చైనాను మరో భూకంపం వణికించింది. నైరుతి చైనాలోని సిచౌన్ ప్రావిన్స్ లో ఆదివారం ఉదయం 6.07 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
హాంగ్కాంగ్: చైనాను మరో భూకంపం వణికించింది. నైరుతి చైనాలోని సిచౌన్ ప్రావిన్స్ లో ఆదివారం ఉదయం 6.07 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదయింది. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
నైరుతి జిలౌడు ప్రాంతానికి రెండు కిలోమీటర్లు, యున్నన్ ప్రావిన్స్ లోని జహయోటాంగ్ ప్రాంతానికి 96 కిలోమీటర్ల దూరంలో భూకంపన కేంద్రాన్ని గుర్తించారు. రెండు వారాల క్రితం చైనాలో సంభవించిన భూకంపం 615 మందిని బలి తీసుకుంది. 3,143 మంది గాయపడ్డారు. వరుస భూకంపాలతో చైనా వాసులు వణుకుతున్నారు.