అడ్డాకుల: పాదయాత్రకు స్వాగతం పలుకుతున్న దృశ్యం
అడ్డాకుల(దేవరకద్ర): మహిళల సాధికారత కోసం ఓ యువతి కన్యాకుమరి నుంచి కాశ్మీర్(శ్రీనగర్)కు చేపట్టిన పాదయాత్ర సోమవారం మండలంలోని జాతీయ రహదారి మీదుగా సాగింది. డెహ్రడూన్ ప్రాంతానికి చెందిన స్రిష్టిబక్షి అనే యువతి సెప్టెంబర్ 15న కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించింది. మహిళల రక్షణ, చిన్న పిల్లలపై ఆకృత్యాల నివారణ, అక్షరాస్యత ద్వారా మహిళలు సాధికారత సాధించి దేశంలో మహిళలకు సురక్షిత స్థానం ఉండాలన్న ఆకాంక్షతో పాదయాత్ర చేపట్టింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌లోని శ్రీనగర్ వరకు 260రోజుల్లో 3800 కిలోమీటర్ల మేర 100కోట్ల అడుగులతో పాదయాత్ర సాగనుంది. 2018 ఏప్రిల్ 28న శ్రీనగర్‌లో పాదయాత్ర ముగియనుంది.
ఈ నెల 12న జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడులో స్రిష్టి బక్షి పాదయాత్ర ద్వారా తెలంగాణలో అడుగు పెట్టింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, అదిలాబాద్ జిల్లాల మీదుగా సాగే పాదయాత్ర డిసెంబర్ 16న మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలోకి ప్రవేశించనుంది. అడ్డాకులలో బక్షి పాదయాత్రకు ఎస్‌ఐ ఆర్.మధుసూదన్, హెడ్ కానిస్టేబుల్ కృష్ణయ్య, కానిస్టేబుల్ శ్రీనివాసులు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకట్‌సాగర్, నాయకులు ప్రవీన్, గంగుల రాజశేఖర్‌రెడ్డి, శివ, వెంకటేష్, రాజు, శ్రీను తదితరులు ఘనస్వాగతం పలికారు. ఆమెతోపాటు కొంతదూరం నడిచారు.
మహిళా శక్తి వంటింటికే పరిమితం కాకూడదు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మహిళా శక్తి వంటింటికి పరిమితం కాకూడాదని గ్రాస్‌బో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి స్రిష్టి బక్షి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో మహిళల హక్కులపై ఎన్‌ఎస్‌ఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహణ సదస్సులో ఆమె మాట్లాడారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ యాత్రలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment