తల్లిదండ్రులను చూడకపోతే శాలరీ కట్
తల్లిదండ్రులను చూడకపోతే శాలరీ కట్
Published Wed, Feb 8 2017 4:18 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు అస్సాం ప్రభుత్వం బాసటగా నిలిచింది. పెంచి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులపై కొరడా ఝుళిపించనుంది. వయసు పైబడిన వారి బాగోగులు చూడని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి అందించనుంది. ఈ మేరకు అస్సాం ఆర్థిక శాఖ మంత్రి హిమంత బిశ్వా సర్మా మంగళవారం జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేశారు.
2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుని సదరు ఉద్యోగి వేతనం నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి అతని తల్లిదండ్రులకు ఇస్తుందని తెలిపారు. అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి బిడ్డ బాధ్యత అని చెప్పారు.
Advertisement
Advertisement