నైరుతి చైనాలోని సిచువాన్ రాష్ట్రంలో ఓ విమానం కూలిపోయింది. చిన్న విమానం ఒకటి ఆ రాష్ట్రంలోని ఓ గ్రామంలో గల పొలంలో శనివారం నాడు కుప్పకూలింది. హైయున్ గ్రామంలో ఈ ప్రమాదం సంభవించినట్లు డుజియాంగ్యాన్ నగర ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా మరణించారా, లేదా గాయపడ్డారా అన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదని చైనా అధికారిక వార్తా సంస్థ సిన్హువా చెప్పింది.
ఒక్కోసారి ఒక్కో ప్రమాదాల సీజన్ కనిపిస్తుంటుంది. ఇంతకుముందు వోల్వో బస్సులు వరుసపెట్టి ప్రమాదాలకు గురయ్యాయి. తర్వాత జలాంతర్గాముల ప్రమాదాలు వరుసగా జరిగాయి. ముంబైలో పది రోజుల వ్యవధిలో జరిగిన రెండు ప్రమాదాల్లో నౌకాదళ ఇంజనీర్లు మరణించారు. ఇప్పుడు విమాన ప్రమాదాల సీజన్ కనిపిస్తోంది.
చైనాలో కుప్పకూలిన విమానం
Published Sat, Mar 8 2014 3:53 PM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
Advertisement
Advertisement