అస్సాం ప్రభుత్వ ఉద్యోగులకు వెసులుబాటు
గువాహటి: అస్సాం ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులు లేదా అత్తమామలతో గడిపేందుకు రెండు రోజులు సెలవులిస్తున్నట్లు సీఎం కార్యాలయం గురువారం ప్రకటించింది. తల్లిదండ్రులు, అత్తమామలు లేని వారు స్పెషల్ కాజువల్ లీవ్‌కు అనర్హులని స్పష్టం చేసింది. నవంబర్ 6, 8వ తేదీల్లో స్పెషల్ కాజువల్ లీవ్ తీసుకునే వారు తమ తల్లిదండ్రులు, అత్తమామలతో గడిపేందుకే కేటాయించాలని వివరించింది.
వయోవృద్ధులైన తల్లిదండ్రులు, అత్తమామలను జాగ్రత్త చూసుకునేందుకు వారికి గౌరవం, మర్యాద ఇచ్చేందుకు ఈ లీవ్ ప్రత్యేక సందర్భమని వెల్లడించింది. నవంబర్ 7న ఛాత్ పూజ, నవంబర్ 9న రెండో శనివారం, నవంబర్ 10న ఆదివారంతో పాటు ఈ రెండు రోజుల సెలవును ఉపయోగించుకోవచ్చని సీఎంఓ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment