టీడీపీ నేతల ఆందోళన | TDP Local leaders Performs Dharna At TDP Office In Kadapa | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల ఆందోళన

Published Thu, Dec 20 2018 9:11 PM | Last Updated on Thu, Dec 20 2018 9:15 PM

TDP Local leaders Performs Dharna At TDP Office In Kadapa - Sakshi

వైఎస్సార్‌ జిల్లా: టీడీపీ వైఎస్సార్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి కార్యాలయం ఎదుట 15వ డివిజన్‌ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని ఉంటే తమను కాదని పార్టీకి సంబంధం లేని వారికి పనులు ఎలా కేటాయిస్తారంటూ శ్రీనివాసులు రెడ్డిని నిలదీశారు. మర్యాదగా బయటకు వెళ్లాలని, ఏమి చేయాలో తనకు తెలుసునని ఆందోళన చేస్తున్న వారిపై శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారిమని తమను పక్కన పెడుతున్నారంటూ టీడీపీ తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. అణాగారిన కులాలను పక్కన పెట్టి కబ్జాదారులకు, రౌడీలకు టీడీపీ జిల్లా నాయకులు పనులు అప్పజెప్పుతున్నారని మండిపడ్డారు. చేసేదేమీ లేక అక్కడి నుంచి కాసేపయిన తర్వాత వెళ్లిపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement