రాంచీ: ప్రజాసమస్యలపై చర్చించే అసెంబ్లీలో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలంటున్నారు.. జార్ఖండ్ ఎమ్మెల్యేలు. బయట మద్యం కొనుక్కోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని, క్యూలలో జనాలు భారీగా ఉండటంతో ఇబ్బందిగా ఉంటోందని, అసెంబ్లీ ప్రాంగణంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసేలే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. చలి కాలం కావడంతో మద్యం ప్రియులు ఎక్కువయ్యారని, దీంతో ఎమ్మెల్యేల సాయంత్రం పెగ్ అలవాటుకు సమస్యగా మారుతోందని ఓ ఎమ్మేల్యే వాపోయాడు.
ఇక జార్ఖండ్ ప్రభుత్వం మద్యం దుకాణాల లైసెన్స్‌ను రద్దు చేసి స్వయంగా లిక్కర్ షాపులను నిర్వహిస్తోంది. ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉండడంతో ఎప్పుడు చూసిన రద్దీగా ఉంటున్నాయి. దుకాణాల ముందు గొడవలు జరుగుతున్నాయి. దుకాణాలు కేవలం సీటీ శివారులో ఉండటం.. రాత్రి 10 గంటల వరకే అందుబాటులో ఉండటంతో మందుబాబులకు ప్రధాన సమస్యగా మారింది.
ఈ నెల 12 నుంచి జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనేత్తాలనుకుంటున్నారు. ఈ విషయంలో స్పీకర్ దినేష్ సాయంతో ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ను ఒప్పిస్తామని ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎమ్‌ఎమ్) నేత హేమంత్ సోరేన్ కూడా మద్దతు తెలుపుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని తమ ఎమ్మెల్యేలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment