కేసీఆర్‌కు చైనాలోని సిచ్వాన్ ప్రావిన్స్ ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: చైనా దేశంలోని సిచ్వాన్ ప్రావిన్స్‌ను సందర్శించాల్సిందిగా ఆ ప్రావిన్స్ విదేశీ వ్యవహారాల శాఖ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఝంగ్‌తావ్ నుంచి తెలంగాణ రాష్ట్ర సీఎం చంద్రశేఖర్‌రావుకు ఆహ్వానం అందింది. ఈ ప్రావిన్స్‌లోని చెంగ్దూ ప్రాంతంలో పర్యటించాలని కోరుతూ లేఖ పంపించారు. ముఖ్యమంత్రితోపాటు ఉన్నతస్థాయి బృందం రావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం, సిచ్వాన్ ప్రావిన్స్‌ల మధ్య వ్యాపార, సాంస్కృతిక సహకారంపై చర్చించవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం విద్యుత్ ప్రాజెక్టులు కావాల్సి ఉన్నందున పర్యటనకు వచ్చినప్పుడు ఈ అంశంలో ఒప్పందాలు చేసుకోవచ్చని డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఝంగ్‌తావు పేర్కొన్నారని ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించింది.