మరోసారి ముద్రగడ పాదయాత్ర యత్నం! | police did not allow mudragada padayathra | Sakshi
Sakshi News home page

మరోసారి ముద్రగడ పాదయాత్ర యత్నం!

Published Mon, Aug 14 2017 11:30 AM | Last Updated on Sun, Sep 17 2017 5:31 PM

మరోసారి ముద్రగడ పాదయాత్ర యత్నం!

మరోసారి ముద్రగడ పాదయాత్ర యత్నం!

అడ్డుకున్న పోలీసులు.. మండిపడ్డ కాపు నేత

కాకినాడ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సోమవారం మరోసారి పాదయాత్ర చేపట్టేందుకు ప్రయత్నించారు. కాపులకు బీసీ రిజర్వేషన్‌ కల్పించాలని 'ఛలో అమరావతి' పేరిట పాదయాత్ర చేపట్టేందుకు గత కొన్నిరోజులుగా ముద్రగడ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే పాదయాత్ర కోసం కిర్లంపూడిలోని తన నివాసం నుంచి ఆయన బయటకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని ఇంటి గేటు వద్ద ఆయనను నిలువరించారు. దీంతో కాపు నేతలు భగ్గుమన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలంటూ ధర్నా నిర్వహించారు. కిర్లంపూడిలో నల్లజెండాలు పట్టుకొని నిరసన తెలిపారు.

తన పాదయాత్రను మరోసారి అడ్డుకోవడంపై ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తానంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర నిర్వహించినప్పుడు తీసుకున్న అనుమతి ఏమిటో, ఆ పత్రం ఏమిటో తనకు చూపాలని, అదే తరహాలో తాను కూడా అనుమతి తీసుకొని పాదయాత్ర చేస్తానని అన్నారు. వేలమంది పోలీసులను కిర్లంపూడిలో మోహరించి తన పాదయాత్రను అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement