సీఎంవో అధికారులకు శాఖల కేటాయింపు  | Allocation of branches to CMO officers | Sakshi
Sakshi News home page

సీఎంవో అధికారులకు శాఖల కేటాయింపు 

Published Thu, Mar 3 2022 5:23 AM | Last Updated on Thu, Mar 3 2022 9:16 AM

Allocation of branches to CMO officers - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం కార్యాలయం(సీఎంవో)లో పనిచేసే అధికారులకు శాఖలను కేటాయిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు.  

కేఎస్‌ జవహర్‌రెడ్డి(స్పెషల్‌ సీఎస్‌): జీఏడీ, హోం శాఖ, రెవెన్యూ, అటవీ పర్యావరణ, వైద్య ఆరోగ్య శాఖ, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎంవో ఎస్టాబ్లిష్‌మెంట్, రాష్ట్ర విభజన సమస్యలు 

సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌(కార్యదర్శి): పౌర సరఫరాలు, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్, అన్ని సంక్షేమ శాఖలు 

ధనుంజయ్‌రెడ్డి(కార్యదర్శి): ఆర్థిక, ప్రణాళిక శాఖ, జల వనరులు, వ్యవసాయ అనుబంధ రంగాలు, మునిసిపల్‌ పరిపాలన, ఇంధన శాఖ, పర్యాటక, యువజన సర్వీసులు,

మార్కెటింగ్‌ అండ్‌ సహకార శాఖలు 
ముత్యాలరాజు(అదనపు కార్యదర్శి): ప్రజాప్రతినిధుల వినతులు, రెవెన్యూ(ల్యాండ్, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌), గృహ నిర్మాణం, రవాణా, రోడ్లు, భవనాల శాఖలు, కార్మిక, నైపుణ్యాభివృద్ధి శాఖలు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement