదాపు 300 మందిని ఆమె కలుసుకున్నారు. కానీ, వారిలో ఒక్కరు కూడా తమ కుమారుడు కాదని డీఎన్ఏ పరీక్షల్లో తేలింది. ఇక చివరకు, తప్పిపోయినా, లేదా అపహరణకు గురైన చిన్నారులను తల్లిదండ్రుల చెంతకు చేర్చేలా సహాయపడాలని నిశ్చయించుకున్నారు. 2007లో ‘బేబీ కమ్ బ్యాక్ హోమ్’ పేరుతో వాలింటరీ గ్రూపును ప్రారంభించారు. ఇప్పటి వరకు మొత్తం 29 మంది చిన్నారులు తమ కుటుంబ సభ్యుల చెంతకు చేరేలా లీ జింగ్జీ కృషి చేశారు. గత ఏప్రిల్‌లో సిచువాన్ ప్రావిన్సులో ఓ వ్యక్తి నుంచి తమకు టిప్ అందిందని పోలీసులు తెలిపారు. ఏళ్ల కిందట తాము బాలుడిని దత్తత తీసుకున్నామని సదరు వ్యక్తి తెలిపాడు. దీంతో పోలీసులు దత్తత తీసుకున్న 34 ఏళ్ల మావో ఇన్ని గుర్తించి డీఎన్ఏ టెస్ట్ నిర్వహించారు. అప్పటికే తమ వద్ద ఉన్న లీ జింగ్జీ డీఎన్ఏతో మావో ఇన్ డీఎన్ఏ మ్యాచ్ అయింది. మావో ఇన్, ప్రస్తుత పేరు గూ నింగింగ్. డెకరేషన్ వ్యాపారం చేస్తున్నాడు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలని ఉందని తెలిపాడు. మావో ఇన్ని దుండగులు అపహరించి, పిల్లలు లేని తల్లిదండ్రులకి దాదాపు 60వేల రూపాయలకు అమ్మేశారని పోలీసులు తెలిపారు. మావో ఇన్ ఆచూకీ లభించిన విషయాన్ని సరిగ్గా మాతృదినోత్సవమైన 10 మేన లీ జింగ్జీకి పోలీసులు ఈ విషయాన్ని చెప్పారు. నా జీవితంలో నాకు దొరికిన బెస్ట్ గిఫ్ట్ ఇదే అని లీ జింగ్జీ కన్నీటి పర్యంతమయ్యారు. మావో ఇన్ చేతిని గట్టిగా పట్టుకుని నా కుమారుడిని ఇక వదిలి ఉండలేను అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నాకుమారుడిని తిరిగి కలుసుకోవడానికి సహకరించిన ఎన్నో వేలమందికి నేను రుణపడి ఉంటాను అని లీ జింగ్జీ అన్నారు. చైనాలో దశాబ్ధాలుగా చిన్న పిల్లల అపహరణ సమస్య కొనసాగుతోంది. ప్రతి ఏడాది దాదాపు 20వేల మందికిపైగా చిన్నారులు అపహరణకు గురి అవుతున్నారు. చైనాలో పబ్లిక్ సెక్యురిటీ మంత్రిత్వ శాఖ 2009లో డీఎన్ఏ డేటాబేస్‌ను సేకరించడం ప్రారంభించింది. దీని వల్ల ఇప్పటి వరకు 6000 మంది అపహరణకు గురైన చిన్నారులను గుర్తించారు. ఇక 2016 మేలో చైనా ప్రభుత్వం రీ యూనియన్ కార్యక్రమాన్ని చేపట్టింది. 2019 జూన్ వరకు ఈ కార్యక్రమం వల్ల 4వేలకు పైగా చిన్నారులు తమ తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
చైనాలో భూకంపం.. 122 మంది..
చెంగ్ధూ : చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు అయ్యింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా 122 మంది తీవ్రంగా గాయపడ్డారని అక్కడి మీడియా పేర్కొంది. విపత్తు సంభవించిన ప్రాంతానికి చేరుకున్న సహాయక సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సోమవారం అర్థరాత్రే సుమారు 30 నిమిషాల పాటు భూమి కంపించగా... సిచువాన్ రాజధాని చెంగ్దూ, చాంగ్నింగ్ నగరాలు షేక్ అయ్యాయి. దీంతో జనాలంతా రోడ్లపైకి పరుగులు తీశారు. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. భూమి మొత్తం రెండు సార్లు కంపించగా.. ఒకసారి 5.9, మరో 5.2 తీవ్రతగా రిక్టర్ స్కేలుపై నమోదైందని, చాంగ్నింగ్ సమీపంలోని 10 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమై ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం పేర్కొంది. సిచువాన్ ప్రావిన్స్‌లో తరచుగా భూప్రకంపనలు సంభవిస్తాయి. 2008 మేలో వచ్చిన భూకంపంతో సుమారు 70వేల మంది ప్రాణాలు కోల్పోయారు. -
సజీవ సమాధుల్లోంచి చిన్నారుల ఘోష
బెర్లిన్: సుమారు 90 వేలకు పైగా పౌరులు. వారిలో 7 వేల మంది స్కూల్ చిన్నారులు. భారీ భూకంపం దాటికి సజీవ సమాధి అయ్యారు. అయితే నాణ్యత లేమి కారణంగానే స్కూల్ భవనాల కారణంగా ఆరోపణలు. పదేళ్లైనా మృతుల జాబితాను ప్రభుత్వం ఎందుకు విడుదల చేయటం లేదు? మరోవైపు తమ పిల్లలు బతికే ఉన్నారా? అన్న ఆశలో తల్లిదండ్రులు. వెరసి దశాబ్ద కాలంగా సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో... చైనాలోని సిచువాన్ ప్రొవిన్స్‌లో మే12, 2008న రిక్చర్ స్కేల్‌పై 7.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ప్రకంపనాల దాటికి పలు గ్రామాలు తుడిచిపెట్టుకుపోగా.. 70 వేల మంది మృతి చెందారు. 20 వేల మంది ఇప్పటిదాకా ఆచూకీ తెలియకుండా పోయారు. పెద్ద సంఖ్యలో స్కూల్ భవనాలు కుప్పకూలిపోవటంతో సుమారు 7 వేల మంది చిన్నారులు సజీవ సమాధి అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. శరీరాలు భవనాల కిందే ఛిద్రం అయిపోగా తల్లిదండ్రుల శోకం వర్ణనాతీతంగా మారింది. అయితే మృతుల సంఖ్య ఎక్కువే ఉండొచ్చు అని సామాజిక వేత్త ‘అయి వెయివెయి’ చెబుతున్నారు. భూకంపం తర్వాత సహయక చర్యల్లో పాల్గొన్న ఆయన.. నాటి పరిస్థితిపై ఓ నివేదిక రూపొందించారు. వెయివెయి నివేదిక ప్రకారం... ‘కనీస ప్రామాణికాలు లేకుండా భవనాలను నిర్మించారు. ఫలితం 7 వేల మంది చిన్నారులు బలయ్యారు. భద్రత ప్రమాణాలు లేని స్కూళ్లకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చింది? ఆ మరుసటి ఏడాది సంభవించిన భూకంపాల్లో మరో 5 వేల మంది విద్యార్థులు చనిపోయారని ప్రభుత్వం అంటోంది. మరి మృతుల పేర్ల జాబితాను పదేళ్లు గడిచినా ఎందుకు విడుదల చేయలేదు. ఈ విషయంలో ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి సూటిగా సమాధానం రావట్లేదు. చారిత్రక ఘటనకు సంబంధించిన నిజాలను ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వం బయటకు రానీవ్వట్లేదు. పోరాటంలో తల్లిదండ్రులు అలసిపోయారు. విచారణ కోసం కోర్టుకు వెళ్లిన సమయంలో నాపై పోలీసులు దాడి చేశారు. నా ప్రాణాలు పోయినా చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరే వరకు పోరాటం ఆపను’ అని వెయివెయి చెబుతున్నారు. పోలీసుల దాడిలో మెదడులో రక్తం గడ్డకట్టడంతో వెయివెయికి జర్మనీలో శస్త్రచికిత్స జరగ్గా.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. భూకంపం జరిగి పదేళ్లు పూర్తి కావటంతో ఓ ప్రముఖ మీడియా సంస్థ ఆయన్ని ఇంటర్వ్యూ చేయగా ఆయన పలు విషయాలను వెల్లడించారు. భారీ కుంభ కోణం... కాగా, నాటి భూకంపం దాటికి 6.5 మిలియన్ భవనాలు కప్పకూలిపోయాయి. మరో 23 మిలియన్ భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనా భూకంపం అధికారిక విభాగం, జియాలజిస్టులు నాణ్యత లేని భవనాల మూలంగానే పెను నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఆ తర్వాత కొందరు ఇంజనీర్లు భవన నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగినట్లు తేలుస్తూ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించారు. దీంతో భారీ కుంభకోణం చైనా ప్రభుత్వాన్ని కుదిపేసింది. అయితే అవినీతి ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం.. భారీ భూకంపం జోన్లో ఆయా భవనాలు ఉండటంతోనే కుప్పకూలిపోయానని నివేదికను వక్రీకరించింది. కానీ, సామాజిక వేత్త వెయి వెయి పూర్తి ఆధారాలతో ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం స్వతంత్ర్య దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే రోజులు గడుస్తున్నా ఆ తర్వాత అంశాన్ని పట్టించుకోలేదు. ఈ పరిణామాలతో వెయివెయి పోరాటాన్ని ఉదృతం చేయగా.. ఆయనపై దాడి చోటు చేసుకుంది. -
భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు
చెంగ్ధూ: చైనాలోని సిచువాన్ ప్రావిన్సులో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ మేరకు చైనా భూకంప కేంద్ర(సీఈఎన్సీ) ఓ ప్రకటన విడుదల చేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైనట్లు చెప్పింది. భూమి లోపల 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. భూకంప ధాటికి ఇళ్లు కూలిపోయినట్లు చైనా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. దాదాపు వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గాయాలపాలైనట్లు వెల్లడించింది. విపత్తు సంభవించిన ప్రాంతానికి చేరుకున్న సహాయక సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపింది. భూకంప తీవ్రత కేంద్రానికి 35 కిలోమీటర్ల పరిధిలో ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. -
అమ్మా, నాన్నను చూడాలి
ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలిక పేరు యాంగ్. పొద్దున్నే బుద్ధిగా బడికెళ్తుంది. సాయంత్రం తమ పొలంలో పండిన కూరగాయలమ్ముతూ హోం వర్క్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ బోర్డు మీద చైనీస్ భాషలో ఏం రాసిందో తెలుసా? ‘అమ్మానాన్నా.. నన్ను పుట్టగానే మీరు వదిలేశారు. నేనిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను.. మీ కోసం ఎదురుచూస్తున్నాను’ అని. ఇలా ఎందుకు రాసిందో తెలియాలంటే ముందుగా యాంగ్ గురించి తెలుసుకోవాలి. 2008లో సిచువాన్ ప్రావిన్స్‌కి చెందిన శరణార్థులైన దంపతులకు యాంగ్ జన్మించింది. నెలలు నిండకుండానే కాదు... న్యుమోనియాతో పుట్టింది. దాంతో ఆ పాపకు చికిత్స చేయించే స్తోమత లేదనుకున్నారేమో ఆ దంపతులు ఓ ఇంటి ముందు వదిలి వెళ్లిపోయారు. దీంతో అప్పటి నుంచి మెంగ్వీ అనే మహిళ యాంగ్‌ను పెంచింది. అయితే కని వదిలేసి వెళ్లిపోయిన అమ్మానాన్నలపై యాంగ్‌కి కోపం లేదు. ఎప్పటికైనా వారి ఒడిలో చేరాలని ఆరాటపడుతోంది. అందుకే ఇలా అన్వేషిస్తోంది. మరి యాంగ్ ప్రయత్నం ఫలించాలని, తల్లిదండ్రుల ఒడికి క్షేమంగా చేరాలని మనమంతా ఆశిద్దాం. -
చైనాలో కొండచరియల బీభత్సం
- సిచువాన్ ప్రావిన్సులో 15 మంది మృతి - శిథిలాల కింద 120 మంది బీజింగ్: చైనాలోని సిచువాన్ ప్రావిన్సులో భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడి 15 మృతి చెందగా, మరో 120 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. భారీ వర్షాల కారణంగా మౌగ్జియాన్ కౌంటీలోని జిన్మో గ్రామంపై శనివారం ఉదయం 6 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. మొత్తం 62 ఇళ్లు కూలిపోయాయి. 1.6 కి.మీ పొడవునా రోడ్డు ధ్వంసం అయ్యింది. ఆ ప్రాంతంలోని నదిలో దాదాపు రెండు కి.మీ పొడవునా రాళ్లు చేరాయి. ఏకంగా అక్కడి పర్వతంలోని కొంత భాగం కూలిపోయింది. జిన్మో గ్రామం పర్వతాల నడుమ లోయలో ఉంటుంది. శనివారం మొత్తం రెండుసార్లు కొండచరియలు విరిగి గ్రామంపై పడ్డట్టు సమాచారం. శిథిలాల కింద చిక్కుకుని ఉన్న వారిని కాపాడటానికి సర్వశక్తులూ ఒడ్డాలని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి పూర్తి కారణాలను అన్వేషించాలని చైనా ప్రధాని లీ కెఖియాంగ్ ఆదేశించారు. రెండు వేల మంది సిబ్బంది, భూగర్భ, జల శాస్త్రవేత్తలు, సర్వే నిపుణులు డ్రోన్లు, లేజర్ స్కానర్లు తదితర పరికరాలతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. శిథిలాల నుంచి ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సజీవంగా బయటకు తీసుకొచ్చారు. ఆ ప్రాంతంలోని రోడ్లను మూసివేశారు. కొండ చరియలకు సంబంధించి రెండో ప్రమాద హెచ్చరికను చైనా జారీ చేసింది. రాబోయే రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొండచరియలు విరిగి పడటానికి స్వల్ప భూకంపం, భారీ వర్షాలే కారణమైనప్పటికీ.. ఆ ప్రాంతంలో చెట్లు లేకపోవడం పరిస్థితిని దారుణంగా మార్చిందని అధికారులు వెల్లడించారు. -
కేసీఆర్‌కు చైనాలోని సిచ్వాన్ ప్రావిన్స్ ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: చైనా దేశంలోని సిచ్వాన్ ప్రావిన్స్‌ను సందర్శించాల్సిందిగా ఆ ప్రావిన్స్ విదేశీ వ్యవహారాల శాఖ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఝంగ్‌తావ్ నుంచి తెలంగాణ రాష్ట్ర సీఎం చంద్రశేఖర్‌రావుకు ఆహ్వానం అందింది. ఈ ప్రావిన్స్‌లోని చెంగ్దూ ప్రాంతంలో పర్యటించాలని కోరుతూ లేఖ పంపించారు. ముఖ్యమంత్రితోపాటు ఉన్నతస్థాయి బృందం రావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం, సిచ్వాన్ ప్రావిన్స్‌ల మధ్య వ్యాపార, సాంస్కృతిక సహకారంపై చర్చించవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం విద్యుత్ ప్రాజెక్టులు కావాల్సి ఉన్నందున పర్యటనకు వచ్చినప్పుడు ఈ అంశంలో ఒప్పందాలు చేసుకోవచ్చని డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఝంగ్తావు పేర్కొన్నారని ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించింది. -
చైనాలో భూకంపం
బీజింగ్: చైనాలోని సిచియన్ ప్రావెన్స్లో భూకంపం సంభవించింది. ఈ భూకంప ధాటికి ఇద్దరు మరణించగా.... 54 మంది గాయపడ్డారని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. క్షతగాత్రులను ఉన్నతాధికారులు సమీపంలోని ఆస్పత్రులకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారని తెలిపింది. కాగా వారిలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారని... వారిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొంది. అలాగే మిగిలిన 43 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయని చెప్పింది. టగాన్ పట్టణం సమీపంలో శనివారం సాయంత్రం ఈ భూకంపం సంభవించిందని... దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.3గా నమోదైందని మీడియా తెలిపింది. -
చైనాను వణించిన భూకంపం
హాంగ్‌కాంగ్: చైనాను మరో భూకంపం వణికించింది. నైరుతి చైనాలోని సిచౌన్ ప్రావిన్స్ లో ఆదివారం ఉదయం 6.07 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదయింది. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. నైరుతి జిలౌడు ప్రాంతానికి రెండు కిలోమీటర్లు, యున్నన్ ప్రావిన్స్ లోని జహయోటాంగ్ ప్రాంతానికి 96 కిలోమీటర్ల దూరంలో భూకంపన కేంద్రాన్ని గుర్తించారు. రెండు వారాల క్రితం చైనాలో సంభవించిన భూకంపం 615 మందిని బలి తీసుకుంది. 3,143 మంది గాయపడ్డారు. వరుస భూకంపాలతో చైనా వాసులు వణుకుతున్నారు. -
చైనాలో కుప్పకూలిన విమానం
నైరుతి చైనాలోని సిచువాన్ రాష్ట్రంలో ఓ విమానం కూలిపోయింది. చిన్న విమానం ఒకటి ఆ రాష్ట్రంలోని ఓ గ్రామంలో గల పొలంలో శనివారం నాడు కుప్పకూలింది. హైయున్ గ్రామంలో ఈ ప్రమాదం సంభవించినట్లు డుజియాంగ్యాన్ నగర ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా మరణించారా, లేదా గాయపడ్డారా అన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదని చైనా అధికారిక వార్తా సంస్థ సిన్హువా చెప్పింది. ఒక్కోసారి ఒక్కో ప్రమాదాల సీజన్ కనిపిస్తుంటుంది. ఇంతకుముందు వోల్వో బస్సులు వరుసపెట్టి ప్రమాదాలకు గురయ్యాయి. తర్వాత జలాంతర్గాముల ప్రమాదాలు వరుసగా జరిగాయి. ముంబైలో పది రోజుల వ్యవధిలో జరిగిన రెండు ప్రమాదాల్లో నౌకాదళ ఇంజనీర్లు మరణించారు. ఇప్పుడు విమాన ప్రమాదాల సీజన్ కనిపిస్తోంది.