మోత్కూరు:
తాళం వేసిన ఇంట్లోకి చొరబడి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి మోత్కూరు మండలంలోని ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ మందుల విజయ–కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పట్టేటి యాదగిరి తన భార్య అనారోగ్యం భారిన పడటంతో ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లారు. గమనించిన దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో దాచిన రూ.30 వేలను అపహరించుకుపోయారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.