బీహార్‌లోని పట్నాలో గల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడంతో కలకలం చెలరేగింది. ఈ నేపధ్యంలో సీఎం కార్యాలయ భద్రతా వ్యవస్థను మరింత అప్రమత్తం చేశారు. కార్యాలయ ప్రాంగణంలో అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తీవ్రవాద సంస్థ అల్ ఖైదా పేరుతో సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీనిపై సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తరువాత ఏటీఎస్ కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. కాగా గతంలో పట్నా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. అయితే ముమ్మర తనిఖీల తర్వాత బాంబులాంటిదేమీ లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
జూలైలో పట్నాలోని ఓ ఇంట్లో బాంబు తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 35 లైవ్ కాట్రిడ్జ్‌లు, పొటాషియం నైట్రేట్ బాక్స్, ట్రీ ఫిల్ లిక్విడ్ బాక్స్ తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పవన్ మహతో అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment