కోవూరు/బుచ్చిరెడ్డిపాళెం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రధాన అనుచరుడిగా చలామణి అవుతున్న నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి ఆక్రమణలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఇద్దరు మహిళలకు వంశపారంపర్యంగా వచ్చిన రూ.75 లక్షల విలువైన మూడెకరాల భూమిని లీజుకు తీసుకుని ఆక్రమించాడు. బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు. వివరాలు..బుచ్చిరెడ్డిపాళెం మండలం కట్టుబడిపాళేనికి చెందిన కాకుమాను కృష్ణకుమారి, కాకుమాను మాధురిదేవికు సర్వే నంబర్ 1023–ఏ,బీ, 1024–ఏ,బీ, 512–1బీ,బీ సర్వే నంబర్లలో మూడెకరాల భూమి ఉంది.
వంశపారంపర్యంగా వచ్చిన ఈ భూమిని అదే ప్రాంతానికి చెందిన నెల్లూరు ప్రభాకర్‌రెడ్డికి కౌలుకు ఇచ్చారు. గత కొన్నేళ్లుగా పొలం యజమానులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఇదే అదనుగా భావించిన నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి భూమిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని కౌలు చెల్లించలేదు. భూమిని అప్పగించాలని కోరిన భూ యజమానులను బెదిరింపులకు గురిచేయసాగాడు.
మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి అనుచరుడిగా చెలామణి అవుతూ రెవెన్యూ అధికారులను బ్లాక్‌మెయిల్ చేసి రెవెన్యూ రికార్డు ల్లో సైతం తన తల్లి నెల్లూరు మీనాక్షమ్మ పేరును నమోదు చేయించుకున్నారు. ఇదేమి అన్యాయం అని ప్రశ్నించిన బాధితులను బెదిరించ డంతో బాధితులు ఇటీవల రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. దీంతో బుచ్చిరెడ్డిపాళెం తహసీల్దార్ ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని నెల్లూరు ప్రభాకర్‌రెడ్డికి శనివారం నోటీసులు జారీ చేశారు. అలాగే బాధితుల ిఫిర్యాదు మేరకు బుచ్చిరెడ్డిపాళెం ఎస్సై వీరప్రతాప్ సైతం చీటింగ్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment