హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కశ్మీర్‌ను కన్యాకుమారితో అనుసంధానం చేయాలనే కలను సాధించడంలో జోజిలా టన్నెల్‌కీలకపాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. ‘ఈ ప్రాజెక్ట్ ఇండియాలో భారీ గేమ్ ఛేంజర్‌కాబోతోంది. కశ్మీర్ లోయ, లడఖ్ మధ్య సంవత్సరం పొడవునా కనెక్టివిటీని అందిస్తుంది. క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో పనులు కొనసాగిస్తున్న ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు నా అభినందనలు. ఎముకల కొరికే చలిలో కూడా వారు పనులను కొనసాగిస్తున్నారు.
టన్నెల్‌లో దాదాపు 38 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తుంది. దీనివల్ల ఉపాధి పెరుగుతుంది. ఇక్కడ రిసార్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్ వంటివి నిర్మిస్తూ.. కశ్మీర్‌ను మరో స్విట్జర్లాండ్‌లా తీర్చిదిద్దుతాం’ అని అన్నారు. మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) నిర్మిస్తున్న జోజిలా టన్నెల్‌నిర్మాణ పనుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల పురోగతిని సోమవారం పరిశీలించారు.
ఎంఈఐఎల్ డైరెక్టర్ సి.హెచ్.సుబ్బయ్య, జోజిలా ప్రాజెక్ట్ హెడ్ హర్పాల్ సింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ఇచ్చారు. కశ్మీర్ లోయ, లడఖ్ ప్రాంతం మధ్య అన్ని వాతావరణాలకు అనువుగా ఉండేలా వ్యూహాత్మకంగా జాతీయ రహదారిపై 11,578 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న సొరంగం పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. 2026 డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే యోచనలో ఉన్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment