tunnel projects
-
జోజిలా భారీ గేమ్ ఛేంజర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కశ్మీర్‌ను కన్యాకుమారితో అనుసంధానం చేయాలనే కలను సాధించడంలో జోజిలా టన్నెల్‌కీలకపాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. ‘ఈ ప్రాజెక్ట్ ఇండియాలో భారీ గేమ్ ఛేంజర్కాబోతోంది. కశ్మీర్ లోయ, లడఖ్ మధ్య సంవత్సరం పొడవునా కనెక్టివిటీని అందిస్తుంది. క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో పనులు కొనసాగిస్తున్న ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు నా అభినందనలు. ఎముకల కొరికే చలిలో కూడా వారు పనులను కొనసాగిస్తున్నారు. టన్నెల్లో దాదాపు 38 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తుంది. దీనివల్ల ఉపాధి పెరుగుతుంది. ఇక్కడ రిసార్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్ వంటివి నిర్మిస్తూ.. కశ్మీర్‌ను మరో స్విట్జర్లాండ్‌లా తీర్చిదిద్దుతాం’ అని అన్నారు. మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) నిర్మిస్తున్న జోజిలా టన్నెల్‌నిర్మాణ పనుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల పురోగతిని సోమవారం పరిశీలించారు. ఎంఈఐఎల్ డైరెక్టర్ సి.హెచ్.సుబ్బయ్య, జోజిలా ప్రాజెక్ట్ హెడ్ హర్పాల్ సింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ఇచ్చారు. కశ్మీర్ లోయ, లడఖ్ ప్రాంతం మధ్య అన్ని వాతావరణాలకు అనువుగా ఉండేలా వ్యూహాత్మకంగా జాతీయ రహదారిపై 11,578 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న సొరంగం పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. 2026 డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే యోచనలో ఉన్నామని వెల్లడించారు. -
సముద్ర గర్భం గుండా ‘బుల్లెట్ ట్రైన్’.. దేశంలోనే తొలిసారి!
న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి సముద్ర గర్భ సొరంగం మార్గం అందుబాటులోకి రానుంది. ఈ టన్నెల్ నిర్మాణం ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సముద్ర గర్భంలో సొరంగం పనులకు నేషనల్ హైస్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) బిడ్లను ఆహ్వానిస్తోంది. హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా మొత్తం 21 కిలోమీటర్ల మేర సొరంగాన్ని నిర్మించనుండగా.. 7 కిలోమీటర్లు సముద్రగర్భంలో తవ్వాల్సి ఉంది. మహారాష్ట్రలోని బంద్రా-కుర్లా కాంప్లెక్స్ మధ్య సాధారణ సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా.. థానే జిల్లాలోని శిల్ఫాటా ప్రాంతంలో సముద్రంలో నిర్మించాల్సి ఉంది. గతంలో అండర్‌వాటర్ టన్నెల్ నిర్మాణం కోసం ఢిల్లీ-ముంబై మధ్య యమునా నది కింద తవ్వాలని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, అది సాధ్యపడలేదు. మరోవైపు.. బ్రహ్మపుత్ర నది కింద అన్ని వాహనాలు వెళ్లేందుకు వీలుగా సొరంగ మార్గం ఏర్పాటు కోసం రోడ్డు, రైల్వే మంత్రిత్వ శాఖలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. 2019లోనే హైస్పీడ్ ట్రైన్ టన్నెల్ నిర్మాణానికి ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ టెండర్లు ఆహ్వానించింది. ఆ తర్వాత గత నవంబర్లోనూ మరోసారి బిడ్లను ఆహ్వానించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో కదలిక వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 29 నాటికి బిడ్లు దాఖలు చేయాలని గడువు విధించారు అధికారులు. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య చేపడుతోన్నఈ రైలు కారిడార్ మొత్తం 508.17 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. అహ్మదాబాద్ నుంచి ముంబై కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. గుజరాత్లో మొత్తం 8 స్టేషన్లు ఉండగా.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. ప్రాజెక్టును పూర్తిచేసి 2026లో తొలిదశ ట్రయల్స్‌ను నిర్వహించాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆశాభావంతో ఉంది. ఇదీ చదవండి: Viral Video: మేడ్ ఇన్ ఇండియా వ్యవసాయం అంటే ఇదే.. రైతు తెలివికి సలాం! -
విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు...సొరంగ ‘మార్గం
సాక్షి హైదరాబాద్: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, కేబుల్ బ్రిడ్జి, అండర్‌పాస్‌లు, స్టీల్‌బ్రిడ్జిలు వంటి పనులు విజయవంతంగా పూర్తిచేసిన జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడిక సొరంగ మార్గాలపై దృష్టి సారించారు. హైదరాబాద్‌లో గతంలో లేనటువంటి వివిధ మార్గాలను అందుబాటులోకి తెస్తున్న వారు ప్రస్తుతం సొరంగ మార్గాల నిర్మాణాలకు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకనుగుణంగా ఇప్పటికే జూబ్లీహిల్స్ నుంచి పంజగుట్ట వరకు భూగర్భంలో సొరంగ మార్గానికి (వయా కేబీఆర్ పార్క్) టెక్నికల్ కన్సల్టెంట్ల కోసం టెండర్లు పిలిచారు. ఖాజాగూడ గుట్టను తొలిచి అక్కడ మరో సొరంగ మార్గానికి సమాయత్తమవుతున్నారు. మంత్రి కేటీఆర్ ఆసక్తితో.. కేబీఆర్ పార్కు కింద నుంచి సొరంగమార్గానికి మంత్రి కేటీఆర్ ఆసక్తి కనబరచడంతో, ఖాజాగూడ సొరంగానికీ నిధులు కోరుతూ ప్రభుత్వం ముందుంచారు. ఎస్సార్డీపీ పనులకు సంబంధించి తొలి ప్రతిపాదనల మేరకు అయిదు ఫేజ్‌ల్లో ప్రణాళికలు రూపొందించారు. క్షేత్రస్థాయి పరిస్థితులతోపాటు ఇతరత్రా కారణాలతో వివిధ ఫేజ్‌ల్లో ఉన్న పనుల్లో ఆటంకాలు లేని పనుల్ని చేపట్టారు. కొన్ని పూర్తయ్యాయి. కొన్ని పురోగతిలో ఉన్నాయి. ప్రస్తుతం వాటన్నింటినీ ఫేజ్– 1 గానే పరిగణిస్తూ, కొత్తగా ఫేజ్–2లో చేపట్టేందుకు 14 పనుల్ని ప్రతిపాదించారు. వాటిలో ఖాజాగూడ సొరంగమార్గం ప్రముఖంగా ఉంది. ఫేజ్– 2లోని పనుల మొత్తం అంచనా వ్యయం రూ.3515 కోట్లు కాగా, అందులో రూ. 1080 కోట్లు ఈ సొరంగ మారానికే ఖర్చు కానుంది. మిగతా 13 పనుల్లో పాతబస్తీకీ తగిన ప్రాధాన్యమిచ్చారు. శాస్త్రిపురం జంక్షన్‌నుంచి ఇంజన్‌బౌలి వరకు రూ.250 కోట్లతో రోడ్డు విస్తరణ, బెంగళూర్ హైవే నుంచి శాస్త్రిపురం వరకు రూ.150 కోట్లతో రోడ్డు విస్తరణ పనుల్ని కొత్తగా చేర్చారు. వీటితోపాటు కొన్ని పాత ప్రతిపాదనలు సైతం ఉన్నాయి. జీహెచ్ఎంసీ పాలకమండలి ఆమోదం కోసం ఈ నెల 12న జరగనున్న సభలో వీటిని ఉంచే అవకాశం ఉంది. (చదవండి: ప్రత్యామ్నాయ ఫ్రంట్ దిశగా..!) -
శరవేగంగా శ్రీనగర్–లద్దాఖ్ భారీ టన్నెళ్ల నిర్మాణం
శ్రీనగర్ సోనామార్గ్ నుంచి సాక్షి ప్రతినిధి: భూతల స్వర్గం జమ్మూకశ్మీర్‌కే తలమానికంగా నిలిచే శ్రీనగర్–లద్దాఖ్‌ను కలిపే వ్యూహాత్మక రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి ఊపిరిలూదడంతోపాటు స్థానిక పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా చేపట్టిన జెడ్–మోర్, జోజిలా టన్నెల్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో సముద్రమట్టానికి 11,578 అడుగుల ఎత్తున నిర్మిస్తున్న రెండు టన్నెళ్ల నిర్మాణ పనులను మంగళవారం కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పరిశీలించనున్నారు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుర్జిత్‌సింగ్ కాంబో సోమవారం ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుత దారులు ఏడాదిలో 5 నెలలు మూతే ప్రస్తుతం శ్రీనగర్ నుంచి లేహ్, లద్దాఖ్‌లను కలిపే రహదారులు రవాణాపరంగా, ఆర్థికపరంగా చాలా క్లిష్టంగా ఉన్నాయి. శ్రీనగర్ నుంచి లేహ్‌కు వెళ్లే రహదారిని ఏడాదిలో 5 నెలలపాటు నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు తెరిచి ఉంచే పరిస్థితులు లేవు. తీవ్రమైన హిమపాతం కారణంగా వాహనాల రాకపోకలకు వీల్లేకపోవడంతో సైనిక వాహనాల రాకపోకలకు సమస్యగా మారింది. అదీగాక ప్రత్యా మ్నాయ మార్గాలన్నీ చైనా, పాకిస్తాన్‌కు సరిహద్దుల్లో ఉండటంతో వాటిని అభివృధ్ధి చేసే పరిస్థితి లేదు. దీంతో వ్యూహాత్మక రహదారుల నిర్మాణం ఆవశ్యకమైంది. ఇందులో భాగంగానే జొజిలా, జెడ్–మోర్ టన్నెల్ నిర్మాణాలు తెరపైకి వచ్చాయి. తగ్గనున్న రవాణా భారం... సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లద్దాఖ్‌కు రెండు సొరంగ మార్గాలను కేంద్రం సుమారు రూ. 7 వేల కోట్లతో నిర్మిస్తోంది. వాటితో శ్రీనగర్–లేహ్ మధ్య ప్రయాణ సమయం 6.5 గంటలుSతగ్గుతుంది. ఇందులో జెడ్–మోర్ టన్నెల్ వ్యయం రూ. 2,300 కోట్లుకాగా జోజిలా వ్యయం రూ.4,600 కోట్లు. జోజిలా ప్రాజెక్టును మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు కింద 14.15 కి.మీ. మేర టన్నెల్, 18.5 కి.మీ. మేర అప్రోచ్ రోడ్డు నిర్మించాల్సి ఉంటుంది. రెండు వైపులా వాహనాల రాకపోకలకు ఉపయోగపడేలా నిర్మించే టన్నెల్ మార్గం ఎత్తు 7.57 మీటర్లుగాను, వెడల్పు 9.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ సొరంగ మార్గం పూర్తయితే మూడు గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం టన్నెల్ తవ్వకం పనులు సుమారు 500 మీటర్ల వరకూ పూర్తయ్యాయి. దీన్ని 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఆసియాలోనే అతిపెద్ద అండర్ టన్నల్‌గా చరిత్రకు ఎక్కనుంది. హైటెక్నాలజీతో మేఘా ప్రాజెక్టు సాధారణ రోడ్డుకు భిన్నంగా జోజిలా ప్రాజెక్టును ఎంఈఐఎల్ సంస్థ నిర్మిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణానికి పాలిస్టైరిన్ వినియోగిస్తోంది. మంచు కారణంగా రోడ్డు పాడవకుండా ఈ పాలిస్టైరిన్ కాపాడుతుంది. హిమాలయాల్లో ఈ టెక్నాలజీతో అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రోడ్డు ఉంటుంది. పాలి స్టైరిన్‌తోపాటు రోడ్డుపై మంచు చేరకుండా స్నోగ్యాలరీలను నిర్మిస్తున్నారు. యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా అధునాతన భద్రతా వ్యవస్థతో ఎంఈఐఎల్ ఈ మార్గాన్ని చేపడుతోంది. ఇందులో ఎమర్జెన్సీ లైటింగ్, ఆటోమెటిక్ లైటింగ్, మెసేజ్ సిగ్నలింగ్, ఎమెర్జెన్సీ టెలిఫోన్, రేడియా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గంలో గంటకు 80 కి.మి. వేగంతో ప్రయాణించవచ్చు. -
వేగంగా వెలిగొండ రెండో టన్నెల్ పనులు
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ (సొరంగం)లో మిగిలిన పనులను రికార్డు సమయంలో పూర్తి చేసిన ప్రభుత్వం, రెండో టన్నెల్ పనులను శరవేగంగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. రెండో టన్నెల్ తవ్వకం పనులకు గాను అమెరికా సంస్థ రాబిన్స్ నుంచి డబుల్ షీల్డ్ టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)ను 2007లో దిగుమతి చేసుకున్నారు. అయితే ఈ టీబీఎంలో, కన్వేయర్ బెల్ట్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. వాటిని సరిచేసేందుకు గత ప్రభుత్వం రాబిన్స్‌తో సంప్రదింపులు జరిపింది కానీ మరమ్మతులకు సంస్థను ఒప్పించలేకపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాబిన్స్‌తో చర్చించడంతో పాటు సంస్థ ప్రతినిధులను రప్పించడం ద్వారా టీబీఎం, కన్వేయర్ బెల్ట్‌లకు మరమ్మతులు చేయించింది. టీబీఎంతోపాటు, కార్మికులతోనూ తవ్వించడం ద్వారా నెలకు వెయ్యి మీటర్ల చొప్పున పనులు చేయించి, ఏడు నెలల్లో మిగిలిన 7,383 మీటర్ల టన్నెల్ తవ్వకం పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 830 అడుగులకు తగ్గిన వెంటనే ఈ టన్నెల్‌కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను ప్రారంభించి, జూన్‌లోగా పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది. వైఎస్ హయాంలోనే సింహభాగం పనులు పూర్తి శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోగానే రోజుకు 11,582 క్యూసెక్కుల చొప్పున 43.5 టీఎంసీలు తరలించేలా రెండు టన్నెళ్లను తవ్వాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, దర్శి, కొండెపి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో 84 వేల ఎకరాలు, వైఎస్సార్ జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో 27,200 ఎకరాలు వెరసి 4,47,200 ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 15.25 లక్షల మంది దాహార్తి తీర్చాలన్నది వైఎస్సార్ సంకల్పం. పనులు వేగంగా కొనసాగించడంతో మహానేత హయాంలోనే టన్నెళ్లు, నల్లమలసాగర్, ప్రధాన కాలువల పనులు సింహభాగం పూర్తయ్యాయి. ఇక మిగిలిన పనులను పూర్తిచేసే పేరుతో కాంట్రాక్టర్లతో కలసి గత ప్రభుత్వ పెద్దలు రూ.66.44 కోట్లు దోచుకున్నారు. టన్నెళ్ల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై వేటు వేసి.. అంచనా వ్యయాన్ని పెంచి అధిక ధరలకు ఎంపిక చేసుకున్న కాంట్రాక్టర్లకు అప్పగించేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలిగొండను ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు అప్పగించిన రెండో టన్నెల్ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి, రివర్స్ టెండరింగ్‌తో రూ.61.76 కోట్లు ఖజానాకు ఆదా చేశారు. తద్వారా గత సర్కార్ అక్రమాలను బహిర్గతం చేశారు. మరోవైపు మొదటి టన్నెల్లో మిగిలిన 3.6 కి.మీల పనిని 13 నెలల రికార్డు సమయంలో పూర్తి చేశారు. లైనింగ్‌తో సహా మొదటి టన్నెల్ పూర్తయింది. మొదటి టన్నెల్‌కు శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేసేందుకు హెడ్ రెగ్యులేటర్‌ను గతేడాదే పూర్తి చేశారు. ఇక రెండో టన్నెల్ ఏడు నెలల్లో పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టారు. నల్లమలసాగర్ నిర్వాసితులకు పరిహారాన్ని చెల్లించడంతో పాటు పునరావాసం కల్పించడం ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి టన్నెళ్ల ద్వారా నల్లమలసాగర్‌కు అక్టోబర్ నాటికి కృష్ణా వరద జలాలను తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. వెలిగొండ ప్రాజెక్ట్ రెండవ టన్నెల్లో ఇప్పటి వరకు పనులు పూర్తయిన ప్రాంతం -
సొరంగంలో సవారీ...!
డిసెంబర్ 10.. ప్రపంచం మొత్తం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు. నగర రవాణా వ్యవస్థను మార్చే ఓ అద్భుతమైన ప్రాజెక్టును ఆ రోజున ఆవిష్కరిస్తానని అమెరికన్ వ్యాపారవేత్త, టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ మాట ఇచ్చాడు. అంతేకాదు దీని వల్ల తక్కువ సమయంలో.. అతి తక్కువ ఖర్చుతో ఒకచోట నుంచి మరోచోటుకి ప్రయాణాన్ని సాగించవచ్చని తెలిపాడు. మస్క్ ఆధ్వర్యంలోని బోరింగ్ కంపెనీ రూపొందించిన ఈ ప్రాజెక్టు పేరే ‘బోరింగ్ టన్నెల్’. ఇంతకీ ఆ ప్రాజెక్టు విజయవంతం అవుతుందా? లేదా? అని ప్రపంచమే ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ప్రాజెక్టు గనుక విజయవంతమైతే ట్రాఫిక్ కష్టాలు తప్పడంతోపాటు భవిష్యత్తు నగర రవాణా వ్యవస్థనే సమూలంగా మార్చేస్తుందని భావిస్తోంది. ప్రాజెక్టులో ముఖ్యమైనవి.. స్ట్రీట్ లెవెల్ ప్లాట్‌ఫారమ్స్ ఎలక్ట్రిక్ స్కేట్స్ సొరంగంలో ఏర్పాటు చేసిన పట్టాలు పనితీరు ఇలా.. సొరంగ మార్గంలోకి ప్రవేశించడానికి స్ట్రీట్ లెవెల్ ప్లాట్‌ఫారమ్స్ ఏర్పాటు చేశారు. ఇవి రోడ్డుపై ఫుట్‌పాత్‌కు పక్కనే ఉంటాయి. వాహనాలు ముందుగా స్ట్రీట్ లెవెల్ ప్లాట్‌ఫారమ్‌పై ఏర్పాటు చేసిన ‘ఎలక్ట్రిక్ స్కేట్స్’మీదకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ స్కేట్స్ ఎలివేటర్ మాదిరిగా పని చేస్తాయి. ఈ స్కేట్స్ వాహనాలను భూమిలోనికి తీసుకెళుతూ.. సొరంగ మార్గంలోని పట్టాల మీదకు వెళ్లి కూర్చుంటాయి. అనంతరం ఈ స్కేట్స్ పట్టాల మీద అత్యధిక వేగంతో ముందుకు కదులుతూ గమ్యస్థానానికి చేరుకుంటాయి. అక్కడ నుంచి ఈ స్కేట్స్ పట్టాల నుంచి విడిపోయి పక్కకు జరిగి ఎలివేటర్ సహాయంతో పైకి కదులుతూ.. స్ట్రీట్ లెవెల్ ప్లాట్‌ఫారమ్స్ మీదకు చేరుకుంటాయి. తొలి ప్రయోగానికి సిద్ధం.. బోరింగ్ కంపెనీ ఇప్పటికే రెండు మైళ్ల పొడవు ఉన్న సొరంగ మార్గాన్ని సిద్ధం చేసింది. లాస్ ఏంజిలెస్‌లోని టెస్లా (ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ) ప్రధాన కేంద్రం నుంచి లాస్ ఏంజిలెస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేలా ఈ సొరంగ మార్గాన్ని రూపొందించింది. దీన్ని ఉపయోగించుకోవడానికి కేవలం ఒక అమెరికన్ డాలర్ మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ మారాన్ని డిసెంబర్లో ప్రపంచం ముందుకు మస్క్ తీసుకురానున్నారు. ఇది విజయవంతమైతే అమెరికాలో మరో మూడు ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. స్కేట్స్ స్పెషాలిటీ.. స్కేట్స్పైన వాహనాలు ఉన్న సమయంలో వీటి వేగం గంటకు సుమారు 240 కిలోమీటర్లు. టెస్లా మోడల్ ఎక్స్ చాసీస్‌ను మార్పులు చేసి ఈ స్కేట్స్ను తయారు చేశారు. ఇవి బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి. వీటి నుంచి వచ్చే ఉద్గారాల శాతం సున్నా కావడం గమనార్హం. ఒక స్కేట్ ఒకేసారి ఓ వాహనం లేదా 8 నుంచి 16 మంది ప్రయాణికులను మోసుకెళ్లగలదు. ఇప్పుడున్న ప్రయాణ సమయం కంటే 14 రెట్లు వేగంగా.. ప్రస్తుత ఖర్చుతో పొలిస్తే దీని ఖర్చు 90 శాతం తక్కువ కావడం విశేషం. మరో మూడు మార్గాలివే.. డగవుట్ లూప్ లాస్ ఏంజిలెస్‌లోని డాడ్జర్ బేస్‌బాల్ స్టేడియం నుంచి పలు మెట్రో స్టేషన్లకు తీసుకెళ్లేలా ఈ సొరంగ మార్గాన్ని రూపొందించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఇంకా దీనికి అనుమతులు లభించలేదు. షికాగో ఎక్స్‌ప్రెస్ లూప్ ఓ హేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లేక్ మిచిగాన్ ఒడ్డున ఉండే షికాగో ప్రాంతం వరకు ఈ సొరంగ మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ మార్గం పొడవు మొత్తం 27 కిలోమీటర్లు. సాధారణ ట్రాఫిక్‌లో అయితే ఈ దూరాన్ని చేరుకోవడానికి గంట లేదా గంటన్నర సమయం పడుతుంది. అదే సొరంగ మార్గం ద్వారా కేవలం 12 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ఈస్ట్ కోస్ట్ లూప్ ప్రాజెక్టు మొత్తంలో ఇదే అతిపెద్ద మార్గం అని చెప్పుకోవాలి. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీని వాణిజ్య నగరం న్యూయార్క్‌కు కలిపేలా ఈ సొరంగ మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. అయితే మొదటి దశలో వాషింగ్టన్ డీసీ నుంచి మేరిలాండ్ మీదుగా బాల్టిమోర్లను కలిపేలా మార్గాన్ని రూపొందించనున్నారు. టన్నెల్ కోసం టాప్ టెక్నాలజీ.. మస్క్ ఈ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు వాడిన సెకండ్ హ్యాండ్ బోరింగ్ మెషీన్ చాలా నెమ్మదిగా పనిచేసేది. ఎంత నెమ్మదిగా అంటే నత్త కంటే 10 రెట్లు తక్కువ వేగంతో భూమిని తవ్వేది. దీంతో లాభం లేదని భావించిన మస్క్ కొత్త టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాగే బోరింగ్ మెషీన్లకు టెస్లా కార్ల బ్యాటరీలు కూడా వాడాలని మస్క్ భావిస్తున్నాడు. ప్రస్తుతం సొరంగం తవ్వడానికి అవుతున్న ఖర్చు ఒక మైలు దూరానికి సుమారు 600 మిలియన్ల డాలర్ల నుంచి 1 బిలయన్ డాలర్లు. దీనిని 60 మిలియన్ డాలర్లకు తగ్గించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చంతంటినీ ప్రైవేట్ కంపెనీలు ఫైనాన్స్ చేయనున్నట్లు తెలిపాడు. అలాగే భవిష్యత్తులో ఇప్పుడు ఉన్న బోరింగ్ మెషీన్ల కంటే 14 రెట్లు వేగవంతమైన వాటిని తీసుకురానున్నట్లు మస్క్ ప్రకటించాడు. -
జోజిలా పాస్ సొరంగానికి కేబినెట్లో ఓకే
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో శ్రీనగర్, లేహ్‌ల మధ్య ప్రయాణ కాలాన్ని మూడున్నర గంటల నుంచి 15 నిమిషాలకు తగ్గించే జోజిలా పాస్ సొరంగ మార్గ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గమైన ప్రాజెక్టుకు 6,089 కోట్లు వ్యయం చేయనున్నారు. 14.2 కి.మీ పొడవుండే ఈ సొరంగం అందుబాటులోకి వస్తే శ్రీనగర్, కార్గిల్, లేహ్ మధ్య అనుసంధానత సాధ్యమవుతుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్పూర్లో ఎయిమ్స్ నెలకొల్పడానికి, జాతీయ జలమార్గం–1లోని హల్దియా–వారణాసి మార్గంలో నౌకాయానానికి ఊతమిచ్చేలా 5,369 కోట్లతో జల్ వికాస్ మార్గ్ ప్రాజెక్టుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. -
రెండున్నరేళ్లు.. 4.5 కిలోమీటర్లు!
• నత్తనడకన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు • ఇంకా రూ.650 కోట్ల పనులు ఎక్కడికక్కడే సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను వినియోగించుకుని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరందించేం దుకు చేపట్టిన ‘ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ –ఎస్ఎల్బీసీ)’ సొరంగం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించి పన్నెండేళ్లు గడుస్తున్నా 70% పనులు కూడా పూర్తికాకపోవడం గమనార్హం. మొత్తం టన్నెల్ పనులు పూర్తయ్యేందుకు మరో ఎనిమిదేళ్లు పట్టవచ్చన్న అంచనాల నేపథ్యంలో నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. 30 టీఎంసీల నీటిని తీసుకునేలా.. ఎస్ఎల్బీసీ ద్వారా 30 టీఎంసీల నీటిని తీసుకునేలా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టారు. 2005 ఆగస్టులో దీనికి టెండర్లు పిలవగా రూ.1,925 కోట్లకు ప్రముఖ కాంట్రాక్టు సంస్థ పనులు దక్కించుకుంది. 2010 నాటికే ఈ పనులను పూర్తి చేయాల్సి ఉన్నా... భూసేకరణ సమస్యలు, వరదలు పనులను ఆలస్యం చేశాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉండగా... మొదటి టన్నెల్‌ను శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.89 కి.మీ. కాగా.. ఇప్పటికి 27.91 కి.మీ. టన్నెల్ పూర్తయింది. ఏడాదికి 2 కిలోమీటర్ల కన్నా తక్కువే..! రాష్ట్రం ఏర్పడే నాటికి 23.07 కిలోమీటర్ల టన్నెల్ పూర్తవగా.. తర్వాత రెండున్నరేళ్లలో తవ్వింది 4.83 కిలోమీటర్లే. అంటే ఏడాదికి సగటున 2 కి.మీ. కన్నా తక్కువగానే పనులు జరుగుతున్నాయి. ఈ లెక్కన మిగతా 15.98 కి.మీ. పనులు జరిగేందుకు మరో 8 ఏళ్లు పడతాయన్నది నీటి పారుదల వర్గాల అంచనా. ఈ టన్నెల్‌ను రెండు వైపుల నుంచి తవ్వుతూ వస్తుం డగా... శ్రీశైలం నుంచి తవ్వుతున్న పనులు 3 నెలలుగా నిలిచిపోయాయి. కన్వెయర్ బెల్ట్ మార్చా ల్సి ఉండటం, ఇతర యంత్రాలను మార్చాల్సి రావ డంతో వాటిని తిరిగి ఏర్పాటు చేస్తున్నారు. పైగా టన్నెల్ తవ్వకం ఆలస్యమవుతోంది. ఇక నల్లగొండ జిల్లా పరిధిలో తవ్వాల్సిన రెండో సొరంగం పూర్త యినా.. కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం గా ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 1,298.91 కోట్లు ఖర్చు చేయగా.. 67.46 శాతం పనులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రాజెక్టుకు 343.35 కోట్లు కేటాయించినా.. ఎస్కలేషన్ చెల్లింపుల కోసమే రూ.235.16 కోట్లు ఇచ్చారు. మొత్తంగా మరో రూ.635 కోట్ల పనులు పూర్తి చేయాలి. అమెరికా పర్యటన రద్దు..టన్నెల్ ఆసియా సదస్సుకు హాజరు! టన్నెల్ పనులను సీరియస్‌గా తీసుకున్న ప్రభు త్వం... టన్నెల్ పనులు ఎక్కువగా జరుగుతున్న అమెరికాకు ఈఎన్సీ నేతృత్వంలో ఓ బృందాన్ని పంపాలని నిర్ణయించింది. కానీ వీసా సంబం ధిత కారణాలతో అది రద్దయింది. డిజైన్, కన్స్ట్రక్షన్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) ముంబైలో నిర్వహిస్తున్న టన్నెల్– ఆసియా సదస్సుకు ఇంజనీర్ల బృందాన్ని పంపిం ది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు గురువారం ఈఎన్సీ మురళీధర్, నాగార్జున సాగర్ సీఈ సునీల్, ప్రాణహిత సీఈ హరిరామ్, మరో ఇద్దరు ఇంజనీర్లు హాజరయ్యారు. టన్నెల్ నిర్మాణాల్లో తీసుకోవాల్సిన చర్యలు, వేగంగా పనులు వంటి అంశాలపై ఇందులో చర్చించారు.