ముత్తుకూరు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు) : తమ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ స్థానికులు ఆందోళనకు దిగిన సంఘటన ఇది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరులో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానిక సెంటర్‌లో మద్యం దుకాణం ఏర్పాటుపై అందిన దరఖాస్తు మేరకు ఎక్సైజ్ సీఐ నరహరి శనివారం సాయంత్రం అక్కడికి చేరుకుని సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేపట్టారు.
విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న దాదాపు 100 మంది స్థానికులు మద్యం దుకాణం వద్దంటూ బైఠాయించి నినాదాలు చేశారు. అయితే దుకాణం ఏర్పాటు కేవలం ప్రతిపాదనల దశలోనే ఉందని ఏర్పాటు సంగతిని పైఅధికారులు చూసుకుంటారని ఎక్సైజ్ సీఐ నరహరి తెలిపారు. స్థానికుల ఆందోళన చాలాసేపటి వరకు కొనసాగింది.
మద్యం దుకాణం వద్దంటూ ఆందోళన
Published Sat, Jan 9 2016 8:26 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM
Advertisement
Advertisement